ఇన్నేళ్ళ తర్వాత కూడా ఇంకా పనిచేస్తూనే… – పురుషోత్తం ఠాకూర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

డెబ్భైల వయసులో ఉన్న కోంధ్ ఆదివాసీ దనామతి మాఝీ పశువులను మేపటం, పొలాల్లో పనిచేయటం, ఇంటి పనులు చక్కబెట్టడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు.
దనామతి తనకొచ్చే పింఛనులోని దాదాపు సగం డబ్బును బెల్లం, పుగాకు వంటి పదార్థాలున్న టూత్‌పేస్ట్ కోసం ఖర్చుపెడతారు.

“నాకు పింఛనుగా వచ్చే వెయ్యి రూపాయలలో 500 రూపాయలను నాకు తిండిని సమకూర్చే నా తమ్ముడి కోడలికి ఇస్తాను,” అని ఆమె పేర్కొన్నారు. మిగిలిన మొత్తాన్ని ఉప్పు, మిరపకాయలు, సబ్బు, మర్దన నూనె, గుడాకు కొనడానికి ఖర్చు చేస్తాను.”
ఆమెకు మిగిలింది కేవలం ఒకటి రెండు పళ్ళు మాత్రమే కదా, ఒక్క టూత్‌పేస్ట్ కోసం అంత ఖర్చు చేయడం మరీ ఎక్కువ కదా అని ఈ విలేఖరి ఆమెను సరదాగా ఆటపట్టించినప్పుడు, ఆమె చిన్నగా నవ్వి ఇలా ఒప్పుకున్నారు: “అది లేకపోతే నాకు ఏమాత్రం మంచిగా అనిపించదు. మీ అందరికీ ఉండే గుట్కా (నమిలే పొగాకు) వ్యసనం లాగే అది కూడా ఒక వ్యసనం.”
దనామతి మట్టి పలకలు పైకప్పుగా ఉండే ఒక మట్టి ఇంట్లో నివసిస్తారు. పెద్దగా సామాన్లేమీ లేని ఆ ఒంటిగది ఇంట్లోకి వెళ్ళాలంటే వంగి వెళ్ళాలి. రాగులను దంచటానికి ఒక రాతి రోకలి బండ, ఒక టార్చి, ఒక మట్టి చుల్హా (పొయ్యి), బట్టలున్న ఒక వెదురు బుట్ట – అవే అక్కడున్న ప్రధాన వస్తువులు. ఆ పెద్ద వయసు మహిళ నేల మీదే నిద్రపోతారు.
మేం మాటలు మొదలుపెట్టగానే, ఆమె ఆ రాతి రోకలిబండను బయటకు తీసి, దేశంలోనే అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన ఒడిశాలోని కాలాహాండీలో పెరిగిన తన బాల్యం గురించి మాట్లాడుతూ, దంచటం మొదలుపెట్టారు.
అది చాలా గడ్డుకాలం. మాకు తిండి పెట్టడానికి మా తల్లులు అడవిలో దుంపల కోసం వెతికేవారు. మాకు ఒక్క జత బట్టలుండేవి, వాటినే ఏడాదంతా వేసుకునేవాళ్ళం. మేం స్నానానికి ఏటికి వెళ్ళినప్పుడు, ఆ బట్టలు ఆరి, తిరిగి వాటిని వేసుకునే వరకూ మేం వేచి ఉండేవాళ్ళం.
మేం మొదటిసారి దనామతిని దారిలో చూసినప్పుడు నీలం రంగు టీ చొక్కా వేసుకొని ఉన్న ఆమె నది వైపుకు దిగుతున్నారు. ఆమె ఒక చేతిలో లాఠీ (కర్ర), మరొక చేతిలో ఆమె పక్కనే నడుస్తోన్న గొర్రెపిల్లను, దాని తల్లినీ కట్టిన తాడు ఉన్నాయి.
తన వయసెంతో ఆమెకు సరిగ్గా తెలియదు కానీ ప్రతి ఒక్క రోజూ దనామతి మేకలు కాయటానికి, సమీపంలోని ఆవాల పొలాల్లో పనిచేయటానికి బయటకు వెళ్తూ తన ఇంటి పనులు చేసుకుంటూ తీరికలేని జీవితాన్ని గడుపుతుంటారు. తాను అప్పుడప్పుడూ ఒక మంత్రగాడు లేదా ఝోలా చాప్ వైద్యుడిని కలుస్తుంటానని అంటూనే, తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని ఆమె నొక్కిచెపుతారు.
కోంధ్ ఆదివాసీ అయిన ఆమె తూకూగూడాలోని తమ పూర్వీకుల ఇంట్లో తన తమ్ముడి కుటుంబంతో కలిసి ఉంటారు. ప్రధానంగా కోంధ్ ఆదివాసీ సముదాయమే ఎక్కువగా ఉన్న ఈ గ్రామ జనాభా 350 మంది (2011 జనగణన).
ఆమె పిల్లలు మలి యాభైల వయసులో ఉండటం, ఆమెకు బడికి వెళ్ళే మునిమనవ సంతానం కూడా ఉండటంతో, తన వయసు దాదాపు ఎనభై ఏళ్ళు ఉంటుందని ఆమె భావిస్తారు. “నేను తూకూగూడా గ్రామంలోని నా సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నాను,” అని ఆమె PARIతో చెప్పారు.
“నా కోడలు చాలా మంచి మనిషి, పైగా నా (ఇద్దరు) మనవళ్ళు నన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చారు,” అన్నారామె. అయితే, దనామతి మాత్రం తన సోదరుడి వద్దనే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఆమె ఇల్లు అక్కడికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే ఉన్న పుయిగూడాలో ఉంది. ఈ రెండు గ్రామాలూ థుఆముల్-రామ్‌పుర్ బ్లాక్ పరిధిలోకి వస్తాయి. ఇవి ఒడిశాలోని కాలాహాండీ జిల్లాలో అత్యంత వెనుకబడిన, అభివృద్ధిచెందని గ్రామాల జాబితాలో ఉన్నాయి.
దనామతి తన కుమారునితో, అతని కుటుంబంతో కలిసి పుయిగూడా గ్రామంలోని తన ఇంట్లో నివసించేవారు. పిల్లలు చాలా చిన్నవయసులో ఉన్నప్పుడే ఆమె భర్త మరణించారు. “కూలి పనులు చేసుకుంటూ నేను నా పిల్లలను పెంచాను. అది చాలా గడ్డుకాలం. నాకు ఒక కొడుకు ఉన్నాడు; నా కూతురు చాలా చిన్నవయసులోనే మరణించింది,” అని ఆమె పేర్కొన్నారు.
తమకున్న సుమారు ఎనిమిదెకరాల భూమిలో ఆ కుటుంబం రాగి, కోసల, కంగూ, బీరీ, కాటింగ్, కందుల వంటి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో పాటు వరిని కూడా పండిస్తుంది. దీని నిర్వహణ బాధ్యతలను ఆమె కుమారుడు డుమెన్ మాఝీ, అతని భార్య సుఖమతి మాఝి చూసుకుంటారు.
డుమెన్ పెద్ద కొడుకైన బీర్ సింగ్ మాఝీ పని కోసం వలస వెళ్ళేవారు. “నేను కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న అలువాలో కూలీగా పనిచేస్తూ, రోజుకు 500 నుండి 600 రూపాయలు సంపాదించేవాడిని. కానీ నా (11 నెలల) కూతురు, భార్య (జయంతి) గురించిన బెంగతో నేను తిరిగి వచ్చేశాను,” అని 24 ఏళ్ళ బీర్ చెబుతున్నారు. ప్రస్తుతం అతను గ్రామంలోనే దినసరి కూలీగా పనిచేస్తున్నారు. అయితే అప్పుడప్పుడూ మాత్రమే పని దొరుకుతోంది.
అతని తమ్ముడైన 21 ఏళ్ళ రూప్ సింగ్ మాఝీ హైదరాబాద్‌కు వలస వెళ్ళి, అక్కడ ఒక టెంట్ హౌస్‌లో పనిచేస్తున్నాడు. థుఆముల్ రామ్‌పుర్ బ్లాక్‌లో పేదరికం తీవ్రంగా ఉందని, ముఖ్యంగా యువతలో వలసల శాతం అధికంగా ఉందని గ్రామ్ వికాస్ అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. కేరళ వారికి ఒక ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది; అక్కడ వారు నెలకు సగటున రూ. 12,000 నుండి 15,000 వరకు సంపాదించగలుగుతున్నారు.
ఇప్పుడు పరిస్థితులు కొంత మెరుగ్గా ఉన్నాయని దనామతి చెబుతున్నప్పటికీ, ఆమె ఎప్పటిలాగే కష్టపడి పనిచేస్తున్నారు. ఆమె మేనల్లుడైన రాజ్‌ఫూల్ కూడా ఆమెతో ఏకీభవిస్తూ, “ఆమె చాలా చురుగ్గా ఉంటుంది,” అన్నారు.
దనామతికి తమ్ముడైన లేదనా మాఝీ, ఆమెను తమతొ కలిసి నివసించడానికి ఇక్కడకు తీసుకువచ్చారు. “పని చేయొద్దని మేం ఆమెకు చెప్పాం, కానీ ఆమె మా మాట వినదు; తనకు నచ్చినట్లుగానే ప్రవర్తిస్తుంది,” 61 ఏళ్ళ లేదనా మాఝీ అంటున్నారు.
“దయచేసి నాకు ఉండటానికి ఒక ఇల్లు (PMAY) మంజూరు చేయమని ప్రభుత్వానికి చెప్పు,” నాకు వీడ్కోలు చెప్తూ దనామతి పలికిన మాటలివి.
(ఈ వ్యాసం https://ruralindiaonline.org/article/still-working-after-all-these-years-te) మే 07, 2026 లో మొదట ప్రచురితమైనది.)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.