కార్పొరేట్లకు ప్రత్యామ్నాయం సహకార సంఘాలే – కన్నెగంటి రవి

దేశవ్యాప్తంగా కొనసాగుతున్న రైతాంగ ఉద్యమం కొత్త పుంతలు తొక్కుతున్నది. కేంద్రం ఏకపక్షంగా రైతుల ఆకాంక్షలను, అన్ని పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రాలను పక్కనపెట్టి తనకున్న బండ మెజారిటీతో ఆమోదించిన 3 వ్యవసాయ రంగ చట్టాలు, దేశంలో చర్చకు పెట్టిన విద్యుత్‌ బిల్లు 2020 గ్రామీణ ప్రజలలో భయాందోళనలను రేకెత్తించాయి. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రచారం, ఇస్తున్న హామీలు వారిలో నమ్మకాన్ని కలిగించలేకపోతున్నాయి.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవసాయ చట్టాలు ఎవరికి చుట్టాలు – అబ్దుల్‌ వాహెద్‌

భారతీయ జనతా పార్టీపై రైతులు మండిపడుతున్నారన్నది స్పష్టంగా తెలుస్తున్న వాస్తవం. రైతుల ఆగ్రహం ఇప్పుడు బీజేపీకి, ఎన్డీయేలో మిత్రపక్షాలకు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సవాలుగా మారవచ్చు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లోని రైతులే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌, ఉత్తరప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగవలసి ఉంది. రానున్న ఏడాదిన్నర కాలంలో ఈ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి. రైతుల ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. ఎన్డీయేలో మిత్రపక్షాలు కూడా ఇప్పుడు రైతులకు మద్దతుగా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేశంలో కొత్త రైతు చట్టం – దాని పరిణామాలు – ఎర్రోజు శ్రీనివాస్‌

ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త రైతు చట్టాలను, వాటి పర్యవసానాలను తెలుసుకునే కంటే ముందు పాత చట్టం ఏమి చెబుతుందో కూడా పరిశీలిద్దాం. భారతదేశంలో గల భౌగోళిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాన్ని రూపుు మార్చాలని, దేశాన్ని ఏకరూప రాజ్యాంగా మార్చాలని అనుకునే కుట్రలో భాగంగా గత కొన్ని సంవత్సరాలుగా నూతన చట్టాలు రూపొందించబడ్డాయి. ఇది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలకు పరిపాలన అధికారాలు, నియంత్రణ లేకపోతే, స్వయం నిర్ణయాధికారం లేకపోతే ఇక ఆ ప్రాంతంలోని ప్రజల హక్కులు, ఆకాంక్షల గురించి చెప్పనవసరం లేదు. ఇక బలహీనులైన రైతులు అత్యంత దుర్భర స్థితిని అనుభవించాల్సి వస్తుంది.

Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పిల్లలపై లైంగిక హింస – కమలాభాసిన్‌

ముందుమాట

‘హింసలేని సమాజం మహిళల, బాలికల హక్కు’ అనే నినాదంతో 1993 నుండి భూమిక ఉమెన్స్‌ కలక్టివ్‌ నిరంతరాయంగా పనిచేస్తుంది. ఇంటా, బయట స్త్రీలు, పిల్లలు ఎదుర్కొనే హింసకు సంబంధించి వివిధ పద్ధతుల ద్వారా భూమిక పనిచేస్తున్నది. అందులో ముఖ్యమైనది ఇరవై నాలుగు గంటలూ పనిచేసే హెల్ప్‌లైన్‌ను బాధితులకు అందుబాటులో ఉంచడం. పోలీస్‌ స్టేషన్‌లలో స్పెషల్స్‌ పేరుతో స్త్రీల కోసం సపోర్ట్‌ సెంటర్లు నడపడం భూమిక కార్యక్రమాల్లో ముఖ్యమైనవి. అలాగే నగర బస్తీలలోను, నారాయణ్‌పేట లాంటి గ్రామీణ ప్రాంతాల్లోను హింసకు, బాల్యవివాహలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నది భూమిక.

Continue reading

Share
Posted in సమాచారం | Leave a comment

నగరాన్ని ముంచెత్తిన వరదలు – భూమిక అందించిన సహాయం

అక్టోబరు నెలలో ఇంతకు ముందెన్నడూ కనీవినీ ఎరగని రీతిలో హైదరాబాదులోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి, లోతట్టు ప్రాంతాలు వరద ముంపునకు గురయ్యాయి. నగరం చుట్టూ ఉన్న చెరువులకు గండ్లు పడడం, బస్తీల మధ్య నుంచి ప్రవహించే నాలాలు పొంగిపొర్లడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చాలా రోజులు పాటు మునిగిపోయిన ప్రాంతాలు నీళ్ళల్లోనే ఉండిపోవడంతో వందలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు.

Continue reading

Share
Posted in రిపోర్టులు | Leave a comment

సవాలంటూ సమరమే – కన్నెగంటి రవి

మిత్రులారా…

మా కంటి పాపలారా…

మమ్మల్నిలా

చూస్తుంటే

ఆశ్చర్యంగా ఉంది కదూ

అద్భుతంగా ఉంది కదూ

ఆనందంగా ఉంది కదూ…

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమికీ హలానికీ పుట్టిన పుతిక్ర… ఎవరు జానకా? కాదు భూమిక – డి.ఎల్‌.మూర్తి మోహన్‌

భూమిక వాలంటీర్‌, బతకమ్మకుంట

భుక్తి కరువైన వారి నోట మెతుక

పాతిపెట్టినా పైకి లేచే ధిక్కారపు మొలక

దురాగతాల దునుమాడి దిగంతాల ప్రకటించే పత్రిక – భూమిక

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

వెలుగుతుంది మహా మానవ కుడ్యం – విమల

భయం లేదు

ఈ పెను చీకటి ముళ్ళ దారినీ

దాటి తీరుతాం మనం

భయం లేదు నా చేయి పట్టుకో

చెరసాలల ఊచల్ని మీటుతూ

ఉరికొయ్యలు తెగిపడక తప్పవని

Continue reading

Share
Posted in కవితలు | Leave a comment

భూమిక – డిసెంబర్,. 2020

భూమిక – డిసెంబర్,. 2020

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఈ హైదరాబాదు మా సీతారామపురం ఒక్కటే నాకు -కొండవీటి సత్యవతి

1975 లో చిన్న బావిలాంటి మా సీతారామపురం నుండి నేను మొదటి సారి రైలెక్కి మా నాన్నతో కలిసి హైదరాబాదుకొచ్చినప్పుడు నేను చాలా భయపడిపోయాను. రైల్లోనే వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌ సమీపిస్తున్నాం. నా ఎదుటి సీట్లో ూర్చున్న ఒకాయన కాలు పొరపాటున నా కాలికి తగిలింది. ‘మాఫ్‌ కరో బేటీ’ అన్నాడు. నేను కంగారుపడి కాలు వెనక్కి లాగేసుకున్నాను.దక్షిణ హిందీ ప్రచార సభ వాళ్ళ పరీక్షలు రాసి ఉండడం వల్ల నాకు కొంచం హిందీ తెలుసు. కానీ ఆయన ఏమన్నాడో నాకు అర్ధమవ్వలేదు.

Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ – అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

చింతామణీ – నేనూ

దుర్గాబాయి స్వయంగా రాసుకొన్న తన జీవిత సంక్షిప్త చరిత్రకు ఈ పేరు పెట్టింది. అంటే ఇది ఆమె ఆత్మ కథ. చింతామణి దేశ్‌ముఖ్‌ కూడా స్వీయ చరిత్ర రాసుకున్నారు. దాని పేరు ‘ది కోర్స్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ (నా జీవన స్రవంతి) అని పెట్టుకున్నారు. దుర్గాబాయి రాసిన ఆత్మకథా, చింతామణి రాసిన స్వీయ చరిత్ర పరస్పర పరిపోషకంగా వారి గొప్ప జీవితాలను ప్రతిబింబింపచేస్తున్నాయి. గంగా యమునల కూడలి లాగా నవీన భారత దేశ పుణ్యతీర్థ చారిత్రక ప్రాధాన్యత వారి జీవితాలకు ఉన్నది. తన సంక్షిప్త ఆత్మకథలో ఆమె తన చిన్ననాటి జీవితాన్ని, ఉద్యమ శీలతను, పూర్వగాథలను సంగ్రహంగా వివరించింది. 1953లో చింతామణి దేశ్‌ముఖ్‌ను వివాహమాడిన తర్వాత 28 ఏళ్ళు ఆయన జీవితంతో తన జీవితం ఎలా కలిసిపోయిందో వివరించింది. ప్రాస్తావికంగా దేశ్‌ముఖ్‌ కుటుంబ నేపథ్యమూ, ఆయన మేథాపరిణతి, ఆయన ఇంగ్లండు చదువులూ, ఇంగ్లండులో ఉండగా ఆయన చేసుకొన్న మొదటి వివాహం, వాళ్ళ దాంపత్య జీవిత వైఫల్యం, వాళ్ళకు కలిగిన కూతురితో చింతామణి వియోగ పరితాప వృత్తాంతం సంగ్రహంగా ఆమె ప్రస్తావించింది. తరువాత ఆయన జీవితంలో తాను వెలితిని పూరించిన వృత్తాంతాన్ని వారి సామాజిక సేవ, సంస్థా నిర్మాణం ప్రవక్తం చేసింది.

Continue reading

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

పోరాటం చేస్తే పోయేదేముంది… -పి. ప్రశాంతి

చాలా రోజుల తర్వాత స్నేహితురాళ్ళు ముగ్గురూ ఊరిచివర చెరువు గట్టు మీదున్న చింతచెట్టు కింద కలిశారు. అదే ఊర్లో పుట్టి పెరిగి పదో తరగతి వరకు కలిసి చదువుకున్న పూల, సరిత, పర్వీన్‌ ప్రాణ స్నేహితులు. దాదాపు మూడేళ్ళు దాటింది వాళ్ళు కలిసి. ముగ్గురూ మూడు రకాల కారణాలతో ఊరికి దూరమై మూడేళ్ళు గడిచాక ఈ మధ్యనే తిరిగి ఊరికి వచ్చారు. గత నాలుగు నెలలుగా అనేకసార్లు చర్చించుకుని ఒక నిర్ణయానికొచ్చి తమ శక్తేంటో చూపించాలని పట్టుదలతో వచ్చారు.

Continue reading

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

చదువుల తల్లి పుల్లగూర దీనమ్మ – డా|| చల్లపల్లి స్వరూపరాణి

జ్యోతీరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలేల కాలం అంటే 19వ శతాబ్దం నాటి ఆంధ్ర దేశంలో సామాజిక పరిస్థితులు, అణగారిన వర్గాల స్థితిగతులు, వాటిపై సంస్కరణ దిశగా సాగిన ప్రయత్నాల మీద అటు అకడమిక్‌ రంగంలో కానీ, బయట గానీ అసలు పరిశోధన జరగలేదనే చెప్పాలి. ఆ రోజుల్లో అత్యంత దయనీయమైన పేదరికం, అంటరానితనం, ఊరెలపటితనం వంటి దుర్భర పరిస్థితుల్లో బతుకులు వెళ్ళదీస్తున్న దళితులకు క్రైస్తవం ఒక వెలుతురు పంచే ఆశాకిరణంలా కనిపించింది. గుంటూరు జిల్లాలో ఫాదర్‌ హయ్యర్‌ ఆధ్వర్యంలో లూధరన్‌ మిషన్‌ తన కార్యక్రమాలను విస్తరిస్తూ అణగారిన కులాలకు చేరువైంది. అటువంటి చీకటి దినాల్లో గుంటూరు జిల్లా వేలూరు గ్రామంలో పుట్టిన గడ్డం దీనమ్మ అసమ సమాజం తన చుట్టూ నింపిన అంధకారాన్ని చీల్చుకుంటూ జ్ఞాన జ్యోతిలా ప్రకాశించింది.

Continue reading

Share
Posted in మిణుగురులు  | Leave a comment

వర్జిన్‌ టెస్ట్‌ – వి.శాంతి ప్రబోధ

అప్పుడే ఢిల్లీకి వచ్చి నాలుగో రోజు. టీ బ్రేక్‌లో టీ సిప్‌ చేస్తుంటే రమణి గుర్తొచ్చింది జయకి. ఈ సమయంలో రమణికి సహాయంగా ఉండాల్సింది. ఒక్కటే ఎంత తిప్పలు పడుతున్నదో మనసులోనే అనుకున్నదామె.

Continue reading

Share
Posted in కధలు | Leave a comment

భావచిత్రాల భోషాణం – ‘జొన్నకంకి’ -చక్రవర్తి వేనంక

మనుషులనీ, మనుగడలనీ లోతుగా అధ్యయనం చేస్తూ… వస్తువుల ఆత్మల్నీ వాస్తవాల గమ్యాల్నీ కూలంకషంగా తెలుసుకున్న వారే ఆయా భావాలని అందమైన కవితా వాక్యాలతో అలంకరించగలరు. తమదైన విలక్షణ శైలి ప్రదర్శించి వారి కవిత్వ లోకంలోకి తీసుకెళ్ళి అలరించగలరు. అట్టి అనుభూతికి సాక్షీభూతంగా చెప్పదగినది ”జొన్నకంకి”.

Continue reading

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

నల్లజాతి విముక్తి చిహ్నం ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’ శివలక్ష్మి

నల్లజాతీయుల ఆత్మగౌరవ ప్రతీక ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’. అమెరికాలో బానిసత్వ నిర్మూలన గురించిన ఉత్కంఠభరితమైన చరిత్ర వివరాలు తెలియాలంటే దానితో పెనవేసుకుపోయిన టబ్మాన్‌ వ్యక్తిగత కథ గురించి తెలుసుకోవాలి.

Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment