తొలి మహిళా మానవ శాస్త్రవేత్త, మరాఠీ సాహితీవేత్త – ఐరావతీ కార్వే – డా. నాగసూరి వేణుగోపాల్

ఐరావతి .. ఈ పేరే చాలా విభిన్నం, అది బర్మాలో ప్రవహించే ఓ నది ‘ఐరావడి’ ఆధారంగా పెట్టిన పేరు. ఐరావతి కార్వే (Iravati Karve) భారతదేశపు తొలి మహిళా సామాజిక శాస్త్రవేత్త, మానవ శాస్త్రవేత్త. ఆ పేరు లాగానే ఆమె జీవితం కూడా చాలా వైవిధ్యమైంది. Continue reading →

Share
Posted in సైన్స్ ఆకాశంలో సగం | Leave a comment

హిజ్రా సంస్కృతిలో నిర్వాణం మరియు జల్సా – అర్చనరావు మానుకొండ

పరిచయం: ట్రాన్స్ సముదాయంలో హిజ్రాలకు లైంగికత కంటే ఎక్కువగా వారి సంస్కృతి ఆధారంగానే గుర్తింపు ఉంటుంది. వారు మధ్యయుగ చారిత్రక కాలం నుంచే భారతదేశంలో ఉన్నారని అనేక చరిత్ర పుస్తకాలు పేర్కొంటున్నాయి. అలాగే పలువురు చారిత్రక పరిశోధకులు కూడా వీరిపై విస్తృతంగా పరిశోధనలు చేసి పుస్తకాలు రచించారు. Continue reading →

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

ఎస్సైఆర్ పేరుతో పౌరసత్వ జాబితా – ఎ. సునీత

2025 జూన్‌లో సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు జాతీయ ఎన్నికల సంఘం ఎస్సైఆర్ మొదలు పెట్టినప్పుడు ప్రతి ఎన్నికల ముందూ సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళన అని అందరూ అనుకున్నారు. అయితే ఇది స్వభావరీత్యా చాలా భిన్నమైన కార్యక్రమం అని త్వరలోనే స్పష్టమయింది. Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

భావి తరాలకి ఓ రక్షణ కవచం ఏర్పరుచూదాం – పి. ప్రశాంతి

తనకి క్యాన్సర్ ఉందేమో అనే అనుమానం సమతని వేధిస్తోంది. ఈ మధ్య చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలని తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలని అనుకుంది కానీ తనకే అర్ధంకాని అయోమయంతో ఆగిపోతోంది. ఇంతకీ అయోమయం ఏంటంటే, తనకి ఒకటి కాదు నాలుగైదు రకాల క్యాన్సర్ లక్షణాలు కనిపిస్తున్నాయని, వాటిల్లో ఏదో ఒకటైనా ఖచ్చితంగా నిజమే అయ్యుంటుందని అనుకుంటోంది. Continue reading →

Share
Posted in పచ్చి పసుపు కొమ్ము | Leave a comment

మహిళా మేధావి రమా మేల్కోటేతో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

వాళ్ళిద్దరూ భిన్న మార్గాలకు చెందిన వారు. ఒకరిది కళారంగం అయితే మరొకరిది ఉద్యమాల బాట. వారే రమ, శంకర్ మేల్కోటేలు. ఇద్దరూ పుస్తక, సంగీత, సినిమా ప్రియులు. వారిద్దరూ సమాజానికి ఆదర్శం. మార్గాలు వేరైనా కలిసి జీవించడంలోని ఆనందాన్ని తెలిసినవారు. Continue reading →

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

డగ్స్ర్ డగ్స్ర్ … మాదకం …. – యన్. నిర్మలాదేవి

ఆర్దరాత్రి ఆదురుతున్న గుండెలతో
ముచ్చమటలతో తడిచి ముద్దై భర్త ఒడిలో కరుచుకుపోతుంది
పీడకల దుస్వప్నం అంటూ జోకొడతాడు… Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

వెలుగులాంటి వాళ్ళు – హిమజ

ప్రభాత ఉదయం
ఇంకా కళ్లెత్తి చూడని వీధుల్లో
తొలి తొలి వెలుగు
నిస్సవ్వడిగా పని చేస్తుంది Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

తెల్లవారని పొద్దు – రామిశెట్టి కావ్య

ఆ పొద్దు తెల్లవారలేదు…
ముంగిలి
తనకు కల్లాపి చల్లి,
సేదతీర్చే చేతుల కోసం ఎదురు చూసింది. Continue reading →

Share
Posted in కవితలు | Leave a comment

Prajwala v Union of India 2026 సుప్రీంకోర్టు తీర్పు – సంక్షిప్తంగా – కింబెర్లి వాల్టర్స్, మీరా రాఘవేంద్ర

ఈ వ్యాసం ప్రధానంగా ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతోంది:
సుప్రీంకోర్టు తొలిసారిగా స్వచ్ఛందంగా సెక్స్ వర్క్ చేసే వయోజన మహిళలను, మానవ అక్రమ రవాణా (Traffiking) బాధితులను ఒకేలా చూడకూడదని గుర్తించింది. అయితే, ఆ సూత్రాన్ని పూర్తిగా అమలు చేసేలా తీర్పు లేదని రచయితలు విమర్శిస్తున్నారు. Continue reading →

Share
Posted in సమాచారం | Leave a comment

ఓ అనామకురాలి జీవన పోరాటం! – శాంతి శ్రీ బెనర్జీ

‘సయ్యదా – ఓ అపరిచిత భారతీయురాలి కథ’ ఢిల్లీకి చెందిన సర్వస్వతంత్య్ర జర్నలిస్టు, అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డుల గ్రహీత, గత 17 సంవత్సరాలుగా రాజకీయాలు, జెండరు, సామాజిక న్యాయం లాంటి విషయాల మీద రాస్తున్న నేహా దీక్షిత్ కలం నుండి వెలువడిన తప్పక చదవాల్సిన పుస్తకం. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఇద్దరు విశిష్ట స్త్రీల జీవన గమనం – కె. శోభాదేవి

“గెట్ అవుట్ ఫ్రం మై కార” “గెట్ అవుట్ ఫ్రం మై హోమ” ఈ రెండు వాక్యాలు ఈ మధ్య ప్రముఖ ఆంగ్ల రచయిత్రి అరుంధతి రాయ్, తన తల్లి మేరీరాయ్ స్మృతిలో రాసిన “మదర్ మేరీ కమ్స్ టు మి” అన్న పుస్తకంలోవి కూతురు అరుంధతిరాయ్ నుద్దేశించి ఆదేశాలు. Continue reading →

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

ఆమె మనసులోనూ తలపైనా మోసే భారం – కమల్‌జిత్ కౌర్ / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా

తన వృద్ధాప్యంలోనూ జీవనోపాధి కోసం పశువుల పాకలను శుభ్రం చేయాల్సిన పరిస్థితిలో ఉన్న పంజాబ్‌లోని తరన్ తారన్ జిల్లా, పట్టి పట్టణానికి చెందిన ఒక దళిత మహిళ కథ. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ రచయిత్రుల కథల్లో ఉద్యమ నేపథ్యం – డా. పెద్దపల్లి తేజస్వి

1. పరిచయం
“ఒక భౌగోళిక ప్రాంతంలో జీవించే ప్రజల గురించి అక్కడి నైసర్గిక స్వరూపం, మానవ సంబంధాల తీరు, భాష, సంస్కృతి, భావ వ్యక్తీకరణ, సంభాషణ తీరు, ఆలోచనల తీరు, వాటితో పాటు వాటిని నిర్దేషించే, ప్రభావితం చేసే ప్రకృతి, పంటలు, వృత్తులు, ఆధునిక అభివృద్ధి, కులాలు, మతాలు, విద్య, వైద్య, ఆర్థిక, రాజకీయ, సామాజిక అంశాలు వీటన్నిటి పరిణామాలు కలిసి ఒక ప్రాంతం యొక్క ప్రాంతీయ అస్తిత్వాన్ని, ప్రత్యేకతను, నిర్దిష్టతను, సంస్కృతిని తెలుపుతాయి. Continue reading →

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలివైన టామి – కె. సిద్దార్ధ, 8వ తరగతి, ఆదర్శ విద్యాలయ హైస్కూల్, జహీరాబాద్

చాంగ్లేర్ అనే గ్రామంలో రాము అనే రైతు దగ్గర ఒక కుక్క ఉండేది. ఆ కుక్క పేరు టామి. రాము ప్రతిరోజు ఆవులకు మేతవేయడం. పొలానికి పోయి పంటలను పండించడం చేసేవాడు.
ఆతని కుక్క టామి అతనితో పాటు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చేదాకా రాముకి సహాయం చేసేది. టామి తనకు చేతనైన చిన్న చిన్న సహాయాలు చేసేది.
ఉదాహరణకు వేరే ఎవరినైనా పొలానికి రానిచ్చేది కాదు. ఇలా టామి రాముకు సహాయం చేసేది. ఒకరోజు రాము పగలు రాత్రి విశ్రాంతి లేకుండా పని చేసి నీరసంతో కింద పడిపోయాడు. అప్పుడు టామి రాముని చూసి చాలా కంగారుపడింది. భయంతో చాలా అరుస్తుంది. కానీ సహాయం చేసేందుకు అప్పుడు పొలంలో ఎవరూ ఉండరు.
టామి ఊర్లోకి వెళ్ళి ప్రతిఒక్కరిని సహాయం కోరుతుంది. కుక్క ఊరికే అరుస్తుంది అని దానిని రాళ్ళతో కొట్టి తరిమారు. అయినప్పటికీ టామి ఎంతో మందిని అందరినీ సహయం కోరుతుంది.
అప్పుడు రాము స్నేహితుడు బంటి ఇలా అనుకుంటాడు. ఈ కుక్క రాముది కదా. నా దగ్గరికి వచ్చి ఎందుకు అరుస్తుంది? రాముకి ఏదైనా అయి ఉంటుందేమో అనుకుంటూ టామి వెనుక వెళ్తాతు.
అప్పుడు టామి రాము దగ్గరకు బంటిని తీసుకొని వెళ్ళాడు. రాము క్రిందపడి ఉండటం చూసిన బంటి రాము చికిత్స కేంద్రానికి తీసుకొని వెళ్ళాడు.
డాక్టర్లు రాముని చూసి అతనికి వైద్యం చేసి ఆరోగ్యం బాగు చేసి కొన్ని మందులు ఇచ్చారు. రాము బంటిని చూసి నీవు ఇక్కడికి ఎలా వచ్చావు. నిన్ను ఎవరు పిలుచుకొని వచ్చారు అని అడిగాడు. అప్పుడు బంటి నన్ను నీ టామి తీసుకుని వచ్చింది అని చెప్పాడు.
అయినా ఏ మాటకి ఆ మాట చెప్పాలి. నీ టామి చాలా తెలివైనది. విశ్వాసమైనదిరా అని బంటి రాముతో అంటాడు. అప్పుడు రాము టామి వైపు చూసి దానిని అప్యాయంగా హత్తుకుంటాడు. అప్పటి నుంచి రాము మరిము టామి మరింత సంతోషంగా జీవించారు.

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment

జూన్ 2026

జూన్ 2026

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

ఐచ్ఛిక సెక్స్ వర్క్ చట్ట విరుద్ధం కాదు – కొండవీటి సత్యవతి

(ఇటీవల సుప్రీమ్ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో)

ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. Continue reading →

Share
Posted in సంపాదకీయం | Leave a comment