ఇంట్లో ప్రేమ్‌చంద్‌ -34

శివరాణీదేవి ప్రేమ్‌చంద్‌
అనువాదం : ఆర్‌. శాంతసుందరి
1935లో బెనారస్‌లో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రిపూట తీరిగ్గా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. ఇంట్లో ఉన్నది మేమిద్దరమే.

”ఈసారి కౌన్సిల్‌ ఎన్నికలు జరిగినప్పుడు మీరు కూడా నిలబడండి,” అన్నాను.
”నాకలాటివేమీ ఒద్దు, ఇలాగే బావుంది,” అన్నారు.
”ఏం? నిలబడితే నష్టమేముంది? కాంగ్రెస్‌ తరపున నిలబడండి.”
”నా లక్ష్యం కౌన్సిల్‌ మెంబర్‌ అవటం కాదు.”
”అయితే మీ జీవిత లక్ష్యం ఏమిటట?”
”కౌన్సిల్‌ సభ్యులని విమర్శించటమే నా ధ్యేయం,” అన్నారాయన నవ్వుతూ.
”అందర్నీ విమర్శిస్తానని ప్రతిన పూనారా? ఇంట్లో కూర్చుని ప్రతివాళ్ళనీ విమర్శించటమేనా మీ పని?”
”రచయిత చెయ్యవలసిన పని మాత్రమే చేస్తాను నేను. ఇక కౌన్సిల్‌ సభ్యులు చేసే పనులని విమర్శించేందుకు కూడా ఎవరో ఒకరు ఉండాలిగా?”
”ఆహా, అయితే అదన్నమాట సంగతి! ఇతరులు మిమ్మల్ని విమర్శిస్తారన్న భయంతోనే మీరు అక్కడ సభ్యుడిగా చేరేందుకు ఎన్నికల్లో పోటీ చెయ్యనని అంటున్నారు!”
”అదేం కాదు. నీ ఉద్దేశం ఏమిటి? నాయకుడన్నవాడిలో అన్నీ మంచి గుణాలే ఉంటాయనుకుంటున్నావా? దుర్గుణాలేవీ ఉండవా? అసలు నన్నడిగితే దేవుడిలో కూడా ఏవో లోటుపాట్లు ఉంటే ఉంటాయంటాను. అందుచేత మనలోని బలహీనతల్నీ, తప్పులనీ ఎవరైనా ఎత్తి చూపిస్తే తప్ప మనకి వాటిగురించి ఎలా తెలుస్తుంది? నిజాయితీగా విమర్శ చేసే వ్యక్తి చాలా విలువైన పని చేస్తాడని అంటాను. అతనే నిజంగా అవతలి వ్యక్తి మంచిని కోరేవాడు.”
”చాలా మటుకు విమర్శకులు అవతలి వాళ్లమీద బురదచల్లే పనే చేస్తారు.”
”అలాటివాళ్లు నిజమైన విమర్శకులు కాదు. వాళ్లు అసూయతో, ద్వేషంతో ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటారు. విమర్శకుడికి గొప్ప బాధ్యత ఉంటుంది. మంచి రచయిత అన్ని విషయాలనీ క్షుణ్ణంగా పరిశీలించిన తరవాతే కాయితం మీద కలం పెడతాడు.”
”అయితే ఇలాటి పనికి మీరు అర్హులనే అనుకుంటున్నారా?” అన్నాను నవ్వుతూ.
”మనసులో కుళ్లుబోతుతనంతో నేనెవర్నీ విమర్శించను. పక్షపాతం లేకుండా ఉండటానికే శాయశక్తులా ప్రయత్నిస్తాను.”
”కానీ మనం తప్పుపట్టే విమర్శకులు కూడా తమ గురించి ఇలాగే అనుకుంటారేమో కదా?”
”అలా అయితే విమర్శలు ఎవర్నీ బాధించవుగా?”
ఆరోజు మేం మాట్లాడుకున్నది అంతవరకే. ఆయన అన్నీ విడమరిచి చెప్పాక నాకు అర్థమైంది. ”ఈ విషయాలన్నీ మీరు నాకు ముందే అర్థమయేట్టు వివరించి ఉంటే ఈరోజు ఇన్ని పిచ్చి ప్రశ్నలు వేసేదాన్ని కాదు కదా!” అన్నాను.
”నువ్వెప్పుడైనా అడిగితే కదా?” అని ఒక్క క్షణం ఆగి, ”నువ్వుట్టి పిచ్చిదానివి!” అన్నారు నవ్వుతూ. ఆయన ఎంతో ప్రేమగా అలా అనేసరికి నేను కూడా నవ్వేశాను.
కాశీలో మేముండే ఇంట్లోనే ప్రెస్సూ, బుక్‌ డిపో ఉండేవి. ఇంట్లో ఉన్నది మేమిద్దరమే. పుస్తకాల స్టాక్‌ కూడా పై రెండుగదుల్లోనూ ఉండేది. మేము గదుల్ని వాడే వాళ్లం కాదు.
రాత్రి పది గంటల ప్రాంతాల మేమిద్దరం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. బైట పెద్ద గాలివాన వస్తోంది. ఇంతలో కరెంటు పోయింది. ”బలే బావుంది కదూ? బైట గాలీ, వానా, లోపల చీకటి!” అన్నారీయన నవ్వుతూ.
”అవును నిజంగానే బలే సరదాగా ఉంది!” అన్నాను.
”అరె, పుస్తకాల గదిలోకి వానజల్లు రావటం లేదు కదా? కానీ వెళ్లి చూద్దామంటే అంతా చిమ్మ చీకటి!”
”ఎలాగైనా సరే చీకటిని ఛేదించి వెలుగు రప్పించాలి!” అన్నాను.
లేచి వెళ్లి లాంతరు తీశాను. అందులో కిరసనాయిల్‌ లేదు. ఎలాగో తడుముకుంటూ అందులో కిరోసిన్‌ నింపి, వెలిగించి గదిలోకెళ్తాను. ఒక గదిలోకి నీళ్లేమీ రాలేదు, కానీ రెండోగదిలో పైకప్పు బీటలు వారటంతో వేగంగా నీళ్లు లోపలికి పడుతున్నాయి. దాని పక్కనే మరో గది ఉండటంతో, పుస్తకాలని గబగబా అందులోకి మార్చే ప్రయత్నం మొదలు పెట్టాను. ”తడిసిపోతున్నావు, ఇంకే మనిషి సాయం లేకుండా నీవల్లకాదు, వాటినలా వదిలేసి రా, జబ్బు పడతావేమో!” అన్నారు.
”నాకేం జబ్బు చెయ్యదు. అలా పుస్తకాలు పాడైపోతూంటే చూస్తూ ఎలా కూర్చోటం? మీరు కూడా ఒక చెయ్యి వెయ్యండి, వీటిని ఆ గదిలో పెడదాం.”
మేమిద్దరం తడిసి ముద్దయిపోయాం, కానీ మొత్తం మీద పుస్తకాలని తడవకుండా కాపాడగలిగాం. ఇద్దరం బట్టలు మార్చుకున్నాం.
ఆ వెంటనే నాకు బాగా జ్వరం, జలుబూ వచ్చి చాలా రోజుల వరకూ తగ్గలేదు. ఆయన చాలా కోప్పడ్డారు. తనకి నామీద ఒక పక్క కోపం, మరోపక్క జాలీ కలుగుతున్నాయన్నారు. ”ఆరోజు ఎంత చెప్పినా వినలేదు, చూడు ఎలా పడకేశావో! పుస్తకాలు తడిస్తే తడిశాయి నీ సంగతి చూసుకో అని చెప్పానా? అయినా కోమటి బుద్ధి, ప్రాణాలు పోయినా పరవాలేదు, డబ్బు నష్టం మాత్రం భరించలేవు!” అన్నారు.
”ఇప్పుడు నాకేమన్నా ప్రాణం మీదికొచ్చిందా? జ్వరం తడవకపోయినా రావచ్చు, అప్పుడేమనేవారు? మీరు ఆరోగ్యంగా ఉన్నారు, నాకంతే చాలు. నాకు ఒంట్లో బావుండకపోతే హాయిగా విశ్రాంతి తీసుకుంటాను. మీకేమైనా అయితే నాకు చేతులూ కాళ్లూ ఆడవు!” అన్నాను.
ఆయన వ్యంగ్యంగా నవ్వుతూ, ”నువ్వెప్పుడూ నీవైపునించే ఆలోచిస్తావా? నాకు ఆరోగ్యం పాడైతే నీకు ఇబ్బంది, కానీ నీ ఆరోగ్యం పాడైతే నాకు అలాగే ఉంటుందన్న ఆలోచనే రాదా నీకు? ఏ పనీ చెయ్యాలనిపించదు, ఇల్లు బావురుమంటూ ఉంటుంది!” అన్నారు.
”నాకేం కాలేదు, సుబ్భరంగా ఉన్నాను. నా గురించి విచారం మానండి.”
ఆయన నా తలదగ్గరే కూర్చున్నారు. నా బుగ్గమీద నెమ్మదిగా చేత్తో తట్టి, ”నువ్వుట్టి పిచ్చిదానివి!” అన్నారు.
1936లో ఒకసారి, ”నేను ఢిల్లీకి వెళ్లాలి,” అన్నారు హఠాత్తుగా.
”ఏదైనా పనిమీదా?” అని అడిగాను.
”అవును, రేడియోలో కథ చదివి వినిపించమని రేడియోవాళ్ళు పిలిచారు.”
”హోలీ పండగ దగ్గర పడిందే!”
”అవును, నువ్వు కూడా రా, వెళ్దాం.”
”నేనెందుకూ మధ్యలో?”
”ఎందుకేమిటి? పండక్కి ఒక్కదానివీ ఇక్కడుండి ఏం చేస్తావు?”
”బైలుదేరమంటున్నారు సరే, మరి ఖర్చు మాట?”
”నీకెప్పుడూ ఖర్చు గొడవే!” అన్నారు నవ్వుతూ.
”ఎందుకుండదు? డబ్బులు చెట్లకి కాస్తున్నాయా?”
”పదవోయ్‌! అక్కడ నీకు కూడా డబ్బిస్తారు, మన జేబులోంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక్కర్లేదు.”
”అంటే రూపాయలు ఆకాశంనించి రాల్తాయా?”
”అలాగే అనుకో, పోనీ! రేడియో వాళ్లు నాకు వంద రూపాయలిస్తామన్నారు. వాటిల్లో పదో పదిహేనో మిగలచ్చుకూడా.”
”నేను రాకపోతే ఇంకా ఎక్కువ మిగుల్చుకోవచ్చు కదా?”
ఆయన కాసేపు మౌనంగా ఉన్నారు. తరవాత, ”అన్నట్టు, గుర్తొచ్చింది, మీ వొదిన నిన్ను ఒకసారి పంపించమని అడిగింది. హోలీ పండక్కి పంపిస్తానని మాటిచ్చాను,” అన్నారు.
”అయితే ఇంతకీ మీరు వెళ్తున్నది ఢిల్లీకా, అలహాబాదుకా?”
”వెనక్కి వచ్చేప్పుడు అలహాబాద్‌ వెళ్దాం. ప్రస్తుతం నేరుగా ఢిల్లీ వెళ్దాం.”
”పండగనాడు మనింట్లో ఉండటమే సరైన పద్ధతి.”
”ఇంటి దగ్గర బిక్కు బిక్కుమంటూ ఒక్కదానికీ పండగేం చేసుకుంటావు? అక్కడ జైనేంద్రనీ, అతని భార్యనీ కలవచ్చు. వాళ్లకీ బావుంటుంది,” అన్నారు. నేను బైల్దేరేందుకు ఒప్పుకున్నాను.
ఇద్దరం ముందు ఢిల్లీకి వెళ్లాం. అక్కడికి చేరుకున్న మూడోరోజు హోలీ పండగ వచ్చింది. జైనేంద్ర ఇంట్లోనే దిగాం. అల్పాహారం తిన్నాక, మేమిద్దరం, జైనేంద్ర మహాత్మా భగవాన్‌ దీన్‌ తాపీగా కూర్చుని మాట్లాడుకోసాగాం. ఉన్నట్టుండి ఒక ఇరవైమంది వచ్చి వీళ్లమీద రంగునీళ్లు పొయ్యటం మొదలు పెట్టారు. మగాళ్లు ముగ్గురూ పూర్తిగా తడిసిపోయారు. నేను ఒక పక్కన నిలబడి తమాషా చూడసాగాను. ఇంతలో ఒకాయన నావైపు కదిలాడు. ఇంకొకాయన, ”వద్దు, ఆవిడమీద పొయ్యద్దు. మా ఆయన మాట్లాడకుండా కూర్చుని రంగు నీళ్లు పోయించుకోటం చూసి నాకు నవ్వు ఆగలేదు. వాళ్లు వెళ్లిపోగానే ఆయన అవతారం చూసి, ”మీరేమిటి అలా వద్దనకుండా రంగుల్లో మునిగారు?” అన్నాను.
”హోలీ కదా? అందరూ అలాగే చేస్తారు!” అన్నారు, నవ్వుతూ.
”బట్టలు మార్చుకోండి, జలుబు చేస్తుంది,” అన్నాను.
అప్పటికే ఆయనకి కొద్దిగా దగ్గు వస్తోంది. బట్టలు మార్చుకుని కూర్చున్నారో లేదో ఇంకో గుంపు వచ్చింది. మళ్లీ తడిసి ముద్దయారు. నేను పొడిబట్టలు కట్టుకుని చెక్కుచెదరకుండా కూర్చున్నాను. మళ్లీ ఆయన పరిస్థితి చూసి నవ్వటం మొదలు పెట్టాను.
”నీకు నవ్వుగా ఉంది కదూ? మా అవస్థ చూడు! మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ ఉండగా జైనేంద్ర భార్య వచ్చి, ”అమ్మా! మీరు లోపలికెళ్లి దాక్కోండి. ఆడవాళ్ల గుంపు వస్తోంది,” అంది.
”ఎందుకు ఆవిడ దాక్కోవటం?” అన్నారీయన.
”ఏం నేను కూడా మీలా అవస్థ పడాలా?” అన్నాను.
”మరి హోలీ అంటే ఇదే కదా? లేకపోతే ఇక పండగేముంది?”
”లేదు, మహాశయా! నన్ను మన్నించండి!”
జైనేంద్ర మేనమామ, మహాత్మా భగవాన్‌ దీన్‌ మధ్యలో కల్పించుకుని, ”మీరు నా గదిలోకి వెళ్లిపోండి. ఇక్కడే ఉంటే వాళ్లు మిమ్మల్ని వదిలిపెట్టరు,” అన్నారు.
నేను తలుపులు మూసుకుని లోపలే ఉండిపోయాను. ఆడవాళ్లందరూ హోలీ ఆడి వెళ్లిన తరవాత, ”నువ్వు చాలా విచిత్రమైన దానిది! అంత భయమేమిటి?” అన్నారు మా ఆయన.
”నాకు భూతంలా తయారవటం నచ్చదు,” అని జవాబు చెప్పాను.
ఆ రోజు మొత్తంలో ఆయన మూడుసార్లు బట్టలు మార్చు కున్నారు, కానీ అన్ని రంగుల్తో తడిసిపోయాయి. సాయంకాలమయే సరికి, ”ఇక వీటిని విప్పేసి మామూలు బట్టలు వేసుకోండి. దగ్గు ఎక్కువైతే బలే మజాగా ఉంటుంది!” అన్నాను. (ఇంకా వుంది)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.