-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: ప్రత్యక సంచిక – నంబూరి పరిపూర్ణ
స్త్రీలు స్వయంపోషకులు కావాలి – నంబూరి పరిపూర్ణ
మాది కృష్ణాజిల్లా గన్నవరం తాలూకాలోని బండారుగూడెం. నేను తొమ్మిదేళ్ళ వయసు వరకు అక్కడే ఉన్నాను. మా అమ్మ, నాన్నగారు గ్రాంట్ స్కూల్‌లో మేనేజర్, టీచర్‌గా పనిచేసేవారు. ఐదవ తరగతి విజయవాడలో చదువుకున్నాను. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతోన్న రోజుల్లో టీచర్లందరూ యుద్దం కోసం ఫండ్స్ వసూలు చేయాలని టార్గెట్ పెట్టారు.
స్తీల చరిత్ర పునర్నిర్మాణానికి చారిత్రక పత్రం ‘వెలుగుదారులలో…’ – డా. వెంకటరామయ్య గంపా
“My life is history, politics, geography. It is religion and metaphysics. It is music and language” (Paula Gunn Allen. The Autobiography of a Confluence. (Quoted by Sidonie Smith and Julia Watson,P-1)
జీవనోత్సవ సౌరభం అమ్మ సమావేశం కాప్షన్ నాకెంతో నచ్చింది – గణేశ్వరరావు
పరిపూర్ణ గారి జ్ఞాపకాలలో ‘జీవనోత్సవ సౌరభం అమ్మ సమావేశం’కి అమరేంద్ర పిలిస్తే వెళ్ళాను. అతను పెట్టిన క్యాప్షన్ ఎంతో నచ్చింది. గతంలో ఇలా ఏర్పాటు చేసిన సమావేశాలకి ‘నివాళి’, ‘భాష్పాంజలి’ అంటూ పేర్లు పెట్టేవారు. ఈ పేరు భిన్నంగా ఉండటమే కాకుండా, ఆత్మీయంగా ఉంది. సమావేశం కూడా అంత బాగానే జరిగింది. రెండు మాటలు మాట్లాడమని … Continue reading
పరిపూర్ణ వెలుగునిచ్చే జీవితం -ఓల్గా
1940, 50 దశాబ్దాలు ఉత్సాహం, చైతన్యం, కార్యదీక్ష, అంకితభావం, సృజనాత్మకతలతో నిండినవి. ఒకవైపు జాతీయోద్యమ ఉధృతి, మరోవైపు రెండవ ప్రపంచ యుద్ధపు సంక్షోభం, సమసమాజపు కలలనందించిన సోవియట్ యూనియన్ ప్రభావం, వీటితో తెలుగు ప్రజలు, ముఖ్యంగా యువతీ యువకులు, విద్యార్థులు ఉద్యమాలలో భాగమైన కాలమది. ఫాసిస్టు వ్యతిరేకత ఆంధ్రదేశంలో ఉధృతంగా
ఒక మహిళా యోద్ధ – ఉష (సీతరామలక్ష్మి పోల)
ఆరుగురు పిల్లలున్న కుటుంబంలో ఐదవ పిల్లగా పుట్టి, భగవద్గీత పద్యాలు కంఠస్థం వచ్చిన తల్లి లక్ష్మమ్మ పెంపకంలో చక్కటి పాటలు, నడవడిక నేర్చారు పరిపూర్ణ. టీచర్ వృత్తితో పాటు, నాటక ప్రదర్శన ఇత్యాది తనకిష్టమైన, సాధ్యమైన అనేక మార్గాల ద్వారా సంపాదన పెంచుకుంటూ కుటుంబాన్ని పోషించే తండ్రి లక్ష్మయ్య గారి ప్రభావంతో చిన్నతనం నుండి ధైర్యసాహసాలు, … Continue reading
ఆమె చూపిన వెలుగుదారుల్లో… – ఎ.కె. ప్రభాకర్
చాలామందికి లాగానే నంబూరి పరిపూర్ణ గారి గురించి నాకు ఆమె ఆత్మకథ ‘వెలుగు దారులలో…’ చదివే వరకు పెద్దగా ఏం తెలీదు. అంతకు ముందు అనిల్ అట్లూరి, దాసరి శిరీష నిర్వహించే వేదిక (సాహిత్యంతో మనలో మనం) కార్యక్రమాల్లో ఒకట్రెండు సార్లు ఆమెను చూశాను. ఎనభై అయిదేళ్ళ కంచు కంఠంతో ఆమె పాడగా విన్నాను. మాటల్లో … Continue reading
విముక్త మానవి విసిరిన సవాళ్ళు – జయధీర్ తిరుమలరావు
పరిపూర్ణ గారిని చూస్తే మా అమ్మమ్మ గుర్తొస్తుంది. మనుషులను పోలిన మనుషులు ఉంటారా? కొద్దిమంది ఉంటారు. కానీ, వీళ్ళిద్దరికి శారీరక పోలికలే కాదు, ఆ చూపు, ఆ హుందాతనం, మాటతీరు… అంతా ఒక్కటే. పరిపూర్ణ గారు ఇంకొన్ని రోజులు బ్రతికి ఉంటే ఎన్నడో ఒకరోజు వెళ్ళిపోయి అమ్మమ్మా అని తనివితీరా పిలిచేవాడిని.
మన చరిత్ర అసమగ్రం – కె.వెంకటేష్
జాతీయోద్యమ స్ఫూర్తి, సాయుధ పోరాట దీప్తుల ఉమ్మడి జ్ఞాపకం నంబూరి పరిపూర్ణ. ఆనాడు దేశభక్తి గీతాలను ఆలపిస్తూ సామాన్యుల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించేందుకు కృషి చేశారు. విద్యార్థి సంఘం నాయకురాలిగా సాయుధ పోరాటంలో పాల్గొని ధీరవనితగా నిలిచారు. సామ్యవాద సిద్ధాంతపు వెలుగుదారుల్లో మొదలైన ఆమె జీవన ప్రస్థానం ఆనాటి చరిత్రకు సాక్ష్యం. 91 ఏళ్ళ పరిపూర్ణ … Continue reading
సదాచారాల ముసుగులో … – నంబూరి పరిపూర్ణ
మన భారతీయుల్ని అన్ని విధాలా దోచుకుంటూ, మనల్ని తమ బానిసలుగా మార్చిన బ్రిటీషర్లులోని మరోకోణం మానవత. పుట్టిన మరుక్షణంలో బాలికను చంపే చర్యను, ఆ తదుపరి ఎనిమిదేళ్ళ పిల్లను పెళ్ళిజరిపే ‘సాకు’తో ఇంటి నుంచి గెంటేయడం లాంటి అమానుష చర్యల్ని సదాచారాల పేరుతో అమలు చేస్తున్న ఆ దుష్ట సంప్రదాయాన్ని బ్రిటీషు పాలకులు, కఠిన చట్టాల … Continue reading
పరిపూర్ణ స్పర్శ – డా॥కె.గీత
దాదాపు 2000లలో, నేను హైదరాబాద్‌లో స్థిరపడ్డ తొలి రోజుల్లో ఆంధ్రజ్యోతి వివిధలో నా ‘వాన స్వాగతం’ కవిత అచ్చయింది. ఆ కవిత తనని ఎంత కదిలించిందో చెబుతూ అమరేంద్ర గారు ఉత్తరం రాశారు. అంతేకాకుండా అదే నెలలో ఏదో సభలో మొదటిసారి కలిసి ఎంతో ప్రశంసించారు. అక్కడే వారి అమ్మగారినీ, శిరీష గారినీ పరిచయం చేశారు. … Continue reading
‘వెలుగు దారులలో’ నిరంతర ప్రయాణం – జి.వెంకటకృష్ణ
నంబూరి పరిపూర్ణ గారి ఆత్మకథ చదివాక గొప్ప అనుభవాల గుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆద్యంతమూ ఒక విషాదస్వరం మనవెంట ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ అక్షరాలు పలికే వినయ సంస్కారపు విజయాల వెనుక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లాగా ఆమె పంటిబిగువున అణచిన కోపమో, వగపో, తృణీకారమో చిరుసవ్వడి చేస్తూ ఉంటాయి. దాన్ని ఎంతమంది వింటారో తెలియదు.
ఆమెతో ప్రయాణం – దాసరి అమరేంద్ర
‘‘నీ కథలకన్నా ఉంటాయి మాకు ఉషస్సులు లోని కథలే బావున్నాయి!’’ హతాశుడినయ్యాను… స్వీయానురాగంలో మునిగి తేలుతున్న రోజులవి. పై మాట అన్నది నాకెంతో గురి ఉన్న మనిషి! కాలేజీ రోజుల్లో ఎన్నెన్నో గంటలు రంగనాయకమ్మ గురించీ, కుటుంబరావు గురించీ… మధ్యలో కాంటాక్ట్ పోయి మళ్ళా ముప్ఫై ఏళ్ళ తర్వాత కలిసిన మనిషి, నాతోనే గాకుండా అమ్మతోనూ … Continue reading
జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన అత్తయ్య – దాసరి పద్మ
అత్తయ్య వెళ్ళిపోయాక ఇల్లంతా ఖాళీ అయిపోయిన ఫీలింగ్. రోజూ ఆవిడకి ఏమి పెట్టాలి, ఏమి వండాలి అనే ఆలోచనతో బుర్ర కూడా బిజీగా ఉండేది. ప్రతిరోజూ సైరాతో సునీతతో ఒక అరగంట డిస్కషన్స్ ఉండేవి. ఇవేమీ లేకపోయేసరికి బుర్ర కూడా ఖాళీ అయిపోయిన ఫీలింగ్…
వెలుగుదారి పరిపూర్ణమ్మ! – శ్రీశైల్‌రెడ్డి పంజుగుల
నంబూరి పరిపూర్ణ గారిని నేను కలిసింది రెండేసార్లు! అదీ ఈ మధ్యనే. సౌదా ‘రామాయణం’ సినిమాలో కైకసి పాత్ర చేస్తరేమో అడగడానికి వస్తమని వారబ్బాయి అమరేంద్ర గారికి చెప్తే, హైదరాబాద్ వస్తున్న అమ్మను తీసుకుని, వచ్చేవారం రండి అన్నరు ఆయన. నేనూ, సౌదా వెళ్ళినం. ఓ రెండు గంటలు
కాంతికిరణానికి కృతజ్ఞతాంజలులు – శ్రీనివాస్ బందా
నంబూరి పరిపూర్ణ గారితో గానీ, ఆవిడ రచనలతో గానీ నాకు ప్రత్యేకమైన పరిచయం మొన్నీమధ్య వరకూ లేదు. కొన్నేళ్ళ క్రితం వరకూ తెలుగు సాహిత్యంతో క్షీణించిన నా సంబంధం మెల్లిమెల్లిగా తిరిగి బలపడుతున్న తరుణంలో ఒక అవకాశం దొరికింది ఢల్లీి సాహితీ వేదికతో 2018`19లో ఏర్పడిన పరిచయం వల్ల. ‘అమరేంద్ర’గారి పేరుతో దాదాపు ఐదు దశాబ్దాలకు … Continue reading
అమ్మమ్మ కూడా అమ్మే- అపర్ణ తోట
And Finally… ఆమె చనిపోతే గాని ఆమె నా మరో పేరెంట్ అన్న విషయం ఉనికికి రాలేదు నాకు. నాకు ఐదున్నరేళ్ళప్పటి నుంచి అమ్మమ్మ, మేము ఒకే కాంపౌండ్‌లో పక్కపక్క ఇళ్ళల్లో ఉండేవాళ్ళం. అమ్మమ్మ నాకు రెండు జడలేసి, తన ఇంటి ముందున్న గుండు మల్లె చెట్టు నుండి రెండు పూవులు దగ్గరగా చేర్చి స్లైడ్ … Continue reading