Category Archives: ఇంటర్‌వ్యూలు

ఇంటర్‌వ్యూలు

బహుముఖ ప్రతిభాశాలి మంథా భానుమతి – గిరిజ పైడిమర్రి

మశీథా భానుమతి గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. నేటి యువతరంతో పోటీపడుతూ 80యేళ్ళ వయసులో కూడా అంతే వేగంగా రచనా వ్యాసంగంలో ఎఫ్.బి బరిలో ముందుకు దూసుకుపోతున్నారు. భౌతిక, రసాయన శాస్త్రాలు బోధించి, కథలు, నవలలు, కవిత్వం, పద్యకవిత్వం, సంగీతం ఒకటేమిటి పలురంగాలలో ఆమె ప్రతిభను చాటారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

చరిత్ర అంటే ఇది కదా! చరిత్ర కెక్కని,బాధలు పడిన అమ్మ లెందరో? – కాంతి నల్లూరి

అనసూయ అమ్మని పలకరిద్దామని ఇంటికి వెళ్ళాను. అమ్మ కూరగాయలు సర్దుతుంది. చిన్నకోడలు రాజేశ్వరి వంటింట్లో హడావుడిగా పనిచేస్తుంది. అమ్మ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది. అమ్మ లోనుంచి ఏదో విద్యుత్ నాలో ప్రవేశించింది. అది ప్రేమ ఆప్యాయత అనే ఉద్యమ విద్యుత్.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆమె బాల (కార్మికు)ల పెన్నిధి – గిరిజ పైడిమర్రి

శాంతాసిన్హాగారి పేరు జగద్వితం. పద్మశ్రీ, రామన్ మెగసెసే లాంటి పలు అవార్డుల గ్రహీత. ఆమె చేసిన పని, సాధించిన విజయాలు చరిత్రలో శాశ్వతంగా చోటు చేసుకున్నాయి. దాదాపు రెండు వేల గ్రామాలలో బాలకార్మిక వ్యవస్థ పునాది స్థాయి నుంచి తుడిచి పెట్టుకుపోయింది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

లక్ష్మీ రాజీవతో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

వయసు పైబడినా ఏమాత్రం అలసత్వం చూపించకుండా అహర్నిశలు పనిచేస్తున్నారు లక్ష్మీరాజీవగారు. ఈ వయసులో కూడా ఆమె చలాకీతనం, ఉత్సాహం నేటి తరానికి మార్గదర్శకం. చంటి ప్రసన్న కేంద్రాన్ని స్థాపించి 30 ఏళ్ళకు పైగా మహిళా సాధికారత దిశగా ఎన్నో కార్యక్రమాలు చేసారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

“హం హైదరాబాదీ” జిలాని బానో – కె.సజయ, కె. సత్యవతి, ఎ. రజిత.

హం హైదరాబాదీ. హమేషా హైదరాబాదీ రహతీహు, మా చిన్నప్పుడు మేము, హిందూస్ అందరం కలిసి ఆడేవాళ్ళం. బోనాలు పండుగలు, దసరా పండుగలకి బొమ్మలు తీసుకురావడం, మిఠాయిలు తీసుకురావడం మేము కూడా ఆ పిల్లలతో కలిసి వెళ్లేవాళ్ళం. బోనాలు సమయంలో మేకల్ని బలివ్వడం, పూజలు చేయడం నా చిన్నతనంలో చూసేదాన్ని.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ప్రముఖ స్త్రీవాది వసంత కన్నాబిరన్‌తో ముఖాముఖి – గిరిజ పైడిమర్రి

వాళ్ళిద్దరివీ రెండు మార్గాలు. ఒకరు పౌరహక్కుల ఉద్యమానికి జీవితం అంకితం చేస్తే మరొకరు మహిళా హక్కుల కొరకు ఉద్యమించారు. వాళ్ళే వసంత, కన్నాబిరన్‌లు. పౌరహక్కుల నేతకు సహచరిగా, ఉద్యోగిగా, ముగ్గురు పిల్లలకు తల్లిగా, అన్నిటికీ మించి మహిళా హక్కుల కొరకు అహర్నిశలు పనిచేసిన మహిళగా, రచయిత్రిగా, అనువాదకురాలిగా పలు సవాళ్ళను వసంత తన జీవితంలో ఎదుర్కొన్న … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

లలితా రాందాస్ జీవన ప్రస్థానం – గిరిజ పైడిమర్రి

ఎనభై ఆరేళ్ళ లలితా రాందాస్ జీవన ప్రస్థానంలో.. రాజకీయంగా, సామాజికంగా, విద్యావ్యవస్థలో వచ్చిన పరిణామాలు పాఠకులకు అవగాహనకు వస్తాయి. బాల్యంలో సహచరులిద్దరి జీవితాలలో జరిగిన సశీఘటనలు.. భవిష్యత్తులో ఇండియా పాకిస్తాన్ దేశాల శాంతి సయోధ్యకు పనిచేసేలా చేసాయి. ఇండియన్ నేవీ కుటుంబాలకు ఉండే హై సెక్యూరిటీ సిస్టం పెట్టని కోటగోడ లాంటిది.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

వనమాల జీవన సంఘర్షణ – గిరిజ పైడిమర్రి

నేను చేస్తున్న ఇంటర్వ్యూల పరంపరలో భాగంగా వనమాలగారిని సంప్రదించినప్పుడు… ఎందుకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకున్నావు? ఈ సందర్భంలో ఇలా నన్ను అడిగిన మొదటి వ్యక్తి ఆమె. హరగోపాల్‌ గారి సహచరిగా కాకుండా మీ అస్తిత్వాన్ని మీరు నిలబెట్టుకున్న తీరు మహిళలను ప్రభావితం చేసే విధంగా ఉంటుందని, అది పాఠకులకు తెలియవలసిన అవసరం ఉందని భావించి వచ్చానని … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

శీలా సుభద్రాదేవి – పరిశోధన – గిరిజ పైడిమర్రి

‘‘నా సాహితీ వ్యాసంగం కొనసాగుతూనే ఉంది. నేను రాస్తూ రాస్తూనే ఉంటాను. నేను అలసిపోలేదు. నా కలం ఇంకిపోలేదు. కవిత్వం నా శ్వాస. నిరంతర అధ్యయనం నా ఊపిరి’’ అంటూ తన డెబ్బై అయిదేళ్ళ వయసులో సాహిత్య సేవ చేస్తున్న.. మృదు స్వభావి శీలా సుభద్రగారు నేటి రచయితలకే కాదు, యువతరానికి స్ఫూర్తి ప్రదాత. ఆమె … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

‘‘చిట్టి చిలకమ్మ’’ బల్ల సరస్వతి ఇంటర్వ్యూ – గిరిజ పైడిమర్రి

‘‘చిట్టి చిలకమ్మా! / చిన్నీ చిలకమ్మా! అమ్మ కొట్టిందా?/ తోట్లోకెళ్లావా? పండు తెచ్చావా?/ పాపాయికిచ్చావా?

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆమె ఒక నిశ్శబ్ద యుద్ధ నౌక – గిరిజ పైడిమర్రి

‘‘అట్టడుగున పడి కాన్పించని కథలెన్నో కావాలిప్పుడు’’ అన్నాడు శ్రీశ్రీ. అలాంటి కథనమే యిది. కోట్లాది ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిల పరచుకున్న ప్రజాయుద్ధ నౌక గద్దర్‌. ప్రజాగాయకుడుగా, కవిగా, విప్లవ రాజకీయ కార్యకర్తగా ఆయన గురించి తెలియని వారుండరు. ఆ యిల్లు నిత్యం వచ్చిపోయే జనానికి, ప్రజా రాజకీయాల చర్చలకు నెలవు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఇంద్రగంటి జానకీబాల – ఒక పరిశీలన – గిరిజ పైడిమర్రి

వాళ్ళ కుటుంబం సంగీత సాహిత్యాలకు నిలయం. సుప్రసిద్ధ రచయిత ఇంద్రగంటి హనుమచ్భాస్త్రి కోడలు, రచయిత ఇంద్రగంటి శ్రీకొంత శర్మ సహచరి, తనదైన ప్రత్యేక ముద్రవేసిన ప్రఖ్యాత సినీ దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తల్లి ఇంద్రగంటి జానకీబాల గారు. రచన, సంగీతం, సంపాదకత్వం. ఇలా పలు రంగాలలో రాణించారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఆమె అతని ఆలంబన – గిరిజ పైడిమర్రి

వాళ్ళ ఇల్లు ఒక మ్యూజియం. ఆ కళాఖండాల నిలయానికి నీలమ్మ గారే ఆలంబన. అనితరసాధ్యమైన కళాఖండాలను గత నలభై యేళ్ళుగా వాళ్ళిద్దరూ కలిసి సేకరించారు. వాటి విలువ ఈనాడు కోట్లలో ఉంది. ప్రజల నుంచి సేకరించిన వాటిని నిస్వార్థంగా ప్రజలకే అందించాలనే దృఢ నిశ్చయంతో వారు వున్నారు. చరిత్ర అంటే రాజులదే అనే అపోహతో ఉన్న … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

సాహసికుడి సహచరి అంతరంగం – గిరిజ పైడిమర్రి

76 సంవత్సరాల వయసులో నమ్మిన విలువలు, ఆదర్శాలు, ఉద్యమాల కోసం నిశ్శబ్దంగా జీవిత సహచరుడితో కలిసి ఆమె ఇంకా అడుగులు వేస్తున్నారు. వాళ్ళ జీవన పయనంలో పదిహేనేళ్లకు (జైలు, ప్రవాసము) పైగా జైలు నిర్బంధంలోనే గడిచిపోయినా ఏనాడూ ఆమె ధైర్యాన్ని కోల్పోలేదు. 78 ఏళ్ళ వయసులో జీవిత సహచరుడుని జైలులో నిర్బంధిస్తే … బలహీనమైన వృక్షం … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అమ్మే స్ఫూర్తి – గిరిజ పైడిమర్రి

సందర్భం:‘‘హలో! నా పేరు విజయలక్ష్మి. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో యోధ పుస్తకం మీద మీరు రాసిన ఆర్టికల్‌ చదివాను. సి ఆర్‌ ఫౌండేషన్‌ గ్రంథాలయం కొరకు యోధ పుస్తకాలు కావాలి.’’ అంటూ విజయలక్ష్మి గారు ఫోన్‌ చేశారు. సిఆర్‌ ఫౌండేషన్‌లో నీలం రాజశేఖర్‌ రెడ్డి రీసర్చ్‌ సెంటర్‌ సహకారంతో కొనసాగించిన గ్రంథాలయం ఇంకా మనుగడలో ఉండడం … Continue reading

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

ఉద్యమ నేపథ్యం కలిగిన వేదమ్మ గారితో ముఖాముఖి – పైడిమర్రి గిరిజ

మూడు సంవత్సరాల కిందట సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో జరిగిన చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ సభలో వేదమ్మ గారు పాడిన పాటలు, ఆమె ఉత్సాహం నన్ను ఉత్తేజపరిచాయి. ఈ వయసులో స్మార్ట్‌ ఫోన్‌్‌తో ఫోటోలు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సంఘం పనుల కోసం అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చురుకుదనానికి ముగ్ధురాలినయ్యాను.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment