-
Recent Posts
- జనవరి – ఫిబ్రవరి, 2025
- తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
- ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
- సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
- మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
February 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 Meta
Tags
Category Archives: ప్రత్యేక సంచిక – బోయి విజయ భారతి
తన మార్గంలో నడవాలని తపన పడిన బోయి విజయభారతి – కొండవీటి సత్యవతి
చాలా సంవత్సరాల క్రితం ఓ రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఒక మీటింగులో మొదటిసారి విజయభారతి గారిని కలిసాను. ఆ మీటింగ్ ఏంటో ఇప్పుడు నాకు గుర్తులేదు. అంతకు ముందు ఎన్నో మీటింగుల్లో తనని కలిసాను కానీ ఎక్కువగా మాట్లాడిరది లేదు. ఆ రోజు ఆ మీటింగ్‌కి విజయభారతి గారు ఒక్కరే వచ్చారు.
ప్రాచీన తెలుగు సాహిత్య విమర్శకు అంబేద్కర్ ఆలోచనను పరికరంగా అందించిన బోయి విజయభారతి – ప్రొఫెసర్ కాత్యాయనీ విద్మహే
విజయభారతిగారి ఎనభై మూడేళ్ళ జీవయాత్ర 2024సెప్టెంబర్ 28న ముగిసింది. ఆమె ప్రసిద్ధకవి, నాటక రచయిత బోయి భీమన్న గారి కూతురు కావచ్చు. మరొక ప్రసిద్ధకవి, పౌర` దళిత హక్కుల నేత, ప్రజాస్వామిక ఉద్యమాలకు వెన్నుదన్ను అయిన బొజ్జా తారకంగారి భార్య కావచ్చు.
సనాతన వర్ణవ్యవస్థ అధర్మంపై సాహిత్య ఖడ్గం ఝుళిపించిన క్రాంతిజ్యోతి – బి.ఎం. లీలాకుమారి
మహాత్మా జ్యోతిబా ఫూలే, మాతా సావిత్రిబాయి, బాబాసాహెబ్ డా॥ అంబేడ్కర్` పెరియార్‌ల మహోన్నత సమతా సాంస్కృతిక సాహిత్యోద్యమ తాత్విక వారసురాలిగా తెలుగునాట ప్రసిద్ధికెక్కిన సాహిత్య క్రాంతిజ్యోతి అమ్మ డా॥ బి.విజయభారతి.
మృదువుగా మాట్లాడటం ఆమె ప్రత్యేకత – కె.లలిత
విజయభారతి గారు దాదాపు 70వ దశాబ్దం చివరినుంచి నాకు తెలిసిన వ్యక్తి. కానీ ఆమెతో అంత సన్నిహితమైన పరిచయం ఆ రోజుల్లో ఉండేదికాదు. 1975-76 సంవత్సరాలలో నేను సంవత్సరానికి రెండు మూడు సార్లు నిజామాబాద్‌కు ప్రయాణం చేసేదాన్ని. ఆ సందర్భంలో తారకంగారి తోటి పరిచయం ఏర్పడిరది. ఆ రోజుల్లో తారకంగారు నిజామాబాద్‌లో అడ్వకేట్‌గా పనిచేసేవారు.
సామాజిక దృక్పథంతో పురాణాల విశ్లేషణ – పాణి
ఆధునిక దృక్పథంతో పురాణాల విశ్లేషణకు ఆద్యుడు ఫూలే. బలి` వామన కథను తలకిందుల చేసి ఆధునిక కథనాన్ని ఆయన వినిపించారు. పురాణాలను పుక్కిటి పురాణాలని ఆయన కొట్టి పారేయలేదు. అవి గత కాలానికి చెందినవని పక్కన పెట్టేయలేదు. పురాణాల పట్ల విమర్శనాత్మక వైఖరి నుంచి తన సామాజిక దృక్పథాన్ని తీర్చిదిద్దుకున్నారు.
ప్రత్యామ్నాయ పరిశోధనా భారతి – డాక్టర్ కోయి కోటేశ్వరరావు
కొంతమంది కవి పండితులు జలపాతాల్లాగా పరవళ్ళు తొక్కుతారు. అతి కొద్దిమంది సాహితీవేత్తలు పంటకాలువలా నిశ్శబ్దంగా ప్రవహిస్తూ పాఠకుల హృదయ క్షేత్రాలపై పచ్చని సృజన సంతకం చేస్తారు. బీడు బారిన నేలమీద ఆవరించిన కంటకాలను పంటకాలువ ప్రక్షాళన చేసినట్లు, జాతిని నిర్వీర్యం చేసే సాంస్కృతిక కాలుష్యాన్ని ఆ సృజనకారులు తమ రచనా వాహినితో శుద్ధి చేయటానికి ప్రయత్నిస్తారు.
అరుదైన పరిశోధకురాలు – చల్లపల్లి స్వరూపరాణి
డా. బి. విజయభారతిగారు వుద్యమ శ్రేణులు చాలా గొప్పది అని భావించే కుటుంబ వారసత్వం నుంచి వచ్చి అంతే గొప్పగా తన కార్యాచరణను చాటుకున్న విశిష్ట వ్యక్తి. ఆమె పంతొమ్మిదవ శతాబ్దపు సంఘసంస్కరణ వుద్యమాలలో విస్మరణకు గురైన అధ్యాయం అయిన దళిత సమాజపు అంతర్గత సంస్కరణలో కీలకపాత్ర పోషించిన గొల్ల చంద్రయ్య గారి మనుమరాలు.
రెండు తరాల పోరాటం – గనుమల జ్ఞానేశ్వర్
పూర్వ ఆంధప్రదేశ్ రాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవితం, ఉద్యమంపై తెలుగు ప్రజలకు స్ఫూర్తిని కలిగింపచేయడానికి 1944లో డా॥ అంబేడ్కర్ ఆంధ్ర ప్రాంతం పర్యటన, తెలంగాణ ప్రాంతంలో భాగ్యరెడ్డి వర్మ కృషి, అంబేడ్కర్‌ను ప్రోత్సహించడం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.
విజయభారతిగారు సామాజిక సాహిత్యకారులు – ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు
విజయభారతి గారు సామాజిక సాహిత్యకారుల కుటుంబంలో జన్మించారు. వీరి తండ్రి బోయి భీమన్నగారు. వీరు తారకంగారి అర్ధాంగి. అటు తండ్రి ఇటు భర్త వీరి కంటే భిన్నంగా తన రచనా వ్యాసాంగాన్ని, సామాజిక అవగాహనని తనకు తానుగా రూపొందించుకున్నారు. నిజామాబాదులో డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తూ హైదరాబాదులోని తెలుగు అకాడమీకి వచ్చారు.
నీలాకుపచ్చని అపురూప తారక – సజయ
విజయభారతిగారితో మొదటి పరిచయం 1989 సంవత్సరంలో! అప్పుడే తారకంగారు ఎడిటర్‌గా నలుపు పత్రిక ప్రారంభమయిన కాలం. అన్వేషిలో నేను ఒక రిసెర్చ్ ప్రాజెక్టులో ఫీల్డ్ అసోసియేట్‌గా చేరిన సందర్భం. అందులో భాగంగా రాష్ట్రంలో వున్న ముఖ్యమైన లైబ్రరిలకి వెళ్లి నూటయాభై సంవత్సరాలనాటి మహిళల గురించి వచ్చిన పత్రికలనూ, పుస్తకాలనూ వెతికి వాటిని భద్రపరచటం నా పని.
దశావతారాల్లో హేతువాద దృక్పథం – డాక్టర్ తిరునగరి దేవకీ దేవి
తారీఖులు దస్తావేజులు ఇవి కావోయ్ చరిత్రకర్ధం అనే శ్రీశ్రీ అభిప్రాయం వాస్తవమే అయినా అవి ఎన్నెన్నో విషయాలను ప్రోది చేసి ఇస్తాయి అనేది కూడా వాస్తవమే. అది విజయభారతి గారి రచనల్లో మరింత స్పష్టం. విజయభారతి గారు 1941లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో జన్మించారు. ప్రముఖ కవి బోయి భీమన్న గారి కూతురు.
మానవ విలువలకి నిలువెత్తు సాక్ష్యం – ప్రొఫెసర్ సుజాత సూరేపల్లి
తెలుగు నేల గర్వించ దగిన గొప్ప దళిత మేధావి, రచయిత్రి, విద్యావంతురాలు బోయి విజయభారతిగారు మన మద్య లేకపోవడం ఒక విషాదం. 1941 నుండి 2024 వరకు జీవించిన కాలం పూర్తిగా ప్రజలకోసం అనే చెప్పొచ్చు. కొందరికి మాత్రమే అరుదుగా లభించే ఆవకాశం. పుట్టి పెరిగిన బోయి భీమన్న కుటుంబ వాతావరణం, తాను పెళ్లి చేసుకొని … Continue reading
ఆమె జీవితం ఒక నిశ్శబ్ద పోరాటం – ఝాన్సీ గెడ్డం
ఆధునిక సమాజానికి సంబంధించిన స్త్రీ ఐకాన్ బోయి విజయభారతిగారు. విజయభారతిగారిని చూసిన ఎవరైనా ఒకసారి మాట్లాడితే చాలు మనసారా అమ్మ అని పిలుస్తారు. తెలుగు అకాడమీ డైరెక్టరుగా, రచయితగా ఆమె సమాజానికి చేసిన కృషి చాలా అమూల్యమైనది. కులం, మతం పట్ల ఆమె వైఖరి ఈనాటికి ఎవరితోనూ సరి తూగనిది.
ప్రత్యామ్నాయ సాహితీ ధృవతార డా॥ బోయి విజయభారతి – డాక్టర్ సుధారాణి
డాక్టర్ బోయి విజయభారతి గారికి మన:పూర్వక నివాళులు అర్పిస్తున్నాను. అమ్మతో మూడున్నర దశాబ్దాల సన్నిహిత సంబంధం నాది. విజయభారతిగారు నాకు పరిచయం కాకముందే వారి తండ్రి పద్మశ్రీ బోయి భీమన్నగారిని కలవడం జరిగింది. నేను జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 1988`1992 మధ్య పరిశోధన విద్యార్థిగా ఉన్నపుడు, ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసాను.
ఒక జ్ఞానజ్యోతి ఆరిపోయింది – ప్రొఫెసర్ కోదండరామ్
డాక్టర్ విజయభారతి అమ్మకి ముందుగా నా తరపున, తెలంగాణ జన సమితి తరఫున నివాళులు అర్పిస్తున్నా. తారకంగారితో, విజయభారతిగారితో, ఆ ఇంటితో ఉన్న చాలా అనుబంధాలు ఈ సందర్భంగా గుర్తొస్తా ఉన్నాయ్. విజయభారతి అమ్మకి హైదరాబాదులో ఉద్యోగం రావడంతో తారకంగారు కూడా నిజామాబాద్ నుంచి ఇక్కడికి షిఫ్టయిన్రు.
ఆధునిక సావిత్రిబాయి ఫూలే మన విజయభారతిగారు! – డా.గోగు శ్యామల
పచ్చదనంపై జరుగుతున్న వేట కనపడినంత స్పష్టంగా దానిని కాపాడే తపన కనపడదుగా! ప్రపంచంలో అణు యుద్ధాలు, వైరస్ దాడులు కనబడుతున్నంత స్పష్టంగా కుల వైరస్ చేసే విథ్వంసం కనపడదేమో! అది కనబడాలన్నా, దానిని చూడాలన్నా కళ్ళు మాత్రమే ఉంటె సరిపోదు. వాటికి తమని తాము వంచించుకోలేని కాస్త నిజాయితి, కాస్త సున్నితత్వం ఉండాల్సిందే.