Category Archives: ప్రత్యేక సంచిక – బోయి విజయ భారతి

అమ్మ – డా. బొజ్జా మహిత

25-10-2024 రోజు గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజీ, నాగర్‌ కర్నూలులో కొత్తగా చేరిన మెడికల్‌ కాలేజీ స్టూడెంట్స్‌కి స్వాగతం చెపుతున్న సభ. వేదిక మీద ఆ కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌గా, హాస్టల్‌ వార్డెన్‌గా కూర్చున్నప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి మాటలలో చెప్పలేనివి.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

కులం, జెండర్‌ స్త్రీవాదం గురించి విజయభారతి – అనిశెట్టి రజిత

గత సంవత్సరం 28 సెప్టెంబర్‌న తెలుగు సాహితీ సామాజిక సమూహాల ముందు చీకటి సంతకం చేసి సెలవంటూ వెళ్ళిపోయారు పరిశోధక సాహిత్య మేరునగధీర బోయి (బొజ్జ) విజయభారతి. ఆమెది మహోన్నతమైన విజయగాథ. కవి, రచయిత బోయి భీమన్న నాగరత్నమ్మల కూతురైన ఆమె తండ్రి భీమన్న రచనా వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

నలుగురు కలిసి కూర్చున్న వేళ విజయభారతి గారిని ఒకసారి స్మరించుకుందాం – మరియం దవాలే

డాక్టర్‌ బోయి విజయభారతి ప్రముఖ విదుషీమని. ప్రముఖ సాహిత్య వేత్త బోయి భీమన్న గారి పెద్ద కుమార్తె. లెక్చరర్‌గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఏమైనా ఆమె విజ్ఞానం, విజ్ఞత, సంస్కారం ముందు ఆమె చేపట్టిన పదవులు అంత లెక్కలోనివి కాదు. తెలుగు సాహిత్యం మీద ఆమెకు మంచి పట్టు.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

ఉత్తమ సంస్కారానికి ప్రతీక విజయభారతి `- డా॥ తెన్నేటి సుధాదేవి

ఉత్తమ సంస్కారానికి ఆలవాలం నిరాడంబరతకు నిలయం ఆప్యాయతకు భాండాగారం సౌజన్యం ఆమె స్వభావం

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

మానవతామూర్తి… బోయి విజయభారతిగారు – గిరిజ పైడిమర్రి

బోయి విజయభారతిగారు ఇక లేరనే పిడుగు లాంటి వార్త 28/9/2024 ఉదయమే తెలిసింది. చాలా సేపు ఆ షాక్‌ నుంచి తేరుకోలేక పోయాను. తరువాత కృష్ణకుమారికి ఫోన్‌ చేసాను. తనూ అదే షాక్‌లో ఉన్నానని చెప్పింది. ఆ మధ్య విజయభారతిగారు నేను, క్రిష్ణ కుమారి తరచుగా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నాము.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

‘విజయ గాథ’ ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ – బొమ్మకంటి కృష్ణకుమారి

పుస్తకాలను 23-11-2024 (శనివారం) రోజు ఆవిష్కరించారు. ‘విజయ గాథ’ డా. బోయి విజయభారతి గారి స్వీయ చరిత్ర. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ విజయ భారతి గారి గురించి 52 మంది రాసిన జ్ఞాపకాలను గుదిగుచ్చి అందించిన స్మారక సంచిక. ‘నిశ్శబ్ద విప్లవ తరంగిణి’ లో నా వ్యాసం ఉంది. ‘విజయ గాథ’ ని నేను, గిరిజ … Continue reading

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

జీవిత నాటక రంగస్థలిపై యోధురాలు ! – యింద్రవెల్లి రమేష్‌

జీవితం ఒక నాటకరంగం, మనమందరం అందులో పాత్రధారులం. ఇలా అనుకుంటే తమ పాత్రను తాము అర్థం చేసుకుని ఘనంగా పోషించేవారు, ఈ జీవిత రంగస్థలిపై బాగా రాణిస్తారు. ఇక్కడ రాణిస్తారు అంటే, తాము అనుకున్న ఫలితాలు సాధిస్తారు అని, ఆ ఫలితాలు (ఇతరులకూ లేదా) సమాజానికి పంచుతారని అర్థం.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

ఆమె మౌనంగా లేదు …. – భండారు విజయ

బోయి విజయ భారతి గారిని చూడడం అదే మొదటి సారి. నా సహచరుడు బొజ్జ తారకం గారి వద్ద అతి కొన్ని నెలలు మాత్రమే అప్రెంటిషిప్‌ చేయడం వలన ఒకసారి వాళ్ళింటికి వెళ్లడం జరిగింది. అప్పుడు ఆమెతో అయిన పరిచయం ఆవిడ గారు జీవించి ఉన్నంత వరకు నిలకడగా అలాగే ఉంది. ముఖ్యంగా ఆవిడ మృదుభావిని. … Continue reading

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

ప్రత్యామ్నాయ చరిత్రకారిణి విజయభారతి – డా॥ సంగిశెట్టి శ్రీనివాస్‌

ప్రత్యామ్నాయ చరిత్రను రాయడానికి పరిశోధన ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. ప్రచారంలో ఉన్నటువంటి విషయాలను పక్కకుతోసి సత్యాలను నిలబెట్టడానికి గ్రంథవనరులు చాలా అరుదుగా దొరుకుతాయి. ఇట్లా దొరికిన ఆధారాలను కన్విన్సింగ్‌గా చెప్పడం ఒక కళ. ఈ కళలో నిష్ణాతులు, ఆల్టర్నేటివ్‌ చరిత్ర నిర్మాత, సబాల్టర్న్‌ విదుషీమణి బోయి విజయభారతిగారు.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment

సామాజిక చింతనా మాతృమూర్తి – డా॥ గూడూరు సీతా మహాలక్ష్మి

డా. విజయభారతిగారి గురించి చెప్పాలంటే గొంతుకేదో గీరబోయినట్లు అనిపిస్తోంది. చాలా వేదనగా కూడా వుంది. నిన్న మొన్న కలిసిన మనిషి, కళ్ల ముందు సజీవంగా నిలిచిపోయిన మనిషి, ఇవాళ భౌతికంగా మనమధ్య లేరు అనేది నాకైతే వ్యక్తిగతంగా జీర్ణించుకోలేని అంశం.

Share
Posted in ప్రత్యేక సంచిక - బోయి విజయ భారతి | Leave a comment