Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

30 వ బీజింగ్‌ సదస్సు వార్షికోత్సవం సందర్భంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం! – శివలక్ష్మి

2025 అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన థీవ్‌ు : 2025 వ సంవత్సరానికి అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవానికి లింగ సమానత్వాన్ని సాధించడానికి వేగంగా చర్యలను చేపట్టండి (Accelerate Action) అని ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు సమిష్టిగా పనిచేయమని ఐక్యరాజ్యసమితి నిర్ధేశించింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశంలోని ముస్లిం మహిళలలో విద్యా పరిస్థితి: ఒక సామాజిక అధ్యయనం – సిహెచ్‌. కృష్ణరావు

పరిచయం ఒక దేశం యొక్క అభివృద్ధి ప్రక్రియలో విద్య ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు వ్యక్తిగత మరియు సమాజ అభివృద్ధి కోసం కొత్త జ్ఞానం మరియు నైపుణ్యాల పెంపుదలతో మరియు చివరికి వృత్తిపరమైన మరియు సామాజిక చలనశీలతతో దగ్గరి సంబంధం కలిగి ఉంటుంది. ఒక దేశం యొక్క పురోగతిని అంచనా వేయడానికి విద్య ఉత్తమ మార్గం.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో మహిళలపై పెరుగుతున్న నేరాలు – సామాజిక పరిశీలన – డాక్టర్‌ కందగట్ల శ్రవణ్‌ కుమార్‌

మహిళలు, బాలికలపై హింస ప్రపంచంలో అత్యంత ప్రబలంగా, విస్తృతంగా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలలో ఒకటిగా మిగిలిపోయింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (ఔనూ) ప్రచురించిన అంచనాల ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా మూడో వంతు స్త్రీలు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగిక సన్నిహిత భాగస్వామి హింస లేదా భాగస్వామి కాని లైంగిక హింసకు గురయ్యారని … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

డా. మాలతీచందూర్‌ కథాసాహిత్యం – స్త్రీ చిత్రణా వైవిధ్యం -డా. వై. సుభాషిణి

ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో రచయిత్రులకు కొదవలేదు. అన్ని ప్రక్రియల్లోనూ తమదే పైచేయిగా చాటి చెప్పారు. అలా చాటిచెప్పిన రచయిత్రుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రచయిత్రి డా. మాలతీ చందూర్‌. ఈమె నవలా రచయిత్రిగా, కథా రచయిత్రిగా, శీర్షికా రచయిత్రిగా, పాఠకులను మెప్పించేలా వాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గాలను చూపించిన వ్యక్తిగా తెలుగు … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆదివాసీ మహిళల జనజీవనం-వర్తమానం – అనూరాధ. బి

భారత రాజ్యాంగంలోని 342 వ ఆర్టికల్‌ కింద ఇప్పటిదాకా నమోదైన ఆదివాసీ తెగలు 700కి పైన ఉన్నాయి. నమోదు కాని వాటి సంఖ్య ఇంకా చాలా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆదివాసీ జనాభా మొత్తం జనాభాలో 8.6%గా ఉంది. అంటే దాదాపు 10.4 కోట్లు. భారత దేశంలో ఉన్న తెగలన్నీ ఒకేలాగా లేవు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

బాన్స్‌వాడాలో ఇంట్లో ఒంటరిగా… – స్వదేశ శర్మ

పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా అనువాదం: సుధామయి సత్తెనపల్లి బాధల వలస బాల్యాన్ని ఎప్పటికీ మారుస్తుంది. బాలల దినం సందర్భంగా ఒక కథనం. కిరణ్‌ వంట చేస్తుంది, ఇంటిని శుభ్రం చేస్తుంది, ఇంటిని నడుపుతుంది. ముంచుకొస్తోన్న ఎండాకాలం వలన వెళ్ళాల్సిన దూరాలు పెరుగుతున్నప్పటికీ, ఆమె కట్టెలనూ నీటినీ సేకరించి, వాటిని ఇంటి వరకూ మోసుకొస్తుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా – ప్రవీణ్‌ కొల్లుగురి

కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్‌ గారు ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే కథనం కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంచి, ఇజ్రాయెల్‌ మరియు పాలస్తీనా సమస్యను పరిష్కరించే మార్గాన్ని సూచించేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ, ఈ సమస్యను చూస్తున్నప్పుడు పలువిధమైన వాస్తవాలను విస్మరించడం … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పేదరిక నిర్మూలన బౌద్ధ ఆచరణలతో సాధ్యం – డా.సి.హెచ్‌. వెంకటశివసాయి

బౌద్ధ మతం మరియు ఆర్ధిక శాస్త్రానికి సంబంధించిన బుద్ధుడు బోధించినట్లు మరెవరు చెప్పలేదు. బుద్ధుని కాలంలో సమాజాలు సహజ ప్రపంచంలో వాటి స్ధానానికి మరింత లోతుగా పాతుకుపోయాయి. ఆర్ధిక వ్యవస్థలు ఇతరుల మాటలలో మరింత స్థానికీకరించబడ్డాయి. ప్రజల మధ్య మరియు సంస్కృతి మరియు ప్రకృతి మధ్య సంబంధాలు సాపేక్షంగా ఉండేవి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

నేపాలీ శబర్‌ శ్రమ జీవనం – ఉమేశ్‌ సోలంకి

అనువాదం: సుధామయి సత్తెనపలి పశ్చిమ బెంగాల్‌, పురూలియా జిల్లాకు చెందిన శబర సముదాయం తమ బ్రతుకుతెరువు కోసం అడవిపై ఆధారపడతారు నేను శబర్‌పారా చేరే సరికి రాత్రయింది. బాందోయాన్‌ తాలూకాలోని కూఁచియా గ్రామం అంచున, పదకొండు ఇళ్ళు రహదారికి దూరంగా ఉన్నాయి. అది శబర్‌ (సబర్‌ అని కూడా పిలుస్తారు) సమూహానికి చెందిన చిన్న మట్టితో … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఉర్దూ కథా సాహిత్యంలో దళితుల సమస్యలు – డా॥ ఎ. షబ్బీర్‌ బాషా

‘దళిత్‌’ అను పదము సంస్కృత భాషలోని ‘దళ్‌ధాతు’ అను పదము నుండి ఉద్భవించినది. దీని యొక్క అర్థం విరిచి భాగాలుగా చేయడం. హిందీ`ఆంగ్ల నిఘంటువులో ‘దళిత్‌’ అను పదానికి అర్థం depressed మరియు downtrodden అని వుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణ కథా రచయిత్రుల విప్లవ కథ-స్త్రీ జీవిత చిత్రణ – పెద్దపల్లి తేజస్వి

సమాజంలో కాలానుగుణంగా మార్పులు చోటుచేసుకుంటాయి. తదనుగుణంగా సమాజ ప్రతిబింబమే సాహిత్యం కాబట్టి, సామాజిక నేపథ్యంలో సాహిత్యంలో కాలక్రమంలో అనేక మార్పులు సంభవించాయి. అందులో భాగంగానే వివిధ వాదాలు, దృక్ఫథాలు వచ్చాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఎల్లలు దాటిన అచ్చమాంబ ఖ్యాతి – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

బ్రిటిషాంధ్రలో మహిళోద్యమాన్ని నిర్మించిన క్రియాశీలక మహిళా మేధావుల్లో ప్రముఖురాలైన భండారు అచ్చమాంబ (1874`1905), అబలా సచ్చరిత్ర రత్నమాల వంటి గొప్ప రచనలు చేసి, తను జీవించిన కాలంలోనే విద్వాంసురాలిగా, అఖండ మేధావిగా ప్రఖ్యాతి చెంది, ఎంతోమంది సమకాలీన స్త్రీలు తనను ఆదర్శంగా తీసుకునే స్థాయికెదిగింది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సెల్వి అమ్మ: కోయంబత్తూరు బిర్యానీ మాస్టర్‌ – పూంగొడి మదియరసు, అక్షర సనాల్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

కోయంబత్తూర్‌లోని పుల్లుక్కాడు ప్రాంతంలో అందరికీ ఇష్టురాలైన ఒక వంటమనిషి చేసే బిర్యానీ చాలా ప్రసిద్ధిచెందింది. ఇది 15 మందికి పైగా ట్రాన్స్‌ ఉద్యోగులతో కూడిన ఒక క్యాటరింగ్‌ సర్వీస్‌.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

రేఖా బెన్‌ జీవితపు పడుగూ పేకా… -ఉమేశ్‌ సోలంకి / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: సుధామయి సత్తెనపల్లి మోటా టింబ్లా గ్రామానికి చెందిన ఒంటరి తల్లి రేఖా వాఘేలా గుజరాత్‌కు చెందిన పటోలాతో – క్లిష్టమైన డబుల్‌ ఇక్కత్‌ నేతకు ప్రసిద్ధి చెందిన చేనేత పట్టు వస్త్రాలు, ఎక్కువగా చీరలు – పాటుగా తన సంక్లిష్టమైన జీవిత కథనూ నేస్తున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మహాయాన బౌద్ధ మతంలో మహిళల స్థానం – ఒక విశ్లేషణాత్మక అధ్యయనం డాక్టర్‌ చింతల వెంకట శివసాయి

వ్యాస సంగ్రహము: స్త్రీల పట్ల వివక్ష అనేది ప్రపంచంలో సర్వసాధారణ విషయం. కొన్ని మతాలలో ఆత్మ కేవలం పురుషులలో మాత్రమే ఉంటుందని, స్త్రీలలో ఉండదని భావన. కానీ, గౌతమ బుద్ధుడు తన భిక్కూని సంఘం ద్వారా మొట్టమొదటి ఆధ్యాత్మిక రంగంలో మరియు

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కమల్‌కోశ్‌ పేము చాపలు చెప్పే కథ – శ్రేయ కనోయ్‌ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రభాతి ధర్‌ అరటి చెట్లు, నెమళ్ళు వంటి శుభప్రదమైన కళాకృతులతో చాపలను అల్లుతారు. ఒక అరుదైన నైపుణ్యమైన కమల్‌కోశ్‌ అల్లికను ఆమె పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రం, కూచ్‌బిహార్‌ జిల్లాలోని యువతకు అందజేస్తున్నారు. చక్కగా అల్లిన కమల్‌కోశ్‌ చాపను కొద్దిమంది మాత్రమే మెచ్చుకోగలరు.చాలా కొద్దిమంది మాత్రమే ఇప్పటికీ ఆ చాపను అల్లగలరు. పశ్చిమ బెంగాల్‌లోని కూచ్‌ బిహార్‌ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment