నది నుండి సముద్రం వరకు: స్వతంత్రం అవ్వాలి పాలస్తీనా – ప్రవీణ్‌ కొల్లుగురి

కొన్ని రోజుల క్రితం ప్రొ. కంచ ఐలయ్య షెఫర్డ్‌ గారు ఇజ్రాయెల్‌-పాలస్తీనా యుద్ధంపై సాక్షి పత్రికలో రాసిన ‘‘రెండు దేశాలుగా బతకడమే దారి’’ అనే కథనం కొన్ని కీలక విషయాలపై అవగాహన పెంచి, ఇజ్రాయెల్‌ మరియు పాలస్తీనా సమస్యను పరిష్కరించే మార్గాన్ని సూచించేందుకు చేసిన ప్రయత్నం అయినప్పటికీ, ఈ సమస్యను చూస్తున్నప్పుడు పలువిధమైన వాస్తవాలను విస్మరించడం కూడా మానవాళికి ప్రమాదకరం అని భావించి,

ఇందులోని కొన్ని అంశాలను పున:విమర్శించాల్సిన ఆవశ్యకతను గుర్తిస్తూ ఈ కథనానికి ప్రతిస్పందనగా మేము ఈ వ్యాసాన్ని రాస్తున్నాము.
రెండు దేశాల పరిష్కారం ఒక పాత చింతకాయ పచ్చడి: ఇజ్రాయెల్‌ – పాలస్తీనా సమస్య ‘‘రెండు దేశాల పరిష్కారం’’ పై ఆధారపడటం గతంలో పని చేయని ఒక పాత ఆలోచన. 1993లో ఈ ఆలోచనా ధోరణిలోనే ఒస్లో ఒప్పందం జరిగినప్పటికీ, ఈ విధానం ఇప్పటి వరకు శాంతిని తీసుకురావడంలో విఫలమైంది. ఆ ఒప్పందం ప్రారంభం నుంచే ఒక పక్షపాతమయిన ఒప్పందంగా ఉండి, పాలస్తీనీయుల హక్కులను తక్కువ చేసే విధంగా రూపొందించబడిరది. ఆ తరువాతి క్రమంలో ఇజ్రాయెల్‌ ఆక్రమణ ధోరణితో శాంతి చేకూర్చే ప్రయత్నాలు మరింత సన్నగిల్లడం వల్ల ఈ ప్రాంతం అస్థిరతకు గురవుతోంది.
గాజా అనే కారాగారం: పాలస్తీనా ప్రాంత ప్రజలు ఇజ్రాయెల్‌ సైనిక ఆధీనంలో ఉండటం వలన తాము పుట్టిన స్వస్థలంలోనే పరాయివారిలా జీవించవలసి వస్తోంది. పాలస్తీనా ప్రాంతాలు ముఖ్యంగా గాజా స్ట్రిప్‌ దశాబ్దాలుగా చెరసాల వలే మారాయి. ఆర్థిక అణచివేత చర్యలు, సాగునీటిని నియంత్రించడం, విద్యుత్‌ సరఫరా నిరోధించడం వంటివి పాలస్తీనీయుల జీవితాలను దుర్భరంగా మార్చాయి. ఈ పరిస్థితి వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని, ఉపాధిని దెబ్బతీస్తూ, అక్కడి ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపింది.
ఇజ్రాయెల్‌ ఒక వలసరాజ్యాల స్థిరనివాసం జాతివివక్ష దేశం: వలసరాజ్యాల స్థిరనివాస (సెటిలర్‌ కలోనియల్‌) దేశం అంటే అక్కడి ప్రాంతంలో ఉన్న నివాసిత ప్రజలను చంపి లేక వెళ్లగొట్టి వారి వనరులతో ఏర్పాటు చేసుకున్న రాజ్యం. ఇజ్రాయెల్‌ దేశం ఈ విధంగానే అక్కడ అధికంగా ఉండే అరబ్బు ముస్లింల వనరులను కాజేసి, వారిని అక్కణ్నుంచి తరిమేసి ఏర్పాటుచేసుకున్న రాజ్యం- అమెరికా, కెనడా మరియు ఆస్ట్రేలియాలు కూడా ఇలాంటి వలసరాజ్యాల స్థిరనివాస దేశాలగానే పరిగణించబడతాయి.
ఇజ్రాయెల్‌ రాజకీయ వ్యవస్థలో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు విపరీతమైన మితవాద రాజకీయ పార్టీలు. ఇవి మరియు వీటి కంటే ముందు ఉన్న ప్రభుత్వాలు అన్నీ కూడా అక్కడ ఉన్న అరబ్బు ముస్లింల మానవ హక్కులను కాలరాశారు. ముస్లింల స్థలాలను, వారి ఇళ్లను యూదు సెటిల్లర్లు ఎప్పుడైనా స్వాధీనం చేసుకోవచ్చు, మరియు వారిని అక్కడ పోలీసులు ఎప్పుడైనా అదుపులోకి తీసుకున్నపుడు వారికి వేరే చట్టం, పాలస్తీనీయులకు వేరే చట్టం వర్తిస్తుంది. ఇదే కాకుండా ప్రతి ఏటా 600-700 పాలస్తీనా పిల్లలను ఏ కేసులు లేకుండా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. అక్కడ మతాంతర వివాహాలు కూడా నిషిద్ధం. అందుకే ప్రపంచ మానవాళి ఇజ్రాయెల్‌ ను జాతివివక్ష (అపార్థెయ్డ్‌ ) రాజ్యం అని అంటోంది. అప్పట్లో నల్ల జాతి వారిపై తీవ్ర వివక్ష చూపించిన దక్షిణాఫ్రికా దేశాన్ని కూడా ఇదే విధంగా అభివర్ణించేవారు.
ఈ విషయాలన్నింటినీ పరిగణించే అంతర్జాతీయ న్యాయస్థానాలు అనేక సార్లు ఇజ్రాయెల్‌ దేశాన్ని తప్పుబట్టాయి. కానీ ఇజ్రాయెల్‌ కు అగ్రరాజ్యాలు మద్దతు పలకడం వలన వీరి పైన ఎలాంటి అంతర్జాతీయ ఆంక్షలు వర్తించలేదు.
పాశ్చాత్య దేశాల మద్దతు: ఇజ్రాయెల్‌ దేశం స్థాపనకు అమెరికా, బ్రిటన్‌ వంటి పాశ్చాత్య దేశాలు విశేష మద్దతు అందించాయి. ఇది ఆ ప్రాంతంలో జియోనిస్ట్‌ ఉనికిని బలపరిచేలా చేసింది. ఈ మద్దతు కారణంగా ఇజ్రాయెల్‌ ఒక శక్తివంతమైన, ఆధునిక దేశంగా ఎదిగింది. 1948 నుంచి ఈ దేశం అమెరికా నుండి సుమారు %వి%320 బిలియన్ల డాలర్ల మద్దతు పొందింది. ఈ ఆర్థిక సహాయం, ఆయుధాల సరఫరా ద్వారా ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రాంతాలపై ఆధిపత్యాన్ని బలపరిచేందుకు నిత్యం తోడ్పడిరది.
మారణహోమం: ఇజ్రాయెల్‌ పాలస్తీనా ప్రజల మీద ఆధిపత్యం మరింతగా పెంచుకునే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉంది. అక్టోబర్‌ 7 దాడి మునుపు వరకు వీరి మధ్యలో జరిగిన సంఘర్షణలో ఇప్పటి దాకా 90000 పాలస్తీనా ప్రజలు, 25000 ఇజ్రాయెల్‌ ప్రజలు మరణించారు. అక్టోబర్‌ 7 దాడి ఈ సంఘర్షణలో మరో ముఖ్యమైన ఘట్టం. ఆ తరువాత గాజాపై ఇజ్రాయెల్‌ కొనసాగిస్తున్న మారణ హోమంలో భాదితులలో ఎక్కువ మంది అమాయకులే ఉన్నారు. ఇందులో అధికంగా మహిళలు, చిన్న పిల్లలు, విలేఖరులు, వైద్య సిబ్బంది లాంటి వారు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ఒక్క సంవత్సరంలోనే 40000 మంది ఈ మారణకాండకు బలి అయ్యారు, ఇంకా అనేక మంది పిల్లలు అనాధలు అయ్యారు. గాజాలో ఉన్న ఎనిమిది విశ్వవిద్యాలయాలన్నిటినీ, ఆసుపత్రులను గత సంవత్సరంలో ఇజ్రాయెల్‌ నేల మట్టం చేసింది. లాన్సెట్‌ అనే పేరు పొందిన విజ్ఞాన పత్రిక అసలు ప్రాణహాని 40000 కంటే పది రెట్లు ఎక్కువ అని ప్రకటించింది. ముఖ్యంగా ఇజ్రాయెల్‌ కు అమెరికా, బ్రిటన్‌, జర్మనీ వంటి దేశాల నుండి లభించిన మద్దతు ఈ హింసలో ఒక కీలకమైన పాత్ర పోషించింది. ఇదే సమయంలో హమాస్‌ ఉనికి ఏ మాత్రం లేని వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలోని పాలస్తీనా అరబ్బు ప్రజలపై కేవలం గత సంవత్సరంలోనే వేయికి పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
పాలస్తీనా ఉద్యమం: పాలస్తీనా జాతీయతకు పునాది పలువురు మద్దతుదారులతో పెరిగింది. 1970లో పాలస్తీనా విమోచన సంస్థ (PLO) ప్రపంచానికి తమ సమస్యను తెలియజేసింది. పాలస్తీనా ప్రజల స్వతంత్రతను కోరుతూ PLO మార్గదర్శకత్వం ఇచ్చినప్పటికీ, 1990ల తర్వాత సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో హమాస్‌ ఒక విభిన్న మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగింది. వీరు మొదటగా PLOకి వ్యతిరేకంగా ఉండటం వలన వీరికి ఇజ్రాయెల్‌ నుండి మద్దతు లభించింది, కానీ తరువాత వారు ఇజ్రాయెల్‌కి పక్కలో బల్లెంగా అవతరించారు. గాజా ప్రాంతంలో హమాస్‌ అధికారం చేజిక్కుంచుకున్నప్పటి నుండి పాలస్తీనా ప్రజలకు స్వాతంత్రం రావాలి అని వారు నిర్విరామంగా పోరాటం చేస్తున్నారు.
పాలస్తీనా మహిళలు: పాలస్తీనా పొలాల్లో మహిళలు పని చేయరు అనేది అబద్ధం, ప్రపంచంలో ఎక్కడైనా సరే చిన్నపాటి పొలాల్లో తక్కువ ఆదాయంతో పని చేసేది అధికంగా మహిళలే. పాలస్తీనాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాలస్తీనాలో పండ్లు, కూరగాయల వ్యవసాయ ఉత్పాదనలో 54% మరియు పాడిపశు ఉత్పాదనలో 83% మహిళలే ఉన్నారు. అంటే అక్కడ మగవారి కంటే మహిళలే శ్రమలో అధికంగా పాల్గొంటున్నారని అర్థమవుతోంది. ఇజ్రాయెల్‌ స్త్రీలను శూద్ర దళిత స్త్రీలతో పోల్చడం సబబు కాదు, ఎందుకంటే శూద్ర దళిత స్త్రీలు కుల పితృస్వామ్య సమాజంలో ఎలాగ కులం మరియు జెండర్‌ వివక్షతో నలిగిపోతున్నారో, అలాగే పాలస్తీనా మహిళలు కూడా జెండర్‌ వివక్షతో పాటు తమ అరబ్బు అస్తిత్వం వలన అక్కడి ఆక్రమణదారుల పెత్తనం కింద నలిగి పోతున్నారు.
ఇస్లామోఫోబియా: ఇజ్రాయెల్‌ – పాలస్తీనా సమస్యను విశ్లేషించేటప్పుడు, పాలస్తీనీయుల పోరాటాన్ని ‘‘తీవ్రవాదం,’’ ‘‘ఇస్లామిస్టు అగ్రహం’’ వంటి ట్యాగ్‌లతో ముద్రించే ధోరణి ఈ కథనంలో కనిపిస్తోంది. ఈ సంఘర్షణలో ఇజ్రాయెల్‌, పాలస్తీనీయులను ఒకే రకంగా చూడకుండా, కేవలం ఇస్లామోఫోబిక్‌ వైఖరినే అనుసరించినట్టు అనిపిస్తుంది. ఈ వైఖరి పాలస్తీనీయుల పట్ల, ఇతర ముస్లింలు మరియు ముస్లిం దేశాలపైన ప్రపంచవ్యాప్తంగా ద్వేష భావనను తీసుకువస్తోంది. పాలస్తీనా ప్రజల పోరాటం ప్రధానంగా వారి ప్రాంతీయ స్వాతంత్య్రం కోసం జరుగుతోంది కానీ, తమ మతం కాని వారి పట్ల వారికి ద్వేషం లేదు. కానీ మతం ఆధారంగానే ఈ పోరాటం జరుగుతోందని దుష్ప్రచారం చేయడం ఇజ్రాయెల్‌ మద్దతుదారులు చేసే కుటిల పన్నాగం. అదేవిధంగా, ఇస్లామోఫోబిక్‌ సెంటిమెంట్స్‌ను విస్త్రుతంగా ప్రచారం చేయడం ద్వారా పాలస్తీనా సమస్యను ప్రపంచ దృష్టి నుండి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజాస్వామ్యం: ప్రజాస్వామ్య పద్దతిని అంగీకరించే పాశ్చాత్య దేశాలు అక్కడి ఆదివాసీలు, వలసవాదులు, శరణార్థులు, నల్ల జాతీయులపై మరియు ఇతర దేశాలపై నిత్యం పెత్తనం చెలాయిస్తూ, తమ సామ్రాజవాదాన్ని నెలకొల్పేందుకు యుద్ధం కొనసాగిస్తూ విధ్వంసాన్ని సృష్టించడం ఎంత వరకు సమంజసం? సెక్యూలరిజం సూత్రాలను పాటిస్తున్నామని చెప్పే దేశాలు నిజంగా సెక్యూలరిజాన్ని పాటిస్తున్నాయా లేక వివిధ రూపాలలో తమ మతాధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయా అనే అంశంపై కూడా చర్చ జరగాలి. అదేవిధంగా, నిజంగా సెక్యూలరిజం పాటిస్తున్న ‘ఆధునిక’ పాశ్చాత్య దేశాలు హింసను తగ్గించి, పరమత ద్వేషాన్ని అరికట్టి, మానవవాదాన్ని ప్రచారం చేయడంలో ఎందుకు విఫలం అవుతున్నాయో కూడా మనం చర్చిస్తే బాగుంటుంది.
మేధో అజ్ఞానం: పాలస్తీనా దైవపాలనా సూత్రాల ఆధారంగా పని చేస్తోందనే నెపంతో అక్కడి అమాయక ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంటే, వారి దుస్థితికి కారణం కేవలం మతమే అని ఆపాదించడం ఎంత వరకు సమంజసం? సామ్రాజ్యవాదాన్ని విస్మరించే మేధో అజ్ఞానం మానవ విలువలకు మరింత వినాశనాన్ని తీసుకొస్తుందని కూడా మనం గ్రహించాలి. దేశాలు ప్రజాస్వామ్యం వైపు మారడం ఎంత ముఖ్యమో పాశ్చాత్య దేశాలు దురాక్రమణలకు పాల్పడకుండా ఉండడం కూడా అంతే ముఖ్యమని మనం గుర్తించాలి.
గ్రేటర్‌ ఇజ్రాయెల్‌ – అఖండ భారత్‌: ఇజ్రాయెల్‌ ప్రస్తుత వ్యూహాలు ‘‘గ్రేటర్‌ ఇజ్రాయెల్‌’’ అనే భావనను సఫలీకృతం చేసుకునే ప్రయత్నంలాగా ఉన్నాయి. ఇది నైలు నుండి యూఫ్రేట్స్‌ వరకూ ఉన్న భూమిని ఆక్రమించుకునేలా చేయాలనే లక్ష్యంతో సాగుతోంది. దీనివలన కొత్త ప్రాంతీయ కలహాలకు అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యూహాలను మన దేశంలో ‘‘అఖండ భారత్‌’’ భావనతో పోల్చవచ్చు. ఇటువంటి అశాంతి భూతాన్ని ప్రోత్సహించడం భవిష్యత్తులో పెద్ద సమస్యలను సృష్టించేందుకు దారి తీస్తుంది.
ముగింపు: పాలస్తీనీయుల హక్కులను అంగీకరించి, వారి స్వేచ్ఛను పరిరక్షించడం ద్వారా మాత్రమే ఆ ప్రాంతంలో నిజమైన శాంతిని సాధించవచ్చు. నది నుండి సముద్రం వరకు, స్వాతంత్య్రం అవ్వాలి పాలస్తీనా అనే నినాదం ప్రకారం అక్కడ ఒకే రాజ్యం
ఉండాలి, దానిలో అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఆ ప్రాంతం విడిచి వెళ్లిన శరణార్తీయులను ఆ ప్రాంతంలో తిరిగి ఆవాస పర్చాలి, అన్యాయాలకు గురైన అక్కడి ప్రజలకు న్యాయం జరగాలి, అదే పాలస్తీనా ప్రజల ఆకాంక్ష.
(కొలిమి వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.