-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కథలు
పరువు – వి. శాంతి ప్రబోధ
ఇప్పుడు బతికి ఉన్నానా.. చచ్చిపోయానా.. లేక చనిపోయి బతికానా అని చిన్నగా నవ్వుకుంటూ చేతిలో మొబైల్ పక్కన పెట్టింది ఆమె. కానీ, ఆమె ఆలోచనలన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టర్ మీద, ఆ వెనుక వస్తున్న రకరకాల వ్యాఖ్యానాల పైనే ఉన్నాయి. ఎంత వద్దనుకున్నా అవి జోరీగల్లా చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉన్నాయి.
Posted in కథలు
Leave a comment
అమ్మకథలు – సాయిపద్మ
అమ్మలు అందరూ మంచివాళ్ళా అంటే ఏమో నేను చెప్పలేను. రకరకాల పరిస్థితుల్లో, రకరకాలుగా వ్యవహరించే అమ్మలను ఎంతమందిని చూశాను, విన్నాను కూడా. కానీ ఖచ్చితంగా చెడ్డవాళ్ళు కారు అని మాత్రం చెప్పగలను.
Posted in కథలు
Leave a comment
భూమ్మీద గంధర్వులు – ఉణుదుర్తి సుధాకర్
ఇదంతా జరిగి ఏభై ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగాలేదు. బైండు చేయించి పెట్టుకున్న మ్యూజింగ్స్’ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉందిÑ ఎన్ని ఊళ్లు మారినా నావెంటే వస్తోంది. దాని మూల్యం బాబూరావుకి చెల్లించనేలేదు.
Posted in కథలు
Leave a comment
మహిమ – డా. మజ్జి భారతి
పేపర్ చదువుతూ ఉంటే ఓ మూలనున్న వార్త ఆకర్షించింది సుమతిని. ‘నేను బాబాను కాదు. దేవుడిని కాదు. నాకేమీ మహిమలు లేవు. నేనూ మీలాంటి మనిషినే. మీ సమస్యలకు నేనేరకంగానూ పరిష్కారం చూపలేను.
Posted in కథలు
Leave a comment
చెంచులక్ష్మి – సామాన్య
మా ఊరిలో రెండు బడులుంటాయి. చిన్న బడి, పెద్ద బడి. చిన్న బడంటే ఐదవ తరగతి వరకూ ఉండే ప్రాథమిక పాఠశాల. ఊర్లో పుట్టిన దిగువ తరగతి పిల్లలు, మధ్య తరగతి పిల్లలు, చాలామంది ఆడపిల్లలు ఇక్కడే చదువు మొదలు పెడతారు. ఐదవ తరగతి పూర్తయ్యాక పక్కనే ఉండే పెద్ద బడికి వెళ్ళిపోతారు. నేను కూడా … Continue reading
Posted in కథలు
Leave a comment
కొత్త పాఠం – నామని సుజనాదేవి
ఎంత ఉద్యోగం చేసినా, అంతో ఇంతో ధైర్యవంతురాలిని అయినా ఒక్కోసారి పరిస్థితుల వల్ల భయం బారిన పడాల్సి వస్తుందని నేను అనుకోలేదు. ఆ రోజు నాకు జీవితం ఒక కొత్త పాఠం నేర్పుతుందనీ నేను అనుకోలేదు. వృత్తిరీత్యా నేను ప్రముఖ సంస్థలో ఆఫీసర్ని కావడంతో బాధ్యతల వల్ల ఆలస్యంగా రావడం పరిపాటే.
Posted in కథలు
Leave a comment
జాయిన్ ది మీటింగ్ – సుజాత వేల్పూరి
‘‘ఒక కప్పు కాఫీ ఇలా పడెయ్, ఐదు నిమిషాల్లో కాల్లో జాయిన్ అవ్వాలి, ఇవాళ బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ ఉన్నాయి’’ హడావిడి పడుతూ కిచెన్లోకి వచ్చాడు.
Posted in కథలు
Leave a comment
పిడికిటి ఇసుక -తిరునగరి దేవకీదేవి
‘‘అమ్మమ్మా! ఇవ్వాళ పులిహోర చేస్తావా’’ బుంగమూతి పెట్టి అడిగింది వర్షిత. ‘‘ఓ ఎందుకు చేసి పెట్టను? అరగంటలో నీ ప్లేట్లో పులిహోర ఉంటుంది. సరేనా?’’ బుజ్జగింపుతో అంది వర్ధనమ్మ.
Posted in కథలు
Leave a comment
ఆడదాన్ని నమ్మితే సొమ్ము ` నమ్మకుంటే దుమ్మే -ఎండపల్లి భారతి
తెల్లారి గుడ్లన్నీ ఉతికి ఆరేద్దామని మిద్ది మిందకు పోతి. మా ఇంటి ఉత్తరం పక్క నా మరదలు వాల్లిల్లుంది. నేను మిద్ది మీద గుడ్లు అరేసేది నా మరదలు చూసి, ‘‘ఓ వొదినా సరస నిన్న అలిగి పుట్టింటికి పోయిందంటనే’’ అనె.
Posted in కథలు
Leave a comment
ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం – గోగు శ్యామల
మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల
Posted in కథలు
Leave a comment
మారిన ధోరణి -తమ్మెర రాధిక
వడగాలి వరండాలోంచి గుయ్యిమంటూ హాల్లో పడుకున్న పరమేశం గారి చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. మనవలు అటూ ఇటూ ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటుంటే ‘‘నాయనలూ కాస్త పెద్ద దర్వాజా ఓరగా వేసి ఆడుకోండిరా, తలుపు తీస్తే వడగాలి ఇల్లంతా సుడి తిరుగుతోంది’’ అన్నాడు నీర్సంగా. ‘‘తలమీద కాస్త తడిగుడ్డ వేసుకోకూడదూ… చల్లటి నీళ్ళు తాగారుగా ఇంకా ఉడుకు … Continue reading
Posted in కథలు
Leave a comment
ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ
బిజీగా సర్వ్ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. ‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్ జాగ్రత్త…’’ మేనేజర్ అరిచాడు.
Posted in కథలు
Leave a comment
ఓ గెలుపు జ్ఞాపకం – గంగాడి సుధీర్
ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు. ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్ ఆవల చెట్టుకిందనున్న బండరాయిపై కూర్చున్నాను. అసలు
Posted in కథలు
Leave a comment
ఆమె నిర్ణయం – కాత్యాయని
(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్ జహీర్) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్ క్వార్టర్స్ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.
Posted in కథలు
Leave a comment
నో రూమ్ -కాళీపట్నం రామారావు
వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది… అత్తవారి ఇల్లులా. ‘‘రూమ్ కావాల.’’ ‘‘సింగిలా, డబులా?’’
Posted in కథలు
Leave a comment
ఇగో -తిరునగరి దేవకీదేవి
సాయంకాలం నాలుగు కావస్తోంది. సెలవులకు తెర పడిరది. పిల్లలకు మళ్ళీ ఉద్యోగ పర్వం… తిరుగుముఖం కాక తప్పలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ బిందుకు అలసట తెలిసి రాలేదు. నెల రోజుల తర్వాత మధ్యాహ్నం నడుం వాల్చే అవకాశం దొరికింది. సాయంత్రం
Posted in కథలు
Leave a comment