-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
May 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Author Archives: భూమిక
మహిళల శ్రమ అదృశ్యీకరణ (Invisible) – కొండవీటి సత్యవతి
హైదరాబాద్ వుమన్ రైటర్స్ ఫోరం ఆద్వర్యంలో ‘‘శ్రామిక మహిళలు-శ్రమ దోపిడీ’’ అనే అంశం మీద ఒక సమావేశం జరిగింది. ఎన్నో వృత్తులలో, ఎన్నెన్నో రంగాలలో పనిచేస్తున్న మహిళల అదృశ్యీకరణ (ఇన్విసిబుల్) మీద పన్నెండు మంది వివిధ రంగాల నుంచి మాట్లాడారు.
Posted in సంపాదకీయం
Leave a comment
అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి
5. అత్యవసర పరిస్థితి తర్వాత: మరోచోట మా జీవితాలు అత్యవసర పరిస్థితి ముగిసిన తర్వాత జీవితం మెరుగ్గా ఉండాల్సింది, కానీ మా విషయంలో అలా జరగలేదు. 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత మేం చండీగఢ్ నుంచి దిల్లీకి మారాం. ఆంధ్ర ప్రదేశ్లో పోలీసుల నుంచి మాకు పలాంటి ముప్పు పొంచి వుందో తెలీదు కాబట్టి … Continue reading
Posted in జీవితానుభవాలు
Leave a comment
ఈనాటి బంధం ఏ నాటిదో?’ – చల్లా. సరోజినీదేవి
స్టాఫ్ మీటింగ్లో కొందరి ద్వంద్వ వైఖరి వల్ల సర్ది చెప్పి అందరినీ ఒక్క తాటి పైకి తెచ్చే సరికి తల ప్రాణం తోకకు వచ్చింది HM హిమజకు.’’ ఛీ, పెత్తనం, పేడ తట్ట ఎత్తుకోవడమంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు’’ అని అమ్మమ్మ చెప్పిన మాట ముమ్మాటికీ నిజం. అర్జంట్గా ఇంటికి వెళ్ళి, స్ట్రాంగ్ … Continue reading
Posted in కథలు
Leave a comment
జెండర్, కుటుంబం, మగతనం : అతుల్ సుభాష్ ఆత్మహత్య – ఎ. సునీత
చేతి రాత పొందిగ్గా, కుదురుగా, అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలంటే ఇంకు పెన్ను వాడాలని స్కూల్లో టీచర్లు చెప్తారు. దానితో జాగ్రత్తగా, ఓపిగ్గా రాయాలి. పెన్నుని మరీ అదిమిపెట్టి రాస్తే పేపరు చిరుగుతుంది. పెన్నుతో పాటు ఇంకు సీసా పక్కన పెట్టుకోవటం తప్పనిసరి.
Posted in ఇంకు పెన్ను
Leave a comment
ఎగిరిపోతే ఎంత బాగుంటుంది! – అపర్ణ తోట
రోడ్డు మీదకు వెళ్ళు. మనుషులే మనుషులు. రైల్వే స్టేషన్, సిటీ బస్సులు, టూరిస్ట్ ప్రదేశాలు, హైకింగ్లు, సెలవలు, సరదాలు. అంతటా పరుచుకున్నదెవరు? ఎవరెవరు? ఎవరబ్బా?
Posted in బోగన్ విల్లా
Leave a comment
ఉద్యమ నేపథ్యం కలిగిన వేదమ్మ గారితో ముఖాముఖి – పైడిమర్రి గిరిజ
మూడు సంవత్సరాల కిందట సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన చైతన్య మహిళా సంఘం ఆవిర్భావ సభలో వేదమ్మ గారు పాడిన పాటలు, ఆమె ఉత్సాహం నన్ను ఉత్తేజపరిచాయి. ఈ వయసులో స్మార్ట్ ఫోన్్తో ఫోటోలు తీయడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. సంఘం పనుల కోసం అప్పుడప్పుడూ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆవిడ చురుకుదనానికి ముగ్ధురాలినయ్యాను.
Posted in ఇంటర్వ్యూలు
Leave a comment
శ్రామిక మహిళ – అవగాహన సదస్సు – గిరిజ పైడిమర్రి
తెలుగు సాహిత్యంలో మధ్యతరగతి మహిళ మీద వచ్చినన్ని రచనలు శ్రామిక మహిళ పైన రాలేదనే చెప్పాలి. అసంఘటిత రంగంలో పని చేస్తున్న మహిళల సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని సాహిత్యంలోకి తీసుక వచ్చి పాఠకులకు తెలియపరచవలసిన బాధ్యత రచయితలదే.. అందులో భాగంగా హస్మిత ప్రచురణ సంస్థ ఆ బాధ్యతను తీసుకుంది.
Posted in రిపోర్టులు
Leave a comment
సావిత్రిబాయి ఫూలే మహాగ్రంథం – దళిత శ్రీశ్రీ గడ్డం విజయరావు
సావిత్రిబాయి ఫూలే అనే ఈ మహా గ్రంథాన్ని ఐదు సంవత్సరాలుగా పరిశోధించి మహాకవి అభినవ అంబేడ్కర్ డా॥కత్తి పద్మారావు గారు వ్రాశారు. ఈ గ్రంథం వ్రాయడానికి సంబంధించిన దృక్పథాన్ని వారు వ్రాసిన పీఠికలో ఇలా కళ్ళకు కట్టినట్టు వర్ణించారు. భారతదేశ సాంస్కృతిక విప్లవ పోరాట స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే. స్త్రీ విముక్తి ప్రధాత, మానవాభ్యుదయ వికాస … Continue reading
Posted in పుస్తక సమీక్షలు
Leave a comment
మీ ప్రవర్తన మిమ్మల్ని రక్షించాలి: రోడ్డు భద్రతపై అవగాహన – డా.ఎ.కళ్యాణి, ఎ.వాణి
చక్రం ఆవిష్కరణతో రవాణా రంగంలో అనేకమైన మార్పులు వచ్చాయి. పెరుగుతున్న జనాభా, పారిశ్రామికరణ, నగరీకరణ, ప్రపంచీకరణ (గ్లోబలైజేషన్) వలన వాహనాల రద్దీ కూడా పెరిగింది. అందువల్ల రవాణా సులభతరం కావడానికి ఒక క్రమబద్ధీకరణ అవసరం.
Posted in సమాచారం
Leave a comment
వేదికపై ప్రధాన పాత్రను పోషించే ఐశ్వర్య – పూంగొడి మదియరసు / పీపుల్ ఆర్కైవ్ రూరల్ ఇండియా
అనువాదం: వై. క్రిష్ణ జ్యోతి వేలూర్ జిల్లాకు చెందిన ఐశ్వర్య ఒక తిరుణంగై (ట్రాన్స్మహిళ). సమాజంలో ఆత్మగౌరవంతో, మర్యాదపూర్వకంగా బతకడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు. తమిళనాడులో సొంత డ్రామా కంపెనీని స్థాపించి, దాన్ని విజయవంతంగా నడిపించడానికి ఆవిడ ఎంత కష్టపడుతున్నారో ఈ కథనం చెబుతోంది.
Posted in వ్యాసాలు
Leave a comment
బ్రిటిషాంధ్రలో వితంతువుల దుస్థితి: ప్రొఫెసర్ మామిడిపూడి వెంకట రంగయ్య మాటల్లో – డాక్టర్ షేఖ్ మహబూబ్ బాషా
బ్రిటిష్ పాలనా కాలం నాటి ఆంధ్రలో బాల్య వివాహ దురాచారం విలయతాండవం చేసేది. దీని ప్రధాన బాధితులు బాలికలు / స్త్రీలు. బాల్య వివాహాలు అనేక అనుషంగిక సమస్యలకు దారి తీసేవి. బాలికల బాల్యానుభవాన్ని హరించి, వారి విద్యావకాశాలకు తీవ్ర ప్రతిబంధకంగా తయారైన ఈ వివాహాలు, చాలా వరకు అసమ వివాహాలు కూడా.
Posted in వ్యాసాలు
Leave a comment
హిందువంటె ఏంది బిడ్డా! – జూపాక సుభద్ర
నా ప్రమేయం లేకుండనే నా కుల సర్టిఫికట్ లోకి ‘హిందుమతం’ అనే పేరు ఎట్లోచ్చిందో తెలువది. మా యింట్ల మా వాడల కూడా ‘హిందూమతం’ అనే మాట వాడుకలో లేదు. మరి నా సర్టిఫికట్లోకి నేను హిందువని ఎట్లా ఎక్కింది? మా కుటుంబం, కులం ఆ హిందూ పదం’ తో ఐడెంటిఫై కాలే. అది అనరు, … Continue reading
Posted in వ్యాసాలు
Leave a comment
జై భీం! జై భీం! జై భీం! – కత్తి పద్మారావు
ఆకాశంలో నీలి నక్షత్రాలు పొడుస్తున్నాయి సముద్రాలు ఒక్కసారి ఊపిరి పీల్చుకుంటున్నాయి కొండల్లో గడ్డిపూల దరహాసం
Posted in కవితలు
Leave a comment