Category Archives: కధలు

అమ్మా నువ్విక వెళ్లిపో! – భండారు విజయ

నీ మనసును ఎంత కఠినం చేసుకోకపోతే, నువ్వంత మాటను అంటావో, నేను అర్ధం చేసుకోగలను వసుధా! కానీ ఆ మాటలకు మీవాళ్ళందరూ నిన్ను ఎలా ఛీత్కారంగా చూస్తారో తెలుసా? ఎంత బాధ వున్నా, నువ్వా మాట అనకుండా వుండాల్సింది.

Share
Posted in కధలు | Leave a comment

శక్తి పుష్పం – డాక్టర్‌ ఎస్‌.రమేశ్‌

గ్రామం చివర ఉన్న చిన్న ఇల్లు. పాత కాలపు ఇటుకలతో కట్టబడిన ఆ ఇంటి ముందు పెరట్లో ఒక చిన్న మామిడి చెట్టు. ఆ చెట్టు కింద కూర్చుని ఉన్న లక్ష్మి తన చిన్న కూతురు పద్మని ఒడిలో పడుకోబెట్టుకుని, దూరంగా అస్తమించే సూర్యుడిని చూస్తూ ఉంది. ఆమె కళ్ళల్లో నిస్సహాయత, నిరాశ కనిపించాయి.

Share
Posted in కధలు | Leave a comment

గుడి లైటు – దామూ

– తమిళ మూలం:టి. జానకిరామన్‌, తెలుగు: దాము తమిళులు తీ.జా. అని ప్రేమగా పిలుచుకొనే టి.జానకిరామన్‌ (1921-1982) తమిళ సాహిత్యంలో ఒక ముఖమైన రచయిత. ఆయన్ను ఫెమినిస్టు రచయిత అని కూడా కొందరు పిలుస్తారు. 1940ల, 50ల నాటి సమాజంలో స్త్రీ పరిస్థితుల్ని తన రచనల్లో విమర్శనాత్మకంగా పరిశీలించి, వారి పట్ల వున్న వివక్షతని బలంగా … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

చీడ – గొరుసు

నా పేరు సంపంగి. ఎనిమిదేళ్ళ క్రితం సింహాచలం నుండి తీసుకొచ్చి ఇక్కడ నాటారు. అడుగు ఎత్తులో మొక్కగా ఉండేదాన్ని. పదహారడుగుల మానుగా పెరిగాను. ఇప్పుడు నా పూలని కోయాలంటే వంకీ కత్తి కట్టిన పెద్ద వెదురుబొంగు అవసరం మీకు. అదే నా చిట్టి తల్లి వచ్చి, నా కింద నిల్చుని దోసిలి పట్టిందంటే జలజలమని పూలవర్షం … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

రంగ పిన్ని ఆకాశం – సాయిపద్మ

నాకు రంగ పిన్ని అంటే చాలా ఇష్టం. ఎంత ఇఫ్టమంటే అమ్మకన్నా ఇష్టం. అమెరికా నుంచి సెమిస్టర్‌ బ్రేక్‌ కోసం ఇండియాకు వచ్చిన మర్నాడే, పిన్ని ఇంటికి వెళ్ళాలి అన్నంత ఇష్టం. అమ్మ చంపేస్తుందని ఆగాను గానీ, లేదా అక్కడే దిగేదాన్ని. అందుకే అమ్మ చెప్పిన మాట విని, తాగుతున్న ఫిల్టర్‌ కాఫీ గొంతులో గరళం … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

రైలు కట్ట – రోహిణి వంజరి

మే నెల. మలమల మాడ్చే ఎండ. సలసల కాల్చే ఎండ. నల్లిని నలిపినట్టు నలిపేసే ఎండ. రాత్రి తొమ్మిదయినా తగ్గని సెగలు పొగలు. రైలు గేటు ఎప్పుడూ మూసే ఉంటుంది అక్కడ. తడవ తడవకి రైలు బండ్లు పోతానే ఉండాయి. రైలు గేటుకి ఆ పక్కా, ఈ పక్కా నాలుగైదు వాహనాలు తప్ప నడిచివెళ్ళే మనుషులెవరూ … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

నిర్ణయం – డా॥ ఎ.ఆర్‌.సత్యవతి

‘ట్రింగ్‌… ట్రింగ్‌…’ కాలింగ్‌ బెల్‌ మోగడంతో ఉలిక్కిపడి లేచింది నీరజ. అప్పుడే పాలవాడు వచ్చేసాడు అనుకుంటూ డోర్‌ ఓపెన్‌ చేసి పాలు తీసుకుంది. స్టవ్‌ మీద పెట్టి ‘అమ్మో! ఆరయిపోయింది. ఈ రోజూ ఆఫీసుకి లేటే…’ అనుకుంటూ కిచెన్‌ సర్కస్‌ మొదలుపెట్టింది.

Share
Posted in కధలు | Leave a comment

పరదాల వెనుక…! – భండారు విజయ

ఫాతిమా! జరీనా ఆంటీ, నదియా దీదీ ‘దోనోం ఆయా, జల్దీ ఆజావ్‌ బేటీ’! బయట నుండి తల్లి పిలుపు రెండోసారి వినిపించింది. ‘దీదీ ఆప్‌ జల్దీ జావ్‌, మళ్ళీ అమ్మీ లోపలికొచ్చి నిన్ను బలవంతంగానైనా తీసుకొని వెళ్తుంది’ అక్కకు లిప్‌స్టిక్‌ సరిచేస్తూ అంది హసీనా.

Share
Posted in కధలు | Leave a comment

జీవన్నాటకం – ములుగు లక్ష్మీ మైథిలి

నగరంలోనే ఎంతో పేరు పొందింది ‘మమతా వృద్ధుల ఆశ్రమం’. పేరుకు తగ్గట్టే అక్కడ ముదిమి వయసులో ఉన్న స్త్రీలను, పురుషులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ, ఆప్యాయతతో వేళకు భోజనం పెడుతూ, ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సొంతవారిలా సేవలు చేయటం, దగ్గరుండి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి చూపించటం, డాక్టర్‌ ఇచ్చే మందులు

Share
Posted in కధలు | Leave a comment

చావు చీర – డాక్టర్‌ పెళ్ళకూరు జయప్రద సోమిరెడ్డి

‘‘ఎవరైనా నామీద ఇంత గుడ్డ కప్పండి ప్లీజ్‌’’ కాల్‌ సెంటర్‌లో నైట్‌డ్యూటీ పూర్తిచేసుకుని స్కూటీ మీద ఇంటికొస్తున్న నాకు సిటీలో సైడ్‌ రోడ్‌లో పక్కనున్న ఫుట్‌పాత్‌ మీద నుంచి కీచుగొంతుతో వచ్చిన అభ్యర్థన వినబడిరది. స్కూటీ దిగి అటుగా వెళ్ళాను.

Share
Posted in కధలు | Leave a comment

నేటి ధర్మం – షేక్‌ మస్తాన్‌ వలి

పెళ్ళైంది. చుట్టాలెళ్ళిపోయారు. కూతుర్ని అత్తారింటికి పంపి ఊపిరి తీసుకున్నా. దానికింకే లోటు ఉండదు. భర్తకు మంచి ఉద్యోగం, అత్తింటివారు సౌమ్యులు.

Share
Posted in కధలు | Leave a comment

మోహనరాగం – దినవహి సత్యవతి

సముద్రతీరాన స్థితమై, ప్రకృతి అందాలకు అలవాలమైన, విశాల నగరం విశాఖపట్నం. నగరంలో అభివృద్ది చెందుతున్న ప్రాంతం మధురవాడలో అధునాతనంగా కట్టిన నూతన గృహ సముదాయంలో, విశాల ప్రాంగణం, చుట్టూరా పరిమళాలు గుబాళిస్తున్న పూలతోటలో కనువిందు చేస్తున్న ఒక డ్యూప్లెక్స్‌ ఇల్లు.

Share
Posted in కధలు | Leave a comment

వే టూ మెట్రో -కుప్పిలి పద్మ

బొంగరాన్ని సంధించి వదిలేవాళ్ళకు గిర్రున తిరిగే బొంగరం ఓ కేరింత. కానీ తిరిగితిరిగి ఏ క్షణాన తను ఒరుగుతుందోనని బొంగరానికెంతో ఆందోళనగా ఉంటుంది. అలా వాలి ఓ చోట ఉండనిచ్చినా ఓ పద్ధతి. ఉన్న చోటనే ఉండడంలో చిన్నదో చితకదో ఓ నిశ్చింత. కానీ అలా ఉండనివ్వరు కదా. ఆ తాడుని అందుకొన్న మరో చెయ్యి … Continue reading

Share
Posted in కధలు | Leave a comment

మౌనఘోష -సింహప్రసాద్‌

‘‘నాన్నా, శిరి ఇంటికి వచ్చిందా?’’ నిరంజన్‌ కంగారుగా ఫోన్‌ చేశాడు. ‘‘ఇంకా రాలేదురా. ఏం ఎందుకలా అడుగుతున్నావు’’ ఆదుర్దాపడ్డాడు తండ్రి. ‘‘అదేమీ అమీన్‌పూర్‌ వైపు వెళ్ళలేదు కదా?’’

Share
Posted in కధలు | Leave a comment

తప్పు ఎవరిది???-వై.నాగవేణి

రమ తన కుర్చీలో మౌనంగా కూర్చొని ఉంది. స్వాతి ఎదురుగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. ఇద్దరికీ గత మూడు నెలల్లో ఒక కేసు విషయమై జరిగిన సంఘటనలు డైలీ సీరియల్‌లో సీన్ల మాదిరి గిర్రుమని తిరిగాయి…

Share
Posted in కధలు | Leave a comment

అమ్మతో పుట్టని బిడ్డ -వి.శాంతి ప్రబోధ

‘‘అమ్మా… అమ్మా…’’ సన్నని గొంతు మెత్తగా… మృదువుగా వినిపించింది. ఉలిక్కిపడి చుట్టూ చూసింది ఆమె. కనుచూపు మేరలో ఎవరూ కనిపించలేదు. మరి ఎవరి పిలుపు? తననే పిలిచినట్టు ఉందని ఆశ్చర్యపోయింది ఆమె.

Share
Posted in కధలు | Leave a comment