-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: ధారావాహికలు
ముందు చూపున్న స్త్రీవాదం – బెల్ హుక్స్
అనువాదం: ఎ. సునీత నిజమైన స్వాప్నికులం కావాలంటే మన ఊహలన్నీ వాస్తవ పరిస్థితులలో బలంగా వేళ్ళూనుకుని ఉండాలి, అలాగే ఆయా పరిస్థితుల నుండి ముందు కెళ్ళి కొత్త సంభావ్యతల గురించి కూడా ఆలోచించగలగాలి. సమకాలీన స్త్రీవాదానికున్న బలం ఏంటంటే తనని, తన మార్గాన్ని మార్చుకోగలగటం. పాతబడిపోయిన ఆలోచనలు, కార్యాచరణని పట్టుకు వేళ్ళాడే సామాజిక న్యాయ ఉద్యమాలన్నీ … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీ వాద ఆధ్యాత్మికత – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత అప్పుడూ, ఇప్పుడూ స్త్రీవాదం ఆధ్యాత్మిక ఆచరణకి పెద్దపీట వేసే ఒక ప్రతిఘటనా ఉద్యమమే. నా జీవితంలోకి స్త్రీవాద సిద్ధాంతం, ఆచరణ ప్రవేశించి ‘మనల్ని మనం ప్రేమించుకోవటం, ఒప్పుకోవటం రెండూ మన జీవితాన్ని మనమనుకున్నట్లు పరిపూర్ణం చేసుకోవటానికి అత్యవసరం’ అని అర్థం చేయించే ముందు, ఇటువంటి సందేశాలనిచ్చే ఇంకొక ఆధ్యాత్మిక దారిలో నేనూ నడిచాను.
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీవాదం అంటే ప్రేమించటం! – బెల్ హుక్స్
అనువాదం: సునీత అచ్యుత ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ప్రేమ గురించి తెలుసుకోవాలని మనం భావిస్తే స్త్రీవాదాన్ని మనసారా కోరుకోవాలి. స్త్రీవాద ఆలోచన, ఆచరణ లేకుండా మన మధ్య ప్రేమ బంధాలకు పునాది ఏర్పడదు. మొదట్లో మగవాళ్ళతో సంబంధాల్లోని తీవ్ర అసంతృప్తి ఆడవాళ్ళని స్త్రీ విముక్తి వైపు నడిపించింది.
Posted in ధారావాహికలు
Leave a comment
పరస్పర స్వేచ్ఛనిచ్చే నైతికత : స్త్రీవాదం అందించే లైంగిక రాజకీయ దృక్కోణం – బెల్ హుక్స్
అనువాదం: సునీత అచ్యుత స్త్రీవాద ఉద్యమం, లైంగిక విముక్తి పోరాటం రాకముందు, అనేకమంది స్త్రీలకు తమ లైంగిక కోరికల గురించి మాట్లాడటం కష్టంగా, ఇంకా చెప్పాలంటే అసాధ్యంగా ఉండిరది. లైంగిక కోరికలు, లైంగిక ఆనందం రెండూ ఎప్పుడూ కేవలం మగవాళ్ళకు మాత్రమే కలుగుతాయని ఆడవాళ్ళకి చిన్నప్పటినుంచి చెప్పటమే కాక, అటువంటి ఆనందం కోరుకునే ఆడవాళ్ళు నీతిలేని … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
పరిపూర్ణ ఆనందం: లెస్బియనిజం, స్త్రీ వాదం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత కొన్ని సార్లు ఏది ముందు వచ్చిందో – స్త్రీ విముక్తి పోరాటమా లేక లైంగిక విముక్తి ఉద్యమమా – అన్నది తెలుసుకోవటం కష్టమవుతుంది. కొంతమంది కార్యకర్తలకి రెండూ కలగలిసి రెండూ ఒకేసారి జీవితంలోకి వచ్చాయి.
Posted in ధారావాహికలు
Leave a comment
పెళ్ళికీ, కుటుంబ భాగస్వామ్యానికీ పితృస్వామ్యం నుండి విముక్తి కల్పిద్దాం!!! – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు వివాహ వ్యవస్థను తీవ్రంగా విమర్శించింది. తమ అంతరంగిక జీవితాల్లో పురుషాధిపత్యాన్ని అనుభవిస్తూ, జెండర్ అసమానతే ప్రధాన విలువగా ఉన్న దాంపత్య బంధాల్లోని పరలింగ స్త్రీలు ఈ ఉద్యమంలోకి పెద్ద ఎత్తున వచ్చారు.
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీవాదులుగా పిల్లల్ని పెంచటం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత సమకాలీన రాడికల్ స్త్రీవాద ఉద్యమంలో పిల్లలపై దృష్టి ఒక కేంద్ర బిందువుగా ఉన్నది. పిల్లల్ని సెక్సిజం అంటకుండా పెంచితే భవిష్యత్తు ప్రపంచంలో సెక్సిజంకి వ్యతిరేక ఉద్యమ అవసరమే ఉండదని స్త్రీలు ఆశపడ్డారు. మొదట్లో దృష్టంతా పిల్లలు పుట్టినప్పటి నుండి వారిపై రుద్దబడే అబ్బాయిలూ, అమ్మాయిలూ అనే సాంఘిక పాత్రల మీదా, వాటి ప్రభావం … Continue reading
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీవాద పురుషత్వం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత సమకాలీన స్త్రీవాద ఉద్యమం ప్రారంభమయినప్పుడు భీకరమైన పురుష వ్యతిరేక ముఠా ఒకటుండేది. పరలింగ సంబంధాల్లో క్రూరమైన, దయలేని, విశ్వాసం లేని, హింసించే మగవాళ్ళతో జీవించిన స్త్రీలు ఉద్యమంలోకి వచ్చేవాళ్ళు. ఈ మగవాళ్ళల్లో చాలామంది శ్రామికుల కోసం, పేదవాళ్ళ కోసం, జాత్యహంకారానికి వ్యతిరేకంగా
Posted in ధారావాహికలు
Leave a comment
హింసకి ముగింపు పలకటం – బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత కుటుంబంలో హింస గురించి సాంస్కృతిక చైతన్యాన్ని పెంచి, దాన్ని ఆపాలంటే మన ఆలోచనా రీతుల్లోనూ, మన కార్యాచరణలోనూ తేవాల్సిన సమూల మార్పుల గురించి జరిపిన ప్రయత్నం సమకాలీన స్త్రీవాద ఉద్యమం ఇప్పటివరకూ తెచ్చిన సానుకూల మార్పుల్లో అతి విస్తృతమయిందని చెప్పకోవచ్చు.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
విశాలాక్షి తన ఆడంబరాన్నీ, అతిశయాన్నీ చూపించే తీరు శారదకు నచ్చదు. చిరాకు తెప్పిస్తుంది. ఐనా చిన్ననాటి స్నేహం ఒకరకంగా రక్తసంబంధం లాంటిదే. విశాలాక్షిని చివాట్లు పెట్టగలదు శారద. చివరకు వెళ్ళింది. భోజనాలయ్యాక శారద ఇక వెళ్తానంటే…
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీలు – శ్రమ – బెల్ హుక్స్
అమెరికాలో నివసించే స్త్రీలలో సగం మందికి పైగా శ్రమ శక్తిలో భాగమే. సమకాలీన స్త్రీవాద ఉద్యమం మొదలయ్యేటప్పటికి అమెరికాలోని కార్మికులలో మూడొంతుల పైగా ఆడవాళ్ళే. నేను పుట్టి పెరిగిన ఆఫ్రికన్ అమెరికన్ శ్రామిక కుటుంబంలో ఎక్కువ మంది స్త్రీలు శ్రమించే వాళ్ళే. స్త్రీవాద ఉద్యమం మొదలయినప్పుడు అనేక మంది
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం – ఓల్గా
స్వరాజ్యం శారదకు అర్జంట్ కాల్ బుక్ చేసి మరీ తెలుసుకుంది తన గర్భం విషయం తల్లికి తెలియదని, శారద చెప్పలేదని. మొత్తానికి ఐదారు నెలల్లో అంతా సర్దుకుని మళ్ళీ శారదా, అన్నపూర్ణలు మామూలయ్యారు.
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
ఎన్నికల రాజకీయాలలో అన్నపూర్ణ వంటి స్త్రీలను ప్రవేశించనిచ్చే ఉద్దేశం కాంగ్రెస్ నాయకులకు లేదు. ఎన్నికల రాజకీయాలు కాక మరో రాజకీయ కార్యక్రమమూ లేదు. ఆంధ్ర రాష్ట్రం వచ్చేవరకూ ఏదో ఒక పని కల్పించుకునేది. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత శారదా నికేతన్‌కి
Posted in ధారావాహికలు
Leave a comment
గ్లోబల్ స్త్రీవాదం-బెల్ హుక్స్
అనువాదం: ఎ.సునీత ప్రపంచంలో ఎన్నో చోట్ల మహిళా స్వతంత్ర పోరాట యోధులు ఒంటరిగానే పితృస్వామ్యానికి, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా వ్యక్తిగత పోరాటాలు చేశారు. ఈ భూమ్మీద మొదటి మనుషులు తెల్ల జాతి వాళ్ళు కాదు కాబట్టి నల్ల జాతి స్త్రీలే మొదటి సారి
Posted in ధారావాహికలు
Leave a comment
గమనమే గమ్యం -ఓల్గా
1952 జనవరిలో ఎన్నికల నోటీసు వచ్చింది. రాజకీయ పార్టీలన్నీ దిగాయి. కమ్యూనిస్టులకు పోరాట విరమణ చేశామనే నిస్పృహ లేకుండా ఎన్నికలలో గెలిచి తమకు ప్రజాబలం ఉందని నిరూపించుకోవాలనే ఉత్సాహం పెరిగింది.
Posted in ధారావాహికలు
Leave a comment
స్త్రీ వాద వర్గ పోరాటం -బెల్ హుక్స్
జాతి సమస్య కంటే ఎంతోముందే స్త్రీలలో వర్గ బేధాలు, అవి స్త్రీల మధ్య సృష్టించే విభజనల గురించి స్త్రీ వాద ఉద్యమం చర్చించింది. స్త్రీ విముక్తి ఏర్పడిన కొత్తల్లో ప్రధానంగా తెల్లజాతి స్త్రీలే ఉండేవారు కాబట్టి వారి మధ్య వర్గపరమైన బేధాలు కొట్టొచ్చినట్లు కనిపించేవి.
Posted in ధారావాహికలు
Leave a comment