స్త్రీవాదం అంటే ప్రేమించటం! – బెల్‌ హుక్స్‌

అనువాదం: సునీత అచ్యుత

ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ప్రేమ గురించి తెలుసుకోవాలని మనం భావిస్తే స్త్రీవాదాన్ని మనసారా కోరుకోవాలి. స్త్రీవాద ఆలోచన, ఆచరణ లేకుండా మన మధ్య ప్రేమ బంధాలకు పునాది ఏర్పడదు. మొదట్లో మగవాళ్ళతో సంబంధాల్లోని తీవ్ర అసంతృప్తి ఆడవాళ్ళని స్త్రీ విముక్తి వైపు నడిపించింది.

ప్రేమ, పెళ్ళి తర్వాత అంతులేని ఆనందం దొరుకుతుందని ఆశించిన ఆడవాళ్ళకి, పెళ్ళి కాగానే తెల్ల గుర్రం మీద రాజకుమారుడి బదులు పితృస్వామ్య ఇంటి యజమాని లభించాడు. అటువంటి బంధాల్లో కలిగిన క్రోధాన్ని, కటుత్వాన్ని ఆ స్త్రీలు ఉద్యమంలోకి తెచ్చారు. తాము ఏర్పర్చుకున్న బంధాలు కూడా పితృస్వామ్య విలువలతో నిండిపోవడంతో తాము మోసపోయామని భావించిన లెస్బియన్‌ స్త్రీలు కూడా వారికి తోడయ్యారు. ఇద్దరి వేదనా కలిసింది. దీనితో మొదటి నుండి కూడా స్త్రీవాద ఉద్యమంలో అసలు ఈ రొమాంటిక్‌ ప్రేమతో ఉండే అనుబంధాన్ని వదిలేసుకుంటే తప్ప స్త్రీలు నిజమైన స్వేచ్ఛ పొందలేరనే భావన బలంగా ఏర్పడిరది.
చైతన్యం పెంపొందించే బృందాల్లో (కాన్షన్‌నెస్‌ రైసింగ్‌ గ్రూప్‌) ఇటవంటి రొమాంటిక్‌ ప్రేమ మనలని పితృస్వామ్య ప్రేమికులతో ` మగవాళ్ళు కావచ్చు ` ప్రేమలో పడేసే వశీకరణ కుట్రనీ, వాళ్ళు ఆ ప్రేమని మనల్ని లొంగదీసుకోవటానికి, తొక్కి పెట్టటానికి వాడుకుంటారని మాకు చెప్పేవాళ్ళు. ఉద్యమంలో చేరేటప్పటికి ఏ పురుషుడితో లైంగిక సంబంధం లేని నేను మగవాళ్ళ పట్ల అంత తీవ్రమైన క్రోధం, ద్వేషం చూసి దిగ్భ్రాంతి చెందాను. కానీ నాకు దాని మూల కారణాలు అర్థమయ్యాయి. నా టీనేజీలో కుటుంబంలో అందరి మీదా మా నాన్న ఆధిపత్యమే నన్ను స్త్రీవాదం వైపు నడిపించింది. నాన్న ఆర్మీలో పనిచేశాడు. ఎథ్లెట్‌, చర్చిలో డీకన్‌, కుటుంబాన్ని చూసుకునే వాడు, చాలామంది ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకునేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే పితృస్వామ్య విలువలు మూర్తీభవించిన పురుషుడు. నేను మా అమ్మ పడే వేదన చూశాను, తిరగబడ్డాను. మా నాన్న ఎంత హింసించినా, అవమానించినా మా అమ్మ ఎప్పుడూ స్త్రీలకి జరిగే అన్యాయం పట్ల కోపం గానీ, క్రోధం గానీ ఒక్కసారి కూడా వ్యక్తం చెయ్యలేదు.
చైతన్యం పెంపొందించే బృందాల్లోకి వెళ్ళినప్పుడు, మా అమ్మ వయసు ఆడవాళ్ళు తమ బాధ, వేదన, కోపం వ్యక్తీకరిస్తూ ఆడవాళ్ళందరూ ఈ ప్రేమ నుండి దూరంగా ఉండాలని అంటుంటే, నాకు వాళ్ళు చెప్పింది సరైందేనని అన్పించింది. అయినా సరే, నాకు ఒక మంచి మగవాడి ప్రేమ కావాలనిపించింది. ఆ ప్రేమ నాకు దొరుకుతుందని కూడా అనిపించింది. నా ప్రేమికుడు స్త్రీవాద రాజకీయాలకి కట్టుబడి ఉండాలని మాత్రం అర్థమయ్యింది. 1970ల మొదట్లో, పురుషులతో జీవించాలని నిర్ణయించుకున్న ఆడవాళ్ళకి ముందు ఆ పురుషులని స్త్రీవాద ఆలోచనలోకి ఎలా మార్చాలనేది ఒక సవాలుగా పరిణమించింది. ఎందుకంటే, మగవాళ్ళు స్త్రీవాదులుగా మారకపోతే వారితో జీవితాంతం సంతోషంగా ఉండలేమని వారికి తెలుసు.
పితృస్వామ్య సంస్కృతిలో చాలామంది కోరుకునే రొమాంటిక్‌ ప్రేమలు మనుషులని చైతన్య రహితంగా, జీవితాలపై అధికారం, నియంత్రణ లేకుండా చేస్తాయి. ఇటువంటి ప్రేమ పితృస్వామ్య పురుషులు, స్త్రీల ఆసక్తులని పెంచి పోషిస్తుందని స్త్రీవాద ఆలోచనా పరులు అందరి దృష్టికి తెచ్చారు. ప్రేమ పేరుతో ఏమైనా చెయ్యొచ్చని ఈ భావన చెప్తుంది: కొట్టటం, వారి కదలికల్ని నియంత్రించటం, వారిని చంపటం, చంపి ‘ప్రేమ వల్ల జరిగిన నేరాలు’ అనటం, ‘ఆమెంటే నాకు ఎంతో ప్రేమ, అందుకే చంపాను అనటం’ వంటిది. పితృస్వామ్య సంస్కృతుల్లో ప్రేమ ‘ఆధీనం’, ‘ఆస్తి’ అనే భావనలతో ముడిపడి ఉంటుంది. ఆధిపత్యం, లొంగి ఉండటం అనే ఈ నమూనాలో ఒకరు ప్రేమ ఇచ్చే వాళ్ళయితే, మరొకరు పుచ్చుకునే వాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళకి మధ్య ఏర్పడే అసమాన పరలింగ సంబంధాల్లో ఆడవాళ్ళు ` ప్రేమ, భావోద్వేగాలతో నిండి ఉంటారు కాబట్టి ` మగవాళ్ళకి ప్రేమని ఇవ్వాలని, దాని బదులు, మగవాళ్ళు ` అధికారం, దాడి చేసే భావనలతో నిండి ఉంటారు కాబట్టి ` ఆడవాళ్ళని రక్షించి, పోషించాలని అనుకుంటారు. అయితే, అనేక కుటుంబాల్లో పురుషులు ఈ ప్రేమ, సంరక్షణలకి పెద్దగా స్పందించకపోయినా, నియంతలుగా ప్రవర్తిస్తూ తమ అధికారాన్ని అన్యాయంగా ఇతరులని బలవంత పెట్టటానికి, నియంత్రించటానికి వాడుకున్నారు. అందుకనే పరలింగ సంబంధాల్లోని స్త్రీలు తమ ప్రేమ బంధాలని తెగ్గొట్టటానికి స్త్రీ విముక్తి పోరాటానికి తరలి వచ్చారు.
ఇంకో కీలకమైన విషయం ఏమిటంటే అప్పట్లో ఆడవాళ్ళు కేవలం పిల్లల కోసం మాత్రమే జీవించకూడదని కూడా బలంగా చెప్పారు. ఆడవాళ్ళు తమ జీవితాలని సాఫల్యం చేసుకోవడానికి ఈ పిల్లల బంధం కూడా ఒక అడ్డంకేనని అన్నారు. తమ పిల్లల ద్వారా జీవితాన్ని జీవించాలని అనుకునే తల్లులు ఆ క్రమంలో క్రూరంగా, పిల్లలని అన్యాయంగా శిక్షించే రాక్షసులుగా తయారవుతారని హెచ్చరించారు. యుక్త వయసులో స్త్రీవాద రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు అప్పటికే తమ తల్లుల మీద తిరుగుబాటు చేస్తున్నారు. మేం మా అమ్మలలాగా తయారవదలచుకోలేదు, మా జీవితాలు సాధ్యమయినంతగా వాళ్ళకంటే భిన్నంగా ఉండాలని అనుకున్నాం. అలా ఉండాలంటే ఒక దారి పిల్లల్ని కనకుండా ఉండటం.
మొదట్లో ప్రేమ గురించి స్త్రీవాద విమర్శ అంత సంక్లిష్టంగా లేదు. ప్రేమ గురించిన పితృస్వామ్య భావనలని సవాలు చెయ్యటానికి బదులు ఆ విమర్శ అసలు ప్రేమనే ఒక సమస్యగా చూపించింది. ప్రేమని పూర్తిగా పక్కన పడేసి, దాని బదులు హక్కులు, అధికారం సాధించాలని అనుకుంది. అయితే స్త్రీవాద తిరుగుబాటు పేరుతో మనం కూడా భావోద్వేగాలు లేని పురుషులు, బుచ్‌ ఆడవాళ్ళలాగా తయారవుతామనే వాస్తవం గురించి ఎవరూ మాట్లాడలేదు. అయితే అదే జరిగింది. ప్రేమ, దాని విలువ, ప్రాధాన్యతల గురించి పునరాలోచించటం బదులు స్త్రీవాద చర్చ అసలు ప్రేమను గురించి ఆలోచించటమే మానేసింది. ప్రేమ కావాలనుకున్న స్త్రీలు, ముఖ్యంగా పురుషులతో ప్రేమ ఆశించిన స్త్రీలు అటువంటి ప్రేమను పొందటానికి దారుల కోసం వేరే చోట వెతుక్కోవాల్సి వచ్చింది. స్త్రీవాద రాజకీయాలలో ప్రేమకి, కుటుంబ సంబంధాలపై, ఇతరులతో కలిసి జీవించే సమూహానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదని చాలామంది స్త్రీలు స్త్రీవాద రాజకీయాల నుండి పక్కకి వెళ్ళిపోయారు.
ముందు చూపు ఉన్న స్త్రీవాద ఆలోచనాపరులకి కూడా స్త్రీలకి ప్రేమ గురించి ఏమి చెప్పాలో తెలియలేదు. ‘స్త్రీవాద సిద్ధాంతాం: అంచుల నుండి సెంటర్‌’కి పుస్తకంలో నేను స్త్రీవాద నాయకులు ప్రేమ స్ఫూర్తిని యాక్టివిజంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని రాశాను. ‘‘ప్రేమ, కరుణ చూపించగలిగే సామర్ధ్యం వారికి ఉండాలి, తమ కార్యాచరణ ద్వారా చూపించగలగాలి. ఇతరులతో విజయవంతంగా చర్చించగలగాలి’’. ప్రేమపూరిత చర్యలు ఆధిపత్యాన్ని మారుస్తాయన్న నా నమ్మకాన్ని ఆ పుస్తకంలో పంచుకున్నాను గానీ, ప్రేమ గురించి విముక్తితో కూడిన చూపుని ఇవ్వగలిగే స్త్రీవాద సిద్ధాంత ప్రాధాన్యత గురించి లోతుగా అప్పట్లో రాయలేకపోయాను.
ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రేమ గురించి ఒక అనుకూల స్త్రీవాద సిద్ధాంతాన్ని, ముఖ్యంగా పరలింగ సంబంధాల గురించి, రూపొందించలేకపోవటం వల్ల పితృస్వామ్య మాస్‌ మీడియా మొత్తం మన ఉద్యమాన్నే ప్రేమ లేని ద్వేషపూరితమైన రాజకీయాలుగా చూపించగలిగింది. పురుషులతో తమ సంబంధాలని పెంచుకోవాలనుకున్న స్త్రీలు ఆ బంధాలని నిలబెట్టుకుంటూ స్త్రీవాద ఉద్యమంలో
ఉండలేమని భావించారు. వాస్తవానికి మనం స్త్రీవాదం పురుషులకి, స్త్రీలకి ప్రేమంటే ఏమిటో తెలియజేస్తుందని చెప్పాల్సి ఉండిరది. ఆ విషయం ఇప్పుడు మనకి తెలుసు.
ముందు చూపున్న స్త్రీవాదం ఒక విజ్ఞత కలిగిన, ప్రేమించే రాజకీయాలని అందిస్తుంది. మన రాజకీయాల ఆత్మ ఆధిపత్యాన్ని అంతం చెయ్యాలనే నిబద్ధతలో ఉంది. పితృస్వామ్య ప్రేమల గురించిన రాడికల్‌ స్త్రీవాద విమర్శ గురి సరైందే. అయితే మన ప్రేమలో ఎక్కడెక్కడ దారి తప్పామో తెలుసుకోవటం సరిపోదు. ప్రేమ గురించి మనకి ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద కల్పన కూడా కావాలి. మన జీవితాల్లో ప్రేమ స్త్రీవాద ఆచరణలో వేళ్ళూనుకుని ఉన్నప్పటికీ ప్రేమ గురించి ఒక విస్తృత స్త్రీవాద చర్చని మనం సృష్టించలేకపోయాం. స్త్రీవాదంలోని ప్రేమ వ్యతిరేక వర్గాల వాదనలకి ప్రత్యామ్నాయ వాదనలని రూపొందించటంపై మనం దృష్టి నిలపలేదు.
మన ప్రత్యామ్నాయ దృష్టికి కేంద్రబిందువు ` ఆధిపత్యం ఉన్నచోట ప్రేమ ఉండదనే మౌలికమైన సత్యం. స్త్రీవాద ఆలోచన, ఆచరణ రెండూ కూడా భాగస్వామ్యంలోనూ, పిల్లలని పెంచటంలోనూ పరస్పర ప్రగతి, జీవిత సాఫల్యాన్ని వెతుక్కోవటం అన్న విలువలు ప్రధానంగా ఉండాలని చెప్తాయి. ప్రతి వాళ్ళ అవసరాలని, హక్కులని గౌరవించి, ఎవరూ మరొకరికి లొంగి ఉండకుండా, మరొకరిని వేధించకుండా వ్యక్తిగత సంబంధాలుండాలని చెప్పే దృష్టి ఆయా సంబంధాల నిర్మాణం గురించిన పితృస్వామ్య విలువలని మౌలికంగా సవాలు చేస్తుంది. మన వ్యక్తిగత జీవితాల్లో, దగ్గరి సంబంధాల్లో తండ్రులు, అన్న, తమ్ముళ్ళు, తండ్రుల స్థానంలో ఉండే మగవాళ్ళ ఆధిపత్యాన్ని చాలామంది అనుభవించిన వాళ్ళమే. అలాగే పరలింగ సంబంధాల్లో రొమాంటిక్‌ భాగస్వాముల నుండి కూడా మనం అనుభవించి ఉంటాము. వాస్తవానికి స్త్రీవాద ఆలోచన, ఆచరణని పాటిస్తే స్త్రీలు, పురుషులు ఇద్దరి మానసిక శ్రేయస్సు మెరుగు పడుతుంది. నిజమైన స్త్రీవాద రాజకీయాలు మనందరినీ దాస్యం నుండి స్వేచ్ఛ వైపు, ప్రేమ రాహిత్యం నుండి ప్రేమలోకి తీసుకువెళ్తాయి. పరస్పర భాగస్వామ్యమే మన ప్రేమకి పునాది అవుతుంది. స్త్రీవాద ఆచరణ మాత్రమే సామాజిక న్యాయం కోసం జరిగే పోరాటాల్లో పరస్పరతని పెంచి పోషిస్తుంది.
ఎప్పుడయితే మనం ప్రేమ అన్నది గుర్తింపులో, ఆదరణతో వేళ్ళూనుకోవాలని, సంరక్షణ, బాధ్యత, నిబద్ధత, జ్ఞానం కలిసిందే ప్రేమని ఒప్పుకుంటామో అప్పుడు న్యాయం లేకుండా ప్రేమ ఉండదని కూడా అర్థం చేసుకోగలుగుతాము. ఆ చైతన్యమే ప్రేమకి మనల్ని మార్చే శక్తి ఉందని, ఆధిపత్యాన్ని వ్యతిరేకించే బలం ఇస్తుందని కూడా అర్థం చేయిస్తుంది. స్త్రీవాద రాజకీయాలని ఎంచుకోవటమంటేనే ప్రేమని ఎంచుకోవటం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.