ట్రాన్స్‌ బిడ్డల తల్లుల సమావేశం – కొండవీటి సత్యవతి

ఇటీవల మదర్స్‌ డే సందర్భంగా ట్రాన్స్‌ పిల్లల్ని కలిగి ఉన్న తల్లులతో ఒక సమావేశం జరిగింది. మామూలుగా ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి సంబంధించి చాలా సమావేశాలకు నేను హాజరౌతూ ఉంటాను. ట్రాన్స్‌ వ్యక్తుల పట్ల, వారి సమస్యల పట్ల నా అవగాహనని పెంచుకోవడానికి నేను ఈ మీటింగ్‌లకు వెళుతూంటాను. ఇప్పడు నేను రాస్తున్న సమావేశం అలాంటిది కాదు.

అది మామూలుగా రెగ్యులర్‌గా జరిగే మీటింగ్‌ కాదు. అందరిలాగానే అమ్మాయిగానో అబ్బాయిగానో పుట్టిన తమ బిడ్డలు పెద్దయ్యేకొద్దీ తమను తాము ట్రాన్స్‌ మహిళగానో, ట్రాన్స్‌ పురిషుడిగానో గుర్తించుకుని తల్లిదండ్రులకు ఆ విషయం చెప్పినప్పుడు వారి రియాక్షన్‌ ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది. కొందరు కోపంతో తమ పిల్లలని కొట్టడం, తిట్టడం, ఇళ్ళల్లోంచి వెళ్ళగొట్టడం చేస్తారు. బలవంతంగా పెళ్ళిళ్ళు చేస్తారు. పురుష రూపంలో ఉన్న తనని తాను మహిళగా గుర్తించుకునే అతనికి పెళ్ళి అనేది భయంకరమైన అనుభవం. కుటుంబాల్లో తమ మీద జరిగే అఘాయిత్యాలను భరించలేక ఎంతో మంది ఇళ్ళు వదిలి పారిపోతారు. కుటుంబం సపోర్ట్‌ లేకపోవడంతో ఆకలి తీర్చుకోవడానికి భిక్షాటన, సెక్స్‌ వర్క్‌ తప్ప వేరే ఉపాధి అవకాశాలు వారికి అందుబాటులో లేకపోవడంతో రోడ్ల మీద విపరీతమైన హింసకు గురౌతున్నారు. కుటుంబాలను కోల్పోయిన వారి పరిస్థితులు దాదాపు ఇలాగే ఉంటాయి.
ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటి మీటింగుల్లో ఇలాంటి విషాద కధనాలు ఎన్నో విన్నాను. వారితో పని చేయడం మొదలు పెట్టినప్పటి నుండి ఈ దుఃఖ గాధలు వింటున్నాను. అయితే క్వీర్‌ బంధు, కిన్నర సొసైటి అనే రెండు సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ట్రాన్స్‌ తల్లి తండ్రుల మీటింగ్‌ చాలా భిన్నమైంది. ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీకి చెందిన పిల్లల తల్లి తండ్రులు పాల్గొన్న మీటింగ్‌ ఇది. ఇలాంటి సమావేశానికి నేను మొదటి సారి హాజరయ్యాను. పుట్టినప్పుడు కొడుకుగా పుట్టి ఆ తర్వాత తాను పురుషుడు కాదు, పురుష శరీరంలో ఉన్న స్త్రీని అని అతడు/ఆమె గుర్తించుకున్నప్పుడు వాళ్ళు పడే మానసిక సంఘర్షణలు, కుటుంబ సామాజిక బహిష్కరణలు, ఇంట్లోంచి వెళ్ళగొట్టబడిన సందర్భాలు చాలా సమావేశాలలో విన్నాను. కానీ తన కడుపున పుట్టిన కొడుకు కొడుకు కాదని, ఆమె కూతురుగా మారబోతున్నదని, అలాగే కూతురుగా పుట్టిన తన పాప కొడుకుగా మారబోతున్నదనే నగ్న సత్యం కళ్ళ ముందు ఆవిష్కృతమైనప్పుడు ఆ తల్లితండ్రులు ఎదుర్కొనే విషాద సన్నివేశాలు, ఆ దుఖం వర్ణనాతీతం. ఆ వేదనని వర్ణించడానికి బాషలో ఉన్న పదాలు సరిపోవు.
అలాంటి బిడ్డల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకోవాలని తల్లితండ్రులు ప్రయత్నం చేసినా కుటుంబ వొత్తిళ్ళు, సామాజిక కట్టుబాట్లు వారిని అంత తేలికగా తమ నిర్ణయాలను తీసుకోనివ్వరు. చాలా కుటుంబాల్లో ఈ వొత్తిళ్ళ వల్లే తమ కన్న వాళ్ళని ఇళ్ళల్లోంచి వెళ్ళగొట్టడం జరుగుతోంది. అలాంటి గతిలేని పరిస్థుతుల్లో రోడ్ల పాలైన ఆ బిడ్డలు బతకడానికి బిచ్చ మెత్తడం లేదా పడుపు వృత్తిలోకి దిగజారడం జరుగుతుంది. సిగ్నళ్ళ కూడళ్ళ దగ్గర, ప్రమాదకరమైన సెక్స్‌ వృత్తి కారణంగా వారు దారుణమైన హింసను ఎదుర్కొంటారు. లైంగిక దాడులు, అత్యాచారాలు, హింసించి చంపేయడం లాంటివి టాన్స్‌జెండర్‌ మహిళ జీవితాల్లో నిత్యకృత్యాలు.
అయితే నిన్న నేను హాజరైన సమావేశం భిన్నమైనది. క్వీర్‌ బంధు పేరుతో ముకుంద మాల అనే ట్రాన్స్‌ మహిళ తల్లి ఈ తల్లుల సంఘాన్ని ఏర్పాటు చేసారు. ముకుంద మాలకు పుట్టిన కొడుకు తన అస్తిత్వాన్ని గుర్తించి తాను పురుష శరీరంలో ఉన్న మహిళనని, తనకు మహిళగా జీవించడమే ఇష్టమని తన తల్లి, తండ్రులకు చెప్పినప్పుడు ఎలా ఈ సమస్యని ఎదుర్కోవాలి, అధిగమించాలి అనే వేదన, సంధిగ్దాల నుండి బయటపడి తన కొడుకుకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. తనిచ్చిన సపోర్ట్‌ వల్ల ఈరోజు ఆమె ట్రాన్స్‌ కూతురు అమెరికాలో పిహెచ్‌డి చేసే స్థాయికి ఎదిగింది. ఆ తర్వాత తన లాంటి తల్లులను కలిపి క్వీర్‌ బంధు తల్లుల సంఘం ఏర్పాటు చేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ముకుంద మాల. నిన్నటి మీటింగ్‌లో కూతుళ్ళు కొడుకులుగా, కొడుకులు కూతుర్లుగా మారిపోయిన తల్లులు తమ దుఖ: గాధల్ని అందరి ముందు వివరించారు. సమాజంలో, కుటుంబాల్లో, పాఠశాలల్లో తామెదుర్కొన్న కష్టాలు, కడగండ్లు చెప్పారు. తమ కడుపున పుట్టిన పిల్లల్ని ఏ తల్లీ దూరం చేసుకోవాలనుకోదు. దారుణమైన పరిస్థితుల్లో కొంతమంది పిల్లల్ని ఇంట్లోంచి పంపిచారేమో మేమలా కాదు. అమ్మాjైునా, అబ్బాjైునా మాబిడ్డలే అంటూ తల్లులు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తమ జీవిత కధల్ని వినిపించారు. వింటున్న మేమూ కన్నీళ్ళను ఆపుకోలేకపోయాం. వారెదుర్కొన్న కష్టాలు, సమస్యలు మన ఊహల్లోకి కూడా రావు. అంతటి మానసిక కల్లోలాలు వారెదుర్కొన్నారు.
నేను ఒక్కటే చెప్పాను మీ దుఖా:న్ని మేము అర్ధం చేసుకుకోగలం కానీ అది మా అనుభవంలోకి రాదు. మీ కధల్ని మీరే చెప్పాలి. జనబాహుళ్యంలోకి మీ జీవిత కధలు విస్తృతంగా వెళ్ళాలి. ఈ రోజు ఈ నాలుగు గోడల మధ్య మేము విన్నాము. కానీ అందరూ ఈ కధల్ని వినాలి. అప్పుడే ట్రాన్స్‌ కమ్యూనిటీ పట్ల ఉన్న అసహనం, అనుమానం, అవమానకరంగా మాట్లాడడం తగ్గుతాయి. అందులో సిగ్గుపడాల్సింది, భిడయపడాల్సింది ఏమి లేదు. ఆ ఉద్దేశ్యంతోనే ముకుందమాల గారి జీవితానుభవాలని భూమికలో వేసాము. మీరు కూడా రాయండి, అలాగే భూమిక హెల్ప్‌ లైన్‌ని ఉపయోగించుకోండి. ఈ రోజు నేను ఎన్నో విషయాలను నేర్చుకున్నాను అని మీ నుంచి. భూమిక ఎప్పుడూ మీతో ఉంటుంది అని చెప్పాను. ఆ తర్వాత మాలా గారు తల్లులకు శాలువ కప్పి సన్మానం చేసారు. వారంతా చాలా సంతోషపడ్డారు.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.