పొన్నుతాయి – తమిళ కథ ` బామ

అనువాదం: డా॥ జిల్లెళ్ళ మెర్సీ విజేత
పొన్నుతాయికి దగ్గర దగ్గర ముప్పయి లేదా ముప్పయి రెండేళ్ళు ఉంటాయి. బలమైన మనిషి. పెళ్ళెí ఏడెనిమిది ఏళ్ళయింది. ఈ మధ్యలో ఆమెకి ఒకరి తర్వాత ఒకరు నలుగురు మగ పిల్లలు పుట్టారు. పొన్నుతాయి నల్లనిది. ఎంత నలుపంటే చీకటి కంటే నల్లనైనది. కాని ఆమె చూడటానికి బాగుంటుంది.

ఆమె పిల్లలు ఆమె కంటే నల్లగా ఉంటారు. వాళ్ళు కాకి పిల్లలాగ వీధుల్లో తిరుగుతుంటారు. ఎవరయినా అచ్చం వాళ్ళ అమ్మని అద్దుకున్నట్టే వాళ్ళని కూడా వేలితో అద్దుకొని నుదుటి మీద నల్లటి బొట్టు పెట్టుకోవచ్చు.
పొన్నుతాయిది చక్కని ధృడమైన శరీరం. ఆమె నడిచేటప్ప్పుడు వేసే అడుగులకి నేల అదిరేది. కొంతమంది ఆడవాళ్ళు ఆమెను అవమానకరంగా మాట్లాడతారు. ఆమె నడిచినా, మాట్లాడినా ఒక ఆడదాని తీరు ఇదేనా!” అంటారు. ఆమెది కంచు కంఠం. ఆమె మాట్లాడితే గంట మోగినట్లు గట్టిగా, స్పష్టంగా ఉంటుంది. ఆమె వీధి కుళాయి దగ్గర నిలబడి మాట్లాడితే ఆ మాటలు వీధి చివరి వరకు వినబడుతాయి. తను ఏదైనా ముక్కుసూటిగా, గుండు దించినట్లుగా మాట్లాడుతుంది. చాల మందికి ఆమె అస్సలు నచ్చదు.
ఊర్లో ఎక్కువ మందికి ఆమె పొన్నుతాయిగా కాకుండా ‘లావు పెదాల ఆమె’గా, తెలుసు. ఆమెకి పెదాలే కాదు నోరు కూడా పెద్దదే అంటారు. మిగతా ఆడవాళ్ళ లాగా ఆమె భూసాముల దగ్గర కూలి పని చేయకుండా సొంతంగా వ్యాపారం చేసుకొని బతకటం వాళ్ళు ఒప్ప్పుకోరు. పొన్నుతాయి చదువుకోకపోయినా బస్సెక్కి దగ్గర్లోని ఊర్లకు వెళ్ళి కూరగాయలు, పండ్లు తెచ్చి, ఇల్లిల్లు తిరిగి అమ్మి జీవనం సాగించేది. వీధిలో వాళ్ళెవరూ అలా చేయలేదు. మనుషులు మాట్లాడే తప్ప్పు మాటలను పట్టించుకోకుండా ఆమె పట్టుదలగా వ్యాపారం చేసేది. ఒక రోజు పొన్నుతాయి గంప నిండా కొబ్బరి కాయలు తెచ్చి వీధుల్లో అమ్ముతూ “కొబ్బరి కాయలు… కొబ్బరి కాయలు… పదికి మÖడు!” అని అరిచింది. అది నచ్చని ఒకామె “కొబ్బరి కాయలు తోట దగ్గర కొంటే ఒక్కొక్కటి రెండు రూపాయలే! ఈమె సిగ్గులేకుండా ఎలా వ్యాపారం చేస్తుందో చూడు!” అంది. ఆ మాటలు అని ఆమె పెద్ద సమస్యలో చిక్కుకొంది.
“నేను ఎప్ప్పుడూ ఎవ్వరితో కొట్లాడను. కానీ కొట్లాట నా వరకు వస్తే ఊరుకోను. నువ్వు కొనాలనుకొంటే కొను లేకపోతే నోరు మÖసుకో! నేను చేసే వ్యాపారం గురించి మాట్లాడ్డానికి నువ్వెవరు?” అని ఆమెను గదిమి వీధి ముందుకు కొంతదూరం నడచి ‘కొబ్బరికాయలో అని అరవకుండా “నేను పనికి పోతానో పోనో అది నా ఇష్టం. అడ్డమైన ముండలందరూ నా గురించి మాట్లాడ్డమెందుకు? చూస్తూ ఉంటే నేను వ్యాపారం చేయడం వీళ్ళకి కడుపు మంటగా ఉన్నట్టుందే. నా గురించి ఎవరైనా వదిరితే నాలుకలు కోస్తా!” అని అసహనంగా పెద్ద పెద్ద అడుగులేస్తూ వెళ్ళిపోయింది పొన్నుతాయి. ఆమె మాటలకి అదరి ‘గంపలో ఏమున్నాయ’ అని అడగడానికి ఏ ఒక్కరూ సాహసించలేదు. ఆమెకి వాళ్ల మాటలు వినబడనంత దూరం వెళ్ళాకే ఆడవాళ్ళు నోళ్ళు విప్పేవారు. “ఆమె ఎంత పొగరుగా నడుస్తోంది చూడు! అందరు ఆడోళ్ళలా కూలి పనిచేసి కూడు సంపాదించుకోవచ్చు కదా? పెద్ద కులపోళ్ళలా వ్యాపారం చేస్తోంది! ఈమె చాలా అతి చేస్తోంది!” అంది మునియమ్మ. పొన్నుతాయి పడమర వీధికి వెళ్ళి తూర్పు వైపు తిరిగోచ్చేసరికి అందరి నోళ్ళు మÖతపడ్డాయి.
పొన్నుతాయి అక్కడున్న ఆడోళ్ళ దగ్గరికి వచ్చి పట పటా పళ్ళు కొరికి “ఆ రోజు నేను మా పెరట్లో టూత్ పేస్ట్‌తో పళ్ళు తోముకొంటుంటే కొంతమంది లంజముండలు నోరు వెళ్ళబెట్టి నన్ను చూస్తూ గుసగుసలాడారు. నేను కొనుకున్న టూత్ పేస్ట్‌తో నా
పళ్ళు తోముకుంటే వాళ్లకెందుకు కడుపుమంట?” అని అరిచింది. పొన్నుతాయి అక్కడి నుంచి వెళ్ళి పోయిన తర్వాత “ఆ లావు పెదాలది ఎలా వెళ్తుందో, ఎలా బతుకుతుందో చూడండి! అసలు ఆమె పళ్ళు కూడా వేళ్ళతో తోమదు. గంజి తాగుతుంది. కానీ ముడ్డి మాత్రం చారుతో కడుగుతుంది” అంది ఆకసంపట్టికారి. అతియమ్మ వెంటనే, “మాతిని, ఆమె వింటుంది. ఏం మాట్లాడొద్దు. ఆమె మిమ్మల్ని చీల్చి చెండాడుతుంది. ఆమె తెలివి తక్కువది అనుకోవద్దు, తాళికట్టిన మొగుడ్నే పోలీసోళ్ళతో కొట్టించింది!” ఊర్లో అందరూ ఈ పోలీస్ కేసు గురించే మాట్లాడతారు. గత రెండు సంవత్సరాలుగా, పొన్నుతాయి తన మొగుడ్ని వదిలేసి ఒంటరిగా బతుకుతోంది. వ్యాపారం చేసి సంపాదించిన డబ్బుల్తోనే సరుకులు కొంటుంది. వాళ్ళ అమ్మగారింటిలోనే పడుకుంటుంది. ఆమెకు మÖక్కండితో పెళ్ళెíన తర్వాత అతనితో వెళ్ళి అందరిలాగే తనూ సంతోషంగా బతకొచ్చనుకుంది. మÖక్కండి సన్నగా ఉన్నా మీసం మాత్రం దట్టంగా ఉంది. ఆయన ఎప్ప్పుడూ తన మీసాన్ని తిప్ప్పుతూ ఉండడం వలన మీసం రెండు వైపులా ఎవర్నయినా పొడిచి చంపే కొమ్ముల్లాగా తయారయ్యాయి.
అతను నాలుగు రోజులు పనికిపోతే, మÖడు రోజులు ఇంట్లోనే ఉండేవాడు. రోజూ సాయంత్రం తప్పక హోటళ్ళకి వెళ్ళి ఇడ్లీలు, దోసెలు, వడల్లాంటివి బొక్కి తిని మళ్ళీ రాత్రికి ఇంటికి వచ్చి భోంచేస్తాడు. అతనికి హోటళ్ళలో తినకపోతే తిండి తిన్నట్లే ఉండదు. అతను సంపాదించిన డబ్బంతా తన కోసమే ఖర్చు పెట్టుకుంటాడు. తాను పనికి పోని రోజుల్లో పొన్నుతాయితో గొడవపడి ఆమె సంపాదించిన కూలి డబ్బు లాక్కొని బయటకు వెళ్తాడు. ఆదివారమైతే కూరకని మాంసం కొని తెచ్చుకొని మరియప్ప తేవర్ నడిపే సారాయి దుకాణానికి పోయి బాగా తాగుతాడు. లేకపోతే ఏదో ఒక విషయం గురించి పొన్నుతాయితో కొట్లాడి ఆమెని బాగా కొడ్తాడు.
పెళ్ళయిన కొత్తలో తన సంపాదనతోనే సర్దుకు పోయేది. తర్వాత, వెంట వెంటనే నలుగురు పిల్లలు పుట్టారు. వారికి ఒక్క పూట కడుపు నింపడమే కష్టమయ్యేది. అందుకు ఆమె రెక్కలు ముక్కలు చేసుకొనేది. పాడిచ్చే ఆవుని కొన్నది, దాన్ని బాగా చూసుకుంటూ, పిల్లల్ని బాగా సాక్కుంది. రోజంతా అటు పొలం పని, ఇటు ఇంట్లో పని చేసి బాగా అలసిపోయేది. ఒకరోజు మÖక్కండి పీకలదాకా తాగి ఆవుని అమ్మి ఆమెకి పైసా కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన కొట్లాటలో ఆమెను గొడ్డుని బాదినట్టు బాదడంతో ఆమె తన పుట్టింటికి తిరిగొచ్చింది. ఆమె తన మొగుడిని వదిలి వచ్చేటప్ప్పుడు ఆఖరి పిల్లాడు పాలు తాగే చంటిబిడ్డ కావడంతో వాడిని మాత్రమే తనతో తెచ్చుకొని పాలు మానే వరకు నాలుగైదు నెలలు ఉంచుకొని మళ్ళీ వాడిని మొగుడి ఇంటి దగ్గర వదిలేసి ఒంటరిగా తిరిగొచ్చింది.
“ఎలాంటి ఆడది అది? పిల్లల మీద కొంచం కూడా ప్రేమ లేదు! మొగోడిలాగ తిరుగుతుంది! పిల్లలను మొగుడికి వదిలేసి తిరిగే ఆడదాన్ని ఎప్ప్పుడైనా చూసామా?” ఊర్లో వాళ్ళు నానా రకాలుగా మాట్లాడినా పొన్నుతాయి పెద్దగా పట్టించుకోలేదు. ‘వాళ్ళు నాకు మాత్రమే పిల్లలా?… అతని బాధ పడలేక ఒకరి తర్వాత ఒకరిని కన్నా ఇద్దరి పిల్లలు చాలనుకున్నా. కానీ అతను ఒప్ప్పుకోలేదు. కాబట్టి వాళ్ళని అతనే సాకాలి’ అని తనలో తాను అనుకుంది పొన్నుతాయి. పిల్లల అలనా పాలనా చూసేసరికి మÖక్కండికి సహనం నశించింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు పొన్నుతాయిని “ఏయ్, ఇంటికి రా!” అని హెచ్చరించాడు. పొన్నుతాయి “ఇప్ప్పుడు నీకు నాకు ఏ సంబంధమÖ లేదు”. “ఆ ఉన్నదేదో రెండేళ్ళ క్రితమే పోయింది. ఇక నీతో కలిసి బతకడం నా వల్ల కాదు” అని తన దారిన తను పోయింది. “ఎంత పనికిమాలినదైనా మొహం మీదే మొగుడితో కలిసి బతకనంటుందా?” మÖక్కండి అరవడం తప్ప చేసేదేమీ లేక “నువ్వు…. ఆడదానివేనా? పిల్లల్ని పట్టించుకోకుండా కుక్కలాగా తిరుగుతున్నావు, లంజదానా!” అన్నాడు.
“నా ఇష్టం వచ్చినట్లు చేస్తా, నువ్వు ఎవరు నన్ను అడగడానికి? నీకు సంబంధం లేకుండా నాకు పిల్లలు పుట్టారా? నువ్వే వాళ్ళను పెంచడానికి ప్రయత్నించు” అని కోపంగా అరిచింది పొన్నుతాయి. మÖక్కండికి కోపం కట్టలు తెంచుకుంది. “ఏయ్ లంజా, నోర్ముయ్ ఒకసారి నీ అవతారాన్ని, నీ పెదాల్ని చూసుకో. వేరే ఎవరైనా నీ పెదాల్ని చూసుంటే నిన్ను పెళ్ళి చేసుకొనే వారే కాదు. నేను అమాయకుడిని కాబట్టి నిన్ను చేసుకున్నాను. నన్ను చెప్ప్పుతో కొట్టించుకోవాల్సిందే!” అన్నాడు. “చెప్ప్పుతోనే కాదు, చీపురుతో కూడా కొట్టాలి పనికిరానోడా! అప్పటికీ నీకు బుద్ధి రాదు” అని అతని వైపు ఉమ్మి ఊసింది. దాంతో అతను ఆమె జుట్టు పట్టుకొని ఐదారు సార్లు చెంప మీద కొట్టి ఇంకా కొట్టుకుంటూ ఈడ్చుకెళ్ళాడు! పొన్నుతాయి తనని విడిపించుకోవడానికి కాళ్ళు చేతులు ఆడిస్తూ వాని చేతిని చిక్కించుకొని గట్టిగా కొరికింది. మÖక్కండి నొప్పితో అల్లాడుతూ పొన్నుతాయి కడుపు మీద తన్నాడు. పొన్నుతాయి నొప్పి తట్టుకోలేక అరుస్తూ పోయి చెక్క రోలు మీద పడడంతో తల పగిలి రక్తం ధారలుగా కారడంతో ఆమె బట్టలు రక్తంతో తడిచిపోయాయి. కాని ఆమె అతనిని అరవకుండా, తిట్టకుండా, రక్తం కారుతుండగానే, అతన్నుంచి దూరంగా దక్షిణం వైపు పరుగెత్తింది.
“రేయ్, ఆమె చేలల్లోంచి పరుగెత్తి పోతోంది. పోయి ఏ బావిలోనో దూకి చచ్చేది ఖాయం! వెళ్ళి ఆమెని పట్టుకో!” అని గుంపులోంచి ఎవరో గట్టిగా అరిచారు. “చస్తే చావనీ లంజని! నేను ఆ గాడిదని పూడ్చి పెట్టి ఇంకొకదాన్ని పెళ్ళి చేసుకుంటా. లోకంలో ఆడోళ్ళు కరువా?” నిర్మొహమాటంగా అన్నాడు మÖక్కండి. పొన్నుతాయి తల్లి చెరిగిపోయిన జుట్టుతో ఆమె వెనకాలే పరుగెత్తింది. ఊరంతా గలి బిలిగా మారింది. ఆడ, మగ తేడా లేకుండా ఊరు ఊరంతా పొన్నుతాయి గురించే మాట్లాడుకుంటున్నారు. పొన్నుతాయి వెళ్ళి ఏ బావిలోనో దూకకుండా, అడ్డదారిలో చేల వెంబడి పరుగెత్తి పక్క ఊరి పోలీస్ స్టేషన్‌కి చేరింది. పొన్నుతాయిని చూసి పోలీస్ స్టేషన్ ముందు జనాలు గుమిగూడారు. ఆమె తల వెంబడి రక్తం బొట్లు బొట్లుగా కారుతోంది. పోలీసులు ఆమెను లోపలికి తీసుకొని పోయి విచారించారు. “సార్, నా మొగుడు ఎప్ప్పుడూ నన్ను హింసించేవాడు. రెండేళ్ల క్రితం అతన్ని వదిలేసి నా పాటికి నేను బతుకుతున్నాను. ఈ రోజు మరలా వచ్చి కొట్టి నా తల పగలకొట్టాడు. మీరు మాత్రమే నాకిప్ప్పుడు సహాయపడగలరు” అంది. ఆమె వొళ్ళొంతా రక్తంతో తడిసిపోయింది. ఆమె పేరు, ఊరు, వీధి మొదలైన వివరాలు రాసుకుని ఆమెని ప్రభుత్వాసుపత్రికి వెళ్ళమన్నారు. అప్పటికి పొన్నుతాయి తల్లి కూడా అక్కడికి వచ్చింది. పొన్నుతాయి వాళ్ళ అమ్మతో ఆసుపత్రికి వెళ్ళింది.
ఎవరి దయవల్లనో గాని పోలీసాయన మాత్రం తన సొంత చెల్లిని చూసుకున్నట్టు చూసుకున్నాడు! వెంటనే ఆయన మÖక్కండిని పట్టుకోవడానికి ఇద్దరు పోలీసుల్ని పంపగా వారు అతన్ని పోలీస్ స్టేషన్‌కి తీసుకొచ్చారు. ఈలోగా పొన్నుతాయి తలకి కట్టు కట్టించుకొని తిరిగొచ్చింది. మÖక్కండిని లోపలికి తీసుకెళ్ళి బాగా కొట్టి లాకప్‌లో పెట్టారు. పోలీసులు పొన్నుతాయితో “నువ్వేమంటావ్? నీ భర్తని రెండు రోజులు ఉంచి బుద్ధి చెప్పి పంపిస్తాము. అతనితో కాపురం చేస్తావా? మళ్ళీ వాడు ఇలాంటి పని చేస్తే మాకు చెప్ప్పు” అన్నారు.
“సార్ మీరు ఆయన్ని ఏమైనా చేయండి. నేను మాత్రం ఇపుడు ఆయనతో కలిసి బతకలేను. నేను పడ్డ కష్టాలు చాలు, ఒక్కదాన్నే ఒంటరిగానే ఎలాగోలా బతకగలను” అని చెప్పి ఆమె, వాళ్ళ అమ్మతో కల్సి ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు పోలీసులు మÖక్కండిని గట్టిగా హెచ్చరించి పంపేశారు. పొన్నుతాయి తన భర్తని పోలీసులతో కొట్టించిందని ఊరు ఊరంతా తెలిసింది. ఇక ఆమె గురించి అందరూ ఏదిపడితే అది మాట్లాడ్డం మొదలెట్టారు. “ఏది ఏమైనా గాని, ఎవరైనా తాళి కట్టిన మొగుడ్ని పోలీస్ స్టేషన్‌కి ఈడ్చి కొట్టిస్తారా? అది అతి ముండ కాదా?” అని అడిగింది అతియమ్మ.
ఛీ… అట్ల మాట్లాడతావేంటి. ఇన్నాళ్ళు వాడు ఆమెను ఎంత కొట్టినా ఓర్చుకుంది కదా! ఇంకెన్నాళ్ళని ఓర్చుకుంటది… అలాంటోడిని పోలీసోళ్ళకి పట్టించాల్సిందే! అలాగైతేనే మిగతా వాళ్ళు పెళ్ళాల్ని కొట్టడం తిట్టడం మానేస్తారు, అంది కురువమ్మ.
ఓహో! అయితే నువ్వు చెప్పేది ఏంటి..? మొగుడు రెండు దెబ్బలు కొడితే ఆ పెళ్ళాం పడి ఉండకుండా తిరిగి వాణ్ణి నాలుగు దెబ్బలు కొట్టాలనా? బాగానే ఉందిలే? కానీ ఎంతకాలమని పోలీసోళ్ళు ఆమెను కాపడతారు? వాళ్ళని అస్సలు నమ్మలేం! పెళ్ళాం ఎంత దూరమెళ్ళినా చివరికి మొగుడి దగ్గరకి తప్పక తిరిగి రావాల్సిందే, గుర్తుంచుకో! అప్ప్పుడు వాడు ఊరుకుంటాడా, దాని పొగరు అణచడా? అంది అతియమ్మ. ఈ మాటలు విన్న కనియమ్మ, “ఆమె అతన్ని వదిలేసి రెండు ఏళ్ళ నుండి ఒక్కతే బతుకుతోంది. ఆయన అంతటితో ఆమెని విడిచిపెట్టాలి. ఆమెని మళ్ళీ తీసుకెళదామనుకున్నాడు. దానికి ఆమె ఒప్ప్పుకోలేదు. ఈ సమస్య అంతటికి కారణం అతనే కదా! మనకు ఏదైనా నచ్చకపోతే, దాన్ని వదిలేసి ముందుకు సాగిపోవాలి” అంది.
“వాడు ఆమెను వెనక్కి పిలిచేది ఆమెతో కలిసి ఉండడానికా? కాదు. నలుగురు పిల్లల్ని పెంచడం అతనికి కష్టమై ఆమెని వెనక్కి రప్పించుకోవాలనుకున్నాడు” అంది కురవమ్మ. ఈ మాటలు విన్న కనియమ్మ వెంటనే కలిగించుకొని, “అతను ఎంతకాలమని ఒంటరిగా ఉంటాడు? ఆడోళ్ళయితే ఉంటారు, కాని మొగోళ్ళు ఉంటారా?” అంది.
ఆడోళ్ళు ఇట్లా చర్చించుకుంటుంటే, మగోళ్ళు కూడా అలాగే అనుకుంటున్నారు. “వాడు అసలు మగోడేనా? వెధవ! ఆమె వాడ్ని పోలీస్ స్టేషన్‌కి ఈడ్చి కొట్టించినా, ఆమెను ఇంకా బతకనిస్తున్నాడు! పనికిమాలినోడు! నేనైతే ఆమెను స్టేషన్‌లోనే ఉరివేసేవాడ్ని” కోపంగా అన్నాడు కుప్ప్పుసామి. “నువ్వు రా..! అసలైన మగోడివి! పెళ్ళాన్ని చంపడం పెద్ద సంగతి కాదు. వాడు మొదట్నుంచి ఆమెకి నాలుగు తగిలించుంటే గమ్మున పడుండేది. అలా చేయలేదు. కాబట్టి, ఇప్ప్పుడు అనుభవిస్తున్నాడు. మొగోడు తన పెళ్ళాంని అదుపులో పెట్టుకోకపోతే వాడసలు మొగోడే కాదు! వాడి మÖతి మీద మీసం వాడికే అవమానం!” అని నవ్వాడు గోవిందన్.
తోటి మగాళ్ళు అతన్ని వెక్కిరిస్తుంటే మÖక్కండికి కోపం మరీ ఎక్కువయింది. అతను పళ్ళు కొరికి ఏం చేయాలో తోచక అటు ఇటు ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు తిరుగుతూ ఒక నిర్ణయానికొచ్చాడు. అతను పొన్నుతాయి ఇంటికెళ్ళి వాళ్ళ నాన్నను బయటికి పిలిచి “నేను ఇంకెప్పటికి నీ కూతుర్ని నాతో తీసుకెళ్ళి బతకలేను. ఆమెను వచ్చి పిల్లల్ని తీసుకెళ్ళి పెంచమను. నేను ఎవరో ఒకరిని పెళ్ళిచేసుకొని నా దారిన నేను పోతాను. ఆమె వలన నాకు చాలా అవమానం జరిగింది” అన్నాడు.
పొన్నుతాయి నాయన “అల్లుడా, దయచేసి ఓపిక పట్టు. ఆడదానికి తెలివి తక్కువ, ఆవేశం ఎక్కువ అన్నట్టు ఆ రోజు ఈ తెలివితక్కువ పిల్ల స్టేషన్‌కి వెళ్ళింది. నాకు ఇంకొన్ని రోజులు గడువు ఇవ్వు, నేను ఆమెకి నచ్చచెప్పి తీసుకొస్తా” అని బదులిచ్చాడు.
“అది కుదరదు. ఇక నాకు ఆమె అస్సలు వద్దు. నేను పిల్లల్ని ఇక్కడే వదలి పెడతాను అంతే” అని మÖక్కండి వెనుతిరిగాడు.
నిశ్శబ్దంగా మÖక్కండి మాటలు వింటున్న పొన్నుతాయి “పిల్లల్ని ఇక్కడ వదిలి పెట్టడమెందుకు? వాళ్ళు నీ పిల్లలు, నువ్వే సాకు. నాకు నువ్వు గాని నీతో కలిగిన పిల్లలు గాని వద్దు! పిల్లల్ని తల్లి మాత్రమే పెంచాలనే చట్టముందా? వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావద్దు. ఎప్ప్పుడూ నీ ముఖం కూడా చూపవద్దు! జాగ్రత్త!” అంది. మÖక్కండి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పొన్నుతాయి తల్లి గట్టిగా ఏడుస్తూ, “వాడు వెళ్ళి ఎవరో ఒకర్ని తెచ్చుకొని ఆమెతో బతుకుతాడు. ఆ వచ్చింది నీ పిల్లల్ని చిత్రహింసలు పెడ్తుంది. నా మాట వినవే! బండదానా, చెత్త మొహమా! ఆడదానికి మొగుడేనే అన్నీ. నువ్వు వాని దగ్గర పడుండాల్సింది పోయి ఇక్కడ పడున్నావ్ దరిద్రపు ముండా…! కనీసం పిల్లల్నయినా తెచ్చుకొని పెంచు” అంది.
“అమ్మా, ఏడుపు ఆపి కొద్ది సేపు ఊరుకో. మొగోళ్ళకి పిల్లల్ని పెంచడం తెలీదా? అతన్ని పెంచనీ. ఆ బండోడిని, చెత్త మొహన్ని పెండ్లి చేసుకొని కాపురం చేసింది చాలు” అంటూ పొన్నుతాయి ఇంట్లోకి పోయి బ్లేడు బయటకు తెచ్చి ఇంటిముందున్న కోళ్ళ గూడు మీద కూర్చుని మెడలో ఉన్న మంగళసూత్రం తీసి ముడులును కోసి పడేసింది. ఇది చూసి వాళ్ళ అమ్మ “ఒసే పిచ్చి లంజా, ఎంత పని చేసావే? పనికిమాలిన దానా! ఇది మామÖలు విషయం కాదు! ఏ ఆడదైనా మగాడు మెడలో కట్టిన మంగళసూత్రం తెంపుతుందా? నీ బదులు నాకు ఒక బండరాయి పుట్టుంటే బాగుండు!” అంటూ నేలమీద పడి ఉన్న తాళి ముక్కల్ని ఏరుతూ, గట్టిగా ఏడ్చింది.
ఆమె ఏడుపు విన్న నలుగురైదుగురు మనుషులు వచ్చి పొన్నుతాయిని తిట్టడం మొదలెట్టారు. కానీ ఆమె ఏమీ పట్టించుకోలేదు. ఆమె తన తల్లిని పట్టుకొని “అమ్మా, ఏడుపు ఆపుతావా? ఇక్కడ ఏం జరిగిందో ఊర్లోవాళ్ళందరికి తెలియాలా? నేను సరుకులు తెచ్చుకోడానికి టౌన్‌కి పోతున్నా, నువ్వు చెరువు గట్టుకి పోయి గొర్రెకి మేత కోసుకొనిరా. అమాయక నోరు లేని మÖగజీవి, ఆకలిగొనింది” అంది.
పొన్నుతాయి మంగళసూత్రం బొడ్లో పెట్టుకొని బుట్ట పట్టుకొని టౌన్‌కి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఆమె చావడి ముందు అంగడి తెరచి వ్యాపారం మొదలు పెట్టింది. పదేళ్ళుగా ఆమె మెడలో ఉన్న మంగళ సూత్రం ఇప్ప్పుడు, అమ్మకానికి పెట్టిన సరుకుల రూపంలో అంగడి మొత్తం ఆక్రమించింది.
(- ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప.)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.