Category Archives: ఇంకు పెన్ను

జెన్ జీ అమ్మాయిల నిరసన: సంఘ పరివార్ ప్రతీకార స్పందన – ఎ. సునీత

జంతర్ మంతర్ నిరసనలు దేశ రాజకీయాలని కుదిపాయి. దీర్ఘ కాలికంగా ఇవి ఎటువంటి పరిణామాలకి దారితీస్తాయో ఇప్పుడే చెప్పలేకపోయినా, అనేక విశ్లేషణల్లో కొన్ని విషయాలు స్పష్టమయ్యాయి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సంఘ పరివార్ భావజాల, భౌతిక అధిపత్యానికి దెబ్బ తగిలింది.

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ఎస్సైఆర్ పేరుతో పౌరసత్వ జాబితా – ఎ. సునీత

2025 జూన్‌లో సరిగ్గా బీహార్ ఎన్నికల ముందు జాతీయ ఎన్నికల సంఘం ఎస్సైఆర్ మొదలు పెట్టినప్పుడు ప్రతి ఎన్నికల ముందూ సాధారణంగా జరిగే ఓటర్ల జాబితా ప్రక్షాళన అని అందరూ అనుకున్నారు. అయితే ఇది స్వభావరీత్యా చాలా భిన్నమైన కార్యక్రమం అని త్వరలోనే స్పష్టమయింది.

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

స్త్రీల ప్రాతినిధ్యం: ప్రస్తుత పరిస్థితి – ఎ. సునీత

రాచరిక వ్యవస్థ నుండి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వైపు జరిగిన ప్రయాణం దాదాపు ఐదు శతాబ్దాలు పట్టింది. భారత దేశంతో సహా, ప్రాచీన కాలంలో వివిధ రకాల సామూహిక పాలనా వ్యవస్థలు ప్రాచీనకాలం నుండి ప్రపంచంలో వివిధ ప్రాంతాలలో ఏర్పడినప్పటికీ, అవి ఎక్కువకాలం నిలబడలేదు, నిలబడినా అవి ప్రాచీన గ్రీసు, భారత ఉపఖండంలోని మగధ సామ్రాజ్యంలో లాగా … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

అమెరికన్ బాంబులు ముస్లిం స్త్రీలని విముక్తి చేస్తాయా? – ఎ. సునీత

పెట్రోల్, అధికారం, ఖనిజాలు, తెల్ల జాత్యహంకార అవసరాల కోసం అనేక ఖండాల్లో అమెరికా ఏభై ఏళ్లుగా నిరంతరం చేస్తున్న యుద్ధాలు, షడ యంత్రాలకి ఆయా దేశాల్లో కమ్యూనిస్టులు ఉన్నారనో, ప్రజాస్వామ్యం లేదనో, నిరసనని అణగదొక్కారనో వంటి మేధోపరమైన సమర్ధన కూడగట్టుకుంటుంది. వీటన్నింటిలో ఆ దేశంలో జెండర్ అసమానతలు, అణచివేతలు తీవ్రంగా వున్నాయని జరిగే ప్రచార ఉద్యమం … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

గ్లోబల్ అధికార విశ్వరూపంలో ‘ది ట్రాఫిక్ ఇన్ విమెన’ పాత్ర – ఎ. సునీత

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతి స్త్రీవాద ఉద్యమం మధ్యన 1975లో కొంతమంది మహిళా మానవ శాస్త్రజ్ఞులు (ఆంత్రోపాలజిస్టులు) ప్రచురించిన ‘మహిళా మానవ శాస్త్రం వైపు’ (టువార్డ్ యాన్ ఆంత్రోపాలోజి అఫ్ విమేన్) అనే పుస్తకంలో (ఇంటర్నెట్ ఆర్కైవ్‌లో దొరుకుతుంది) గెయిల్ రూబిన్ ‘ది ట్రాఫిక్ ఇన్ విమేన్: టువార్డ్ ఎ పొలిటికల్ ఎకానమీ అఫ్ సెక్స’ … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

తెలుగు మగతనం: ఒక పరిశీలన – ఎ. సునీత

గత రెండు నెలలుగా తెలుగు టెలివిజన్, సోషల్ మీడియా, సినిమా పెద్దలు, తెలుగు మహిళలు ఎలా ఉండాలని జరుపుతున్న చర్చలో తెలుగు మగవాళ్ళు చాలా ఉత్సహంగా ఆడవాళ్లు స్వేచ్చని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో, ఎలా వాళ్ళని నియంత్రణ చెయ్యాలో, ఏ బట్టలేసుకుంటే గౌరవించాలో, లేకుంటే ఎలా తన్ని తరిమేయ్యలో కామెంట్లు చేస్తున్నారు. మొదట్లో వీళ్ళందరూ బోట్స్ … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | 1 Comment

అసలు సిసలయిన భారతీయ విషమయ (టాక్సిక్‌) మగతనం – ఎ. సునీత

మగవాళ్ళంటే దూకుడుగా, హింసాత్మకంగా ఇతరులపై ఆధిపత్యాన్ని చెలాయిస్తూ, కోపం, ఉద్రేకం, పోటీతత్త్వం తప్ప ఇతర భావోద్వేగాల్ని పైకి కనపర్చకుండా ఉండాలనే అత్యంత మూసపోసిన ధోరణిని విషమయ మగతనంగా స్త్రీవాద చర్చల్లో వర్ణిస్తున్నారు. ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలలో వివిధ దేశాల్లో మగ వాళ్ళ హక్కుల ఉద్యమాల నుండి పుట్టిన ఈ ధోరణిలో ఆడవాళ్ళ, అణచివేతకు గురయ్యే … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

మగస్వామ్యంలో కొత్త ఆకర్షణీయ ధోరణులు: ట్రాడ్‌ వైవ్స్‌ – ఎ. సునీత

కొన్నాళ్ల క్రితం ఒక స్త్రీవాద మిత్రురాలు ట్రాడ్‌ వైవ్స్‌ గురించి ఫేస్బుక్‌లో ఆందోళన చెందే పరిణామమని పోస్టు రాస్తే వీళ్ళెవరూ అని ఈ తరం స్త్రీవాది మా అమ్మాయిని అడిగాను. ‘ఇదంతా ఇంస్టాగ్రామ్‌లో ఒక లేటెస్ట్‌ ట్రెండ్‌ అమ్మా, అంతకంటే ఏమీ లేదు’, అని తేల్చేసింది. గూగుల్‌ సహాయంతో దొరికిందంతా చదివాను. ట్రాడ్‌ వైవ్స్‌ అన్నది … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ట్రాన్స్‌ జెండర్‌ ఏ స్త్రీవాదం – ఎ. సునీత

మనం ఆడవాళ్లుగా పుట్టం, సమాజం మనని ఆడవాళ్లుగా తయారు చేస్తుంది అన్న ఫ్రెంచ్‌ స్త్రీవాది సిమోన్‌ డి బువర్‌ సిద్ధాంతీకరణ అందరికీ సుపరిచితమే. స్త్రీ, పురుష జననాంగాలతో (సెక్స్‌) పుట్టిన పిల్లల్ని, స్త్రీలు పురుషులు అనే రెండు రకాల అసమాన మనుషులుగా (జెండర్‌) తయారు చేసేది సమాజమే అంటే, సెక్స్‌ వేరు, జెండర్‌ వేరు. దీన్ని … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను, వ్యాసాలు | Leave a comment

క్వియర్‌ (లెస్బియన్‌, గే, బై సెక్సువల్‌, ట్రాన్స్‌ జెండర్‌) స్త్రీవాదం-ఎ. సునీత

మూడేళ్ళ క్రితం నేను రెండు దశాబ్దాల పాటు పని చేసిన స్త్రీవాద పరిశోధక సంస్థలో కొంత మందిమి క్వియర్‌ సమూహాలలో వ్యక్తులకి (సమలైంగికులు, ట్రాన్సజెండర్‌ వ్యక్తులు, ఇతర క్వియర్‌ వ్యక్తులు) వివిధ రకాల మద్దతు ఇవ్వగలిగే ఒక నిర్మాణానికి రూపునిచ్చే ప్రయత్నం చేసాం. ఒక ట్రాన్స్‌జెండర్‌ మహిళ, ఒక సమలైంగిక వ్యక్తి, నేను మా టీమ్‌ … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

ప్రగతి శీలత: మగ స్వామ్యం – ఎ. సునీత

రెండు నెలల క్రితం అందరికీ తెలిసిన ఒక ముస్లిం జర్నలిస్టు, తనతో సంబంధం వున్న సమయంలో తనపై పలుసార్లు హింసాత్మకంగా లైంగిక దాడి జరిపారని, తన కిష్టమైన వస్తువులు పగల గొట్టారని, తమ మధ్య సంబంధాన్ని బయటకి చెప్పకుండా ఆపాడని, తన కిష్టం లేని గొడ్డు మాంసం తినిపించాడని ఆయనతో కలిసి జీవించిన మహిళ ఇంస్టాగ్రామ్‌లో … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

స్త్రీవాదం, ఫాషన్‌ : సంక్లిష్ట సంబంధం – ఎ. సునీత

హైదరాబాదులో జరుగుతున్న మిస్‌ వరల్డ్‌ పోటీలు స్త్రీవాద కార్యకర్తల్లో భిన్నమైన భావోగ్వేగాలను కలుగ చేశాయి. ముప్ఫయి ఏళ్ల క్రితమే ఈ పోటీలు స్త్రీలని వస్తువులుగా మార్చి మార్కెట్‌లో కొత్త ఉత్పత్తులని అమ్ముకోవటానికి వాడుకుంటాయంటూ వ్యతిరేకించిన చరిత్ర ఒక పక్క, అది మూడు దశాబ్దాల్లో తారా స్థాయికి చేరుకున్నప్పటికీ ఇప్పటి తరం వాళ్లకి అది ఏ మాత్రం … Continue reading →

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment

జెండర్‌, కుటుంబం, మగతనం : అతుల్‌ సుభాష్‌ ఆత్మహత్య – ఎ. సునీత

చేతి రాత పొందిగ్గా, కుదురుగా, అందరికీ అర్థమయ్యేటట్లు ఉండాలంటే ఇంకు పెన్ను వాడాలని స్కూల్లో టీచర్లు చెప్తారు. దానితో జాగ్రత్తగా, ఓపిగ్గా రాయాలి. పెన్నుని మరీ అదిమిపెట్టి రాస్తే పేపరు చిరుగుతుంది. పెన్నుతో పాటు ఇంకు సీసా పక్కన పెట్టుకోవటం తప్పనిసరి.

Share
Posted in ఇంకు పెన్ను | Leave a comment