పోటెత్తిన కెరటం – కొండవీటి సత్యవతి

గీతా హరిహరన్ ఇంగ్లీషులో రాసిన “I ష్ట్రaఙవ bవcశీఎవ tష్ట్రవ Tఱdవ” నవలని “పోటెత్తిన కెరటాన్ని” పేరుతో ఓల్గా తెలుగులోకి అనువాదం చేసారు. మలుపు బాల్‌రెడ్డి గారు ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఈ నవలలో ‘టైడ’ ఒక శక్తివంతమైన ప్రతీక.

భారత దేశంలో కుల వ్యవస్థ వేల సంవత్సరాలుగా మనుష్యులను ఒకచోట నిలిపివేసిన ‘నిటకడైన చెరువు లాంటిది’. కానీ అణిచివేతకు గురయ్యేవారు తమ గొంతును వినిపించినప్పుడు అది కదులుతున్నదిగా, చివరకు ఒక పెద్ద అలగా మారింది. రచయిత్రి స్వయంగా ఈ నవలలోని నీటి ప్రతీకను స్తబ్దత నుంచి కదలికకు, ప్రతిఘటన నుంచి మార్పుకు సంబంధించినదిగా వివరిస్తారు.
యుగయుగాలుగా దళిత జీవితాల్లోని కుల వివక్ష, అసమానతల గురించి చాలా ప్రభావవంతంగా గీత ఈ నవలలో చిత్రించారు. ఈ నవల మÖడు కాలాల కథా ప్రవాహాలను కలుపుతుంది. మూడుపాయల భిన్నమైన జీవితాల గురించి ఆమె వర్ణించారు. పశువుల చర్మాలను వొలిచి బతికే తండ్రి, అతని కొడుకు చిక్క, అతని జీవిత పోరాటం, ఆనంద గ్రామానికి పెద్దన్న ద్వారా చేరటం అతని భార్య మహాదేవి, కొడుకు కన్నప్పల జీవితాల చిత్రణ మొదటి పాయ.
రెండో పాయలో దళిత విద్యార్థులు ఆషా, రవి, సత్యాలు మెడికల్ కాలేజీలో చదవాలనే కోరికలు తుంచేయబడి, ఒక సత్య మాత్రమే వైద్య విద్యలో చేరినా ఆధిపత్య కులాల అణిచివేత, అవమానాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఆషా, రవి హతాసులవుతారు. పోటెత్తే కెరటాలౌతారు.
మూడో పాయలో ప్రొఫెసర్ కృష్ణ జీవితం, అతని పరిశోధనలు. ప్రాచీన యోగి కన్న దేవుడు గురించిన పరిశోధన ద్వారా వెల్లడించిన సత్యాలు హిందుత్వ వాదుల ఆగ్రహానికి గురై, వారి తుపాకీ గుళ్ళకు బలైపోతాడు.
ఈ మూడు కథలు విడివిడిగా అనిపించినా వాటిని కలిపే మూల సూత్రం మాత్రం ధిక్కారం. యుగయుగాల కుల వివక్ష, అంటరానితనం, అసమానతల మీద పోటెత్తిన కెరటం.
“ఆ నేల ఎక్కడుంది?
నీరు స్వేచ్ఛగా పారే చోటు ఎక్కడుంది?
నాకు చెప్పండి నాకు చెప్పండి
నా నేల ఎక్కడుంది?
నీళ్లు స్వేచ్ఛగా పారే ఆ చోటు ఎక్కడుంది”
చిక్కడి తండ్రి డప్పు కొట్టుకుంటూ పాడే ఈ పాట నవలకి ఆయువుపట్టు లాంటిది.
నవల చదువుతున్నంత సేపు సమకాలీన అంశాలు ఎన్నో కళ్ళ ముందు మెదులుతాయి. ధిక్కార స్వరాలు రోహిత్ వేముల, కల్బుర్గి, పన్సాలే, గౌరీ లంకేష్ గుర్తుకు వస్తారు. హిందుత్వవాదుల తుపాకీ గుళ్ళకు బలైపోయిన ఎందరో గుర్తొచ్చి మనసులో తీవ్ర దుఃఖం కలుగుతుంది. అత్యంత విలువైన వ్యక్తుల బలిదానాలు కళ్ళ ముందుకు వస్తాయి.
చివరగా ఈ నవలలో గీత ప్రస్తావించిన కులాతీత, మతాతీత, వర్గాతీత, ప్రాంతాతీత ఆనంద గ్రామం. ఆనంద గ్రామంలో ఎలాంటి వివక్ష కులాధిపత్యం, కులాహంకారం లేని సమ సమాజ ఆకాంక్ష. ఆనంద గ్రామం గురించి చదవడం చాలా ఆనందాన్నిస్తుంది. చదవండి. తప్పకుండా చదవాల్సిన నవల. ఓల్గా అనువాదం సరళంగా ఉంది. పోటెత్తిన కెరటాన్ని పేరు బాగుంది. దాని ట్యాగ్ లైన్ నియంతృత్వాన్ని వెటకరించిన నవల.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.