Category Archives: ప్రతిబింబం

క్వియర్ సముదాయంలో హిజ్రా సంస్కృతి: ఒక పురాతన వ్యవస్థ – అర్చన రావు మానుకొండ

మనం చిన్నప్పటి నుంచి మన కాలనీల్లో, మన ఇంటి పరిసరాల్లో, బయట బహిరంగ ప్రదేశాల్లో, రైళ్లలో, బస్ స్టాండ్లలో హిజ్రాలను చూస్తూనే ఉన్నాము. అసలు ఈ హిజ్రాలు ఎక్కడి నుంచి వస్తారు? వీరు ఎవరు? “హిజ్రాలు” అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే, వారి జీవితం, చరిత్ర, సంస్కృతి కలిపి చూడాలి.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

సవాలుగా నిలిచిన సముదాయ గుర్తింపు – ట్రాన్స్ బిల్ 2026 – అర్చనరావు మానుకొండ

భారతదేశంలో క్వియర్ మరియు ట్రాన్స్‌జెండర్ హక్కుల చరిత్ర ఒక దీర్ఘకాలిక సామాజిక, న్యాయ, రాజకీయ పోరాట ఫలితం. ఆధునిక చారిత్రక కాలంలో, ముఖ్యంగా బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత, ఈ సముదాయాల జీవితం మరియు హక్కులపై తీవ్ర ప్రభావం చూపిన చట్టాలలో ముఖ్యమైనది భారతీయ శిక్షాస్మృతిలో ప్రవేశపెట్టిన సెక్షన్ 377.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

సమాజ అంచుల నుండి గౌరవప్రదమైన జీవనానికి: ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్ వ్యక్తుల జీవన యాత్ర అందరిలా కాదు. అది కుటుంబ అంగీకారం నుండి నిరాకరణ వరకు, ఆశ్రయం నుండి అసురక్షితత్వం వరకు, ఆత్మగౌరవం నుండి అవమానం వరకు విస్తరించే సంక్లిష్ట అనుభవాల సమాహారం. వారు ఉన్న సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు వారి జీవనోపాధిని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తు అవకాశాలను కూడా నిర్ణయిస్తాయి.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

సామాజిక మాధ్యమాలు: ట్రాన్స్‌జెండర్ సముదాయానికి ప్రజాస్వామ్య వేదిక – అర్చనరావు మానుకొండ

భారతదేశంలో మారుతున్న సామాజిక-రాజకీయ పరిస్థితుల్లో, ట్రాన్స్‌జెండర్ సముదాయాలు చరిత్రపరంగా ప్రధాన మీడియా ద్వారా తప్పుగా చూపబడుతూ, అవమానించబడుతూ, నేరపూరితంగా, హేళనాత్మక హాస్యంతో చిత్రీకరించబడ్డాయి. ఈ చిత్రీకరణలు తరచుగా ట్రాన్స్ వ్యక్తులను సాధారణ జీవితాలు గల విభిన్న వ్యక్తులుగా కాకుండా, మోసపూరితులుగా, మానసికంగా అస్థిరులుగా లేదా సమాజానికి ముప్పుగా చూపిస్తుంటాయి.

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

ట్రాన్స్‌ సాధికారతకి తొలి మెట్టు-కుటుంబం – అర్చనరావు మానుకొండ

ట్రాన్స్‌ వ్యక్తులు అట్టడుగున ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. చట్టం, సమాజంలో వ్యతిరేకత, వివక్ష, పితృస్వామ్యం లేదా మగస్వామ్యం మొదలైనవి ఇందులో ముఖ్యమైనవి. అయితే, ట్రాన్స్‌ వ్యక్తులు తమ లైంగిక పరిస్థితిని గుర్తించినప్పటి నుండి భయం, సిగ్గు, వివక్ష, చిన్నచూపు వంటి భావాలు ఉచితంగా ఒక బంపర్‌ ఆఫర్‌లా వచ్చేస్తాయి. ఇవన్నీ మొదలయ్యేది కుటుంబంలోనే!

Share
Posted in ప్రతిబింబం | Leave a comment

ట్రాన్స్‌జెండర్‌ సముదాయం: వివక్షను దాటి, గౌరవం వైపు – అర్చన రావు మానుకొండ

ఇటీవల కాలంలో ట్రాన్స్‌జెండర్‌ అనే పదం టీవీలో, సోషల్‌ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. సాధారణంగా వాడుకలో వీరిని హిజ్రా, కొజ్జా, చెక్కా, మాడ, తేడా, పాయింట్‌ ఫైవ్‌, వన్‌ బై టూ, నపుంసకులు వంటి పదాలతో సంబోధిస్తూ ఉంటాం. ఇది, సమాజంలో అంగీకారం లేకపోవడం, మీడియా-సినిమాల్లో వీరిని ఎక్కువగా కామెడీ లేదా విలన్‌ పాత్రలుగా … Continue reading

Share
Posted in ప్రతిబింబం | Leave a comment