-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
November 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 Meta
Tags
Category Archives: సంపాదకీయం
మానవ హక్కుల కోసం ప్రాణాలు అర్పించిన సాయిబాబా – కొండవీటి సత్యవతి
సాయిబాబా గారి గురించి నాకెప్పుడు తెలిసింది. చాలా సంవత్సరాల క్రితం ఫేస్ బుక్‌లో ఎవరో రాసిన ఆర్టికల్ చదివినప్పుడు ఆయన గురించి వివరంగా తెలిసింది. ఆయన 90 శాతం శారీరక వైకల్యంతో బాధపడుతున్నారని, అతి కఠినమైన నాగపూర్‌లోని అండాసెల్ జైలులో
Posted in సంపాదకీయం
Leave a comment
జిలుగు వెలుగుల వెండితెర వెనుక మహిళా ఆర్టిస్టుల బీభత్స జీవితాలు – కొండవీటి సత్యవతి
వివిధ పనిస్థలాల్లో పనిచేసే మహిళలు ఎదుర్కొనే లైంగిక వేధింపులు రకరకాలుగా ఉంటాయి. ఒక పని స్థలం, ఒక యజమాని ఉండే ఆఫీసుల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులకి, ఒక పనిస్థలం లేకుండా పనిచేసే అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ప్రతిరోజూ ఎదుర్కొనే వేధింపులకి కొంత తేడా ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణంలో కూలీలుగా పనిచేసే స్త్రీలు మేస్త్రీల … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
చిన్నోడికి ప్రేమతో.. – కొండవీటి సత్యవతి
ఈ మధ్య కాలంలో పిల్లల మీద విపరీతంగా లైంగిక దాడులు పెరిగిపోయాయి. ఒక పేరున్న హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదివే ముగ్గురు కుర్రాళ్ళు రెండో తరగతి చదువుతున్న పాప పట్ల అసభ్యంగా, అభ్యంతరకరంగా ప్రవర్తించారు. వారం వారం షీ టీమ్స్ కౌన్సిలింగ్‌కి పోలీసులు తీసుకొచ్చే మగపిల్లలు రోడ్ల మీద ప్రవర్తిస్తున్న తీరు గమనిస్తే తీవ్రమైన కోపంతో … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
యాంత్రికతని మనమే సృష్టించుకుంటాం – కొండవీటి సత్యవతి
పర్ఫెక్ట్ డేస్ సినిమా పేరు. ఇది జపనీస్ చిత్రం. విన్ వెండర్స్ దర్శకుడు. హిరయామా అనే ఒక టాయ్లెట్ క్లీనర్ కధ. కోజి యకుషో అనే నటుడు టాయ్లెట్లు శుభ్రం చేసే పాత్రలో అద్బుతంగా నటించాడు. టాయ్లెట్ శుభ్రం చేసే మనిషిని కథానాయకుడుగా పెట్టి విన్ వెండర్స్ ఓ కళాత్మక చిత్రం తీసాడు. కళాత్మక చిత్రం … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
మగవాళ్ల ప్రాణాలు హరిస్తున్న మద్యపానం – కొండవీటి సత్యవతి
ఇటీవల విజయవాడ, రాజమండ్రిలో కొత్తగా పనిచేయడానికి ఎంపిక చేసుకున్న బస్తీలలో ఒక దిగ్బ్రాంతికరమైన అంశం కొట్టొచ్చినట్టు కనబడిరది. కొత్తగా పనిచేయడానికి ఏదైనా బస్తీలోకి వెళ్ళేటప్పుడు బేస్ లైన్ చేయడం అవసరం. దానిలో భాగంగా ఆయా బస్తీల సమాచారం సేకరిస్తాం. ఆ బస్తీ స్థితిగతులు, ఎలాంటి సమస్యలున్నాయి, స్త్రీ పురుషుల నిష్పత్తి, బాల బాలికల నిష్పత్తి లాంటి … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
వైవిధ్యాన్ని ప్రేమించేవారు ఈపుస్తకం చదవాలి – కొండవీటి సత్యవతి
‘సన్ ఆఫ్ జోజప్ప’ ఈ పుస్తకం చదవడానికి నాకు అంచెలంచలుగా నెల రోజులు పట్టింది. సాధారణంగా పుస్తకం చదవడం మొదలు పెడితే తొందరగానే పూర్తి చేయగలుగుతాను. కానీ ఈ పుస్తకం చదవకుండా అక్కడక్కడ నన్ను ఆపేసింది. చెప్పలేని ఒక నెగెటివ్ ఫీలింగ్, అభిప్రాయం నన్ను ముందుకెళ్లకుండా చాలాసార్లు ఆపేసింది.
Posted in సంపాదకీయం
Leave a comment
జీవితాన్ని వెలిగించేవి పుస్తకాలు – కొండవీటి సత్యవతి
నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పుస్తకాలు, పేపర్లు కనబడని ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం. ఐదో తరగతి వరకూ పలక మీదే చదువు సాగింది. టెక్ట్స్ బుక్కులు, నోట్ బుక్కులు అంటే ఏంటో కూడా అప్పటికి తెలియదు. ఆరో తరగతి చదవడం కోసం మా ఊరి ఎలిమెంటరీ స్కూల్ వదిలి కొంచెం దూరంలోని హైస్కూల్‌కి … Continue reading
Posted in సంపాదకీయం
Leave a comment
ఆకాశం మెల్లగా నల్లబడిపోతుంది – కొండవీటి సత్యవతి
(The sky gets dark slowly… Zhou Daxin)ఈ పుస్తకం చదవమని ఎవరో సూచించారు. చదువుతుంటే చాలాసార్లు అబ్బూరి ఛాయాదేవి గారు, ఆవిడ నాకు రాసిన ఉత్తరం గుర్తు వచ్చాయి. జీవితాన్ని, మరణాన్ని ఆవిడ అద్భుతంగా ప్లాన్ చేసుకున్న తీరు కళ్ళముందు ఆవిష్కృతమైంది.
Posted in సంపాదకీయం
Leave a comment
తర్పణాలు… త్రిశంకు స్వర్గాలు – కొండవీటి సత్యవతి
మా సీతారాంపురంలో మా తాతకి చాలా పొలాలు ఉండేవి. మా తాత, చిన్న తాత ఇద్దరే పొలాలన్నింటిని పంచుకున్నారు. మా తాత ఇన్ని పొలాలను ఎలా సంపాదించాడనేది నాకు చాలా కుతూహలంగా ఉండేది. మా ఊర్లో మా కుటుంబమే ఎక్కువ పొలాలను కలిగి ఉండేది. ఆ పొలంలో చేయడానికి దళితవాడలోని దళితులు పనిచేస్తూ ఉండేవారు.
Posted in సంపాదకీయం
Leave a comment
ఆనంద తాండవమాడిరచిన జక్కీకు నవల – కొండవీటి సత్యవతి
తప్పెట్లు, తాళాలు వాయిస్తూ అపర్ణ తోట, దాసరి శిరీష గారి పేరుమీద ప్రింట్ చేసిన జక్కీకు నవల చదవడం ఇప్పుడే పూర్తి చేశాను. నవల చదువుతున్నంతసేపు మనసంతా గొప్ప ఆనందం తాండవమాడిరది. ఎండపల్లి భారతి చాలాకాలంగా తెలుసు.
Posted in సంపాదకీయం
Leave a comment
బాలికలు భారతదేశ భవిష్యత్తు – కొండవీటి సత్యవతి
‘‘పాపం పుణ్యం ప్రపంచమార్గం మెరుపు మెరిస్తే వాన కురిస్తే కష్టం సౌఖ్యం, శ్లేషార్ధాలూ ఆకసమున హరివిల్లు విరిస్తే
Posted in సంపాదకీయం
Leave a comment
వీథి కొళాయిల దగ్గర మగవాళ్ళెందుకుండరు? – కొండవీటి సత్యవతి
వీథి కొళాయిల దగ్గర మహిళలు ఎప్పుడూ పోట్లాడుకుంటూ ఉంటారని, గట్టిగా అరుచుకుంటారని చాలా కామెంట్లు వింటూ ఉంటాం. ఎన్నో జోకులు, కార్టూన్లు వీటి చుట్టూ కనబడుతూంటాయి. ఎన్నో వెకిలి కార్టూన్లు చూశాను.
Posted in సంపాదకీయం
Leave a comment
అనుదినం, అనుక్షణం సెక్సిజమ్ – కొండవీటి సత్యవతి
దాదాపు ఇరవై ఏళ్ళ క్రితం జయప్రభ ‘చూపులు’ అనే కవితలో ‘‘రెండు కళ్ళనించి చూపులు సూదుల్లా వచ్చి మాంసపు ముద్దలపై విచ్చలవిడిగా తిరుగుతుంటాయి.’’ అని రాశారు. ప్రతి మహిళ ఈ చూపుల దాడిని అన్ని చోట్ల, అన్నివేళలా అనుభవిస్తుంది.
Posted in సంపాదకీయం
Leave a comment
మహిళల కోసం ఏర్పాటయ్యే సపోర్ట్ సెంటర్లు మానవీయంగా ఉండాలి – కొండవీటి సత్యవతి
చంకలో బిడ్డ, చెయ్యి పట్టుకున్న మరో బిడ్డతో, ఒంటిమీద దెబ్బలతో మహిళా పోలీస్ స్టేషన్‌కి వచ్చిందామె. చాలాసేపటి నుండి తనని పిలిచి మాట్లాడతారని, తనను ఇంట్లోంచి గెంటేసిన అత్తింటి వాళ్ళని, భర్తని పిలిపిస్తారని, తన సమస్యను పరిష్కరిస్తారని గంపెడాశతో ఎదురు చూస్తోంది. పొద్దుటి నుంచి పిల్లలు ఏమీ తినలేదు. ఎస్సై గారు రాలేదు
Posted in సంపాదకీయం
Leave a comment
ఇప్పటి వరకు మాట్లాడనివి మన పుట్టిళ్ళ కథలు – కొండవీటి సత్యవతి
న్యూఢల్లీిలో పనిచేస్తున్న ‘శక్తిశాలిని’ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వారు చేపట్టి పూర్తి చేసిన ఒక అధ్యయన రిపోర్ట్‌ను పంపించారు. ‘అన్కహీ’ ఇప్పటివరకు మాట్లాడనిది పేరుతో ఈ అధ్యయనం జరిగింది.
Posted in సంపాదకీయం
Leave a comment