లింగాధారిత హింసకు వ్యతిరేకంగా 16 రోజుల ప్రచారోద్యమం – కొండవీటి సత్యవతి

ప్రతి సంవత్సరం నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీల పరంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమం స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగెన్‌స్ట్‌ విమెన్స్‌ డే’ అంటూ మొదలై అంతర్జాతీయ మానవహక్కుల దినం డిసెంబరు 10తో ఈ కార్యక్రమాలు ముగుస్తుంది.

ఒక్కోదేశంలో ఒక్కో కార్యక్రమం. మన దేశంలో కూడా వివిధ రాష్ట్రాల్లో భిన్నమైన ప్రోగ్రామ్‌లు చేస్తున్నారు. దీనిని 16 రోజుల ఏక్టివిజమ్‌గా కూడా పిలుస్తున్నారు. రోజుకో రకమైన హింస గురించి మాట్లాడినా గానీ ఈ రోజు స్త్రీల మీద అమలవుతున్న హింసా రూపాల గురించి మాట్లాడాలంటే ఈ పదహారు రోజులు ఏం సరిపోతాయి? ఎక్కడ మొదలు పెట్టి ఎక్కడ ఆపాలి? ఏ హింస గురించి ఎక్కువ మాట్లాడి ఏ హింస గురించి తక్కువ మాట్లాడాలి?
అమ్మ కడుపులో భద్రంగా పడుకున్న పసికందుని చంపే క్రమం గురించి మాట్లాడాలా? పుట్టగానే, ఆడశిశువని తెలియగానే నోట్లో వడ్లగింజ వేసో, ముక్కు చెవులు మూసేసో చంపేసే అమానవీయత గురించి మాట్లాడాలా? సొంత పిల్లల్ని వయసు, వావి, వరస ఏమీ లేకుండా లైంగికంగా దాడి చేస్తున్న తండ్రుల గురించి మాట్లాడాలా? చదువు చెప్పాల్సిన పంతుళ్ళు ఆడపిల్లల్ని లైంగికంగా కాల్చుకుతింటున్న సంఘటనల గురించి మాట్లాడాలా? పెళ్ళయితే కుటుంబ హింస, పెళ్ళి చేసుకోకపోతే ఒంటరి మహిళగా ఎదుర్కొనే హింస, రోడ్డు మీద హింస, పనిచేసేచోట హింస, యుద్ధహింస, మతహింస ఏ హింస గురించి మాట్లాడాలి? ఎంత కాలం ఇలా మాట్లాడాలి?
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది స్త్రీలు గొంతు చించుకుని ఎలుగెత్తి ‘‘హింస లేని సమాజం స్త్రీల హక్కు. అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం’’ అంటూ నినదిస్తున్నారు. ఎవరు వింటున్నారీ మాట? ఎవరి చెవుల ద్వారా ఎవరి గుండెల్లోకి చేరుతోంది ఈ ఘోష? అసలు ఎవరైనా వింటున్నారా? ఆ వింటున్న వాళ్ళకి తల్లి వుండదా? తోడపుట్టిన వాళ్ళుండరా? సహచరో, సహవాసో వుండరా? కూతుళ్ళుండరా? వుంటారు. అందరూ వుంటారు. తాము నానారకాల హింసలకి పాల్పడుతూ, తమ వాళ్ళని భద్రంగా వుంచుతున్నామనే భ్రమలో ఇళ్ళల్లో బంధించాలనుకుంటున్నారు. ఓ పక్క స్త్రీల బతుకుల్ని హింసామయం చేస్తూ… మరో పక్క మేమే స్త్రీల రక్షకులంటూ ఫోజు కొట్టడం ఎలాంటి నీతి అవుతుంది? పురుషులు పాటిస్తున్న ఈ ద్వంద్వ నీతి కోట్లాది స్త్రీల జీవితాలను ఎలా ఛిద్రం చేస్తున్నాయో గణాంకాలు చెబుతూనే వున్నాయి.
‘అన్ని హింసలకు వ్యతిరేకంగా పోరాడదాం’’ అనే నినాదం ఎవరిని ఉద్దేశించింది? పురుషుల్నా? వ్యవస్థల్నా? ప్రభుత్వాలనా? వివిధ హింసలతో వేలాది స్త్రీల మరణాలకు కారణమౌతున్న శత్రువు అసలు ఎవరు? ఎవరి మీద మనం పోరాడుతున్నాం. స్త్రీల రక్షణ కోసం బోలెడు చట్టాలు తెచ్చాం మా పని అయిపోయింది అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వాలు స్త్రీల పక్షపాతంతో వ్యవహరిస్తూ, వాళ్ళ కోసం కొత్త కొత్త చట్టాలు తెస్తూ, మమ్మల్ని రాచిరంపాన పెడుతోంది అంటున్నాయి పురుషవాద సంఘాలు. అంతేకాదు పురుషుల్ని వేధించే స్థితికి మహిళలు చేరిపోయారని, చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని కూడా ఆరోపించి, దూషిస్తున్నారు.
ఇదే నిజమైతే… హింస ఎందుకు పెరుగుతోంది? హింసా రూపాలెందుకు మారుతున్నాయి? ఆలోచించి, విశ్లేషించే ఆసక్తిగాని అసలు కారణాలను అన్వేషించే సహనం కానీ లేని కొంతమంది పురుషులు స్త్రీలు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. అంతే… అవతలి వైపు చూసే అవసరం మాకు లేదు అంటూ మొండికేస్తున్నారు.
నిజమే! ప్రభుత్వం మహిళల ఉద్ధరణ కోసం కొత్త చట్టాలను తేస్తూనే వుంది. అంతర్జాతీయ వొప్పందాల ప్రకారం స్త్రీల మీద హింసను అంతం చేసే చట్టాలను తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద వుంది. ఇంకా ఎన్నో క్యూలో వున్నాయి కూడా. ఇవన్నీ మహిళలకి అండగా, రక్షణగా ఎందుకుండటం లేదు? దీనికి కారణం ఒక్కటే. ప్రభుత్వం తెస్తున్న కొత్త చట్టాలన్నీ ఆచరణ యోగ్యం కాని విధంగానే మిగిలిపోతున్నాయి. కొత్త చట్టాల అమలుకు కావలసిన బడ్జెట్‌లు, వనరులు మంజూరు కావు. వాటిని పఠిష్టంగా అమలు పరిచే వ్యవస్థలు రూపొందవు. చట్టం అందమైన భాషలో, అద్భుతమైన పదజాలంతో రూపొంది కాగితం పులిలా గాండ్రిస్తుంటుంది. ఆ గాండ్రిరపులకే భయపడి పురుష ప్రపంచం ప్రభుత్వం స్త్రీల పక్షం అంటూ నింద వేస్తుంది. మరింత హింసని ప్రేరేపిస్తుంది. పఠిష్టమైన ఆచరణకు నోచుకొని చట్టాలు మరో వంద వచ్చినా స్త్రీలకు వొరిగేందేమీ లేదు. జిల్లా ప్రధాన కేంద్రంలో కూర్చున్న రక్షణాధికారి ఆ జిల్లాలోని స్త్రీలందరిని గృహహింస నుంచి కాపాడుతుందనుకోవడం ఎంత భ్రమో! చట్టాలొక్కటే స్త్రీలను హింసల్నుండి రక్షిస్తాయనుకోవడం అంతే భ్రమ.
భారతదేశంలో స్త్రీల ఉద్యమం వల్ల అనేక చట్టాలు సహాయ సంస్థలు అమలులోకి వచ్చాయి. మహిళలు పిల్లల సహాయార్థం అనేక వ్యవస్థలు నడుస్తున్నాయి. అయినప్పటికీ హింస తగ్గుముఖం పట్టకపోవడానికి కారణం అమలులో ఉన్న చట్టాల గురించిన ప్రచారం పెద్ద ఎత్తున జరగకపోవడం ఒక కారణమైతే చట్టాల అమలు తీరు సకాలంలో న్యాయం దొరికి శిక్షలు పడకపోవడం మరో కారణం. గహ హింసకు సంబంధించి వందలాది కేసులు (డిఐఆర్‌) కోర్టుల్లో పేరుకుపోయి ఎలాంటి న్యాయం కూడా బాధిత మహిళలకు అందడం లేదు.
నిజానికి ఈ చట్టం ప్రకారం 60 రోజుల్లో ఆమెకు రక్షణ ఆర్డర్‌ గానీ మెయింటెనెన్స్‌ కానీ నివాస హక్కు ఆర్డర్‌ కానీ రావాల్సి ఉంది. కానీ ఏళ్లు గడుస్తున్నా బాధిత మహిళలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు.
తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని సఖీ సెంటర్లలోనూ వందలాది కేసులు కోర్టుల్లో పేరుకుపోయి ఉన్నాయి. ఎందుకని ఆర్డర్స్‌ రావడం లేదు? చట్టం ప్రకారం రావాల్సిన పరిహారాలు ఎందుకు రావటం లేదు అనే దానిపైన ఎలాంటి రివ్యూలు ఉండవు. హైకోర్టు లాంటి ఉన్నత న్యాయస్థానాలు పట్టించుకోవడం లేదు.
అన్నిటికన్నా ముఖ్యం హింసను ఎదుర్కొంటున్న స్త్రీలకు సంబంధించి అనేక చట్టాలు హెల్ప్‌ లైన్లు సహాయ సంస్థలు ఉన్నాయనే విషయం గ్రామీణ స్థాయి మహిళ నుంచి నగర స్థాయి మహిళల వరకు కూడా ఎలాంటి అవగాహన లేదు. నిజానికి ఈరోజు స్త్రీలకు సంబంధించి అనేక వ్యవస్థలు ఏర్పాటయ్యాయి. ఆ వ్యవస్థలు సఖి సెంటర్‌ సిడిఈడబ్ల్యూ పేరుతో పోలీస్‌ స్టేషన్‌లలో పోలీస్‌ శాఖ నడుపుతున్న సెంటర్స్‌, భరోసా సెంటర్లు, ఉమెన్‌ హెల్ప్‌ లైన్‌ లాంటి ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ కూడా స్త్రీలకు ఎందుకని న్యాయం జరగడం లేదు అనే దానిపైన ఎలాంటి రివ్యూ లేకపోవడం ఒక పెద్ద లోపం. ఈ ప్రచారం అనేది జరిగిన నాడు స్త్రీలు తాము ఎదుర్కొంటున్న హింస నుంచి బయటపడడానికి ప్రయత్నాలు చేయగలుగుతారు.
ఇన్ని వ్యవస్థలు తమ సహాయార్ధం నడుస్తున్నాయనే ఎరుక మహిళలకి కలిగిననాడు హింసల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఒకప్పుడు ప్రభుత్వం పల్స్‌ పోలియోని ఎంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డలకి చుక్కలు వేయించాలి అనే అవగాహన, చైతన్యం వచ్చింది.
అంతే కాదు సమాజంలోని అన్ని వ్యవస్థల్లోను శిలాజ రూపంలో తిష్ట వేసి ఉన్న పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా మనం తప్పకుండా గళమెత్తాలి. అమలులో ఉన్న చట్టాలను, సహాయ సంస్థలను ఉపయోగించుకోనీయకుండా అడ్డుపడే పితృస్వామ్య భావజాలపు అన్ని కుట్రలని బద్దలు కొట్టాలి. మహిళలని మౌనంగా అణిగి ఉండమని. హింసని భరించమని చెప్పే సమస్త భావజాలాన్ని వ్యతిరేకిస్తూ పదహారు రోజుల ప్రచారోద్యమాన్ని నిర్వహిద్దాం.
హింసలేని సమాజం స్త్రీల హక్కంటూ నినదిద్దాం. అంతే కాదు పదహారు రోజుల ప్రచారోద్యమమే కాదు మూడువందల అరవై ఐదు రోజుల ఉద్యమాన్ని నిర్మించి లింగాధారిత హింసకు వ్యతిరేకంగా సామూహికంగా గళమెత్తుదాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.