-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
January 2025 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags
Category Archives: కరోనా డైరీస్
కరోనా కల్లోల సమయంలో… – రోజా రమణి
కరోనా నేపథ్యంలో చాలామంది తమ అనుభవాలను పంచుకున్నారు. నేను ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది అనుకున్నా కానీ రాస్తే బాగుంటుందని ఒక మిత్రుడు ఇచ్చిన సలహాతో ఈ సాహసం చేస్తున్నా.
Posted in కరోనా డైరీస్
Leave a comment
కరోనా డైరీస్ – ఫీల్డ్ టీమ్
ఇటీవల ప్రపంచాన్ని, దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి. పేద, గొప్ప, ఇక్కడ, అక్కడ అనే తేడా లేకుండా అంతటా తన ప్రభావాన్ని చూపిస్తోంది. మొదట విమానాలలో ఎక్కి దిగే ఉన్నవాళ్ళకే వస్తుందనేది కాస్తా ఇప్పుడు విశ్వవ్యాప్తమైపోయింది. దాంతోపాటే ఆ వైరస్ వ్యాప్తి గురించి, వైరస్ రాకుండా ఎలా ఉండాలి, వచ్చినా ఎలా బయటపడాలి, అసలు రాకుండా … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
నేను, సజయ… ఒక తెలుగు కరోనా! – ఒమ్మి రమేష్ బాబు
కరోనా సోకితే ఇక కాటికే దారి అన్న దురభిప్రాయం సభ్యసమాజంలో బలంగా వేళ్ళూనుకున్నవేళ… నేను ఆ వైరస్ బారిన పడ్డాను. చెప్పొద్దూ, ఒకింత కలవరపాటు కలిగిన మాట వాస్తవం. కానీ భయపడలేదు. డీలాపడలేదు. నిస్పృహకి గురికాలేదు. కర్తవ్యం గురించి మాత్రమే ఆలోచించాను. తీసుకోవాల్సిన జాగ్రత్తలని పరిపరి గుర్తుచేసుకుని పాటించాను. చివరకు ఆ వైరస్ నుంచి బయటపడ్డాను. … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కరోనా దరి చేరినప్పుడు… శాంతి ప్రబోధ
నిత్యం భయాందోళనలతో కాలం గడిపే వాళ్ళ కోసం నా అనుభవం మీ ముందుకు తెస్తున్నాను. జూన్ పదవ తేదీ మధ్యాహ్నానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. (అంతకు రెండు మూడు రోజుల క్రితమే కరోనా భయంతో రాలిపోతున్న వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం… ప్రజలకు భరోసా కల్గించాల్సిన వ్యవస్థలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని, చేతులెత్తేస్తున్నాయని, … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
మొదట చేయాల్సింది టైంకి డాక్టర్‌ని కలవడమే -చైతన్య పింగళి
హెచ్‌ఐవి పాజిటివ్ అంటే ఎంత భయం, అపోహలు, వివక్ష ఉన్నాయో కరోనా పాజిటివ్ అంటే కూడా ఆ లెవల్లోనే ఉంది. మొత్తానికి నాకు ఇప్పుడు నెగటివ్ వచ్చింది కాబట్టి చెప్తున్న.
Posted in కరోనా డైరీస్
Leave a comment
పాజిటివ్‌గా ఉండండి – నెగటివ్‌గా అయిపోతారిలా!! – స్వర్ణ కిలారి
చైనాలో పుట్టి కంటికి కనిపించని జీవి ఒకటున్నదని, దాని వల్ల వేలాదిమంది ప్రాణాల మీదికి వస్తున్నదని జనవరి, ఫిబ్రవరి నెలల్లో అనుకుంటా పత్రికల్లో చదివాము. కరోనా మన ఇండియాకి వచ్చిందని మార్చి నెల మొదటివారంలో తెలిసింది. తొలుత హైదరాబాద్‌లో ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగికి వచ్చిందని కంగారుతో ఆ బిల్డింగ్ మొత్తం హుటాహుటిన ఖాళీ చేయించేశారు. … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కరోన వైరస్ – దాని పరిణామాలు -టి వి ఎస్ రామానుజరావ
కరోన వైరస్ – ఈ పేరు వింటేనే ప్రస్తుతం ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది. మొదట్లో దీన్ని గురించి అసలు వివరాలకన్నా, అసత్యాలు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చాయి. అవి యువకులలో కొంత నిర్లక్ష్యం, వయసు పైబడిన వారిలో భయాందోళనలు పెంచాయి. ప్రభుత్వం తగిన శ్రద్ధ తీసుకుని, కరోనా గురించి విస్తతంగా ప్రచారం మొదలెట్టాక, ప్రజలకు దాని వల్ల వచ్చే … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కరోనా కల్లోలంలో నా అనుభవాలు – ఆర్. శాంతిప్రియ
కనిపించని ఒక శత్రువుతో మానవులందరం యుద్ధం చేస్తున్నాం అని కొరోనా గురించి అరటున్నారు. కానీ నా మట్టుకు నాకు నాపై నేనే యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. మొఖానికి మాస్క్‌తో ఊపిరి సరిగా అరదక చీటికి మాటికి మాస్క్‌ని తొలగించకుండా ఉండటా నికి, ఎక్కడికైనా వెళితే చేతులతో ఏదీ తాక్కురడా ఉండటానికి, ఎంతటి ఆత్మీయులు ఎదురుపడ్డా తాక్కుండా … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
కోవిడ్ – ఒక కొత్త అధ్యాయం – వి. ప్రతిమ
ప్రపంచవ్యాప్తంగా మనుషులు ఇలా ఎవరికి వాళ్ళు వేసే అరెస్ట్‌లో ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా ఉండాల్సి వస్తుందనీ, కలుగుల్లోని ఎలుకల్లా వీధుల్లోకి తొంగి తొంగి చూస్తుంటారనీ, అవసరమైతే ముసుగు దొంగల్లా బయటికి రావలసి ఉంటుందనీ కలలో కూడా ఊహించలేదు. ఊళ్ళకు ఊళ్ళు, దేశాలకు దేశాలు ఇలా ఒకదాని కొకటి సంబంధం లేకుండా మూసివేయడాన్ని లాక్‌డౌన్ అరటారని … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
లాక్‌డౌన్ డైరీ -శిలాలోలిత
మనమెవరమూ అన్న మౌలికమైన ప్రశ్న ఉదయించిన కాలం ఇది. ఇప్పుడు బతుకుకే తాళాలు వేసుకునే పరిస్థితి. కనబడకుండా ఇంతటి విధ్వంసాన్ని కరోనా వైరస్ సష్టించింది. కరోనా ఎక్కడుందో తెలియదు. పక్కనుందో తెలియదు. మనలోనే ఉందో తెలియదు. అదిప్పుడు ప్రపంచాన్ని శాసించే స్థితిలో మాత్రం ఉంది. వందలాది మంది రాలిపోతున్నారు. మందు లేదు. అనువైన, అవసరమైన ఆస్పత్రులు … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment
లాక్‌డౌన్ అనుభవాలు – మెర్సీ మార్గరెట్
ఇది రాస్తున్న సమయానికి లోపలంతా భయం. రాత్రంతా నిద్ర లేదు. గొంతు నొప్పి. ఎండిపోయిన నాసికా రంధ్రాలు. పొద్దున్నే లేచి వేడి నీళ్ళతో గొంతు కాచుకోవాలి. వేడి నీళ్ళ ఆవిరి పట్టాలని అనుకుంటూ నిద్రపోయి లేచి మళ్ళీ నిద్ర పోయి మళ్ళీ నిద్ర లేచి ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేచానో తెలియలేదు. కరోనా లక్షణాలు ఏవో … Continue reading
Posted in కరోనా డైరీస్
Leave a comment