మొదట చేయాల్సింది టైంకి డాక్టర్‌ని కలవడమే -చైతన్య పింగళి

హెచ్‌ఐవి పాజిటివ్‌ అంటే ఎంత భయం, అపోహలు, వివక్ష ఉన్నాయో కరోనా పాజిటివ్‌ అంటే కూడా ఆ లెవల్లోనే ఉంది. మొత్తానికి నాకు ఇప్పుడు నెగటివ్‌ వచ్చింది కాబట్టి చెప్తున్న.

నా స్నేహితుల్లో, నేను కలిసిన వాళ్ళల్లో ఎవరికీ కరోనా లేదు. ూరవఎజ్‌ూశీఎa్‌ఱష గా ఎవరన్నా ఉన్నారేమో తెలీదు. జ్వరం వచ్చింది. రెండో రోజు రాత్రికి కూడా జ్వరం ఉండడంతో నేను మా అపార్ట్‌మెంట్‌ నుండి సెల్ఫ్‌ ఐసోలేషన్‌కి వేరే ఫ్రెండ్‌ ఇంటికి వెళ్ళాను. అదే సమయంలో చెస్ట్‌ హాస్పిటల్‌ వీడియో చూశాక, ఇంక నాకు నిజంగానే గుండె దడ వచ్చేసింది. జల్సా సినిమాలో సునీల్‌ ‘మనకొకడు ఉన్నాడు కదా’ అని ధర్మవరపుకి ఫోన్‌ చేస్తాడు కదా. నేను ఆ మాదిరి ‘ప్రభుత్వంలో మనకొకడు ఉన్నాడు కదా’ అని దిలీప్‌ కొణతం గారికి గాలి అందట్లేదు అని మెసేజ్‌ ఇచ్చాను. ఆయన ఎంత బిజీ అనేది నేను ఆలోచించలేదు. ఆయన ఆక్సీమీటర్‌తో చూస్కోమని, కోవిడ్‌ టెస్ట్‌ చేయించుకోమని ఒక నెంబర్‌ పంపారు. కోఠి వెళ్ళి టెస్ట్‌ చేయించుకుంటే పాజిటివ్‌ వచ్చింది. సరాసరి గాంధీ హాస్పిటల్‌కే వెళ్ళా. గాంధీ హాస్పిటల్‌లో పనిచేస్తున్న వంశీకృష్ణ గుణశేఖర్‌ గారు నా డాక్టర్‌. పాపం నా టార్చర్‌ భరించారు. ఐదేళ్ళ ఎం.బి.బి.ఎస్‌, ఇప్పుడు పీజీ జ్ఞానాన్ని నాకు పది రోజుల్లో బోధించి ధైర్యం చెప్పాడు, చెబుతూనే ఉన్నాడు. ఏవో మందులు ఇచ్చాడు. అన్నీ కరక్టుగా వాడాను. బలానికి గోళీలు. విటమిన్‌ సి, జింకోవిట్‌, గ్లోవ్స్‌, శానిటైజర్‌… ఫోన్‌చేసి మొత్తుకున్నప్పుడల్లా ధైర్యం ఇచ్చాడు పాపం. అతను లేకుంటే భయానికి, డిప్రెషన్‌కి చచ్చేదాన్ని.

విరించి విరివింటి గారి లైవ్‌ వీడియోస్‌ చూస్తూ ఉండేదాన్ని. కొంచెం ధైర్యం వచ్చేది. ఆయన లైవ్‌ వీడియో చూశాక అర్థమయిన దాన్ని బట్టి ధైర్యంగా గాంధీ డాక్టర్‌నే ఫాలో అయ్యాను. ప్రైవేట్‌ హాస్పిటల్‌కి వెళ్ళి ఉంటే లక్షలు అయ్యేవి. చాలా భయం వేసింది. నా వల్ల ఇంట్లో వాళ్ళకి వచ్చింది అనే గిల్ట్‌. 65 ఏళ్ళ డయాబెటిక్‌, ఆస్థమా పేషెంట్‌ ఉన్నారు ఇంట్లో. భయం వేసింది. దూరంగా ఉన్నందుకు ఒంటరిగా అనిపించేది. అసలే తిరిగే కాలు. ఇంక ఏడుపు ఏడుపు గదిలో. పైగా కరోనా న్యూస్‌ చూస్తే నాకు గాలి ఆడకపోయేది. టెన్షన్‌ ఎక్కువ రాగానే, నా ఆక్సిజన్‌ లెవల్స్‌, పల్స్‌ మారిపోయేది. ఇళయరాజా పాటలు ఆదుకున్నాయి. పర్వ పుస్తకం పూర్తిచేశా. దూరంగా కూర్చుని లౌడ్‌ స్పీకర్‌ పెట్టిన లెవల్లో మా వాడికి బోలెడు కథలు చెప్పా. ఫ్రెండ్స్‌తో ఫోన్‌, ఫేస్బుక్‌లో పోస్టులు… అలా భయం వేసినప్పుడల్లా డీవియేట్‌ చేసుకునేదాన్ని.

వరవరరావు గారి ఆరోగ్యం టెన్షన్‌. అంత టెన్షన్‌లో కూడా వనజ సి నా కండిషన్‌ అడుగుతూనే ఉన్నారు. భరధ్వాజ రంగవఝల గారికి పంజాగుట్టలో సపోర్ఠ్‌కి వెళ్ళలేకపోయా. కంగాళీగా ఉండేది బుర్రంతా. పాజిటివ్‌ అని తెల్సిన తర్వాత వచ్చిన జూaఅఱష a్‌్‌aషస ని దాటడానికి రెండు రోజులు పట్టింది. మా వాళ్ళు కూడా త్వరగా కోలుకుని, నెగటివ్‌ అవుతారు అనే ధైర్యం వచ్చింది ఇప్పుడు. ప్రతి రోజూ మామూలు ఆహారమే తిన్నా కానీ ఒక గుడ్డు, జామకాయ ఉండేలా మాత్రం చూసుకున్నా. గోరు వెచ్చటి నీళ్ళు తాగాను. ఇవి కాక అదనంగా ఈ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఒక నాలుగు సార్లు చికెన్‌, ఒక బొప్పాయి తిన్నా. ఈ ఫేజ్‌ దాటింది. ఒక కష్టం నుండి గట్టెక్కాను. ఈ సమయంలో ఎంతమంది పరిచయస్తులు, ఆత్మీయులుగా మారారో! సొంత వాళ్ళని బైట వదిలేస్తున్నారు రోగం అంటుకుంటుందన్న భయానికి. నాకు నా బాలు, నోర్బు తప్ప అటూ ఇటూ కుటుంబం లేదు. ఈ కష్టంలో నాతో నిలబడ్డ వాళ్ళు, అన్నం వండి తెచ్చిన వాళ్ళు; అపార్ట్‌మెంట్‌లో ర్‌ఱస్త్రఎa ఉంది అంటే ఇల్లు ఇచ్చిన వాళ్ళు, కూరలు, సామాను తెచ్చిన వాళ్ళు, అడక్కుండా నా అకౌంట్‌లో డబ్బులు వేసిన వాళ్ళు, ఫేస్బుక్‌ స్నేహితులు… ఇంత మంది ఉన్నారు. ఎంత ధైర్యం వచ్చిందంటే నాకేమైనా అయితే నోర్బుని చూసుకుంటారులే అన్నంత ధైర్యం వచ్చింది.

నేను అర్థం చేసుకున్న ఇబ్బందులు:

1. గుడ్డు ఐదు రూపాయలు. బేసిక్‌ ప్రొటీన్‌ ఆహారం అది. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే రోజుకి 20 రూపాయలు. కొంచెం పెద్దవాళ్ళు, అనారోగ్యం ఉన్నవాళ్ళు ఉంటే డ్రై ఫ్రూట్స్‌, చికెన్‌ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అది ఇంకా ఖర్చెక్కువ. పైగా లాక్‌డౌన్‌ తర్వాత ఎంతో కొంత నయంగా బతికే కుటుంబాలకే కష్టంగా ఉంది. ఇంక బీపీఎల్‌ కుటుంబాల పరిస్థితేంటి? ఎలా భరించగలరు? ఆక్సీమీటర్‌ ఎందరు కొనగలరు? ప్రొటీన్‌ ఆహారం, ఆక్సీమీటర్‌ సబ్సిడీ రేట్లలో దొరికేలా ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకోవాలి.

2. కుటుంబంలో ఒకరి నుండి మరొకరికి రాకూడదంటే పెద్ద ఇళ్ళన్నా ఉండాలి లేదా ప్రత్యేక గదులన్నా ఉండాలి. పిల్లలు ఉంటే ఇంకా కష్టం. మన దేశంలో ఎంతమందికి ఆ ప్రివిలేజ్‌ ఉంటుంది? అసలు ఈ వెలివేత భయానికి టైంకి ఎందరు డాక్టర్‌ని కలవగలరు? మేమే భయానికి అపార్ట్‌మెంట్‌ను వదిలి, వేరే ప్రాంతానికి వచ్చాము. అంత ర్‌ఱస్త్రఎa. దీన్ని పోగొట్టే పని ప్రభుత్వం, చానల్స్‌ బాగా చేయాలి ఇప్పుడు.

3. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్ళలేం కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల మీద భరోసా కలిగే విధంగా, ప్రైవేటు ఆస్పత్రులకి ధీటుగా వసతులు కల్పించాలి, దాన్ని ప్రచారం చేయాలి.

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.