ఇదీ సంగతి – కొండవీటి సత్యవతి

ఒకానొక సఖి సెంటర్‌కి ఒక కుటుంబ హింస బాధిత మహిళ వచ్చారు. ఆమెతో ఆమె ఇద్దరు పిల్లలు ఉన్నారు. కౌన్సిలర్ ఆమెను కూర్చోబెట్టి భోజనం చేసారా అని అడిగింది. లేదు అన్నారామె. భోజనం తెప్పించి ముందు తినండి తర్వాత మాట్లాడదాం అంది కౌన్సిలర్. పిల్లలు చాలా ఆకలితో ఉన్నారు గబగబా తింటున్నారు. ఆమె కళ్ళ నుండి నీళ్ళు కారుతూనే ఉన్నాయి.

అన్నం తినకుండా ఏడుస్తోంది. కౌన్సిలర్ సముదాయించాక మెల్లగా తినడం పూర్తిచేసింది. కొంచం సేపు రిలాక్స్ అవ్వండి మాట్లాడుకుందాం అని కౌన్సిలర్ అనగానే పిల్లలిద్దరినీ పక్కనేసుకుని చాప మీద పడుకుందామె. ఎంత అలిసిపోయిందో చాలా సేపు నిద్రపోయింది ఆమె.
ఆమె లేవగానే కౌన్సిలర్ ఆమెకు టీ ఇచ్చి తనతో మాట్లాడడం మొదలు పెట్టింది. ఎలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి తన భర్త పిల్లల్ని తనని ఎలా బయటకు గెంటేసాడో చెబుతూ వొళ్ళంతా కమిలిపోయిన బెల్ట్ దెబ్బల్ని చూపించింది. ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగినప్పుడు పక్కింటి వాళ్ళు ఈ అడ్రెస్ చెప్పారు. వాళ్ళే పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చారు. సరే మొదట హాస్పిటల్‌కి తీసుకెళతారు వెళ్ళండి. మీకు చాలా దెబ్బలు తగిలాయి డాక్టర్‌కి చూపించాకా మెడికో లీగల్ సర్టిఫికెట్ తీసుకోవాలి. అంటే ఏంటి అని అడిగింది. మీ ఒంటి మీద దెబ్బలు పరీక్షించి డాక్టర్ మీకు ఒక సర్టిఫికెట్ ఇస్తారు. మీరు కేసు వేసుకోవడానికి ఉపయోగపడుతుంది. కేసా? ఆందోళనగా అందామె. కేసు వద్దులెండి మేడం ఆయన్ని పిలిపించి మాట్లాడండి అంది. తప్పకుండా పిలుస్తాం. అతనితో మాట్లాడతాం. ముందు హాస్పిటల్‌కి వెళ్ళండి.
పక్కనే ఉన్న ఏరియా హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఆమెకు మందులిప్పించి, ఎంఎల్‌సి తీసుకుని వచ్చింది పేరా మెడికల్ వర్కర్. అప్పటికి పిల్లలు నిద్ర లేచారు. అక్కడున్న బొమ్మలతో ఆడుకుంటున్నారు. కౌన్సిలర్ ఆమెను తన రూంలోకి తీసుకెళ్ళింది. మిమ్మల్ని పోలీసులు తీసుకొచ్చి వదిలారు కదా ఈ సెంటర్ ఏమిటో మీకు తెలుసా?
తెలియదు
చదువుకున్నారా? ఏమి చదివారు
డిగ్రీ పూర్తి చెయ్యలేదు. చదువు మాన్పించి పెళ్ళి చేసారు.
ఇక్కడ ఏమి రాసి ఉందో చదవండి
సఖీసెంటర్ అని చదివింది.
మీలాంటి కుటుంబ హింస బాధితుల కోసం 2017లో ప్రభుత్వం సఖీ సెంటర్‌లు ప్రారంభించింది.
ఎప్పుడూ, ఎక్కడా ఈ పేరు వినలేదా? వినలేదని తల అడ్డంగా ఊపిందామె.
మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టే హక్కు మీ భర్తకి లేదు మీకు తెలుసా ఈ సంగతి.
తెలియదు
సరే గృహహింస నిరోధక చట్టం పేరుతో మీలాంటి వారికి న్యాయపరంగా సహకరించడానికి ఓ చట్టం ఉంది విన్నారా ఎప్పుడైనా?
వినలేదు
ఈ చట్టం ప్రకారం మీ భర్త మిమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం కుదరదు. మీరు ఉంటున్న ఇంట్లో మీకు సగ భాగాన్ని ఈ చట్టం కల్పించింది. మీరు కోర్టులో కేసు వేసుకుంటే మీకు మీ ఇంట్లో హక్కు కల్పించబడుతుంది.
కోర్టులు,¹ ¿సులు వద్దు, మా అయన్ని పిలిపించి మాట్లాడండి అంది ఆమె భయపడుతూ.
భయపడకండి మీ కంప్లైంట్ తీసుకున్నాక మీ భర్తని తప్పకుండా పిలిపిస్తాం. మీలాంటి గృహహింస బాధిత మహిళలకు ఎలాంటి చట్టాలు, సదుపాయాలు ఉన్నాయో చెబుతున్నాను. భయపడకండి.
మీ భర్తని పిలిపించి మాట్లాడే లోపు మీరు మీ పిల్లలు ఇక్కడే ఉండొచ్చు. ఐదు రోజులుండొచ్చు.
అవునా ఇక్కడ ఉండొచ్చా, ఇప్పుడెక్కడికి వెళ్ళాలా అని అలోచిస్తున్నానమ్మా. ఇక్కడ ఉండొచ్చు అంటే సంతోషంగా ఉంది. పిల్లలకి తిండి దొరుకుతుంది. నా చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమైంది.
బాధపడకండి ఇక్కడ ఐదు రోజులుండొచ్చు, ఆ తర్వాత కూడా మూడు సంవత్సరాలు ఉండగలిగిన స్వాధార్ హోంలు కూడా
ఉన్నాయి. అయ్యో ఇలాంటివి ఉన్నాయని తెలిస్తే ఎప్పుడో ఆ నరకం నుండి బయటపడేదాన్ని కదమ్మా అందామె.
అదిగో అక్కడ కూర్చున్నారు కదా ఆమె లీగల్ కౌన్సిలర్. మీరు తన దగ్గరికి వెళ్ళండి. మీకు న్యాయపరమైన హక్కులేమున్నాయో, ఒకవేళ మీ భర్త మీద కేసు పెట్టాలనుకుంటే ఏమి చెయ్యాలో చెబుతారు.
లీగల్ కౌన్సిలర్ ఆమెకు గృహహింస చట్టం గురించి, ఆ చట్టం ద్వారా కేసు వేసుకుంటే ఆమెకు దొరికే పరిహారాల గురించి వివరించాకా నిజంగానే మాఇంట్లో నాకు హక్కు ఉందా? నాకు మెయింటెనెన్స్ వస్తుందా? అని అడిగింది ఆతృతగా.
ఈ చట్టంలో మీకు హాక్కు ఉంది. దీని ప్రకారం మీ భర్త మీద పోలీస్ కేస్ పెట్టక్కరలేదు. మీకు రావాల్సిన పరిహారాలను అడగొచ్చు. మీరు ఈ అప్లికేషన్ మీద సంతకం పెట్టండి. మీ తరఫున మేమే కోర్టులో కేసు ఫైల్ చేస్తాం. కోర్టు ద్వారా మీకు అన్నీ లభిస్తాయి అని చెప్పింది లీగల్ కౌన్సిలర్.
మా అయన్ని పిలిచి మాట్లాడరా అందామె.
పిలుస్తాం, మాట్లాడతాం మీరు రెస్ట్ తీసుకోండి. ఇంకో విషయం మీకు చెప్పాలి 181 అనీ ఒక ఎమర్జెన్సీ హెల్ప్లైన్ నంబర్ ఉంది తెలుసా మీకు. మీరు ఆపదలో ఉన్నప్పుడు ఆ నంబర్‌కి కాల్ చేస్తే సఖీ సెంటర్ వెహికల్‌లో మీ ఇంటికొచ్చి మిమ్మల్ని రక్షించి ఇక్కడికి తీసుకొస్తారు.
మేడం ఇవేవీ నాకు తెలియదు. ఇలాంటి సఖీ సెంటర్లు ఉన్నాయని, నేను ఇక్కడ ఉండొచ్చని నాకే కాదు చాలా మందికి తెలియదు. నాలాగా ఎంతోమంది ఇళ్ళల్లో ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళందరికీ ఈ విషయాలు తెలిస్తే బాగుంటుంది కదా.
అవును మేము వీటి గురించి అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం.
ఏమో మేడం నేనైతే ఎప్పుడూ వినలేదు. నేనిక్కడకి ఏడుస్తూ వచ్చాను. దారి తెన్నులేనట్టనిపించింది. ఇక్కడికొచ్చాకా నాకు కొంచం ధైర్యం వచ్చింది. ఆ మేడం, మీరు చెప్పిన విషయాలు విన్నాకా చాలా బాగా అనిపించింది. ఇవన్నీ నాకు ముందే తెలిసుంటే రోజూ అంత హింస పడకబోదును కదా అనిపిస్తోంది మేడం. ఇవన్నీ అందరికీ చెప్పండి మేడం. నాలా ఎవ్వరూ బాధపడకూడదు. నేను వెళ్ళాకా అందరికీ చెబుతాను మేడం అందామె.
చాలా సంతోషం మీరు అక్కడ పుస్తకాలున్నాయి చదువుకోండి. ఇంకెవరో వచ్చారు. నేను మాట్లాడాలి అంది లీగల్ కౌన్సిలర్. అలాగే మేడం అంటూ ఆమె పుస్తకాల స్ట్టాండ్ వైపు నడిచింది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.