భారతదేశంలో మహిళలను రైతులుగా గుర్తించడం: న్యాయం, సమానత్వం కోసం ప్రయాస – ఉషా సీతాలక్ష్మి

2026వ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ‘అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరం’గా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ-ఆహార వ్యవస్థలలో మహిళల పాత్రకు పెరుగుతున్న గుర్తింపు నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చినప్పటికీ, ఇది భారతీయ వ్యవసాయ రంగంలో మహిళల పరిస్థితి మరియు హోదాపై మరింత లోతైన మరియు క్లిష్టమైన పరిశీలన చేయవలసిన అవసరాన్ని నొక్కి చెబుతోంది

.
1990వ దశకంలో భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకరణ ప్రేరేపిత సంస్కరణల నేపథ్యంలో, ఈ సంస్కరణలు ప్రవేశపెట్టడానికి ముందు ఒక దశాబ్దానికి పైగా క్షీణతను ఎదుర్కొంటున్న వ్యవసాయ రంగం, ప్రపంచ మార్కెట్ల ప్రభావం మరియు ప్రభుత్వ మద్దతు ఉపసంహరణ కారణంగా మరింత తీవ్రంగా దెబ్బతింది. ఎక్కువ మంది పురుషులు వ్యవసాయం నుండి గ్రామీణ వ్యవసాయేతర లేదా పట్టణ ఉపాధికి మారడంతో, సాగు మరియు వ్యవసాయ నిర్వహణ బాధ్యత మహిళలపై పడి వ్యవసాయ రంగంలో మహిళల భాగస్వామ్యం (feminisation) పెరగడానికి దారితీసిందని పలు అధ్యయనాలు చూపుతున్నాయి. జాతీయస్థాయి ప్రాతినిధ్య సర్వేలతో పాటు వివిధ అనుభావిక అధ్యయనాల ఆధారాలు భారతదేశం అంతటా గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక శాతం మహిళలు వ్యవసాయ రంగంలో సాగుదారులుగా మరియు వ్యవసాయ కార్మికులుగా పాల్గొంటున్నారనే వాస్తవాన్ని ఎత్తి చూపుతున్నాయి. పంటల ఉత్పత్తి మరియు ప్రాసెసింగ్‌లో వారి పాత్రలతో పాటు, దేశ వ్యాప్తంగా పశుపోషణ, కోళ్ల పెంపకం, ఉద్యానవనం, పట్టుపురుగుల పెంపకం, మత్స్య మరియు అటవీ రంగాలలో మహిళలు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు. గణాంకాలను పరిశీలిస్తే దీని స్థాయి స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో మహిళలకు ఉపాధి కల్పిస్తున్న అతిపెద్ద రంగం వ్యవసాయమే: దేశంలోని పనిచేసే మహిళల్లో 64.4% మంది ఇందులో నిమగ్నమై ఉన్నారు, ఇది 2017-18లో 57.0% గా ఉండేది (PLFS 2023-24). గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళలలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో నిమగ్నమైన వారి సంఖ్య 76.9%కి చేరుకుంది. ఒక ILO (ఐ.ఎల్.ఓ) అధ్యయనం ప్రకారం, వ్యవసాయంలో ఉన్న మహిళల్లో 81% పైగా దళిత మరియు ఆదివాసీ వర్గాలకు చెందినవారు (ILO, 2010). అయితే, పై డేటా, విశ్లేషణను నిశితంగా పరిశీలిస్తే అత్యంత ఆందోళనకరమైన విషయం వెల్లడవుతుంది. ఈ పెరుగుదలలో అత్యధిక వాటా (42%) మహిళలకు ఎలాంటి చెల్లింపులు లేని కుటుంబ పనికి సంబంధించినది, ఇది రెట్టింపు కన్నా ఎక్కువ అయింది; మహిళల స్వయం-ఉపాధి పని నాలుగు రెట్లు పెరిగింది; వ్యవసాయ కూలి రేట్లలో గంటల వారీ లింగ వేతన వ్యత్యాసం 39% నుండి 42%కి పెరిగింది, అదే సమయంలో గ్రామీణ భారతదేశంలో వాస్తవ వేతనాలు స్తబ్దుగా ఉన్నాయి లేదా పడిపోతున్నాయి. వేతనం లేని కార్మికులుగా లేదా స్వయం ఉపాధి సాగుదారులుగా మహిళలు అసమాన స్థాయిలో ఉండటం అనేది వారి సాధికారతకు నిదర్శనం కాదనే వాస్తవాన్ని ఇది స్పష్టంగా సూచిస్తుంది. మంచి వేతనాలు మరియు పని పరిస్థితులతో కూడిన నాణ్యమైన, ఉత్పాదక, వ్యవసాయేతర ఉపాధి మహిళలకు అందుబాటులో లేకపోవడం, మరియు అది వారు నివసించే ప్రాంతాలకు దగ్గరగా లేకపోవడం నిజమైన ఆందోళన కలిగించే విషయం.
కుటుంబం లోపల మరియు వెలుపల మహిళలు చేసే వేతనం లేని పనిని అధికారిక డేటా వ్యవస్థలు, విధానాలు మరియు కార్యక్రమాలలో తక్కువగా అంచనా వేయడం లేదా తక్కువగా లెక్కించడం కొనసాగుతుండగా, భూమి, నీరు, అడవులు మరియు ఉమ్మడి వనరుల వంటి ఉత్పాదక ఆస్తులపై మహిళలకు ఉన్న పేలవమైన యాజమాన్యం మరియు నియంత్రణ దీనిని మరింత తీవ్రతరం చేస్తుంది. తాజా వ్యవసాయ జనాభా లెక్కల (Agricultural Census) గణాంకాల ప్రకారం, అఖిల భారత స్థాయిలో మొత్తం సాగు విస్తీర్ణంలో 12 శాతం భూమిని కలిగి ఉంటూ, మొత్తం కమతాలలో మహిళల కమతాలు కేవలం 14% మాత్రమే ఉన్నాయి. 2007లో, భారతదేశ జాతీయ రైతుల విధానం (National Policy for Farmers) ‘రైతు’ అనే పదాన్ని మరింత సమగ్రంగా నిర్వచించింది. దీనిలో పంటలు పండించడం, ఇతర ప్రాథమిక వ్యవసాయ ఉత్పత్తులను ఉత్పత్తి చేయడంలో ఆర్థిక లేదా జీవనోపాధి కార్యకలాపాలలో చురుకుగా నిమగ్నమైన వారందరినీ – అంటే భూకమతాల దారులు, సాగుదారులు, వ్యవసాయ కార్మికులు, కౌలుదారులు, గుత్తదారులు, కోళ్లు మరియు పశువుల పెంపకందారులు, జాలర్లు, తేనెటీగల పెంపకందారులు, తోటమాలులు, పశువుల కాపరులు, నాన్-కార్పొరేట్ ప్లాంటర్లు మరియు తోట కార్మికులు, అలాగే పట్టుపురుగుల పెంపకం, వానపాముల పెంపకం మరియు వ్యవసాయ-అటవీ (agro forestry) వంటి వివిధ వ్యవసాయ-సంబంధిత వృత్తులలో నిమగ్నమైన వ్యక్తులు, మరియు పోడు వ్యవసాయం (shifting cultivation) మరియు మైనర్ మరియు కలప-యేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, వినియోగం మరియు విక్రయాలలో నిమగ్నమైన కుటుంబాలు/వ్యక్తులు – చేర్చబడ్డారు. అయితే ఆచరణలో, వ్యవసాయ భూములపై అధికారిక యాజమాన్యం ఉన్నవారిని మాత్రమే ప్రభుత్వ డేటా వ్యవస్థలు మరియు విధానాలలో రైతులుగా గుర్తించడం కొనసాగుతోంది. భూమి వంటి ఆస్తులపై మహిళలకు ఖచ్ఛితమైన యాజమాన్యం లేకపోవడం వలన వారు ప్రభుత్వ విధానాలు, కార్యక్రమాలు మరియు బడ్జెట్లలో అదృశ్యంగానే మిగిలిపోయారు, అంతేకాకుండా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలలో వారి జీవనోపాధిని నిలబెట్టుకోవడానికి అత్యంత కీలకమైన క్రెడిట్ (రుణాలు), మార్కెటింగ్ మరియు వ్యవసాయ విస్తరణ మరియు సాంకేతికత వంటి మద్దతు వ్యవస్థల సపోర్ట్ కూడా వారికి నిరాకరించబడుతోంది.
మహిళా రైతులు ఒకే విధమైన సమూహం కాదు, వారి జీవితాలు, వారి పని ప్రాంతం, మతం, కులం/వర్గం, జాతి, వయస్సు, లైంగిక ధోరణి వంటి అంశాల ద్వారా, అలాగే సాగుదారులుగా, వ్యవసాయ కార్మికులుగా, పశువుల పెంపకందారులుగా మరియు అటవీ-ఆధారిత వ్యవసాయ వ్యవస్థలలో వారి పని ద్వారా విభిన్నంగా నిర్ణయించబడుతున్నాయి. వ్యవసాయ రంగంలో, ఆహార పంటల నుండి పెట్టుబడితో కూడిన, మార్కెట్-ఆధారిత వాణిజ్య వ్యవసాయంగా మారుతున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో చిన్న, సన్నకారు భూకమతాలు ఉన్న రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. వ్యవసాయేతర ప్రయోజనాల కోసం వ్యవసాయ భూములను పెద్దఎత్తున సేకరించడం, తోటల పెంపకం, పులుల సంరక్షణ కేంద్రాలు మరియు అభయారణ్యాల కోసం అటవీ భూములను మళ్లించడం, వాతావరణ మార్పులకు సంబంధించిన పెరుగుతున్న సవాళ్లతో కలిసి ఈ మార్పులు మరింత తీవ్రమయ్యాయి. ఈ ప్రక్రియల వల్ల మహిళా రైతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నారు. అట్టడుగు సామాజిక-ఆర్థిక వర్గాలకు చెందిన మహిళలు ఈ వ్యవసాయ పరివర్తనల సామాజిక, పర్యావరణ పరిణామాల భారాన్ని మరింత తీవ్రంగా భరిస్తున్నారు. ఈ సవాళ్లకు తోడు, భూ రికార్డుల క్రమబద్ధీకరణకు సంబంధించిన డిజిటల్ సిస్టమ్ల పరిచయం మరియు ఎక్కువగా బ్యాంక్ ఖాతాలకు నగదు బదిలీల రూపంలో ఉన్న వ్యవసాయ పథకాలు, ప్రయోజనాల పంపిణీ కూడా తోడయ్యాయి. వీటన్నింటిలో, మహిళలకు స్మార్ట్ ఫోన్లు లేకపోవడం లేదా బ్యాంక్ ఖాతాలను నిర్వహించలేకపోవడం వల్ల వారు ప్రతికూలంగా ప్రభావితమవుతున్నారు.
మనం అంతర్జాతీయ మహిళా రైతుల సంవత్సరాన్ని జరుపుకుంటున్నప్పటికీ, దేశవ్యాప్తంగా పెరుగుతున్న గ్రామీణ సంక్షోభం నేపథ్యంలో వివిధ వర్గాలకు చెందిన మహిళలు తమ జీవితాలను మరియు జీవనోపాధిని ఎలా సాగిస్తున్నారో శోధించడం మరియు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. నేడు గ్రామీణ మహిళల పోరాటాలు ఏమిటి? మరియు విభిన్న వర్గాలకు చెందిన గ్రామీణ మహిళలు, వ్యక్తిగతంగా, సమిష్టిగా, భూసేకరణ వల్ల తలెత్తుతున్న సవాళ్లను, తమ జీవనోపాధిని కాపాడుకోవడానికి వాతావరణ మార్పుల ముప్పును, వ్యవసాయంలో మార్పులను ఎలా ఎదుర్కొంటున్నారు? ఈ నేపథ్యమే, మహిళా రైతుల హక్కులు, అర్హతలను పరిష్కరించడానికి స్పష్టమైన విధాన చర్యలను రూపొందించడం వాటిని వ్యక్తీకరించడం ముఖ్యమని నొక్కిచెబుతుంది. విభిన్న వర్గాల మహిళా రైతులను ‘వారి సొంత హక్కుతో రైతులుగా’ (farmers in their own right) గుర్తించే ప్రత్యేక చట్టాన్ని రూపొందించడం, అమలులోకి తీసుకురావడం, అదే సమయంలో భూమి, నీరు, అడవులు మరియు ఉమ్మడి వనరుల వంటి ఉత్పాదక వనరులపై వారి హక్కులు, అర్హతలను కల్పించడం, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు మరియు బడ్జెట్లలో సమాన వాటాను విస్తరించడంతో పాటు, పెన్షన్లు, ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి హక్కుల ద్వారా మహిళా రైతులకు సామాజిక భద్రతను నిర్ధారించడంతో పాటు రైతులుగా న్యాయం, సమానత్వం కోసం వారు సాగిస్తున్న పోరాటానికి అండగా నిలవడంలో గొప్పగా ఉపయోగపడుతుంది. `

Share
This entry was posted in గెస్ట్ ఎడిటోరియల్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)

అ
a
ఆ
aa
ఇ
i
ఈ
ee
ఉ
u
ఊ
oo
ఋ
R
ౠ
Ru
ఌ
~l
ౡ
~lu
ఎ
e
ఏ
E
ఐ
ai
ఒ
o
ఓ
O
ఔ
au
అం
M
అః
@H
అఁ
@M
உ
@2
క
k
ఖ
kh
గ
g
ఘ
gh
ఙ
~m
చ
ch
ఛ
Ch
జ
j
ఝ
jh
ఞ
~n
ట
T
ఠ
Th
డ
D
ఢ
Dh
ణ
N
త
t
థ
th
ద
d
ధ
dh
న
n
ప
p
ఫ
ph
బ
b
భ
bh
మ
m
య
y
ర
r
ల
l
వ
v
 
శ
S
ష
sh
స
s
    హ
h
ళ
L
క్ష
ksh
ఱ
~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.