లాక్‌డౌన్‌ అనుభవాలు – మెర్సీ మార్గరెట్‌

ఇది రాస్తున్న సమయానికి లోపలంతా భయం. రాత్రంతా నిద్ర లేదు. గొంతు నొప్పి. ఎండిపోయిన నాసికా రంధ్రాలు. పొద్దున్నే లేచి వేడి నీళ్ళతో గొంతు కాచుకోవాలి. వేడి నీళ్ళ ఆవిరి పట్టాలని అనుకుంటూ నిద్రపోయి లేచి మళ్ళీ నిద్ర పోయి మళ్ళీ నిద్ర లేచి ఎప్పుడు పడుకుని ఎప్పుడు లేచానో తెలియలేదు. కరోనా లక్షణాలు ఏవో చదివి నోటికి రుచి తగులుతుందా లేదా అని కొంచెం కొరివి పచ్చడీ… ఆ తర్వాత కొంత పాయసం… ఆ తరువాత కొంత కోడికూర రుచి చూసి నాలుక్కి రుచి తగ్గలేదని నిర్ధారించుకున్నాను. మొహం కడుక్కోడానికి చేతులకి రుద్దుకున్న సబ్బు వాసన చూసి పర్లేదు ముక్కువాసన పసిగడుతుందని నిర్ధారించుకుని… కొంత ఊపిరి పీల్చుకున్నాను.

చావంటే భయంతో కాదు… చావు హింస భరించకుండా ఒక్కసారే ఠపీమనిపోతే బాగుంటుంది కదా, అందుకనీ. ఒక భయం ఉండేది చావు అంటే నాకు చిన్నప్పటి నుంచి. చావు ఏడుపులు వినిపిస్తే ఒకలాంటి భయం నాకు. ఒళ్లు చల్లబడిపోయి కళ్ళు తిరిగినట్టు అయి పడిపోతానేమో అనిపించేది. మా చిన్న తమ్ముడు చనిపోయి ఆ మంచం మీద కదల్లేక నిశ్చలంగా పడుకుని ఉన్నప్పుడు… అప్పుడు తెలిసింది చావు గురించి. ఆ భయం ఏదో పోయింది. చావు భయం ఉండనిది ఎవరికి? కానీ కొన్ని వ్యక్తిగత అనుభవాలు అవే వచ్చి కౌగలించుకున్నాక చావు అనేది మంచి స్నేహితురాలే అనిపించింది. కానీ కరోనా, చావు మరో రూపం, వెయ్యి చేతులు కాదు లక్షల చేతులతో మనుషుల్ని ఎత్తుకెళ్లటం చూస్తే ఆ కుటుంబాల బాధని ఎలా అన్వయించుకోవాలో తెలియలేదు.

ప్రకతి పాస్‌ బటన్‌ నొక్కింది అని అనుకోవాలా?? ప్రకతి తనని తానే రిజ్యువినేట్‌ చేసుకుంటుంది అనుకోవాలా? ప్రకతి మరణాన్ని ‘ఆమనీ… పాడెవే హాయిగా…’ అంటూ పాడుతుందని వినాలా? ఏమో మొదట్లో అలాగే అనిపించింది. అందుకే ‘కరుణామయి’ అని కవిత కూడా రాశా. ఇది మార్చి 23న ఆంధ్రజ్యోతి ఎడిట్‌ పేజీలో అచ్చయింది. పాపం అప్పటికి కరోనా ‘కరీనా’ లాంటి కవితా వస్తువుగా రూపాంతరం చెందలేదు. ఒక అనుమానం… ఒక సందిగ్ధత… అయోమయం… చుట్టూ ఏదో కాన్స్పిరసీ జరుగుతోందన్న భయం… చావు కన్నా కాన్స్పిరసీ ప్రమాదకరం కదా.

… … …

లాక్‌ డౌన్‌ డైరీ రాయటం ఎలాగో నాకు అవగాహన లేదు. డైరీ రాసుకోవటం అనే చిన్నప్పటి ఒక అలవాటు ఉంది. అయితే ఈ లాక్‌ డౌన్‌ టైమ్లో రాస్తున్నాం కదా లాక్‌ డౌన్‌ డైరీ అయ్యిందేమో. అంతా మూసుకు పోయిన ఈ కాలంలో ఊహలూ, ఆలోచనల్ని ఎవరూ ఆపలేరు కదా. ఈ సమయంలోనే జయంత్‌ పర్మార్‌ ః్‌ష్ట్రవ జూవఅషఱశ్రీః కవిత, మంగలేశ్‌ దబ్రాల్‌ గారి కవితలు గుర్తుకుచ్చాయి. వాళ్ళని మళ్ళీ మళ్ళీ చదువుకున్నా… కొన్ని మంగలేశ్‌ గారి కవితల్ని నా కోసం నేను అనువాదం చేసుకున్నా…

ఈ లాక్‌ డౌన్‌లో నాకు తోడుగా ఉన్నవి పుస్తకాలు. సినిమాలు… చదవటం… రాయటం… వీలైతే స్నేహితులతో మాట్లాడటం. కేశవరెడ్డి గారి నవలలు ‘మునెమ్మ’, ‘చివరి గుడిసె’, ‘అతడు అడవిని జయించాడు’, ‘మూగవాని పిల్లనగ్రోవి’ మళ్లీ చదువుకున్నా ప్రేమగా. జయకాంతన్‌ నాకు ఆత్మీయుడయ్యాడు. ఆయన బ్రతికే ఉంటే వెళ్ళిపోయి పెద్దనాన్న అని వరస కలిపేసుకుందునూ. ఆయన రాసిన ‘కొన్ని సమయాల్లో కొందరు మనుషులు’ అనే నవల నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులోని ‘గంగ’ పాత్ర నాకు ప్రాణమిత్రురాలుగా మారిపోయింది. తన గురించి ఒక వారం రోజులు అదే తీరుగ దుఃఖించాను. ఒకవేళ గంగ నిజంగానే ఉంటే వెళ్లి గట్టిగా హత్తుకుని ఏడ్చి, ఓదార్చేదాన్నేమో.

‘సిద్ధార్థ’ అనే హెర్మెన్‌ హెస్సే నవలాత్మక పుస్తకం నన్ను చాలా ప్రభావితం చేసింది. ఈ లాక్డౌన్‌లో నన్ను చాలా విషయాలు రియలైజ్‌ అయ్యేలా చేసిన పుస్తకం అది.

ఈ లాక్‌డౌన్‌ ప్రకటించినప్పుడు నాకు భయం వేసింది, బయటకి వెళ్లకుండా ఎలా ఉండేది అని. పుట్టి బుద్ధి వచ్చాక అంత సమయం ఇంట్లో ఉన్నది లేదు. ఒకానొక సమయంలో జ్వరం వచ్చేసిందేమో దిగులుతో అనిపించింది. దిగులుతో అంటే ఏదో అయిపోద్దని కాదు… కలవాల్సిన వాళ్ళని కలవలేకపోవటం… చేయాల్సిన పనులు చేయలేకపోవటం… చాలా పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.

ఈ లాక్‌డౌన్‌లో నాకు దొరికిన ఇంకో మిత్రురాలు… ‘కిష్వర్‌ నహీద్‌’. పాకిస్థానీ మొదటి తరం ఫెమినిస్ట్‌ కవి. తన కవిత్వం ‘షవ రఱఅటబశ్రీ షశీఎవఅ’ నాకు చాలా నచ్చింది. ఆమె రాసిన కవిత్వంతో అలా గడిచిపోయింది కాలం. కొన్ని నా కోసం నేను అనువాదం చేసుకున్నాను ఆమె రచనలు. ఓల్గా గారి ‘రాజకీయ కథలు’ కూడా ఇష్టంగా చదువుకున్నాను..

… … …

ఈ లాక్డౌన్‌లో మంచి మంచి సినిమాలు చూసే అవకాశం దొరికింది. మణిరత్నంని రీవిసిట్‌ చేసాను. అమెజాన్లో ‘పాతాల్‌ లోక్‌’ సిరీస్‌ చూసాను. ‘ణవఞ్‌aతీ’ సీరీస్‌ చూసాను. గురుదత్‌ సత్యజిత్‌ రే సినిమాలు చూసాను. ప్రపంచ సినిమా చూట్టం ఆ తర్వాత దాని మీద ప్రేమ పుట్టాక భారతీయ సినిమాలు చూట్టానికి ఇష్టం లేకుండేది. కానీ ఈ లాక్డౌన్‌లో తమిళ్‌, మలయాళం, మరాఠీ, కన్నడ, కొంకణీ ఇంకా బెంగాలీ సినిమాలు విరివిగా చూసాను. తమిళ దర్శకుడు శ్రీనురామస్వామి గారి సినిమా ‘నీర్‌ పారవై’ చూశాక ఆయనతో పరిచయం ఏర్పట్టం ఆయనతో మాట్లాడటం ఒక మంచి జ్ఞాపకం అయితే… ‘సిల్లు కరుపట్టి’ సినిమా చూసి హలిత షమీమ్‌ అనే మహిళాదర్శకురాలి పరిచయం, తాను స్నేహితులు అవటం చాలా స్ఫూర్తి నిచ్చిన విషయాలు.

శ్రవణ్‌ కటికనేని రెండు షార్ట్‌ ఫిలిమ్స్‌ నాకు బాగా నచ్చాయి.

మలయాళం దర్శకుడు విపిన్‌ విజయ్‌ సినిమా ‘చిత్రసూత్రం’ చాలా నచ్చింది. అతడు తీసిన డాక్యుమెంటరీ సినిమాలు మరీ మరీ నచ్చాయి. అతడితో మాట్లాడటం సినిమా ప్రపంచంలో తిరిగి వచ్చినట్టుగా ఉంటుంది. ఈ లాక్డౌన్‌ వల్ల ఏర్పడ్డ ఖాళీ ఇలా ఉపయోగపడిందన్న మాట, తెలుసుకోటానికి నేర్చుకోటానికీ.

… … …

ఫేస్‌బుక్‌కి, సోషల్‌ మీడియాకి దూరంగా ఉండే అవకాశం ఏదో దొరికినట్టు అనిపించింది ఈ లాక్డౌన్‌ వల్ల. ఎందుకో ఫేస్‌బుక్‌ నిండా భయం కరోనా రూపంలో ప్రవహించినట్టుగా అనిపిస్తే… కరోనాని సెలబ్రేషన్‌గా మలుచుకున్న పోస్టులూ చూసి ఎందుకో ఊపిరి ఆడటం ఇక్కడ కష్టం అయింది. జయకాంతన్‌ తన వేడుక అనే కథలో అంటాడు… మనుషులకు వేడుక కానిది ఏది?? అని. నిజమే… కరోనా వల్ల భయపడే వాళ్ళు భయపడుతుంటే ఈ లాక్డౌన్‌ను సంపూర్ణంగా ప్రొడక్టివ్‌గా వాడుకున్న వాళ్ళని చూశాక… ఏమో నాకే ఒకలా అనిపించింది. నేను ఇక్కడ ఇమడలేనేమో అని. అందుకే ఫేస్‌బుక్‌కి చాలా దూరంగానే ఉన్నాను.

… … …

చెల్లికి ఇద్దరు కొడుకులు. తమ్ముడికి ఒక కొడుకు. ముగ్గురూ మూడేళ్ళలోపు వయసున్న పిల్లలు. వాళ్ళతో ఆడుకోటానికి సమయం సరిపోయింది. అయితే ముగ్గురూ సొంతరగా అన్నీ నేర్చుకోవటం గమనిస్తుంటే మనిషి రూపాంతరం చెందే ప్రక్రియ చాలా ఆసక్తిగా తోచింది.

మా ఇంటిపక్కనే రోడ్డు పైన వైన్‌ షాప్‌. లాక్డౌన్‌ ఎత్తేస్తూనే అక్కడ గుమికూడిన జనం వాళ్ళ తగువులు చూస్తే జాలి కూడా వేసింది. ఏందీ ఈ మనుషులు అని బాధపడ్డా. ఎన్ని కోరికలు ఉంటాయి కదా మనుషులకి పాపం! బ్రతకటానికి తమకోసం తమదైన ఒక ప్రపంచాన్నీ నిర్మించుకుని బ్రతకటం… కొంచెం అల్లకల్లోలం అయినా తట్టుకోలేని బాధని అనుభవించటం మనిషికే తెలుసు.

ఈ లాక్డౌన్‌లో చాలా ‘ఛాలెంజెస్‌’ నడిచాయి ఫేస్‌బుక్‌లో… చీరలు కట్టుకోవటం… నచ్చిన పుస్తకం. నచ్చిన సినిమాలు పది… తీసిన ఫోటోల ఛాలెంజ్‌, ఇలా.. వేటిలోను పాలుపంచుకోవాలని అనిపించలేదు. వైరాగ్యం వల్ల అవచ్చు… కత్రిమంగా తోచటం వల్ల అవచ్చు… ఎందుకో ఒక ఒంటరితనం వల్ల కూడా కావచ్చు.

… … …

నాకు ఏకాంతం ఇష్టం… కానీ మరీ ఒంటరితనం భరించలేను. అందుకే ఎప్పుడూ గుంపులో ఉంటాను… గుంపులో ఉన్నా నా ఏకాంతానికి యే భంగం కలగకుండా చూసుకోగలను. నేను ఎక్కువ రోజులు ఇంట్లో ఉండటం అవలేదు. ఖాళీ దొరికినప్పుడు ట్యాంక్‌బండ్‌ మీద నడకకి వెళ్ళాను. రాత్రుళ్ళు పోలీసోళ్లు ఆపకుండా హైదరాబాద్‌ అంతా తిరిగాను. ఘట్కేసర్‌ ఎదులాబాద్‌ చెరువు దగ్గర ప్రశాంతంగా వెళ్లి కూర్చున్నాను. ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్‌లో ఎవరూ లేని చోట ప్రశాంతంగా పుస్తకంతో పాటు కూర్చున్నాను. ూహ= లో నాకు ఇష్టమైన ఐస్‌ క్రీమ్‌ తిన్నాను. ఇవ్వే కదా ఎక్కువ గుర్తుండేవి. కానీ రోజూ నా స్టూడెంట్స్‌ని, స్కూల్‌ని చాలా చాలా మిస్‌ అయ్యాను.

… … …

నా స్నేహితుడొకడు ఫోన్‌ చేసాడు నిన్న రాత్రి తన స్నేహితుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిందనీ, తాను వెళ్ళి కరోనా టెస్ట్‌కి శాంపిల్స్‌ ఇచ్చి వచ్చానని చెప్పాడు. ఒకవేళ తనకీ పాజిటివ్‌ వస్తే నేనూ చేయించుకోవాలీ.

ఇంత జీవితానికి ఇన్ని వేషాలు అవసరమా అని కూడా అనిపిస్తుంది. వేసుకోలేక పక్కనున్న నా చెప్పులూ అల్మారా నించి మూన్నెళ్లుగా తీయని బట్టలు నాకు ఛాలెంజ్‌ చేస్తున్నట్టే అనిపించాయి. దాదాపు 7 కిలోల బరువు తగ్గాను. ఇది కొంచెం సంతోషం కలిగించే విషయం. కానీ డయాబెటిక్‌ అనే వ్యాధి ఉండటం వల్ల ప్రతిసారి ఒళ్ళు జగ్రత్తగా పెట్టుకోమనే మిత్రుల శ్రేయోభిలాషుల సలహాలు సూచనలు ప్రతిక్షణం నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి.

… … …

ఏమో నేనంత శ్రద్ధతో ప్రేమతో రాసి ఉండకపోవచ్చు. కానీ ఇవన్నీ నేను ఇంకా శ్రద్ధగా స్పష్టంగా రాసే ఓపిక తెచ్చుకుని నన్ను నేను మెచ్చుకుని రాయాలి. సెల్ఫ్‌ అప్రిసియేషన్‌ చాలా తక్కువ నాకు.

ఈ సమయంలో కొందరు మంచిస్నేహితుల పరిచయం ఏర్పడింది. సినిమాల గురించి పుస్తకాల గురించి విపరీతంగా చర్చించు కుంటున్నాం. నచ్చని వాళ్ళను నిర్దయగా బఅటతీఱవఅస కూడా చేసాను. నా ఫేస్‌బుక్‌ లిస్ట్‌లో నుంచి దాదాపు 1500 మందిని బఅటతీఱవఅస చేసాను.

ఏందో గురున్నంతవరకు ఇలా ఇప్పటి వరకు సాగిపోయింది కాలం. రాయమని టాగ్‌ చేసిన రమాసుందరి గారికి ధన్యవాదాలు.

తమ లాక్డౌన్‌ అనుభవాలు రాయాల్సిందిగా నేను శిలాలోలిత గారిని ఆహ్వానిస్తున్నాను.

ఓపిగ్గా చదివినందుకు మీ అందరికి ధన్యవాదాలు. సెలవు.

Share
This entry was posted in కరోనా డైరీస్. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.