కనిపించని ఒక శత్రువుతో మానవులందరం యుద్ధం చేస్తున్నాం అని కొరోనా గురించి అరటున్నారు. కానీ నా మట్టుకు నాకు నాపై నేనే యుద్ధం చేస్తున్నట్లుగా ఉంది. మొఖానికి మాస్క్‌తో ఊపిరి సరిగా అరదక చీటికి మాటికి మాస్క్‌ని తొలగించకుండా ఉండటా నికి, ఎక్కడికైనా వెళితే చేతులతో ఏదీ తాక్కురడా ఉండటానికి, ఎంతటి ఆత్మీయులు ఎదురుపడ్డా తాక్కుండా నిగ్రహించుకోటానికి, అత్యవసరమై తప్పిస్తే ఎక్కడికీ వెళ్ళకుండా కాళ్ళు చేతులు మూతీ ముక్కు నా అరతట నేనే కట్టేసుకుని విప్పకుండా ఉరడటానికి నిరంతరం ప్రయత్నిస్తూ, ఓడిపోతూ ”I షaఅః్ పతీవa్‌ష్ట్ర” అని ఇక్కడా గట్టిగా అరవాలని ఉరది. నాలాగే అరదరికీ ఇదే ఫీలింగ్ కచ్చితంగా ఉండే ఉంటుంది.
మొన్నటి వరకు కొరోనా ఎంత ప్రమాదకరమైనా మన జాగ్రత్తలో మనం ఉరటే, అరటే మాస్క్ ధరించటం, చేతులు తరచూ సానిటైజ్ చేసుకోవటం, భౌతికదూరం పాటించటం చేస్తే కొరోనా మనదాకా రాకురడా ఉంటుంది అనే భరోసా ఏదో బలంగా ఉరడేది. మా ఆఫీస్ స్టాఫ్ ఎక్కడైనా కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా మా మేడం సత్యవతిగారు ఏం మొహమటం లేకురడా కోప్పడ్తూ వార్నింగ్‌లు ఇస్తూ మమ్మల్ని అప్రమత్తంగా ఉండేలా చేశారు. ఆమె ఆ టైమ్‌లో కోప్పడ్డా మేమందరం మనందరి జాగ్రత్త కోసమే కదా ఆమె చెప్తున్నారు అని ఆమె పట్ల ఇంకా గౌరవం పెరిగింది.
అరత జాగ్రత్తగా సత్యవతిగారు, ప్రశారతిగారు ఉండబట్టే అరదరికంటే ఎక్కువగా వారు సిటీ అరతా తిరుగుతూ అతిథి కార్మికుల్ని స్వస్థలాలకు పంపటం గురించి, వారి తిండి తిప్పల గురించి నిరంతరం ఆలోచిస్తూ అరదర్నీ సమీకరిస్తూ సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వాలు చేయలేని పనుల్ని చేయగలిగారు. కూరగాయలు, పాలు, రేషన్ ఇవ్వటం కోసం భయపడకుండా రెడ్‌జోన్ల దగ్గరకు వెళ్ళటం ప్రమాదం అని తెలిసినా క్వారంటైన్ సెరటర్లకు వెళ్ళి వారితో మాట్లాడటం, రాత్రి పగలు అనే ధ్యాస లేకురడా పని చేయడం చెప్పినంత రాసినంత సులువు కాదు. ఇదంతా దగ్గరుండి చూట్టం మాకు ఎంతో స్ఫూర్తిని ధైర్యాన్ని ఇచ్చింది. అరదరం కలిస్తే ఎలారటి కష్టసాధ్యమైన పనినైనా చెయ్యగలమనే నమ్మకం, కొండంత ఆత్మవిశ్వాసం మాకరదరికీ వచ్చింది. మేమూ వారితో పాటు అప్పుడప్పుడూ అవసరమైన చోటుకి వెళ్ళి కమ్యూనిటీకి సరుకులు ఇవ్వటం, ఆ టైంలో అవసరమైన ఇతర పనులు చేయటం, అలాగే మేం సురక్షితంగా ఉరటూ వారిని సురక్షితంగా ఉంచటానికి, వారు భౌతిక దూరం పాటించేట్టు చేయడానికి, వారితో మాస్కులు ధరింప చేయడానికి ఎన్నో అవస్థలు పడ్డాం. అయినా ఈ మాత్రం సహాయమైనా మేము కష్టాల్లో ఉన్నవారికి ‘భూమిక’ నుండి అరదజేయగలిగాం అన్న సంతృప్తిని పొందాం.
కానీ రోజు రోజుకి పెరుగుతున్న కొరోనా కేసులు, మరణాలు ప్రభుత్వాలు ఏమీ చేయలేక చేతులెత్తేయడం ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉంది. ఇంకా ఎన్ని చూడాలో! ఎన్ని నెలలు ఇలా అవస్థలు పడుతూ ఉరడాలో అని ఆందోళనగా ఉంది. ఎంతో కొంత భద్రమైన జీవితంలో ఉన్న నాకే ఇలా ఉరటే మరి తినటానికి తిండిలేక, చేసేందుకు పనుల్లేక, బయటకెళితే ఎక్కడి నుండి కొరోనా అరటుకుంటుందోనని నిత్యం భయపడుతూ పనిచేయకుంటే జరగని కుటుంబాల సంగతి ఆలోచించటానికే దుఃఖంగా ఉంది. మన చుట్టూ ఉన్న పేదవారు, ఆర్థికంగా కష్టాల్లో ఉద్యోగాలు పోగొట్టుకొని బాధలు పడుతున్న రక్తసంబంధీకులు, హెల్ప్‌లైన్‌లో కుటుంబ సభ్యుల నుంచే ఎన్నో రకాల బాధల్ని, హింసల్ని అనుభవిస్తున్న ఆడవాళ్ళ గొంతుల్ని వింటుంటే దుఃఖం ఆవరిస్తోంది. స్వయంగా ఆ బాధల్ని అనుభవిస్తున్న వారి గురించి ఆలోచిస్తే గుండె బరువెక్కుతోంది.
ఎటువంటి పరిస్థితుల్లోనూ ‘భూమిక’ పని ఆగకూడదు అనే దృఢనిశ్చయంతో వుంటూనే ‘భూమిక’లో పని చేసే స్టాఫ్‌కు ఏమీ కాకూడదని ఆలోచించి, మమ్మల్ని సురక్షితంగా ఉంచేందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు మా సత్యవతి గారు, ప్రశాంతి గారు. రెరడు తెలుగు రాష్ట్రాల్లోని సర్వైవర్స్‌కి మేం నిరంతరం అరదుబాటులో ఉండేవిధంగా కాలానుగుణంగా పరిస్థితులనుబట్టి పని పద్ధతుల్ని మారుస్తూ పని ఆగకుండా చేస్తున్నాం అరటే వీటన్నిటి వెనుక నిరంతరం శ్రమిస్తూ, ఆలోచిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ, స్ఫూర్తిని ఇస్తున్నందువల్లే. మీ వెనక ఎల్లప్పుడూ మేమున్నాం అనే భరోసాని నిత్యం ఇస్తున్న వారిద్దరికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు. కృతజ్ఞతలు.
చివరగా ఒక్క మాట. కొరోనా కారణంగా ఎంతో మంది బ్రతుకులు చితికిపోయాయి. అరదులో మన బంధువులు, స్నేహితులు, పరిచయస్థులు ఉరటారు. చాలామంది సహాయం అడగటానికి మొహమాటపడ్తూ ఉండొచ్చు. మనమే చొరవ తీసుకొని మనకున్నంతలో వారికి సహాయం చేద్దాం. ఎన్ని కష్టాలొచ్చినా మానవత్వం మాసిపోలేదని మనందరం కలిసి నిరూపిద్దాం !