‘‘కూర్చునే హక్కు – కార్మికుల మానవ హక్కు’’ – కొండవీటి సత్యవతి

ఒకప్పుడు షాపింగ్‌కి వెళ్తే మనకి వస్తువులు చూపించే సేల్స్‌ గర్ల్స్‌, సేల్స్‌ బాయ్స్‌ కూర్చోడానికి చిన్నచిన్న స్టూల్స్‌ లాంటివి ఉండేవి. కస్టమర్స్‌ ఎవరూ లేకపోతే వాళ్ళకి కూర్చోగలిగిన వెసులుబాటు ఉండేది. దాదాపు పది సంవత్సరాల నుండి సేల్స్‌ సెక్షన్స్‌లో పనిచేసే వారు ఎనిమిది నుంచి పది గంటల వరకు నిలబడే ఉండాల్సిన పరిస్థితి ఈ రోజు మనం గమనిస్తున్నాం.

పెద్దపెద్ద మాల్స్‌ కెళ్ళినా, సూపర్‌ బజార్లకు వెళ్లినా ఇవే దృశ్యాలు చాలా కాలంగా మనకు కనబడుతున్నాయి. ఇలాంటి మాల్స్‌, హైపర్‌ మార్కెట్లు, సూపర్‌ బజార్లలో పనిచేస్తున్న వేలాది మంది యువతీ యువకులు కొన్ని నిమిషాలైనా కూర్చోగలిగిన పరిస్థితి లేకపోవడం చాలా అన్యామం. తమ షాపులకు వచ్చే కస్టమర్ల కోసం వస్తువులు చూపించాలి, బిల్లింగ్‌ చేయాలి, గైడ్‌ చేయాలి. కానీ పనిచేసే సమయంలో ఈ ఉద్యోగులు ఎదుర్కొనే పెద్ద సమస్య – ఎనిమిది నుండి పది గంటలు వరకూ నిరంతరం నిలబడి ఉండాల్సిన పరిస్థితి.
మనుష్యులనే వాళ్ళు ఎవరైనా ఒక గంటపాటు నిలబడి ఉంటే కాళ్లు నొప్పి, నడుము నొప్పి వస్తుంటాయి. అయితే ప్రతిరోజూ గంటల తరబడి నిలబడి పనిచేస్తున్న ఈ యువతీ యువకులు ఎలాంటి శారీరక, మానసిక కష్టాలు ఎదురొంట్టున్నారో మనం ఊహించలేము.. ఇది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు – ఇది మానవ హక్కుల సమస్య కూడా.
తెలంగాణ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ యాక్ట్‌, 1988 ఏమి చెబుతుందో చూద్దాం. ఈ చట్టం ప్రకారం షాపుల్లో, మాల్స్‌ కానీ ఇతర చోట్ల కానీ పనిచేసే కార్మికులు రోజుకు 8 గంటల కంటే ఎక్కువ పనిచేయకూడదు. 5 గంటల తర్వాత తప్పనిసరిగా అర్ధగంట విరామం ఇవ్వాలి. వారానికి కనీసం ఒక రోజు సెలవు ఉండాలి. ఓవర్‌టైమ్‌కి రెట్టింపు వేతనం ఇవ్వాలి. అయితే ప్రాక్టికల్‌గా ఈ నిబంధనలు చాలా చోట్ల పాటించబడడం లేదు. ముఖ్యంగా, ఉద్యోగులకు కూర్చునే సౌకర్యం ఇవ్వక పోవడం మరీ అమానుషం. ఇప్పటికే తమిళనాడు, కేరళ రాష్ట్రాలు ఇప్పటికే ఁRఱస్త్రష్ట్ర్‌శ్‌ీ ూఱ్‌ఁ అనే చట్టం తీసుకొచ్చారు.
తెలంగాణలో కూడా ఈ చట్టం అవసరం గురించి ప్రయత్నం చెయ్యల్సిన అవసరం ఉంది. ఇది వారి న్యాయమైన హక్కు. షాపులు, మాల్స్‌ తదితర చోట్ల పనిచేస్తున్న వీరంతా కార్మికులు. వారు మానవులే గానీ యంత్రాలు కావు. వారికి తగిన విశ్రాంతి ఇవ్వడం, కూర్చునే సౌకర్యం కల్పించడం యజమానుల బాధ్యత.
మాల్స్‌, షాపింగ్‌ సెంటర్లలో పనిచేసే ఉద్యోగులకు కూర్చునే హక్కు చట్టబద్ధంగా ఇవ్వాలి. లేబర్‌ డిపార్ట్మెంట్‌ పర్యవేక్షణను కఠినతరం చేయాలి. పౌర సమాజం ఈ అంశాన్ని పట్టించుకుని విస్తృతంగా రాయాలి. వీరిలో అవగాహన పెంచాలి. వినియోగదారులుగా మనం కూడా ఈ ఉద్యోగుల పట్ల సహానుభూతి చూపాలి. ఎనిమిది గంటలు నిలబడి పనిచేయడం అనేది మానవత్వానికి విరుద్ధం. ఇలా నిలబడే ఉండి కస్టమర్స్‌తో వ్యవహరించాలి అనే రూల్‌ ఏమన్నా ఉన్నదా అని ఆశ్చర్యం కలుగుతుంది. లేబర్‌ డిపార్ట్మెంట్‌ ఈ అంశం మీద దృష్టి పెట్టినట్టుగా కనబడలేదు.
షాప్స్‌లో, పెద్ద మాల్స్‌లో పనిచేస్తున్న కార్మికులు వాళ్ళు ఇచ్చే చిన్న చిన్న జీతాలకు గత్యంతరం లేని పరిస్థితులలో పనిచేస్తున్నారు. ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి ముందుకొస్తున్న ఎంతోమంది యువతీ యువకులకు కనీసం కొంత సేపైనా కూర్చోవడానికి అవకాశం లేకపోవడం మాల్స్‌, సూపర్‌ మార్కెట్లో పనిచేయడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం చాలా ఉంది. కాళ్ల నొప్పులు, నడుం నొప్పి, మెడ నొప్పి ఇవన్నీ కూడా వాళ్లని కుంగ తీస్తాయి. తప్పనిసరి పరిస్థితుల్లో వేలాది మంది ఇలాంటి ఉద్యోగాల్లో కొనసాగుతున్నారు.
ఈ అంశం మీద ఇప్పుడిప్పుడే కొంతమంది మాట్లాడుతున్నారు. వారికి కనీస మానవ హక్కులు కూడా లేకుండా అన్ని గంటలసేపు నిలబడి పని చేయించుకోవడం చాలా అన్యాయమే కాక అమానుషం కూడా. అందరం ఈ అంశం మీద మాట్లాడదాం. వారికి సపోర్టుగా నిలబడదాం. వినియోగదారులుగా ప్రతి రోజూ వాళ్ళని ఆయా మాల్స్‌, సూపర్‌ బజార్‌ లలో చూస్తూనే ఉంటాం. వాళ్ళ కోసం నిలబడదాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.