Category Archives: సంపాదకీయం

సంపాదకీయం

తల్లిపొత్తిళ్ళకు బిడ్డల్ని దూరం చేయడం నేరమే -కొండవీటి సత్యవతి

ఇటీవల యూనిసెఫ్‌ హైదరాబాద్‌లో ఒక మీటింగ్‌ నిర్వహించింది. ‘‘ఆరోగ్యం`పోషకాహారం`తల్లిపాలు’’ అంశాల మీద ఈ సమావేశం జరిగింది. తల్లిపాలు అంశాల మీద ఎక్కువ ఫోకస్‌తో వక్తలందరూ మాట్లాడారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) – కొండవీటి సత్యవతి

సెక్స్‌ వర్క్‌… సెక్స్‌ వర్కర్‌… పునరావాసం!! (ఇటీవల సుప్రీమ్‌ కోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యంలో) ఈ మధ్య కొన్ని ఆలోచనలు నన్ను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ప్రపంచం మొత్తంమీద అతి పురాతనమైన వ్యవస్థ వ్యభిచారం. వ్యభిచారం చుట్టూ అల్లుకుని ఉన్న భావజాలం, అందులో చిక్కుకున్న మహిళల జీవితాలు ఈ మధ్య చాలా దగ్గరగా చూడగలిగిన అవకాశాలు దొరికాయి. … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

యాపచెట్టు – కొండవీటి సత్యవతి

ఉగాది వెళ్ళిపోయిన పది రోజులకి తీరిగ్గా ఇంటి ముందున్న వేపచెట్టు గుబురుల్లో కూర్చుని గొంతు విప్పిన కోయిలను చూసి హమ్మయ్య! కోయిల పాట వినబడిరది. ఈ సంవత్సరానికి మొదటి కోయిల పాట. కోయిల వాలిన వేపచెట్టు కొత్త చిగుళ్ళు, మెరుస్తున్న కొత్త ఆకులు, గుత్తులు గుత్తులుగా తెల్లటి పూతతో కళకళలాడుతోంది.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

మన్యం సిగలో పువ్వు గుడిస – కొండవీటి సత్యవతి

రాజమండ్రికి వెళ్ళింది ఆఫీస్‌ పనిమీద ఒకరోజు ఆఫీస్‌కి, ఒకరోజు నాకు. రంపచోడవరం, చిలకమామిడి, మారేడుమిల్లి, గుడిస. ఒక్కరోజు ప్రోగ్రాంలో ఇన్నింటిని ఇరికించాను.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అలుపెరుగని పోరాట కెరటం మల్లు స్వరాజ్యం – కొండవీటి సత్యవతి

నిజాం రాజరికంలో… కరుడుగట్టిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణాని అతలాకుతలం చేస్తూ… గ్రామాలకు గ్రామాలే వెట్టి చాకిరీతో విలవిల్లాడుతోన్న సమయాన దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు కార్యకర్తలు చట్టపరంగా ఎన్నో సభలూ సమావేశాలూ నిర్వహిస్తూ తమ పోరాటాలను ఉధృతం చేశారు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘‘ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌’ -సత్యవతి

నేను డిగ్రీలో ఉన్నప్పుడు మా చరిత్ర అధ్యాపకురాలు వసంత గారు నాకు ఇంగ్లీషు పుస్తకాలు చదవడం అలవాటు చేశారు. డిగ్రీలో స్పెషల్‌ ఇంగ్లీషు ఒక సబ్జక్టుగా ఉండడం వల్ల కూడా ఇంగ్లీషు నవలలు చదివే అవకాశం దొరికింది. ఇంగ్లీషు చదవడం నేర్చుకున్నాను కానీ

Share
Posted in సంపాదకీయం | Leave a comment

భారతదేశపు ప్రప్రథమ ఉపాధ్యాయిని సావిత్రీబాయి – కొండవీటి సత్యవతి

సావిత్రీబాయి ఫూలే… భారతదేశ స్త్రీలు నిత్యం తలచుకోవాల్సిన పేరు. కానీ, పురుషాధిక్య సమాజంలో బతుకుతున్నాం కదా! సంస్కర్తలంటే మనకు పురుషులే గుర్తొస్తారు. రాజారామ్మోహన్‌ రాయ్‌, కందుకూరి వీరేశలింగం వగైరాలు గుర్తొస్తారు కానీ సావిత్రీబాయి,

Share
Posted in సంపాదకీయం | Leave a comment

16 రోజుల యాక్టివిజం కాదు… 365 రోజుల ఉద్యమం కావాలి – కొండవీటి సత్యవతి

నవంబరు 25 నుండి డిసెంబరు 10 వరకు స్త్రీలపరంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భిన్నమైన కార్యక్రమాలు జరుగుతాయి. చాలా సంవత్సరాలుగా ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీద అమలవుతున్న హింసకు వ్యతిరేకంగా నవంబరు 25ని ‘వయొలెన్స్‌ అగైనెస్ట్‌ ఉమెన్‌’ డే

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అక్కాచెల్లెళ్ళు వస్తున్నారు బంధనాలు తెంచుకుని – నాయిషా హసన్‌, అనువాదం : పి. ప్రశాంతి

‘‘ఇంటి పనులు ఎవరు చెయ్యాలి’’ వంటి ప్రశ్నలకు జవాబుగా కమలా భాసిన్‌ సహజ శైలిలో ఇంకో ప్రశ్న సంధించేది, ‘‘ఇంటి పనులు చేయడానికి గర్భసంచి అవసరమా?’’ మహిళల ఉనికితో ముడిపడున్న సంప్రదాయాల ఉచ్చుతాళ్ళను తెంచి వారిని

Share
Posted in సంపాదకీయం | Leave a comment

నేను ఒక అమ్మాయిని కాబట్టి, నేను తప్పక చదువుకోవాలి `- కమలా భాసిన్‌ అనువాదం : కుప్పిలి పద్మ

ఒక తండ్రి తన కూతురిని అడిగాడు చదువుకోవాలా? నువ్వెందుకు చదువుకోవాలి? నాకు చదువుకునే కొడుకులు ఉన్నారు అమ్మాయివి నీకు చదువెందుకు?

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఉప్పొంగే అమ్మాయిలు – కమలా భాసిన్ అనువాదం : ఎస్. వేణు గోపాల్

అమ్మాయిలు గాలులలాగ తయారవుతారు తడబడకుండా వీచడమే గాలుల ఆనందం తమను నిష్కారణంగా అడ్డుకుంటే ఆ గాలులు ఒప్పుకోవు

Share
Posted in సంపాదకీయం | Leave a comment

హక్కుల ఉద్యమకారిణి జయశ్రీ – కొండవీటి సత్యవతి

జయశ్రీ గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో జయశ్రీది కంగు కంగున మోగే ఒక ధిక్కార స్వరం. ఒకవైపు అధికారులతో నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ మరోవైపు బాధాతప్తులకు అండగా నిల్చే జయశ్రీది కడప జిల్లాలో ఒక బలమైన గొంతు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

‘‘నాటు’’ అని వెక్కిరించి కొట్టేయడం సరికాదు – కొండవీటి సత్యవతి

చిన్నప్పుడు ఆటల్లో దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే గాయపాకు పసరు వేస్తే చటుక్కున రక్తం కారడం ఆగిపోయేది. గాయం మెల్లగా మానిపోయేది. ఆ కాలానికి అది వైద్యమే. నల్లేరు కాడల చారు కడుపును చక్కగా శుభ్రపరుస్తుంది. అదీ ఒక వైద్యమే. ఇన్ని రకాల టూత్‌పేస్టులు దండెత్తని రోజుల్లో వేపపుల్ల, సరుగుడు పుల్లలు, ఉత్తరేణి పుల్లలు

Share
Posted in సంపాదకీయం | Leave a comment

కరోనా మృత్యుఘోష ` పట్టని ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులు – కొండవీటి సత్యవతి

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న కల్లోలం, విధ్వంసం గమనిస్తుంటే, పిట్టల్లా రాలిపోతున్న మనుషుల్ని చూస్తుంటే, గుండెల్లోంచి పొంగుకొస్తోన్న దుఃఖం గొంతులో సుడులు తిరుగుతుంటే ఓదార్పు కోసం ఏ దిక్కు చూడాలి, ఎవరి భుజాన్ని అడగాలి, ఎవరి గుండెమీద వాలి భోరున ఏడవాలి? సంవత్సర కాలంగా జరుగుతున్న దారుణ పరిణామాలు, మనిషికి మనిషి కాకుండా పోతున్న వైనాలు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

పులిమీద పుట్ర -కొండవీటి సత్యవతి

పొద్దున్నే సరోజ ఫోన్‌. ఇంత పొద్దున్న ఆమెకు క్షణం తీరికుండదు. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు పరుగెత్తాలి. స్కూళ్ళు మొదలయ్యాయి కూడా. ఫోన్‌ ఎత్తాను. ‘‘ఏంటీ, ఈ రోజు ఉదయాన్నే తీరికైంది’’ అన్నాను నవ్వుతూ. అటువైపు మాటల్లేవు. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ‘‘సరోజా ఏమైందే. అందరూ

Share
Posted in సంపాదకీయం | Leave a comment

ఆడపిల్లల జీవితాలను అల్లకల్లోలం చేసే వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన -సత్యవతి

”అష్ఠ వర్షాత్‌ భవేత్‌ కన్యా” అంటే ఎనిమిదేళ్ళు వచ్చిన బాలిక కన్య కిందే లెక్కకట్టి ఎనిమిదేళ్ళు నిండకుండా పెళ్ళి చేయాలి అనేది ఒకప్పటి నియమం. పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కథ రాసిన గురజాడ ఉద్దేశ్యం బాల్య వివాహాలు చెయ్యొద్దని చెప్పడమే. అయితే ఈ కథ చదివిన వాళ్ళు, దృశ్యంగా చూసిన వాళ్ళు కడవల కొద్దీ కన్నీళ్ళు … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment