భూమిక జూన్ 2008
వారం రోజుల క్రితం ఫోన్‌లో మాట్లాడారు. అండమాన్‌యాత్రా విశేషాలు చదివి చాలా సంతోషపడ్డానని, నీ వచనం కవిత్వంలా వుంది. ‘దుప్పట్లో దూరిన సముద్రం సన్నగా గురకలు పెట్టినట్టు చిరు కెరటాల సవ్వడి’ ఈ వాక్యం చాలా బావుందోయ్.
పూర్తిగా చదవండి »
కొండవీటి సత్యవతి మే 2008
2001 మార్చి మొదటి తారీఖు నాటికి భారతదేశ జనాభా ఒక బిలియన్. అంటే వందకోట్లు.
ఈ ఏడేళ్ళ కాలంలో మరిన్ని కోట్ల మంది పుట్టి వుంటారు. ఈ విషయంలో మనం నెంబర్ టూ పోజిషన్‌కు చేరుకున్నాం.
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2008
'’మేము మాకోసం పోరాడ్డం లేదు. మా తరువాత తరం కోసం పోరాడుతున్నాం.
ఈ అడవి మా తాత ముత్తాతలకు చెందింది.
ఇక్కడ మేము ఎలా ప్రశాంతంగా బతికామో మా తరువాత తరం కూడా ఇలాగే బతకాలి.
పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2008
భూమికకు పదిహేనేళ్ళు నిండాయి. ఒక సీరియస్ స్త్రీల పత్రికకు ఎడిటర్‌గా నాకు పదిహేనేళ్ళు గడిచాయి. నిజానికి ఎంతో ఆనందంగా పదిహేనేళ్ళ పండుగ జరుపుకోవాల్సిన సందర్భం.
పూర్తిగా చదవండి »
కొండవీటి సత్యవతి నవంబర్ 2007
పదిహేను సంవత్సరాలుగా భూమికను ఆదిరిస్తూ, మాకు కొండంత అండగా నిలబడిన ప్రియపాఠకులకు నమస్కారం. భూమిక మాస పత్రికగా మారి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది.
పూర్తిగా చదవండి »
భూమిక అక్టోబర్ 2007
జూలై మూడు 2007. రాజ్కోట్ వీధుల్లో పూజా చౌహాన్ అనే మహిళ లోదుస్తులు మాత్రమే ధరించి తన నిరసనని ప్రపంచానికి తెలియచెప్పింది.
పూర్తిగా చదవండి »
భూమిక సెప్టెంబర్ 2007
ఆగష్టు ఆరవ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాలులో ‘’పాలపిట్ట పాట - ప్రత్యేక తెలంగాణా పోరాట పాటలు'’ వరవరరావు రాసిన పాటల సిడీల ఆవిష్కరణ సభ జరిగింది. మా భూమి సినిమాలో ‘’పల్లెటూరి పిల్లగాడా'’ పాటతో జనం నాలుకల మీద ఈనాటికీ నిలిచిన సంధ్య, విమల, రడం శ్రీను, పుష్ప, వెంకట్ల పాటలు వినడానికి ఎంతో ఉత్సాహంలో ఆ మీటింగుకు వెళ్ళడం జరిగింది. మీటింగు మొదలవ్వడానికి ముందు అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నాం.
పూర్తిగా చదవండి »
భూమిక ఆగస్టు 2007
భూమిక పాఠకులకు, అభిమానులకు నమస్కారం. భూమిక అజేయ ప్రయాణం ప్రారంభించి దాదాపు పదిహేను సంవత్సరాలు కావస్తోంది. త్రైమాస పత్రికగా మొదలై, ద్వైమాస పత్రికగా కొనసాగి ప్రస్తుతం మాసపత్రికగా నిలదొక్కుకున్నది. అన్వేషి అండదండలతో తొలి అడుగు వేసినా, అచిర కాలంలోనే స్వయంసిద్ధగా ఎదిగింది. ఒక ప్రత్యామ్నాయ స్త్రీవాద పత్రికగా తన లక్ష్యాలు, ఉద్దేశ్యాల విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ రోజు వరకు దృఢంగా నిలబడగలిగింది. అశేష పాఠకుల అపారమైన ఆదరాభిమానాలు మూటగట్టుకుని తెలుగు సమాజం మీద తనదైన ముద్రను బలంగా వేయగలిగింది.
పూర్తిగా చదవండి »
కొండవీటి సత్యవతి జులై 2007
సునీతా విలయమ్స్. స్ఫూర్తికి మారు పేరు. సంచలనాల చిరునామా. అంతరిక్షంలో 195 రోజులు గడిపిన తొలి మహిళ. చిరునవ్వుల సునీత భారత సంతతికి చెందడం, ఇంత ఘనమైన ప్రపంచ రికార్డును సాధించడం, అపూర్వం. అపురూపం. భారతీయులందరికి గర్వకారణం. భారతీయ మహిళలకు స్ఫూర్తిదాయకం. ఆకాశం మా హద్దంటూ నినదించిన మహిళోద్యమం, ఇక నుండి అంతరిక్షం మా ధ్యేయం అంటూ సునీత స్ఫూర్తిని గర్వంగా స్వీకరిస్తుంది. పూర్తిగా చదవండి »
భూమిక జూన్ 2007
కల్పనా శర్మ. హిందూ పేపర్ చదివే వారికి ఈ పేరు సుపరిచితమే. ముంబయ్ హిందూ చీఫ్ బ్యూరో గాను, డిప్యూటీ ఎడిటర్‌గాను పని చేస్తున్న కల్పన మే నెలాఖరుకి తన పదవి నుంచి రిటైర్ కాబోతున్నారు. మే 24 న ఆమె అరవై ఏళ్ళకు చేరుకుంది. ఈ సందర్భాన్ని మహిళా జర్నలిష్టుల నెట్‌వర్క్, బెంగుళూరు విభాగం వారు చక్కగా సెలబ్రేట్ చేసారు. కల్పనా శర్మ గౌరవార్ధం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి »
భూమిక మే 2007
మన రాష్ట్రం ఎంతో సొగసైన చేనేత సొబగులను కలిగి వుంది. బహు నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న అద్భుతమైన చేనేత కళాకారులు వున్నారు. రాష్ట్రం నలుమూలలా విస్తరించి వున్న ఈ కళాకారులు క్రమంగా ఉపాధిని కోల్పోతూ కుంచించుకు పోతున్నారు. పొట్ట గడవని స్థితిలో ఆత్మహత్యల వేపు నెట్టబడుతున్నారు. చేతిలో అద్భుతమైన నేత కళ వుండి కూడా ఆదరణ కరువై, చేసిన ఉత్పత్తికి తగిన గిట్టుబాటు ధర లేక సరైన ప్రభుత్వ సహకారం, విధాన నిర్ణయం కరువై వీరు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో వున్నారు.
పూర్తిగా చదవండి »
భూమిక ఏప్రిల్ 2007
పెద్ద చేప చిన్న చేపను మింగుతుంది. ఫుడ్ బజార్లు ప్రవేశించి ఎన్నో సూపర్‌బజార్లను మింగేసాయి. జెయింట్‌లు, బిగ్ బజార్లు వచ్చి ఫుడ్ బజార్లను దెబ్బతీసాయి. ఇపుడు తాజా కూరగాయలు, తాజా పండ్లు అందిస్తాం అంటూ తాజాగా మార్కెట్‌లో ప్రవేశించిన “ఫ్రెష్” సూపర్ మార్కెట్లు, నగరంలో ఎక్కడెక్కడ కూరగాయలు అమ్మే స్థలాలున్నాయో, అక్కడే తమ దుకాణం తెరిచి దశాబ్దాలుగా కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్ముకుని బతికే వాళ్ళ పొట్టల మీద చావుదెబ్బ కొడుతోంది. ఈ ఫ్రెష్ దుకాణాల్లో ఎ.సిలు పెట్టి, తూచుడు మెషీన్లు పెట్టి తక్కువ ధరలకే కూరలు, పండ్లు అనే ప్రకటనలు గుపించడంతో మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాల వారు ఈ దుకాణాల వేపు మళ్ళి పోతున్నారు. ఎంతో ఆర్భాటంగా పెట్టిన రైతు బజార్లు ఎందుకూ కొరగానివిగా తయారవ్వబోతున్నాయి. పూర్తిగా చదవండి »
భూమిక మార్చ్ 2007
సునీతా విలియమ్స్ అంతరిక్షంలోకి దూసుకెళ్ళి అక్కడే మకాం పెట్టిన ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన రోజు వుండాలని మీరింకా ఎందుకనుకుంటున్నారు? అంటూ ఇటీవల ఒక విలేఖరి నన్ను ప్రశ్నించాడు. అంతర్జాతీయ మహిళా దినం మార్చి ఎనిమిది గురించి నన్ను ఇంటర్వ్యూ చేస్తూ అతను పై ప్రశ్న వేసాడు. సునీత అంతరిక్ష యానం ఈ దేశంలోని ఆడవాళ్ళందరి సమస్యలను హాంఫట్ మని ఊదేయగలిగితే బాగానే వుంటుంది. పూర్తిగా చదవండి »
భూమిక ఫిబ్రవరి 2007
షర్మిలా ఇరామ్, 35 సంవత్సరాల మణిపూర్ ఉక్కు మహిళ నిరవధిక నిరాహారదీక్ష మొదలుపెట్టి ఏడు సంవత్సరాలు దాటుతోంది. మణిపూర్‌లోనే కాక మొత్తం ఈశాన్య రాష్ట్రాల్లో 48 సంవత్సరాలుగా అమలులో ఉన్న అమానుష చట్టం ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్స్) చట్టాన్ని (ఎఎఫ్ఎస్‌పిఎ) కి వ్యతిరేకంగా షర్మిల నవంబర్ 2000 లో తన అమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టింది. నవంబరు 2, 2000, షర్మిల జీవితాన్ని అనూహ్యమైన మలుపుతిప్పిన రోజు. పూర్తిగా చదవండి »
కొండవీటి సత్యవతి జనవరి 2007
భూమిక పాఠకులకు నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు
2006 సంవత్సరంలో స్త్రీలపరంగా చూసినపుడు చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. భారతీయ స్త్రీలు అనేక రంగాల్లో అద్భుత విజయాలు సాధించి జయకేతనాలెగరేసారు. భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా ఆశయాన్ని, రోదసికి ఎగిసి వెళ్ళి సాధించగలిగింది. ప్రపంచంలోనే శక్తివంతమైన వ్యాపారవేత్తగా ఇంద్ర నూయీ ఎదగగలిగింది. పూర్తిగా చదవండి »
భూమిక డిసంబర్ 2006
మానవ ప్రవృత్తి వైపరీత్యాల ఫలితం…
ఒకటిన్నర దశాబ్ద కాలంగా స్త్రీల సమస్యల గురించి, స్త్రీల అంశాల గురించి భూమిక చేస్తున్న కృషి మీకందరికి తెలుసు. ఈ కృషిలో భాగంగానే గత సంవత్సరం, అంతర్జాతీయ ఎయిడ్స్ దినం సందర్భంగా, స్త్రీల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్న హెచ్ఐవి/ ఎయిడ్స్ పై ప్రత్యేక సంచికను వెలువరించాం. రెండో ప్రయత్నంగా, ఆంధ్రదేశాన్ని మరింత అతలాకుతలం చేస్తున్న ఈ సమస్యమీద మేము తెచ్చిన ప్రత్యేక సంచిక మీ చేతుల్లో వుంది.
పూర్తిగా చదవండి »