ఒంటరితనాల్లోంచి స్వతంత్ర మహిళలుగా ఎదుగుతున్న వైనం – కొండవీటి సత్యవతి – –

‘‘అప్పుల్జేసి నా మొగుడు ఉరేసుకుని సచ్చాడు. ముగ్గురు పిల్లల్తో నేను రోడ్డున పడ్డాను. పోలీసోడు వచ్చి ఏమంటడు. నీతో కొట్లాడి, నువ్వు తిడితే సచ్చాడట కదా! నేను వలవలా ఏడుస్తుంటే పక్కింటోళ్ళని ఎంక్వయిరీ చేస్తడు. ఈమె మంచిదేనా, మొగుడిని తిట్టి

సతాయిస్తదట నిజమేనా? ఆడు మనిషేనా, ఆ పోలీసోడు. ఏడకి పోయినా ఇదే మాట. ఎమ్మార్వో, కలెక్టర్‌ ఇదే కూత. నేనేం చేయాలి? నా పిల్లల్నేం చెయ్యాల’’
‘‘నా భర్త వ్యవసాయం చేస్తడు. మాకు భూమి లేదు. కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తడు. ప్రతి ఏటా నష్టమే. అయినా కౌలు కట్టాలి. వ్యవసాయం చెయ్యకుండా పట్నంలో కాలుమీద కాలేసుకుని ఏ.సి.లో కూర్చునేటోళ్ళకు రైతుబంధు లచ్చలు లచ్చలు బ్యాంకులో పడతాయి. ఒకరోజు చేలోనే నా మొగుడు పురుగుల మందు తాగి సచ్చిపోయాడు. చేతికందని పంట, అప్పులు, అవమానాలు. సచ్చి తన దారి తాను చూసుకున్నడు. నా బతుకేంటని ఆలోచించలేదు. పిల్లలేమైతారని కూడా చూడలేదు. నాకు పొలం లేదు. ఇల్లు లేదు. ఇద్దరు చిన్నపిల్లలు. నష్టపరిహారం రాలేదు.’’ దుఃఖంతో ఆమె మాట్లాడలేకపోయింది.
ఁూఱఅస్త్రశ్రీవ పబ్‌ చీశ్‌ీ Aశ్రీశీఅవఁ పేరుతో యాక్షన్‌ ఎయిడ్‌ ఆధ్వర్యంలో నిన్న జరిగిన ఒక సమావేశంలో ఇద్దరు మహిళలు మాట్లాడిన మాటలివి. ఆ ఇద్దరే కాదు పదుల సంఖ్యలో ‘‘ఒంటరి’’ మహిళలు తమ దుఃఖ గాధల్ని వినిపించారు. తాగి తాగి చచ్చిన భర్తల గురించి చాలామంది మాట్లాడారు.
ఒకామె కోపంతో ఊగిపోతూ ‘‘మా మొగోళ్ళకు పీకల్దాకా తాగించి చంపేసి మా మొకాన వితంతు పెన్షన్‌లు కొడతారా? మాకు మీ పించెన్లొద్దు. మా ఊళ్ళో వైన్‌ షాపులు తీసేయండి. మా కొడుకులు కూడా తాగి తాగి చస్తున్నారు. మా కోడళ్ళకి వితంతు పింఛన్లిస్తున్నారు. మీరిచ్చే రెండు వేలతో మేము బతకాలా? తాగుళ్ళాపితే మా కుటుంబాలు బాగానే ఉంటాయి. మందు షాపులు బందు చెయ్యండి. లేదంటే మేమే బొంద పెట్టేస్తాం’’. ఎవ్వరికీ నోట మాట రాలేదు. కంట్లోకి నీళ్ళొచ్చాయి.
అసలు ఇంతమంది ఒంటర్లెందుకయ్యారు? వితంతువులెందుకయ్యారు? మగవాళ్ళు ఎందుకు తొందరగా చనిపోతున్నారు. కోవిడ్‌ తర్వాత భారత దేశంలో లక్షలాదిమంది భర్తల్ని కోల్పోయారు. కోవిడ్‌లో పురుషులే ఎక్కువగా ఎందుకు చనిపోయారో? ఈ స్త్రీలందరికీ ‘‘కోవిడ్‌ విడోస్‌’’ అని ఓ పేరు పెట్టారు. కోవిడ్‌ విషయం పక్కన పెడితే… నిన్నటి సమావేశంలో ఒకామె తన ప్రసంగంలో ఎన్ని కేటగిరీల ఒంటరి మహిళలున్నారో చెబుతుంటే చాలా ఆశ్చర్యమనిపించింది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరు.
కశ్మీర్‌లో ‘‘హాఫ్‌ విడో’’ సగం వితంతువు. కశ్మీర్‌లో మగవాళ్ళు, మగపిల్లలు మాయమైపోవడం సర్వసాధారణం. మిలటరీ వాళ్ళు, పోలీసులు ఎత్తుకెళ్ళి మాయం చేసినవారు వేలల్లో ఉంటారు. సంవత్సరాలు గడిచినా వాళ్ళ ఆచూకీ తెలియదు. బతికున్నారో, మరణించారో, చంపేశారో తెలియదు. హఠాత్తుగా భర్తలు మాయమైపోయిన కశ్మీరీ భార్యల కడగండ్లు వర్ణనాతీతం. వీరికి ‘‘హాఫ్‌ విడో’’ అనే ఓ పేరిచ్చి వదిలేశారు.
పశ్చిమ బెంగాల్‌లో ‘‘టైగర్‌ విడోస్‌’’ అట. ఎంతో సుందరమైన సుందర్‌బన్‌ దీవుల్లో 3000 కు పైగా ‘‘టైగర్‌ విడోస్‌’’ ఉన్నారు. వీరి భర్తలందరూ సుందర్‌బన్‌ మంగ్రూవ్‌ అటవీ ప్రాంతంలో నివసించే బెంగాల్‌ టైగర్ల చేత చంపబడినవారే. ఆ ప్రాంతంలో 100కు పైగా బెంగాల్‌ టైగర్లు సంచరిస్తూ ఉంటాయి. అటవీ ఉత్పత్తుల కోసం, తేనె కోసం ముఖ్యంగా చేపల వేట కోసం అడవుల్లోకి వెళ్ళే పురుషుల్ని పులులు చంపడం వల్ల ఈ ప్రాంతంలో మూడు వేల మంది స్త్రీలు భర్తల్ని కోల్పోయి వితంతువులుగా మారిపోయారు. భర్తల్ని, జీవనాధారాల్ని కోల్పోయిన ఈ మహిళల జీవితాలు దుర్భర దారిద్య్రంలో కుంగిపోయినా వారే ఇప్పుడు సుందర్‌బన్‌ అడవుల్ని రక్షించే పనికి పూనుకొన్నారు. సుందర్‌బన్‌ నేషనల్‌ పార్క్‌ అంతటా విస్తరించిన ‘‘సుందరి చెట్టు (మంగ్రూవ్స్‌) ను కాపాడుతున్నారు. ఏ అడవుల్లో పులుల వల్ల తమ భర్తల్ని కోల్పోయారో ఆ అడవుల్ని రక్షించే పనుల్లో ‘టైగర్‌ విడోస్‌’ నిమగ్నమై ఉన్నారు. సుందరి చెట్లను మరింత సుందరంగా తీర్చిదిద్దుతూ పర్యావరణాన్ని రక్షిస్తున్నారు. తమ జీవితాల్లోని సంక్షోభాలను దాటి సమాజసేవలో నిమగ్నమవుతున్నారు వీరంతా.
ఒడిస్సాలో మంత్రగత్తెల పేరుతో ఇళ్ళనుండి గెంటేయబడిన ఒంటరి మహిళలు చాలా మంది ఉన్నారు. ఆస్తుల కోసం, రకరకాల ఇతర కుటుంబ కారణాలతో స్త్రీల మీద మంత్రగత్తె పేరుతో చంపడం ఒంటరివాళ్ళను చేయడం జరుగుతోంది. ముఖ్యంగా వితంతువులను మంత్రగత్తెలుగా ముద్రవేసి దారుణంగా హింసించి చంపడం లేదా వాళ్ళని వెలివేసి కుటుంబం నుంచి, గ్రామం నుంచి గెంటేయడం జరుగుతోంది. ఒడిస్సాలో మూఢ నమ్మకాల వ్యతిరేక చట్టం అమలులో ఉన్నప్పటికీ మంత్రగత్తె ముద్రవేసి దారుణంగా చంపేయడం ఒంటర్లను చేయడం ఇంకా కొనసాగుతోంది.
ఇక వ్యవసాయ వృత్తిలో భర్తల్ని కోల్పోయి, వితంతువులుగా, ఒంటరివాళ్ళుగా మారిన మహిళలు దేశవ్యాప్తంగా లక్షల్లో ఉన్నారు. కోట నీలిమ రాసిన ఁఔఱసశీషం శీట పఱసaతీపష్ట్రaఁ పుస్తకం చదివినప్పుడు వ్యవసాయంలో నష్టాలొచ్చినపుడో, అప్పులు పెరిగిపోయినప్పుడో పురుషులు ఆత్మహత్యలు చేసుకుంటే ఆ స్త్రీల జీవితాల్లోని విషాదం, దారిద్య్రం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఈ సంపాదకీయం రాస్తున్నపుడు కూడా దేశంలో ఎక్కడో ఓ చోట రైతు బలవన్మరణానికి పాల్పడి ఉంటాడు. రైతు ఆత్మహత్య లేని రోజు లేదంటే అతిశయం కాదు. తామెంతో శ్రమించే, ప్రేమించే పొలాల్లోనే పురుషులు పురుగుల మందు తాగి, చెట్లకు ఉరేసుకుని చనిపోతుంటే వాళ్ళ కుటుంబాల పరిస్థితేంటి? హఠాత్తుగా వితంతువులుగా, ఒంటరిగా మారిపోతున్న ఈ స్త్రీలు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎన్నో సుడిగుండాలను దాటాల్ని ఉంటుంది. తన భర్తలాగా ఆమె కుటుంబాన్ని, పిల్లల్ని తమ మీద ఆధారపడిన పెద్దల్ని వదిలేసి తానూ ఆత్మహత్య చేసుకోవాలనుకోదు. తన జీవితంలో ముంచుకొచ్చిన కల్లోలాల్ని ఆర్థిక సంకోచాలని అదీగమించడానికి ప్రయత్నిస్తుంది. సడిగుండాలని దాటడానికి ప్రయత్నిస్తుంది. ఉరమని పిడుగులా తనమీద పడిన భర్త ఆత్మహత్య కల్పించిన దుఃఖాన్ని, వేదనని దిగమింగుకుని ఒంటరి యుద్ధాలకి తయారైన ఇలాంటి మహిళలు నిన్నటి సమావేశంలో తమ పోరాటాల చరిత్రల్ని, తమ బలమైన గొంతుల్ని వినిపించిన మహిళల్ని చూశాక వాళ్ళని ఒంటరివాళ్ళని, వితంతువులనే ఏడుపుగొట్టు పిలుపుల్ని వదిలేసి వాళ్ళే అసలు సిసలైన మహిళలు, సాధికారత పొందిన మహిళలు అనాలనిపించి మీటింగ్‌లో చెప్పేసాను కూడా. ఈ రోజు వాళ్ళంతా తమ కాళ్ళమీద తాము నిలబడటమే కాదు తమ కుటుంబాలకు ఆధారమయ్యారు. తమలాంటి స్త్రీలతో సంఘటితమయ్యారు. సామూహిక స్వరాలై తమ సమస్యల మీద నినదిస్తున్నారు.
ప్రభుత్వాలు, పౌర సమాజం అండగా ఉంటే ఈ మహిళలంతా కలిసి తమ చరిత్రల్ని తామే సొంతంగా తిరగరాసుకుంటారు. బాధిత పదాన్ని తుడిచిపెట్టేసి విజయవంతమైన, సాధికార, స్వతంత్ర మహిళలుగా రూపొందుతారు. సంఘాలు పెట్టి పోరుబాటలో ఉన్నవారంతా రాష్ట్రస్థాయిలో ఫెడరేషన్లు పెట్టుకుని ఉద్యమించాలని, తమ సమస్యల్ని, అంశాల్ని ప్రభుత్వ దృష్టికి తేవాలని కోరుకుంటూ, నా వంతు సహకారం తప్పకుండా ఉంటుందనే హామీతో… ఒంటరి మహిళలంతా సంఘటితమై సమూహంగా రూపొందాలని కోరుకుంటూ…

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.