Monthly Archives: April 2024

ఏప్రిల్, 2024

ఏప్రిల్, 2024

Share
Posted in కవర్ పేజీ | Leave a comment

జీవితాన్ని వెలిగించేవి పుస్తకాలు – కొండవీటి సత్యవతి

నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పుస్తకాలు, పేపర్లు కనబడని ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం. ఐదో తరగతి వరకూ పలక మీదే చదువు సాగింది. టెక్ట్స్‌ బుక్కులు, నోట్‌ బుక్కులు అంటే ఏంటో కూడా అప్పటికి తెలియదు. ఆరో తరగతి చదవడం కోసం మా ఊరి ఎలిమెంటరీ స్కూల్‌ వదిలి కొంచెం దూరంలోని హైస్కూల్‌కి … Continue reading

Share
Posted in సంపాదకీయం | Leave a comment

స్త్రీవాదం అంటే ప్రేమించటం! – బెల్‌ హుక్స్‌

అనువాదం: సునీత అచ్యుత ఆడవాళ్ళూ, మగవాళ్ళూ ప్రేమ గురించి తెలుసుకోవాలని మనం భావిస్తే స్త్రీవాదాన్ని మనసారా కోరుకోవాలి. స్త్రీవాద ఆలోచన, ఆచరణ లేకుండా మన మధ్య ప్రేమ బంధాలకు పునాది ఏర్పడదు. మొదట్లో మగవాళ్ళతో సంబంధాల్లోని తీవ్ర అసంతృప్తి ఆడవాళ్ళని స్త్రీ విముక్తి వైపు నడిపించింది.

Share
Posted in ధారావాహికలు | Leave a comment

ఏమమ్మా, అంతర్జాతీయతమ్మ! ఆకాశంలో సగానికి ఇవన్నీ ఇస్తావా? – అపర్ణ తోట

ఈ మార్చి నెల మూడు సమూహాలకు ప్రత్యేకమైనది. మార్చ్‌ 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం! మార్చ్‌ 3న అంతర్జాతీయ రచయితల దినోత్సవం. అలానే మార్చ్‌ 21న అంతర్జాతీయ కవుల దినోత్సవం.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

మెంటల్‌ క్రైసిస్‌ రాకముందే మేల్కొనాలి – వి.శాంతి ప్రబోధ

‘‘చ్చో… చ్చో… పాపం. గిట్ల నడి మంత్రాన బిడ్డ పానం పాయే. మైకు ముందట పెట్టిన్రని మనసు లోపటి ముచ్చట సంతోశంగ చెప్పే. గిట్ల పరేషాన్‌ జేసి పానం మింగే.. పానం కల కల అయితాంది’’ వాకిలి శుభ్రం చేసి లోనికి వస్తూ అంది యాదమ్మ.

Share
Posted in కిటికీ | Leave a comment

నిర్ణయం – డా॥ ఎ.ఆర్‌.సత్యవతి

‘ట్రింగ్‌… ట్రింగ్‌…’ కాలింగ్‌ బెల్‌ మోగడంతో ఉలిక్కిపడి లేచింది నీరజ. అప్పుడే పాలవాడు వచ్చేసాడు అనుకుంటూ డోర్‌ ఓపెన్‌ చేసి పాలు తీసుకుంది. స్టవ్‌ మీద పెట్టి ‘అమ్మో! ఆరయిపోయింది. ఈ రోజూ ఆఫీసుకి లేటే…’ అనుకుంటూ కిచెన్‌ సర్కస్‌ మొదలుపెట్టింది.

Share
Posted in కధలు | Leave a comment

మరో కోణంలో ‘మంచి పుస్తకం’ – పద్మ వంగపల్లి

మంచి పుస్తకం ప్రస్థానం 2003 హైదరాబాద్‌ బుక్‌ ఫేర్‌లో పాల్గొనటంతో మొదలయింది. 2004 ఏప్రిల్‌లో పబ్లిక్‌ ట్రస్ట్‌గా నమోదయింది. దీని పునాదులు 1989లో మొదలై, పదేళ్ళ పాటు పనిచేసిన ‘బాల సాహితి’ అన్న ట్రస్టులో ఉన్నాయి. ఆ పదేళ్ళకాలంలో బాల సాహితి 40కి పైగా పుస్తకాలు ప్రచురించింది. మంచి పుస్తకం వ్యవస్థాపక ట్రస్టీలుగా కె.సురేష్‌, ఎ.రవీంద్రబాబు … Continue reading

Share
Posted in పుస్తకం | Leave a comment

టు కిల్‌ ఎ టైగర్‌ – కె.శాంతారావు

అటు సామాజిక కార్యకర్తలకు (సోషల్‌ యాక్టివిస్ట్‌లకు) ఇటు చలనచిత్ర నిర్మాణ దర్శకులకు (ఫిల్మ్‌ మేకర్స్‌కు) ఏకకాలంలో గొప్ప పాఠం అందించేలా వచ్చిన డాక్యుమెంటరీ దృశ్య కావ్యం ‘టు కిల్‌ ఎ టైగర్‌’.

Share
Posted in డాక్యుమెంటరీ | Leave a comment

అలా కొందరి జీవితకథలు – పి.సత్యవతి

డాక్టర్‌ భార్గవి ‘అలా కొందరు’ అంటూ మనకు జ్ఞాపకం చేసిన ఆ పదిహేను మంది జీవిత కథలలో కొన్ని మనసుని మెలిపెడతాయి, ప్రశ్నార్థకాలవుతాయి. ప్రపంచానికి వెలుగులు చిమ్మి తమ బ్రతుకుల్ని చీకటి చేసుకున్నారెందుకని దిగులు పడతాం. నలుగురు నడిచిన నలిగిన దారిలో ఎందుకు నడిచారు కాదు? వారి జీవితం నల్లేరు మీద నడక ఎందుకు కాలేదు? … Continue reading

Share
Posted in పుస్తక పరిచయం | Leave a comment

టాలీవుడ్‌లో సుహాస్‌ ఎక్కువకాలం ఉండడు, ఉండనివ్వరు – విజయ్‌ సాధు

గొప్పోళ్ళు నేరం చేసినా అది లోకకళ్యాణం కోసమే అంటార్రా… అదే మనలాంటి తక్కువోళ్ళు మంచి చేసినా, దాన్ని క్షమించరాని నేరంగానే చూస్తారు రా సంజీవ్‌, మనం జైలుకు పోకూడదు, మనం ఉండాలి, ఇక్కడే ఉండాలి, ఉండి తీరాలి.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

స్వాతి ముత్తిన మళె హనియె – వాడ్రేవు వీరలక్ష్మీదేవి

ప్రేమ కథలు చదవడం కానీ చూడటం గాని నాకు ఎప్పుడూ ఇష్టమే. ఇంత కాలంగా ప్రేమ గురించి కవిత్వాలు, కథలు ఎందరో చెప్పారు. ఇంకా ఇంకా చెప్తూనే ఉన్నారు. అయితే మళ్ళీ చెప్పాలనుకునే వాళ్ళు ఎంతో ప్రతిభావంతులైతే తప్ప ఆ ప్రేమకథ మనల్ని కదిలించలేదు. అలాంటి ఒక ప్రత్యేకమైన మర్చిపోలేని ప్రేమకథ ఉన్న కన్నడ సినిమా … Continue reading

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న క్షయవ్యాధి – రితాయన్‌ ముఖర్జీ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రపంచంలోని మొత్తం క్షయవ్యాధి రోగులలో దాదాపు మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంత మురికివాడలకు చెందినవాళ్ళు. ఈ రోగులలో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. దీని నుంచి కోలుకున్న రోగుల కుటుంబాలు ఒకవైపు తమ ఆర్థిక భారాన్ని, ఇతర ఖర్చులను భరిస్తూనే, ఈ రోగుల పట్ల నిరంతర సంరక్షణను, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జన వారధి’ – శాంతిశ్రీ బెనర్జీ

తెలుగు సాహిత్యంలో మహిళలు వ్రాసిన స్వీయ చరిత్రలు అతి తక్కువ. అందుకే కొండపల్లి కోటేశ్వరమ్మ గారి స్వీయ చరిత్ర ‘నిర్జన వారధి’ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించి చదవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ మధ్య వచ్చిన రెండు స్వీయచరిత్రల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో కోటేశ్వరమ్మ గారి ‘నిర్జన వారధి’ (2012) మొదటిది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేవదాసి వ్యవస్థను రద్దు చేయించిన దేవదాసీ బిడ్డ – డాక్టర్‌ దేవరాజు మహారాజు

అనువాదం : రవికృష్ణ్ల సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి, వాళ్ళని వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకుని, తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు, ఇతరత్రా వాడుకునేవారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్‌ మొఘల్స్‌ – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

భారతదేశ చరిత్రలో తీవ్రంగా వివాదాస్పదం చేయబడుతున్న భాగాల్లో మొఘలుల చరిత్ర ప్రధానమైనది. ఎంత తీవ్రంగా వీరి చరిత్ర వివాదాస్పదమౌతోందో, అంతే పెద్ద ఎత్తున వీరి చరిత్రపై పుస్తకాలూ వెలువడుతున్నాయి. అలా ఇటీవల వెలువడ్డ ఒక ముఖ్యమైన పుస్తకం ప్రొఫెసర్‌ ఫర్హత్‌ నస్రీన్‌ రచించిన ద గ్రేట్‌ మొఘల్స్‌.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మాలతీ చందూర్‌ నవలా మంజరి`4, స్త్రీ పాత్రల వైవిధ్యం – మమత వేపాడ

వ్యాస సంగ్రహం: మాలతీ చందూర్‌ అనే పేరు సాహితీ ప్రియులకు చాలా సుపరిచితమైనది. తెలుగు సాహిత్యానికి కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అది ఎలా అంటే ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం మాలతి చందూర్‌ రాసిన ‘ప్రమధావనం’ కాలమ్‌ 40 ఏళ్ళు నిరాటంకంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment