మెంటల్‌ క్రైసిస్‌ రాకముందే మేల్కొనాలి – వి.శాంతి ప్రబోధ

‘‘చ్చో… చ్చో… పాపం. గిట్ల నడి మంత్రాన బిడ్డ పానం పాయే.
మైకు ముందట పెట్టిన్రని మనసు లోపటి ముచ్చట సంతోశంగ చెప్పే. గిట్ల పరేషాన్‌ జేసి పానం మింగే.. పానం కల కల అయితాంది’’ వాకిలి శుభ్రం చేసి లోనికి వస్తూ అంది యాదమ్మ.

స్వార్థ రాజకీయాల కోరల్లో చిక్కి ప్రాణం పోగొట్టుకున్న గీతాంజలి వీడియో కళ్ళముందు మెదిలింది.
ఓ ప్రైవేటు ఇంటర్వ్యూలో ఇంటి పట్టా అందుకున్న ఆనందాన్ని భావోద్వేగంతో పంచుకుంది గీతాంజలి. అదే ఆమె పాలిట శాపంగా మారి జీవితమే లేకుండా పోయింది. ఆమె భావోద్వేగ ప్రకటన కొందరికి కంటగింపైంది. అతి దారుణంగా ట్రోల్‌ చేశారు. అసభ్యకరమైన కామెంట్లలో వాడిన భాష, తనతో పాటు తన వాళ్ళని కూడా కలిపి తిట్టిన బూతులు ఆమెను కలవరపెట్టాయి. సున్నిత మనస్కురాలైన ఆమె అనుచిత వ్యాఖ్యలు తట్టుకోలేక మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడిరది.
సంతోషాన్ని పంచుకున్న గీతాంజలి మాటల్ని ఒక పార్టీ వైరల్‌ చేసింది. కౌంటర్‌గా ప్రతిపక్షం విమర్శిస్తూ ట్రోల్‌ చేసింది. ఇద్దరూ చేసింది రాజకీయ ప్రయోజనం కోసమే. ఆ ఇద్దరి మధ్యలో ఆ అమ్మాయి జీవితం పోయింది. పిల్లలు తల్లి లేని బిడ్డలయ్యారు.
మనిషి ఎందుకింత స్వార్థంగా సంకు చితంగా మారిపోతున్నాడు? ఎదుటి వారిని ఎందుకు సహించలేకపోతున్నారు? మానసిక ఆరోగ్యం పోయి సైకోల్లాగా ఎందుకు తయారవుతున్నారు? మానవ సంబంధాలకు హాని కలిగిస్తున్నారు?
గీతాంజలి స్థానంలో మరొకరు, అంటే పురుషులయితే అలాగే ట్రోల్‌ చేసేవారా. చేసినా ఇటువంటి అసభ్య పదజాలంతో చేసేవారా… ఏమో! మహిళలయితే చేసేవారేమో!
ఎందుకంటే తెలుగునాట ఎంతోమంది మహిళలు ట్రోల్‌కి గురికావడం తెలిసిందే కదా. సంధ్య, దేవి, సుజాత వంటి
ఉద్యమకారులు, తులసి చందు, స్వాతి వంటి జర్నలిస్టులు, మెర్సీ మార్గరెట్‌, మల్లీశ్వరి, కొండేపూడి నిర్మల వంటి కవయిత్రులు, రచయిత్రులూ, స్మితా సబర్వాల్‌ వంటి అధికారులూ… ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో ట్రోల్‌కి గురయ్యారు, అవుతూనే
ఉన్నారు.
ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగం వారి గురించి చెప్పనక్కరలేదు. అనసూయ, శ్రీరెడ్డి వంటి వారి నుంచి నేపథ్య గాయని సునీత వరకు అంతా ట్రోల్‌ బాధితులే.
వీళ్ళేమిటి ఓ ముఖ్యమంతి భార్య భారతి కావచ్చు, మరో ముఖ్యమంత్రి కూతురు కవిత కావచ్చు, మహిళా మంత్రి రోజా కావచ్చు… ట్రోల్‌కి అనర్హులేమీ కాదు. కాకపోతే, వాళ్ళపై ట్రోల్‌ జరిగినప్పుడు ట్రోలర్‌ ఎవరో జల్లెడ వేసి పట్టుకుంటారు, శిక్షిస్తారు.
ఎన్నికల సమయం కదా… సామాన్యు రాలైన గీతాంజలి మరణం తర్వాత కూడా ట్రోలర్స్‌ని పట్టుకున్నారు. అంతే తేడా. స్వప్రయోజనం కోసం మూకదాడులు చేసే గుంపుల్ని పెంచి పోషించేది ఒక మతానికి చెందినవాళ్ళు, రాజకీయ పార్టీల వాళ్ళు.
ఒక మహిళ తన అభిప్రాయాల్ని వ్యక్తీ కరిస్తున్నా, వ్యక్తిగా ఎదుగుతున్నా భరించలేని అసహనం, కుళ్ళుబోతు తనంతో తమలోని క్రూరత్వాన్ని బయట పెట్టుకుంటారు. ఎదుటి వారిపై బురద జల్లి అగౌరవపరుస్తారు. తద్వారా వారి ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసి వెనక్కి నెట్టేందుకు చేసే ప్రయత్నమే ఈ ట్రోల్‌.
ఆన్‌లైన్‌ వేదికగా నిత్యం ఏదో ఒక సందర్భంలో మహిళలు ట్రోల్‌ బారిన పడుతూనే ఉన్నారు. అత్యంత నీచంగా ట్రోలింగ్‌ జరుగుతున్నప్పటికీ చాలామంది ఇంట్లో వాళ్ళకి కూడా తమ బాధ చెప్పుకోలేక ఆ దాడిని మౌనంగా భరిస్తున్నారు లేదా తమ సోషల్‌ మీడియా అకౌంట్‌ మూసుకుం టున్నారు. కొందరు అత్యంత సన్నిహితులైన మిత్రులతో పంచుకున్నప్పటికీ ఫిర్యాదు చేయడం లేదు.
అందుక్కారణం ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియకపోవడం కావచ్చు. తెలిసినప్పటికీ యంత్రాంగం చేతులెత్తేయడం వల్ల కావచ్చు లేదా పరువు, మర్యాద మంటకలుస్తాయన్న భయం కావచ్చు.
యంత్రాంగం దగ్గర ఆన్‌లైన్‌ వేధింపు లపై అనేక ఫిర్యాదులు ఉన్నప్పటికీ తగిన చర్యలు తీసుకోవడంలేదు ఎందుకని? ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంటే ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు కదా. తగిన మందీ మార్బలం లేని యంత్రాం గం బాధితురాలినే మౌనం వహించమని చచ్చు సలహాలు ఇస్తున్నారు. నేరస్థుడు ముసుగు వేసుకొని నేరం చేసి తప్పించు కుంటున్నాడు. బలవంతుడినని విర్రవీగు తున్నాడు. అది కూడా ట్రోల్‌ పెరగడానికి కారణం.
మన రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 19(1) (ఎ) వ్యక్తి స్వేచ్ఛను కలిగిస్తుంది. మహిళల ఆన్‌లైన్‌ వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు జాతీయస్థాయిలో ఒక పోర్టల్‌ అందుబాటులో ఉంది. పోలీస్‌ స్టేషన్‌కి వెళ్ళకుండానే షషష.షవపవతీషతీఱఎవ. స్త్రశీఙ.ఱఅ లో ఫిర్యాదు చేయవచ్చు.
కొందరి విషయంలో ఆగమేఘాల మీద స్పందించే అధికార యంత్రాంగం ప్రతి మహిళ చేసే ఫిర్యాదుకి అదే విధంగా స్పందించే రోజు ఎప్పుడొస్తుందో… మన కున్న చట్టాలు మనం తెలుసుకొని, మన హక్కులు మనం కాపాడుకునేది ఎప్పుడో.

Share
This entry was posted in కిటికీ. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.