జీవితాన్ని వెలిగించేవి పుస్తకాలు – కొండవీటి సత్యవతి

నేను పుట్టింది ఒక మారుమూల గ్రామంలో. పుస్తకాలు, పేపర్లు కనబడని ఓ పెద్ద ఉమ్మడి కుటుంబం. ఐదో తరగతి వరకూ పలక మీదే చదువు సాగింది. టెక్ట్స్‌ బుక్కులు, నోట్‌ బుక్కులు అంటే ఏంటో కూడా అప్పటికి తెలియదు. ఆరో తరగతి చదవడం కోసం మా ఊరి ఎలిమెంటరీ స్కూల్‌ వదిలి కొంచెం దూరంలోని హైస్కూల్‌కి వెళ్ళినపుడు కూడా పుస్తకాలను గుండెకానించుకున్న జ్ఞాపకం లేదు.

పుస్తకాలంటే ఏంటో తెలియని రోజులు. లైబ్రరీలుంటాయని అస్సలు తెలియదు. పదో తరగతి వరకు చదివింది సంస్కృతం. ఓరియెంటర్‌ టెంత్‌ క్లాస్‌. ఇక్కడ వల్లె వేయడమే ఎక్కువ. అయినా గొప్ప గొప్ప కావ్యాలుగా ప్రాచుర్యంలో ఉన్న మేఘసందేశం, మృచ్ఛ కటికం, కాదంబరి, చంపూరామాయణం, అమర కోశం లాంటి పుస్తకాలు మా సంస్కృతం మాస్టారు చాలా బాగా చెప్పేవారు. వినడం వరకే. అప్పటికీ పుస్తకాలు చేతుల్లోకి రాలేదు. మేఘ సందేశం కావ్యం విన్నాక ఆ పుస్తకం చదివితే బాగుండునని అన్పించేది. కానీ అవన్నీ మా మాస్టారి దగ్గరే ఉండేవి. పుస్తకాలు చదవాలనే కోరికకు నాంది పడిరది ఈ సంస్కృత కావ్యాల వల్లనే అనేది మాత్రం వాస్తవం.
నేను ఎనిమిదో తరగతిలోకి వచ్చేటప్పటికి లీడర్‌గా ఎదగడం మొదలైంది. స్కూల్‌ పీపుల్‌ లీడర్‌గా నన్ను మా హెడ్‌మిస్ట్రెస్‌ కన్యాకుమారి ఎంపిక చేశారు. ఆవిడే నా చదువు కొనసాగడానికి సహాయం చేశారు. అదంతా ఇంకొక కథ. ఎనిమిది నుండి పదో తరగతి వరకు మనమే ఎస్‌పిఎల్‌. నాయకత్వ లక్షణాలు ప్రోదిచేసుకుంటున్న లేత వయసు. మా స్కూల్లో పుస్తకాలతో నిండుగా ఓ బీరువా ఉండేది. దానికి తాళం వేసి ఉండేది. నేను స్కూల్‌ లీడర్‌ని కదా కన్యాకుమారి గారు ఆ తాళం నాకిచ్చారు. పుస్తకాలతో పాటు కొన్ని ఆట వస్తువులు కూడా ఉండేవి ఆ బీరువాలో.
ఆ బీరువా తలుపులు తెరవడం నా జీవితంలో మరిచిపోలేని మధురానుభవం. ఆ చిన్న బీరువా నా విశాల ప్రపంచానికి కూడా తలుపులు తీసింది. రోజూ ఒక్కో పుస్తకం చదవడం మొదలుపెట్టాను. అప్పటికి ఆ పుస్తకాల్లో ఏముంటుంది? ఎవరు రాశారు? ఎలా చదవాలి అనే విషయాలేవీ నాకు తెలియదు. దొరికిన పుస్తకాన్ని దొరికినట్టు చదవడమే. అదొక తీరని దాహం లాగా తయారైంది. ఆ రోజుల్లో ఆ బీరువాలోంచి తీసుకుని చదివిన ‘‘కుక్కపిల్ల ఆత్మకథ’’ ఇప్పటికీ నాకు (డెబ్భై సంవత్సరాల తర్వాత) గుర్తుంది. మనుష్యులు, ముఖ్యంగా పిల్లలు తనను ఎలా హింసించారో కుక్కపిల్ల చెప్పిన కథ అది. చాలా వేగంగా బీరువాలో పుస్తకాలన్నీ చదివేశాను. రచయితలెవరు? కథలా, నవలా? కవిత్వమా ఏమీ తెలియదు. అలా ఆ బీరువా, ఆ పుస్తకాలు నా జీవితాన్ని పెనవేశాయి. పుస్తకాల మీద విపరీతమైన ప్రేమని ప్రోది చేశాయి.
ఆ రోజుల్లో నాకు ప్రేమ్‌చంద్‌ ‘గోదాన్‌’ అనువాద నవల చదివే యోగం పట్టింది. అది కూడా అంచెలంచెలుగా. మా స్కూల్‌ దగ్గరే మా మేనమామ వాళ్ళ మేడ ఉండేది. మా సంస్కృతం మాస్టారి ఇల్లు ఆ మేడ ఎదురుగా ఉండేది. మాస్టారి కూతురు స్వరాజ్యం నా క్లాస్‌మేట్‌, ఫ్రెండ్‌ కూడా. స్వరాజ్యం వాళ్ళింటికి వెళ్ళినపుడు మా మేనమామ ఇంటికి వెళ్ళేదాన్ని. మేడమీద మా మేనబావ రూమ్‌లో చాలా ఇంగ్లీష్‌ పుస్తకాలు ఉండేవి. ప్రేమ్‌చంద్‌ ‘గోదాన్‌’ కూడా ఉండిరది. ఇంగ్లీష్‌ నాకు రాదు కాబట్టి వాటిని ముట్టలేదు. గోదాన్‌ తీసుకుని చదవటం మొదలుపెట్టాను. ఇంటికి వెళ్ళాలి. పుస్తకం ఇవ్వమంటే ఇవ్వనన్నాడు. పాడు చేస్తావు నేనివ్వను, ఇక్కడికే వచ్చి చదువుకో అన్నాడు. చాలా పెద్ద పుస్తకం గోదాన్‌. అలా కొన్ని రోజుల పాటు వాళ్ళింటికెళ్ళి ఆ పుస్తకాన్ని పూర్తి చేశాను. ప్రేమ్‌చంద్‌ అంటే చాలా ఇష్టమైంది అప్పటి నుంచి.
ఇంటర్‌లోకొచ్చాక లెక్చరర్లు ఇంగ్లీష్‌ పుస్తకాలు చదవమని ప్రోత్సహించారు. ఇంగ్లీషంటే భయపడే నేను మెల్లిగా ఇంగ్లీష్‌ నవలలు చదవడం మొదలుపెట్టాను. ఏమి నవలలు చదివానో ఇప్పుడు గుర్తులేదు. ఇంటర్‌లో స్పెషల్‌ తెలుగు చదవడం, తెలుగు లెక్చరర్‌ హనుమాయమ్మ గారి ప్రోత్సాహంతో చాలా తెలుగు పుస్తకాలు చదివాను. కాలేజీ లైబ్రరీ నుండి పుస్తకాలు ఇంటికి తెచ్చుకోవడంతో ఇంటికెళ్ళాక కూడా ఎప్పుడూ చేతిలో పుస్తకాలతోనే కనబడేదాన్ని. ఇదో ‘‘పుస్తకాల పురుగు’’ అనే బిరుదు తెచ్చుకున్నాను.
డిగ్రీలో స్పెషల్‌ ఇంగ్లీష్‌ సబ్జక్టుగా చదివాను. షేక్‌స్పియర్‌ నాటకాలు, మిల్టన్‌, కీట్స్‌, షెల్లి కవిత్వం సబ్జెక్టుగానే చదివారు. థామస్‌ హార్టీ రాసిన ‘మేయర్‌ ఆఫ్‌ కేస్టర్‌ బ్రిడ్జ్‌’ నవల చాలాకాలం నన్ను వెంటాడిరది. ఆర్‌.కె.నారాయణ్‌ ‘‘ది ఇంగ్లీష్‌ టీచర్‌’’ కూడా ఇప్పటికీ గుర్తుంది. గ్రీకు నాటకం ‘ఆంటిగాన్‌’లోని విషాదం, విలియం వర్డ్స్‌వర్త్‌ ‘డాఫడిల్స్‌’ కవిత మా ఇంగ్లీష్‌ లెక్చరర్లు శాంత, సుందరి గార్లు క్లాసులో చెప్పిన తీరు ఇంకా కళ్ళముందు కనిపిస్తోంది. ‘‘ఆకాశంలో మబ్బులాగా ఒంటరిగా నేను తిరుగాడుతున్నప్పుడు నేలమీద, ఏటి గట్టున బంగారు రంగు ‘డేఫడిల్‌’ పూలు గుత్తులు గుత్తులుగా, గుంపులు గుంపులుగా నాకు కనబడ్డాయి. ఆ పూలన్నీ నాట్యం చేస్తున్నాయి’’ అని వర్డ్స్‌వర్త్‌ రాసిన కవితని మా సుందరి మేడం ఎంత అద్భుతంగా చెప్పేవారో. ఇంగ్లీషు సాహిత్యం అలవాటు చేసిన హిస్టరీ లెక్చరర్లు వసంత, లలిత గార్లు, శాంత, సుందరి మేడం, హనుమాయమ్మ, కస్తూరీ మేడం… వీరంతా నాకు ప్రాతఃస్మరణీయులు. పుస్తకాల విశాల ప్రపంచంలోకి నన్నొక పక్షిలాగా ఎగరేశారు వీళ్ళు. వాళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను, పుస్తకాల రుణం. 1975లో హైదరాబాద్‌ వచ్చాక కొన్నాళ్ళు పుస్తకాలు లేవు. కొనుక్కోవడానికి డబ్బుల్లేవు. ఆదివారాలు ఆర్టీసీ సీజన్‌ టికెట్‌ కొనుక్కొని హైదరాబాద్‌ నలుమూలలా తిరగడం మొదలుపెట్టాక పేవ్‌మెంట్ల మీద సెకండ్‌ హ్యాండ్‌ పుస్తకాలు కళ్ళబడ్డాయి. అబిడ్స్‌ బాటా షాప్‌ దగ్గరనుండి జీపీఓ సాగర్‌ థియేటర్‌ వరకూ గంటలు గంటలు నడుస్తూ పుస్తకాలు చూసేదాన్ని. చవకగా దొరికే పుస్తకాలు కొనుక్కోవడం, ఆబగా చదవడం… అలా ఒకసారి శరత్‌ శ్రీకాంత్‌ నవల, గోపీచంద్‌ మెరుపులూ మరకలు, ప్రేమ్‌చంద్‌ పుస్తకాలు దొరికాయి. శ్రీకాంత్‌ నవల చదవడం నాకో గొప్ప అనుభవం, అలాగే మెరుపులూ మరకలూ కూడా. మెల్లగా బుచ్చిబాబు, చలం, రంగనాయకమ్మ, యద్ధనపూడి సులోచనారాణి పుస్తకాలు దొరకడం, చదవడం. పుస్తకం దొరికితే చదివేదాకా నిద్ర పట్టదు. అఫ్ఘల్‌ గంజ్‌లోని స్టేట్‌ లైబ్రరీకి వెళ్ళడం అలవాటైంది. శారద అని అక్కడ పనిచేసే ఒకామె నన్ను ఆ లైబ్రరీకి పరిచయం చేసింది. దాంతో పుస్తకాల సముద్రంలో మునిగినట్లైంది.
ఆ తర్వాత పుస్తకాల షాపుల్లో గంటలు గంటలు గడిపేదాన్ని. కాళ్ళు పీకుతున్నా ఒక ర్యాక్‌ తర్వాత ఇంకో ర్యాక్‌ వెతుకుతూ నిలబడేదాన్ని. విశాలాంధ్ర, నవోదయ పుస్తకాల షాప్‌లకి రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని. ఎన్ని సంవత్సరాలైందో ఈ షాప్‌లకి వెళ్ళి. అప్పట్లో పుస్తకం కొనుక్కోవడం, పేరు రాసి తేదీ వేసుకోవడం మహా ఇష్టంగా ఉండేది. చదివేశాక చివరి పేజీ మీద తేదీ వేయడం అలవాటుగా ఉండేది.లా తర్వాత అన్వేషి పరిచయం, అక్కడి లైబ్రరీలో ఉండే ఇంగ్లీషు పుస్తకాలు, ఫెమినిజాన్ని గుండెల్లో ఆవాహన చేసుకున్న సమావేశాలు. జీవితాన్ని మలుపు తిప్పిన సందర్భం. భూమిక పత్రిక ఆవిర్భావం, మూడు దశాబ్దాలు మడమ తిప్పని ఉద్వేగ ప్రయాణం.
నా దృక్పథాన్ని, ఆలోచనా సరళిని మలుపు తిప్పిన హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌, గీతారామస్వామి గురించి ఎంత ఎక్కువ రాసినా తక్కువే. నాలాంటి పల్లెటూరి పిల్ల అన్నేసి ఇంగ్లీషు పుస్తకాలు చదవగలగడం, అవీ హాయిగా తెలుగు అనువాదాలు చదవడం… హమ్మో హైదరాబాద్‌ బుక్‌ ట్రస్ట్‌ లేకపోతే సాధ్యమయ్యేది కాదుÑ మహాశ్వేత ఎవరో తెలిసేది కాదుÑ ఎలెక్స్‌ హేలీ ఎవరో అస్సలు తెలిసేది కాదు. ఎన్నో… ఎన్నెన్నో భాషల్లోంచి తెలుగులోకి అనువాదం చేయించి, తక్కువ రేటుకి అందుబాటులోకి తెచ్చి, నాలాంటి వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసిన హెచ్‌.బి.టి.ని సదా స్మరిస్తాను. ఆ పుస్తకాలను ప్రేమిస్తూనే ఉంటాను.
పుస్తకం, ఇంత ప్రాణప్రదమైన సందర్భాలను ఇప్పుడు ఎందుకింత ప్రేమగా తలచుకుంటున్నాను. ఆడియో పుస్తకాలు ఆన్‌లైన్‌లో పిడిఎఫ్‌ పుస్తకాలు వెల్లువెత్తుతున్నవేళ పుస్తకం గురించి, చదవడం గురించి ఎందుకింతగా పలవరిస్తున్నాను. టైమ్‌ ఎక్కడుందండీ చదవడానికి అని చాలామంది పెదవి విరుస్తున్న వేళ చదవడానికి టైమ్‌ ఎందుకండీ అంటాన్నేను. ఇరవై నాలుగ్గంటల్లో మనం చదువుకోగలిగిన సమయాలు తప్పకుండా దొరుకుతాయి. కానీ మనమే దృష్టి పెట్టం.
‘‘బహుశా చదవడం కూడా నాకొక డిస్ట్రాక్షన్‌ అయి ఉంటుంది. నిజంగానే చదవడం అన్నింటికన్నా ముందు నాకొక జూశ్రీవaంబతీవ, ఒక సాంత్వన. ఎంత కష్టాన్నైనా, ఆందోళననైనా మరిపించగల ఔషధం. నామీద మిన్ను విరిగి పడబోతున్నదని తెలిసినప్పుడు కూడా నా చేతుల్లో ఒక పుస్తకం ఉంటే చాలు, మరేమీ అక్కర్లేదు అనిపిస్తుంది. చదవడం ఒక పవిత్ర కర్తవ్యం అనో, తప్పనిసరిగా పాటించవలసిన బాధ్యత అనో, గంభీరమైన వ్యాపకం అని గానీ మీరు అనుకుంటే మీ మనసు చదవడం వదిలిపెట్టి తక్కిన డిస్ట్రాక్షన్‌ వైపు చూస్తుంది. అలా కాక చదవడం ఒక టబఅ, ఒక jశీవ అనుకుంటే, జీవితం పెట్టే హింస నుంచి తప్పించుకోడానికి చదువుకుంటూ
ఉండటానికి మించిన డిస్ట్రాక్షన్‌ మరొకటి దొరకదు. అది నేను ముందే చెప్పినట్లు ఎశీర్‌ ఱఅవఞజూవఅంఱఙవ కూడా’’.
` వాడ్రేవు చినవీరభద్రుడు
చేతిలోనో, బ్యాగ్‌లోనో ఎప్పుడూ ఒక పుస్తకం పెట్టుకుని చదువుకోవడానికి అనువైన సమయాలు మనం ఎలా సృష్టించుకోవాలో వీరభద్రుడు గారు ఈ ఇంటర్వ్యూలో వివరంగా చెప్పాను. సో… టైమ్‌ని తిట్టిపొయ్యడం భావ్యం కాదు.
నేనీ సంపాదకీయం రాయడానికి, నా పుస్తకాల ప్రేమని అంచెలంచెలుగా గుర్తు చేసుకోవడానికి కారణం రెండు దశాబ్దాల తమ ప్రయాణాన్ని సెలబ్రేట్‌ చేసుకోబోతున్న ‘‘మంచి పుస్తకం’’ ప్రచురణ సంస్థ. మంచి పుస్తకం ఇంటిపేరుగా మారిన సురేష్‌, భాగ్యలక్ష్మి గార్ల పుస్తకాలతో ప్రయాణం. 2004 నుంచి నిర్విరామంగా పిల్లల పుస్తకాలను ప్రచురిస్తున్న వీరిద్దరి ప్రయాణాన్ని భూమికలో ప్రచురించాలనే ఆలోచన వల్ల వారం క్రితం ప్రశాంతి మంచి పుస్తకం ద్విదశాబ్ది ప్రయాణ పండగ గురించి భూమికలో వేద్దామని ప్రతిపాదించిన దగ్గరనుండి నేనా పనిలో మునిగిపోయాను. వారిద్దరి ఇంటర్వ్యూ ఎలా సేకరించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఇంతకు ముందు వంగపల్లి పద్మ చేసిన ఆడియో క్యాసెట్‌ గుర్తొచ్చింది. దాని పని చకచకా ముందుకెళ్ళింది. కవర్‌ పేజీ ఎలా ఉండాలా అని ఆలోచన చేయడం కూడా జరిగిపోయింది. పిల్లల పుస్తకాల ప్రేమికుల ప్రచురణ సంస్థ ‘‘మంచి పుస్తకం’’ గురించి ఏప్రిల్‌ సంచికలో ప్రముఖంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భానికి అనుగుణంగా నా పుస్తకాల ప్రేమ గురించి రాయాలనిపించింది. ప్రకృతి తర్వాత, పుస్తకాన్ని మించిన రిలాక్సేషన్‌ వేరేదీ లేదని చెప్పాలన్పించింది. పుస్తకాలు చదవని వాళ్ళు జీవితంలో ఏం కోల్పోతున్నారో ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.
‘‘పుస్తకమే ప్రాణశక్తిని నిలబెడుతుంది
చదవడమే జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది.’’

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.