భూమిక సంపాదకులు కె సత్యవతి గారికి నమస్కారం!
భూమిక ఫిబ్రవరి 2026 సంచిక అక్షరాక్షరం చదివాను. ప్రతి శీర్షిక (సంపాదకీయంతో సహా) ఎంతో ఆలోచనత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఉంది. మీకు, భూమిక పరివారానికి అభినందనలు.
గీతారామస్వామి గారి ఆత్మ కథాత్మకి వ్యాసం, ప్రభాకర్ గారి అనువాదం చదివిన వారి మెదళ్లు డిస్టర్బ్ అవుతాయి. ‘విరసం తమ ఊపిరిగా’ ప్రకటించిన కృష్ణాభాయి గారి జీవితానుభవాలు వివరించిన తీరు ప్రేరణాత్మకంగా ఉన్నాయి. ‘లలితా రాందాస్ జీవన ప్రస్థానం’ స్ఫూర్తిదాయకం. ప్రతినెల భూమికలో ఒక ప్రముఖ మహిళామణిని పరిచయం చేస్తున్న గిరిజ పైడిమర్రి గారికి శుభాకాంక్షలు. భూమిక ప్రతి సంచికా మళ్లీమళ్లీ చదవదగిన, దాచుకోవాల్సిన స్ఫూర్తిని పొందాల్సిన సంచికగా రూపొందిస్తున్న ‘భూమిక’ టీం మొత్తానికి హృదయపూర్వక అభినందనలు.
– ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ,
పూర్వ ఉపకులపతి తెలుగు విశ్వవిద్యాలయం
