సహాయం ఇవ్వడానికే కాదు, తీసుకోవడానికి కూడా చేతులు చాపుదాం – కొండవీటి సత్యవతి

ఎవరి నోటి వెంట విన్నా ఒక మాట తరచుగా వింటున్నాను. చిన్న పెద్ద తేడా లేదు. గ్రామీణ ప్రాంతమా? పట్టణమా? మహా నగరమా? ఏమీ తేడా లేదు. ఈ విషయంలో మాత్రం అంతరాలు లేవు. అందరూ అనేది ఒకటే మాట. స్ట్రెస్‌, టెన్షన్‌, మానసిక ఒత్తిడి, మానసిక

కల్లోలం వెరసి మెంటల్‌ హెల్త్‌. మానసికారోగ్యం. శరీరంలో ఏ చిన్న గాయమైనా ఎర్రటి రక్తం ఉబికి వస్తుంది. రక్తం కంటపడగానే ఆసుపత్రికి పరుగులు తీస్తాం. గాయం పెద్దదైతే కుట్లేయించుకుంటాం. మందులు వాడతాం. మచ్చ మిగిలినా తొందరగానే తగ్గిపోతుంది. శరీరం పట్ల అంత జాగ్రత్తగా ఉండే మనం మనసు పట్ల ఎందుకంత నిర్లక్ష్యంగా ఉంటాం. శారీరక రోగాలెన్ని ఉన్నాయో మానసిక రోగాలు అన్నే ఉన్నాయి. ఎందుకు పట్టించుకోం?
అసలు మనసంటే ఏమిటి? శరీరంలో ప్రతి అవయవం కనిపిస్తుంది. శరీరం బయటా, లోపలా ఉన్న ప్రతి అవయవానికి ఓ పేరుంది, ఉనికి ఉంది. వాటికి వచ్చే జబ్బుల్ని నయం చేయడానికి ఓ ప్రత్యేక విభాగం, డాక్టర్లు ఉన్నారు. గుండెకి జబ్బు చేస్తే కార్డియాలజిస్ట్‌, కంటికి, పంటికి అన్నింటికి స్పెషలైజేషన్లున్నాయి. శరీరాన్ని, శారీరక వ్యాధుల్ని ఎంతో జాగ్రత్తగా నయం చేసే వ్యవస్థలున్నట్లే మానసిక వ్యాధులకు సంబంధించి ఎందుకని ఎక్కువ ప్రాముఖ్యత లేకుండా పోయింది. దాన్ని కూడా వ్యాధిగా గుర్తించాలని, అవసరమైన వైద్యం చేయించుకోవాలని భావించకపోవడానికి ముఖ్యమైన కారణం అవగాహనా రాహిత్యం, భిడియం, స్టిగ్మా.
మనసు ఎక్కడుంటుంది? అది ఒక అవయవం కాదు. కాని మనః స్థితికి కారణం మెదడులోని కొన్ని రసాయనాలే అని నమ్ముతారా? ఇవి బ్యాలెన్స్‌ తప్పినప్పుడే చాలా ఇబ్బందులొస్తాయి. మానసిక వ్యాధిని ఎలా గుర్తించాలి. మరికొన్ని మానసిక వ్యాధులు మరి కొన్ని జీన్స్‌ ఆధారంగా, జెనెటిక్‌గా సంక్రమించేవి. వీటిని గుర్తించడం చాలా తేలిక. వైద్యం చేయడం సులభం. అలాంటి కొన్ని వ్యాధులు జీవితాంతం కొనసాగుతాయి. వాటిని మార్చలేము. కాని మేనేజ్‌ చేయగలం.
రెండోది మనిషి తన జీవన విధానంతో తెచ్చుకునే మానసిక వ్యాధులు. ఆధునిక జీవితంలోని ఒత్తిళ్ళు కలిగిస్తున్న వ్యాధులలో, బిపి, డయాబెటిస్‌ ఎలాగో అలానే మానసిక వ్యాధులు కూడా. ప్రపంచీకరణ విసిరిన పెను సవాళ్ళలో మానసిక ఒత్తిడి, స్ట్రెస్‌ చాలా ముఖ్యమైనవి. సింపుల్‌గా, సహజంగా బతికేవాళ్ళకి, ప్రకృతికి దగ్గరగా బతికేవాళ్ళకి మానసిక ఒత్తిడి తక్కువగా ఉంటుందని నేను అనుకుంటాను. అడవుల్లో బతికే ఆదివాసీలకు బతుకు సవాళ్ళు, జీవనాధార సమస్యలు ఎక్కువే ఉంటాయి. కానీ అడవితో మమేకమై బతికే వారి జీవనశైలిలో ఒత్తిళ్ళు చాలా తక్కువ ఉంటాయి. వారి చుట్టూ పచ్చదనపు కాంతి తప్ప బడా షాపింగ్‌ మాల్స్‌, కృత్రిమపు మెరుపులు ఉండవు. అలవి కాని వస్తు సముదాయం కొనుక్కోవాలని, ఇల్లంతా, ఒళ్ళంతా నింపుకోవాలనే అపసవ్య కోరికలు ఉండవు. ప్రకృతిలో మమేకమైన వారి జీవితాల్లో స్వచ్ఛమైన ఆనందం మిళితమై ఉంటుంది. వారి ఆటలో, పాటలో, చిందులో ఆవిష్కృతమవుతుంటుంది. అది నిజమైన ఆనందం. వస్తు ఆధారిత ఆనందం కాదది. గుండెల్లోంచి అత్యంత సహజంగా పొంగి వచ్చే ఆనందం. దాన్ని వ్యక్తీకరించడంలో వారెప్పుడూ వెనుకాడరు.
మైదాన ప్రాంతాల్లో నాగరికులంగా చలామణి అయ్యే ఆధునిక మనుష్యులకు దొరకనిది సహజమైన ఆనందం. ఎండమావుల వెంట వస్తు సముదాయాన్ని వేటాడుతూ సాగే ప్రయాణంలో ఆనందం కూడా ఆయా వస్తువుల ఆధారంగానే దొరుకుతుంది. అతి త్వరగా ఆవిరైపోతుంది. కొత్త మోడల్‌ కారు కొనాలి. కొత్త రకం మొబైల్‌ ఫోన్‌ కావాలి. ఉన్న ఇల్లు తృప్తినివ్వదు. గేటెడ్‌ కమ్యూనిటీ మీద మోజు. ఇల్లంటే విల్లానే. విల్లా కొనుక్కోలేని బతుకూ ఓ బతుకేనా. ఈ ఆశలకు, కోరికలకు అంతెక్కడుంది. ఈ వేటలో, ఈ పరుగులో ఏం కోల్పోతున్నామో అర్థం చేసుకోలేని మానసిక స్థితిలోకి జారిపోతున్నాం. ఆకాంక్షలుండడం, కోరికలు ఉండడం తప్పు కాదు కానీ అవి అలవి కానివీ, అందనివీ అయితేనే సమస్య. దాని ముద్దు పేరే స్ట్రెస్‌. మానసిక ఒత్తిడి. అరచేతిలో ఉన్నదాన్ని ఆస్వాదించకుండా సుదూర తీరాల్లో అసహజ మెరుపుల వైపు పరుగులు తీయడం వల్ల ఆనందం ఆవిరైపోతుంది. కంటికి కనబడని మనసు మీద తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ స్థితి.
ప్రపంచీకరణ ప్రభావం మానవ సంబంధాలను ఎంత విధ్వంసం చేసిందో 90లలో వచ్చిన కథలు, కవిత్వం రికార్డు చేసే
ఉంచాయి. సమూహానికి చెందిన మనిషికి ఏకాకిని చేసింది. సరళీకృత ఆర్థిక విధానాల వల్ల మల్టీ నేషనల్‌ కంపెనీలు దివిసీమ నాటి
ఉప్పెనలా భారతదేశం మీద విరుచుకు పడ్డాయి. మహా క్రూరమైన కార్పొరేట్‌ కంపెనీలు లాభార్జనే ధ్యేయంగా దేశంలోకి దూసుకొచ్చాయి. మెగా మాల్స్‌, బ్రాండెడ్‌ వస్తువులు, దేశ సుస్థిర ఆహార పద్ధతిని భగ్నం చేసిన జంక్‌ఫుడ్‌, శీతల పానీయాలు గ్రామీణ స్థాయి వరకు ముంచెత్తాయి. ఎందుకూ పనికిరాని వస్తు సముదాయం మాల్స్‌లో తిష్టవేసి మనిషిలో తీరని వస్తుదాహానికి తెరలు తీశాయి.
అన్నింటినీ మించి ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్‌ చేసిన విధ్వంసాన్ని తూచడానికి నా దగ్గర రాళ్ళు లేవు. మనిషి సుఖవంతంగా బతకడానికి ఆవిష్కృతమైన శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలు, టెక్నాలజీ మనిషిని మరింత ఏకాకిని చేశాయి. అడ్డూ అదుపూ లేని విషపూరిత ఛానళ్ళు మనిషిలోని సున్నితత్వాన్ని దుంప నాశనం చేశాయి. అరచేతిలో ఇమిడిపోయి అద్భుతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించే మొబైల్‌ ఫోన్‌ మనిషి మస్తిష్కాన్ని కబ్జా చేసి కోతిని ఆడిరచినట్లు ఆడిరచే స్థాయికి చేరడమే ప్రస్తుతం మానవ సమాజం ఎదుర్కొంటున్న మహా ఉపద్రవం అని నాకు అనిపిస్తుంది. తోటి మనిషితో పెనవేయాల్సిన ప్రేమానుబంధం ఒక వస్తువుతో పెనవేయడం మనిషిని మహా ఏకాకిని చేస్తున్నది.
తన మనసులో జరుగుతున్న ఘర్షణలు, కల్లోలాలను తోటి మనిషితో పంచుకోవడానికి జంకే దుస్థితిలోకి జారిపోయాం. తోటి మనిషి పట్ల నమ్మకం కోల్పోవడం, సోషల్‌ మీడియాలోని మాయా మనుష్యుల ప్రభావంలో, సాలెగూడు లాంటి సామాజిక మాధ్యమాల్లో చిక్కుకుపోయి గిలగిల్లాడడం చూస్తూనే ఉన్నాం. ఇంటా బయటా ఫోన్‌తో స్నేహం చేసేవాళ్ళు ఎక్కువవుతున్నారు. మనుష్యులతో బలపడాల్సిన సంబంధాలు ఛానెల్స్‌ కుమ్మరిస్తున్న విషంతోను, మొబైల్స్‌తోను బలపడడం వల్ల మనిషి ఏకాకి అవుతున్నాడు. విపరీతమైన మానసిక అసమతుల్యానికి గురవుతూ, తన మనసులో చెలరేగే కల్లోలాలను ఎవరితో పంచుకోలేక, పంచుకుంటే వెక్కిరిస్తారో, వేరేవాళ్ళకు చెప్పేస్తారో అని భయపడుతూ ఆత్మహత్యా ధోరణుల్లోకి జారిపోతున్నారు. ఇటీవల విపరీతంగా పెరిగిపోతున్న హత్యలు, ఆత్మహత్యలు దీనికి రుజువుగా కనబడుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఏం చెయ్యాలి? శారీరక రోగాలకు ఇచ్చే ప్రాముఖ్యాన్ని మానసిక రోగాలకు కూడా ఇచ్చి తీరాలి. అవసరమైతే తప్పకుండా వైద్య సహాయం తీసుకోవాలి. నమ్మకమైన మిత్రులతో తన దుఃఖాన్ని, సమస్యలను పంచుకోవాలి. పరిస్థితి చేయిదాటిపోయేవరకు వేచి చూడకుండా సరైన సమయంలో, వైద్య సహాయం, కౌన్సిలింగ్‌, థెరపీ తీసుకుంటే తప్పకుండా గడ్డు సమస్య నుండి బయటపడగలుగుతారు.
ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మన జీవితాలను సింప్లిఫై చేసుకోవడం. మార్కెట్‌ విసురుతున్న వల్లో పడిపోకుండా జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోగలగడం. వస్తు సముదాయం మీద మోజు తగ్గితే ఆటోమేటిగ్గా మానవ సంబంధాలు బలపడతాయి. మనిషి వస్తు ప్రపంచంలో గిరగిరా తిరగడం వల్ల తోటి మనిషి ప్రేమ, ఆత్మీయతని కోల్పోతున్నాడు. ఒంటరితనాల్లోకి జారిపోతున్నాడు. మానసిక కల్లోలాల్లో కుంగిపోవడం, ఆత్మహత్య ఆలోచనలు చేయడం చూస్తూనే ఉన్నాం. ప్రకృతిని మించిన రిలాక్సేషన్‌, సాంత్వన మరెక్కడా దొరకదు కదా! ప్రకృతికి దూరమవ్వడం కూడా మనిషి కష్టాలకు ముఖ్యమైన కారణం.
అయితే ప్రకృతి వలన సాంత్వన పొందినా, వైద్య చికిత్స మాత్రమే ఈ వ్యాధుల నుండి మనలను కాపాడుతుంది. దీనికి తోడు చుట్టూ ఉన్న సమాజం స్థైర్యాన్ని ఇవ్వగలిగితే ఇంకేం కావాలి. మానసిక వ్యాధి ఎంత వ్యక్తిగతమో అంతే సామాజికం కూడా. వ్యాయామం ఎంత అవసరమో పోషణ, సంభాషణ అంతే అవసరం. అది చుట్టూ ఉన్న సమాజం వలనే సాధ్యం. మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని, వైద్యం అందుకుంటున్న వారి పట్ల సహానుభూతితో మెలగే సమాజం కోసం కృషి చేద్దాం.
సహాయం ఇవ్వడానికే కాదు, తీసుకోవడానికి కూడా చేతులు చాపుదాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.