Daily Archives: April 5, 2025

అంబేద్కర్‌ మనందరివాడు – కొండవీటి సత్యవతి

భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్‌ రూపొందించాడు అనే ఒక్క వాక్యం తప్ప చదువుకునే సమయంలో ఆయన గురించిన పాఠం ఏ సిలబస్‌లోనూ చదివినట్టు గుర్తులేదు. అంబేద్కర్‌ గురించి పాఠ్యాంశం ఎందుకులేదో చాలా ఏళ్ళ తరువాత కానీ అర్థం కాలేదు. భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్‌ నిజానికి భారతీయులందరికీ చెందాల్సిన వాడు.

Share
Posted in సంపాదకీయం | Leave a comment

అడుగడుగున తిరుగుబాటు – గీతా రామస్వామి

` అనువాదం: ప్రభాకర్‌ మందార (గత సంచిక తరువాయి…) మొదట్లో పార్టీ మా యువ సభ్యులను కొంత ప్రత్యేకంగా చూసుకునేది. ఇక్కడ నీలం రామచంద్రయ్య (ఎన్‌ఆర్‌) వ్యవహార శైలి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘ఎన్‌కౌంటర్‌’లో చనిపోయే వరకూ కూడా మా విషయాలన్నీ ఆయనే చూసుకునేవారు. తను ఎంతో హుందాగా, మాతో కాస్త వ్యూహాత్మకంగా కూడా వ్యవహరించేవారు.

Share
Posted in జీవితానుభవాలు | Leave a comment

అడ్జస్ట్మెంటుని అడ్జస్ట్‌ చేసుకోమందాం – ఆపర్ణ తోట

జంటలు, భార్యా భర్తలు, పెళ్ళిళ్ళూ, బంధాలు, సంబంధాలూ – ఇవన్నీ మాట్లాడే శాక, మాట్లాడేముందు, మాట్లాడదాం అనుకునే సమయాల్లో – ఆఖరున ఒక శాక్సఫోన్‌ అంత అట్టహాసంగా మోగే మంత్రపు మాట – ఈ రోజుల్లో అమ్మాయిలు అస్సలు అడ్జస్ట్‌ అవడం లేదేంటో! చిన్న చిన్న విషయాలకే గొడవలుపడి విడిపోతున్నారు.

Share
Posted in బోగన్ విల్లా | Leave a comment

సంవేదం – జె. కనకదుర్గ

అత్తగారిని బస్సెక్కించటానికి భర్త వెళ్ళగానే అమ్మయ్య! అని అనుకొంది అనూష. నెల రోజుల నుండి తీరికలేని పని. పని చేయొచ్చుగానీ తనని తన వాళ్ళని అత్త సూటీపోటి మాటలంటుంటే భరించటం కష్టమయింది. అలా అంటుంటే కోడలు పడి ఉండాలి గాని ఎదురు సమాధానం చెబితే ఆయనకు ఫిర్యాదు చేస్తుంది. తనమీద ఆయనకు కోపం తెప్పిస్తుంది.

Share
Posted in కధలు | Leave a comment

ఆడపిల్లలు మంచిగ చదువుకోవాలె ఉద్యోగాలు చేయాలె – పైడిమర్రి గిరిజ

సందర్భం: మహిళల కోసం, మహిళా దృక్పథంతో ఒక ప్రత్యేక కథా కార్యశాల నిర్వహించాలని ఎన్నాళ్లుగానో అనుకున్నాము. బండారు విజయగారు స్వయంసిద్ధ, యోధ కథా సంకలనాలు వెలువరించాక కార్యశాల నిర్వహణకై పూనుకున్నారు. అలా అందరినీ సంప్రదించి హైదరాబాద్‌ బుక్‌ఫేర్‌ ముగియగానే కథా వర్క్‌షాప్‌ 2024లోనే అనుకున్న ప్రకారంగా జరపాలని నిర్ణయించు కున్నారు.

Share
Posted in ఇంటర్‌వ్యూలు | Leave a comment

అడాలసెన్స్‌ – రఘు మందాటి

ఒక చిన్నారి మనసు – సమాజం దాని మీద ఆశలతో, భయాలతో వేసే చిత్రపటంలా ఉంటుంది. అడాలసెన్స్‌ – అనేది కేవలం ఓ సిరీస్‌ కాదు, ఒక నిజాయితీ గల అద్దం.

Share
Posted in సినిమా సమీక్ష | Leave a comment

మాతృత్వం గురించి కొత్త చైతన్యం – పుష్యమీ సాగర్‌

మాతృస్వామ్యం అనేది ఒక సామాజిక సంస్థ లేదా వ్యవస్థ రూపం. ఈ వ్యవస్థలో స్త్రీలు ఆధిపత్యాన్ని, ప్రత్యేక హోదాలను కలిగి ఉంటారు. విస్తృత కోణంలో చూసినట్లైతే, అది ఒక సామాజిక నైతిక అధికారం. సామాజిక హక్కు, ఆస్తి నియంత్రణకు కూడా ఈ పదం విస్తరించవచ్చు. మాతృస్వామ్యాన్ని గైనర్కీ, గైనోర్కసి, గైనోసెంట్రిక్‌ సొసైటీ అని కూడా అంటారు.

Share
Posted in పుస్తక సమీక్షలు | Leave a comment

సిరాతో కథలు చెప్పే గోద్నా కళ – అశ్విని కుమార్‌ శుక్లా / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రతి తెగకూ కులానికీ ప్రత్యేకమైన గోద్నా, రaార్ఖండ్‌లో ప్రధానంగా స్త్రీలు సాధన చేసే పచ్చబొట్టు కళ. ఈ పురాతన కళకు రోగాలను నయం చేసే శక్తులున్నాయని నమ్ముతారు. కానీ పచ్చబొట్లు కులం, జెండర్‌, ఇతర సామాజిక చిహ్నాలను కూడా గుర్తుచేస్తాయి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

పర్యావరణంలో మార్పులు – మహిళలపై ప్రభావం – పద్మ వంగపల్లి

ఎండా కాలం ముందే వచ్చేసింది. కాలం కాని కాలంలో వానలు పడుతున్నాయి. చలిగాలులు అంతటా విస్తరిస్తున్నాయి. ఒక చోట వరదలు, మరో చోట ఎండలతో గందరగోళంగా ఉంది. వాతావరణంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పంజాబ్‌లో పంటకోతల తర్వాత పెట్టిన మంటలు, ఢల్లీి ప్రజలకు శ్వాస ఆడకుండా చేస్తున్నాయి.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సతీసహమరణం – చారిత్రిక పరిశీలన బొల్లోజుబాబా

మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ ‘‘జీవించే హక్కు’’ కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గిరిజనులపై దోపిడిని చిత్రించిన కథలు – సారిపల్లి నాగరాజు

నాగరిక సమాజం ఏర్పడిన నాటి నుండి ఆదివాసుల భూములను నాగరికులు దోచుకుంటూనే ఉన్నారు. ఆదివాసిలు ఈ దోపిడిని ప్రతిఘటిస్తూనే వస్తున్నారు. గిరిజనాభివృద్ధి పథకాల పేరుతో జరుగుతున్న కార్యక్రమాల వల్ల గిరిజనుల కంటే ప్రభుత్వ అధికారులు, ఫారెస్ట్‌ ఆఫీసర్లు, పల్లం ప్రజలే ఎక్కువగా లాభం పొందుతున్నారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

సంక్షుబిత – కొలిపాక. శోభారాణి

నిలువెల్లా గాయం లా ఆమె ఏమైనా కాలం మారుతుందన్న ఆశ యుగాలుగా నడిపిస్తుంది

Share
Posted in కవితలు | Leave a comment

సునీతా విలియమ్స్‌… నీకు స్వాగతం – నాంపల్లి సుజాత

నీ రాక కోసం యావత్‌ భూలోకం ఉద్విగ్నభరితంగా కళ్ళు కాయలు చేసుకునే ఎదిరి చూస్తోంది తల్లీ..!

Share
Posted in కవితలు | Leave a comment

నిశిని వీడి – డా.బండారి సుజాత

చీకట్లను తొలగించుకుంటూ నాటి, నేటి నడకలను సరిదిద్దుకుంటూ అంది వచ్చిన చేయూతనందుకుంటూ, తనను తాను దిద్దుకొంటోంది ‘‘వనిత’’వెన్నెల దారులకై

Share
Posted in కవితలు | Leave a comment

నరక శాల – ఆవుల రేణుక

చెత్త నిండిన వాకిలి … జిడ్డు బారిన గిన్నెలు…

Share
Posted in కవితలు, పిల్లల భూమిక | Leave a comment

పిల్లల భూమిక

నాన్న ప్రేమ అందమైనది నాన్న ప్రేమ అందమైనది నాన్న ప్రేమ మధురమైనది

Share
Posted in పిల్లల భూమిక | Leave a comment