చీకట్లను తొలగించుకుంటూ నాటి, నేటి నడకలను సరిదిద్దుకుంటూ
అంది వచ్చిన చేయూతనందుకుంటూ,
తనను తాను దిద్దుకొంటోంది ‘‘వనిత’’వెన్నెల దారులకై
కాల మహిమలో కొట్టుమిట్టాడుతూ
గుండె దిటవు చేసుకొని అంకురాలను కాపాడుకుంటూ, అనుబంధాలకు ఆయువునిస్తూ ,
కురిసే వెన్నెలతో నడుస్తోంది ‘సుదతి ‘ నవీన ఆలోచనలతో
మదిమదికి మధురుహాలందిస్తూ,
కంటకాలను తొలగించుకుంటూ, సమానత్వానికి సత్తువనివ్వాలని
లింగ బేధాలు మరచి
బంగారు తల్లికి బతుకునిచ్చి చల్లని వెన్నెలలో సేద తీర్చాలనుకుంటుంది
‘ముదిత ‘మువ్వలసవ్వడితో
మనవాద సూత్రాలను మదిలో నిలపకుండా
తపనే తాయిలంగా
ఆటంకాలనెదుర్కొంటూ అలుపు సొలుపు లేని పయనంతో
అభివృద్ధే ధ్యేయంగా ఎదుగుతోంది ‘మగువ’
వెన్నెల దారులతో