మగవాళ్ల ప్రాణాలు హరిస్తున్న మద్యపానం – కొండవీటి సత్యవతి

ఇటీవల విజయవాడ, రాజమండ్రిలో కొత్తగా పనిచేయడానికి ఎంపిక చేసుకున్న బస్తీలలో ఒక దిగ్బ్రాంతికరమైన అంశం కొట్టొచ్చినట్టు కనబడిరది. కొత్తగా పనిచేయడానికి ఏదైనా బస్తీలోకి వెళ్ళేటప్పుడు బేస్‌ లైన్‌ చేయడం అవసరం. దానిలో భాగంగా ఆయా బస్తీల సమాచారం సేకరిస్తాం. ఆ బస్తీ స్థితిగతులు, ఎలాంటి సమస్యలున్నాయి, స్త్రీ పురుషుల నిష్పత్తి, బాల బాలికల నిష్పత్తి లాంటి అంశాల గురించి సమాచారం తీసుకోవడం తప్పనిసరిగా ఉంటుంది.

మొదట బస్తీలోకి వెళ్ళినప్పుడు మాహిళల్ని కలిసి బస్తీ అంశాలు, సమస్యల గురించి చర్చించడం జరుగుతుంది. తొలి సమావేశంలో సాధారణంగా మహిళలు ఎక్కువ మాట్లాడరు. మెల్లగా తమ సమస్యలను వివరించడం మొదలు పెడతారు. ఇంతకు ముందు కొత్తగా పనిచెయ్యడానికి ఎంపిక చేసిన ఒక బస్తీలో మహిళలు చెప్పిన విషయం చాలా బాధ కలిగించింది. మేము మీ బస్తీలో ఏ అంశాల మీద పని చేయాలని మీరు అనుకుంటున్నారు. అలాంటి ముఖ్యమైన అంశం గురించి చెప్పండి అంటే మహిళలు ఒకరి ముఖాలొకరు చూస్తున్నారు కానీ చెప్పడం లేదు. అరే అలా సిగ్గుపడితే ఎలా, ఇక్కడి సమస్యలు మాకెలా అర్ధమౌతాయి అన్నప్పుడు ఒకామె ధైర్యంగా ముందుకొచ్చి ‘‘మా కొడుకులే మాకు సమస్య మేడం’’ అన్నారామె. ‘‘మీ కొడుకులతోనా! వాళ్ళతో ఏమి సమస్యలు’’ అన్నాను నేను.‘‘మాబస్తీలో మగపిల్లలతోనే మాకు ఇబ్బందులు. వాళ్ళు అర్ధరాత్రిళ్ళు దాకా తాగడం, కొట్లాడుకోవడం, గట్టిగా అరవడం, సీసాలు పగలగొట్టి కొట్టుకోవడం చేస్తున్నారు.
మా బస్తీలో బాత్రూంలు బయటే ఉంటాయి. రాత్రిళ్ళు మేము బాత్రూం కెళ్ళడానికి బయటకు రాలేకపోతున్నాం. మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి చెప్పండి. మీరు ఏమి చేసినా చెయ్యకపోయినా ఈ కుర్రాళ్ళకి కాస్త బుద్ధి చెప్పండి చాలు’’ అన్నారు.
ఇదే సమస్యను మిగిలిన బస్తీల్లోను చెప్పారు. అప్పుడు మేము ప్రాధాన్యతాంశంగా ఈ సమస్యనే తీసుకుని ఆయా బస్తీల్లోని యువత కోసం కంప్యూటర్‌ ట్రైనింగ్‌ క్లాసులు నడిపాం. యూత్‌ లీడర్‌ షిప్‌ ప్రోగ్రాములు చేసాం. ఆ విధంగా బస్తీలోని మహిళలు, పిల్లలతోనే కాకుండా యూత్‌తో కూడా పనిచెయ్యడం మొదలు పెట్టాం. వాళ్ళకి ప్రతి శనివారం సామాజిక అంశాల మీద సెషన్స్‌ తీసుకోవడం, జీవన నైపుణ్యాల మీద అవగాహన కల్పించడంలాంటి కార్యక్రమాలతో వాళ్ళతో కలిసి పనిచేసాం. వారందరికీ ప్లాస్టిక్‌ వల్ల అనర్ధాలను వివరించి మీ బస్తీలో ప్లాస్టిక్‌ లేకుండా ప్రయత్నాలు చేస్తే మీకు మంచి బహుమతి ఇస్తామని ప్రకటించగానే అందరూ ఎంతో ఉత్సాహంగా ఆ కార్యక్రమంలో పాల్గొని ప్లాస్టిక్‌ సేకరించి మున్సిపల్‌ వాళ్ళకి అప్పగించారు. ఈ కార్యక్రమాల ద్వారా నాకు అర్ధమైంది ఏమిటంటే యువతని ఇన్స్పైర్‌ చేసే నాయకులెవరూ లేరు. రాజకీయ నాయకులు వాళ్ళ ఓట్ల కోసం తప్ప యువతని పట్టించుకునే పరిస్థితి లేదు.
ఏ బస్తీ కెళ్ళినా డ్రగ్స్‌, మద్యం, గంజాయి విచ్చలవిడిగా వినియోగం కనిపిస్తున్నది. బస్తీ పిల్లల్ని నేను తప్పు పట్టడం లేదు. వాళ్ళుండే వల్నరబుల్‌ పరిస్థితుల వల్ల, తల్లిదండ్రులు శ్రమ చేసి బతకడం, ఈ పిల్లల గురించి పట్టించుకునే వెసులుబాటు లేకపోవడం వల్ల బస్తీలలో యువత తాగుడుకు బానిసలై తమ తల్లులతో పాటు సమాజానికి కూడా సమస్యాత్మకంగా తయారవుతున్నారు.
ఐదేళ్ళ పాటు భూమిక పనిచేసిన బస్తీల్లో ఈ సమస్య చాలా వరకు తగ్గింది. మేమిచ్చిన చైతన్య కార్యక్రమాలు, శిక్షణల వల్ల ఆయా బస్తీ మహిళలు ఇలా ఇబ్బంది పెట్టే కుర్రాళ్ళతో మాట్లాడగలిగారు. వాళ్ళ చర్యల వల్ల తామెంత ఇబ్బంది పడుతున్నారో చెప్పగలిగారు. మా ట్రైనింగుకు వచ్చే మగపిల్లల ముందు ఈ అంశం మీద ఒక స్కిట్‌ వేసి చూపించినపుడు మగపిల్లలు చాలా సిగ్గుపడ్డారు. అలా వాళ్ళల్లో ఒక ఆలోచన మొదలైంది. బస్తీలో రాత్రిళ్ళు వాళ్ళు చేసే అల్లరివల్ల తమ తమ తల్లులెంత ఇబ్బంది పడుతున్నారో ఈ స్కిట్‌లో స్పష్టంగా మగపిల్లలే నటించి చూపించారు. నగర బస్తీలలో పనిచేయడం అనేక చాలంజెస్‌తో నిండి ఉంటుంది. వాటికి అనుగుణంగానే మన కార్యక్రమాలను రూపొందించుకోవాలి. భూమిక ఇంతకుముందు పనిచేసిన పది బస్తీలలోను ఈ మార్పును కొంతమేరకు తేగలిగాము. నిజానికి ఈ మార్పును ఆయా బస్తీ మహిళలే సాధించారు. మేమిచ్చిన అవగాహన, చైతన్యం, శిక్షణలు వాళ్ళకి ఉపయోగపడ్డాయి.
మేము ప్రస్తుతం మరో పదహారు బస్తీలకు విస్తరించాలని బేస్‌ లైన్‌ చేసాము. హైదరాబాద్‌లో పది, విజయవాడలో 3, రాజమండ్రి లో 3 బస్తీలు కొత్తగా తీసుకున్నాం. మిగతా అంశాలలో పెద్ద తేడా లేదు కానీ స్త్రీ పురుష నిష్పత్తి వివరాలు గమనించినపుడు ప్రతి బస్తీలోను పురుషుల కన్నా మహిళలు ఎక్కువ ఉన్నారు. ముఖ్యంగా విజయవాడ, రాజమండ్రిలో చాలా తేడా ఉంది. వెయ్యి నుంచి రెండు వేల మంది మహిళలు ఎక్కువ ఉన్నారు. ఈ గణాంకాలు నాకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆందోళన కలిగించాయి. ‘మీ బస్తీల్లో మగవారెమయ్యారు. చాలా తక్కువున్నారు’ అని అడిగితే ‘తాగి తాగి చచ్చారు’ అని ఒకామె చాలా కోపంగా అంది. అక్కడున్న ఒక మహిళ గ్రూప్‌ సభ్యురాలు ఇలా చెప్పారు. ఆమె అన్నది నిజమే మేడం. మగవాళ్ళల్లో తాగుడు చాలా ఎక్కువగా ఉంది. తాగి తాగి లివర్లు చెడిపోతున్నాయి. చిన్న వయస్సులో చనిపోతున్నారు.హెచ్‌ ఐ వి కూడా కారణమే. గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా వాడుతున్నారు. కొంతమంది దుబాయ్‌ లాంటి దేశాలకు వెళుతున్నారు.’’
‘అన్నింటికన్నా ముఖ్య కారణం మందే మేడం. మగవాళ్ళు మందు తాగి చనిపోతే మా బస్తీలో ఎంతోమంది మహిళలు ఒంటరి మాహిళలుగా మారిపోతున్నారు’ అందామె. ‘‘మా మగవాళ్ళకు ఫుల్లుగా తాగించి, చంపేసి మాకు వితంతు పించన్లు ఇస్తున్నారు. దేనికి మేడం ఈ పించన్లు మా కుటుంబం కడుపు నింపుతుందా. మందు షాపులు బంద్‌ చేయండి మా మగవాళ్ళు బతుకుతారు. మా కుటుంబాలు బాగుపడతాయి. ‘‘నా చుట్టూ కూర్చున్న అందరి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి.’’ నిజం మేడం తాగుడు లేకపోతే మా అయన బతికేటోడు. లివర్‌ పాడైతే ఆసుపత్రుల చుట్టూ తిప్పి ఉన్నదంతా ఖర్చు పెట్టేసాను. అయినా మనిషి దక్కలేదు. నా పిల్లల్నెలా పోషించుకోవాలి మేడం’’ అంటూ గట్టిగా ఏడ్చింది ఒకామె.
రైతులు ఆత్మహత్య చేసుకున్నా, నేత వారు ప్రాణాలు తీసుకున్నా, తాగి తాగి మగవాళ్ళు చనిపోయినా మిగిలే వాళ్ళు అసంఖ్యాకమైన ఒంటరి మహిళలు. గ్రామాల నిండా, బస్తీల నిండా ఒంటరి మహిళల గుండె ఘోషలే. ఒంటరి పోరాటాలే. ఈ బస్తీలలో ప్రారంభించాల్సిన కార్యక్రమం ఏమిటో అర్ధమైంది. అదెంత పెద్ద చాలెంజో కూడా అర్ధమైంది. ఎన్నో ఆలోచనలు చుట్టుముట్టాయి. ఆ ఆలోచనల్ని ఆచరణలోకి ఎలా తేవాలో ఆలోచిస్తూ ఆ బస్తీ నుండి బయటకు నడిచాం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.