భూమిక ఎడిటర్ గారికి
జూన్ నెల భూమిక అట్ట మీద మన సాయి పద్మ నవ్వుతూ చాలా బాగుంది. తన మనసు, ఆశయాలు కూడ ఆ చిరునవ్వు లాగా వుంటాయి. నాకు తను ఫేస్ బుక్ ద్వారా పరిచయం.
తను ఎయిర్ పోర్ట్ లోను, విమానంలోను పొందిన అన్యాయాన్ని దైర్యంగా ఎదుర్కొన్న సంఘటన చదివి తనకు ఫ్యాన్ అయ్యాను. అలా అన్యాయాన్ని ధైర్యంగా ఎదుర్కొనే వారంటే నాకు ఎనలేని అభిమానం. చాలామంది పిరికి వారిని చూసి చిరాకు పడేదానిని. నిదానంగా ఆవిడ గురించి తెలుసుకుని తనను ఆరాధించసాగాను. ఫేస్ బుక్ ద్వారా పరిచయం సాగించాను. తనకు నా లైఫ్ స్టైల్ బాగా నచ్చింది. తన చీGూ లకు 2,3 మార్లు తప్ప ఎక్కువ సహాయపడలేక పోయాను. మా సాయి పద్మ ఎక్కడ వుంటే అక్కడ అందరినీ సంతోష పెడ్తుంది. ఆనంద్ గారి సహకారం కూడ చాలా వుంది. ఆ ఇద్దరూ ‘‘వీaసవ ఖీశీతీ జుaషష్ట్ర ూ్ష్ట్రవతీు షశీబజూశ్రీవ. ఈ నెల భూమిక సాయిపద్మకు అంకిత మిచ్చిన మీకు ధన్యవాదాలు.
` మంగళా కందూర్, చెన్నై.