ట్రాన్స్‌ కమ్యూనిటీ అంశాల మీద రచనలు రావాలి – కొండవీటి సత్యవతి

ఎనభైలలో తెలుగు సాహిత్యంలోకి ఉధృతమైన వరదలాగా వెల్లువెత్తి వచ్చిన స్త్రీవాదం తెలుగు సమాజం మీద, తెలుగు సాహిత్యం మీద బలమైన ముద్ర వేసింది. అప్పటి వరకు పురుష ధృక్కోణంలో మాత్రమే వెలువడిన రచనలు స్త్రీవాద ఉద్యమ స్ఫూర్తితో వందలాది రచయిత్రులు అప్పటి వరకు సాహిత్యంలో అంటరాని వస్తువులుగా ఉన్న అనేకానేక కొత్త అంశాలతో దూసుకొచ్చారు.

పురుష రచయితలు ఉక్కిరిబిక్కిరై ఇదంతా ‘‘నీలి సాహిత్యం’’ అంటూ నిందలకు దిగేంత అభద్రతకు లోనైన సందర్భం. ఎందుకంటే అప్పటి వరకు సాహిత్య పీఠాధిపతులు పురుషులే. వారు రాసేదే సాహిత్యం. స్త్రీలు రాసేది కాలక్షేప, వంటింటి సాహిత్యం అని ముద్ర వేసి తెరవెనక్కి నెట్టేయడమే వారికి తెలిసిన విద్య. అందుకే భండారు అచ్చమాంబ లాంటి ప్రతిభామూర్తులు కూడా చరిత్ర చీకటిలో ఉండిపోయారు. స్త్రీవాద ఉద్యమాలు మొదలయ్యాకా మాత్రమే వీరంతా వెలుగులోకి వచ్చారు. స్త్రీశక్తి సంఘటన ప్రచురించిన ‘‘మనకు తెలియని మన చరిత్ర’’ అన్వేషి ప్రచురించిన ‘‘ఉమన్‌ రైటింగ్‌ ఇన్‌ ఇండియా’’ లాంటి పుస్తకాలు వచ్చాకా తెలుగు సాహిత్యంలో, తెలుగు సమాజంలో, ఎన్నో రంగాల్లో అవిరళమైన కృషి చేసినప్పటికీ చరిత్రలో ప్రముఖమైన స్థానం పొందకుండా అనామకంగా ఉండిపోవడం వెనక ఉన్నది పితృస్వామ్య పురుషాధిపత్య భావజాలమే.
పై నేపథ్యంలోంచి చూసినపుడు ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటికీ చెందిన సాహిత్యం తెలుగులో రాకపోవడానికి ఎన్నో కారణాలు కనబడతాయి. వారి గురించి సమాజంలో ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. వారి వేష భాషలు, జీవన విధానం పట్ల మామూలు జనంలో వ్యతిరేకత చాలా ఎక్కువగా ఉంది. సినిమాలు, సాహిత్యం వారిని ‘‘కొజ్జాలు’’గానే వెక్కిరించాయి. జబర్దస్త్‌ లాంటి టివి ప్రోగ్రాముల్లో ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీని చాలా ఘోరంగా అవమానకరంగా చూపిస్తూ సమాజంలో వారి పట్ల చులకన భావాల్ని వెదజల్లుతున్నాయి. వారు మనుష్యులు కాదు అన్నంత నీచంగా వారి గురించి తమ కార్యక్రమంలో చూపించచడం చాలా అన్యాయమైన విషయం. భారత రాజ్యాంగం వారిని పౌరులుగానే గుర్తించి అన్ని హక్కులూ ఇచ్చింది.
అయితే ఇటీవల కాలంలో ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీ వ్యక్తులు తమ పట్ల జరుగుతున్న వివక్షని, అన్యాయాలని గుర్తించి పెద్ద సంఖ్యలో ఐక్యమై తమ హక్కుల కోసం నినదిస్తూ ఉద్యమాల బాట పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించింది. ట్రాన్స్‌ జెండర్‌ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చెయ్యడంతో పాటు, ఉమన్‌ సేఫ్టీ వింగ్‌లో ప్రైడ్‌ ప్లేస్‌, సఖీ సెంటర్లలో హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసి వారి అవసారాలన్నింటిని తీర్చడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నది. అన్ని జిల్లాల్లోను అన్ని ప్రభుత్వ ఏరియా హాస్పిటళ్ళలో మైత్రి క్లినిక్‌లు ఏర్పాటు చేసారు. ఇక్కడ వారికి కౌన్సిలింగ్‌, వైద్య అవసరాలు అందిస్తారు. ఇటీవల ప్రభుత్వం ఇంకో ముందడుగు వేసి పోలీస్‌ శాఖలో ట్రాఫిక్‌ అసిస్టెంట్లుగా ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. మొదటి బ్యాచ్లో 40 మంది ట్రాన్స్‌ ఉమెన్‌, మెన్‌ ఇద్దరిని తీసుకున్నారు. వారంతా చాలా సమర్ధవంతంగా తమ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరో 100మందిని ఉద్యోగాల్లోకి తీసుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పరంగా జరగడం చాలా అహ్వానించాల్సిన అవసరం ఉంది.
అయితే ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీ పట్ల సమాజంలో పాతుకుపోయి ఉన్న చులకన భావం, చీదరింపు పోవాలంటే వారి గురించి విస్తృతంగా సాహిత్యం రావాల్సి ఉంది. కుటుంబాల్లో చోటు లేకుండా బయటకు గెంటేయబడిన తర్వాత రోడ్డున పడ్డాక వారు బతకడానికి యాచన,సెక్స్‌ వర్క్‌ తప్ప వేరే అవకాశాలు వారికి అందుబాటులో లేవు. రోడ్ల కూడళ్ళలో, సెక్స్‌ వర్క్‌ అడ్డాల మీద వారు భయంకరమైన హింసను ఎదుర్కొంటారు. అవమానాలు, తిట్లు, దెబ్బలు, గాయాలతో పాటు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ ఒక సానుకూల దృక్పధంతో రచయితలు అర్ధం చేసుకోవడంతో పాటు తమ రచనల్లో ప్రతిబింపచేయాలి. తమ రచనల ద్వారా వారి దయనీయ జీవితాల్లో మార్పులు తీసుకురావడానికి రచయితలు ప్రయత్నం చెయ్యాలి. ట్రాన్స్‌ జెండర్‌ వ్యక్తుల పట్ల సమాజంలో పాతుకుపోయి వ్యతిరేక భావాలను పోగొట్టగలిగిన ముఖ్యమైన పాత్రను రచయితలు పోషించాల్సి ఉంది.
ఈ విషయం ఎందుకు ప్రస్తావించానంటే ఇప్పుడిప్పుడే కన్ను విప్పుతున్న ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటీకి చెందిన అంశాలు తెలుగు సాహిత్యంలో ఎలా ప్రతిబింబిస్తున్నాయో అర్ధం చేసుకోవడానికి. ట్రాన్స్‌ కమ్యూనిటి పట్ల తెలుగు సమాజం చాలా స్తబ్దంగా ఉంది. వారి మీద జరుగుతున్న లైంగిక హింస, హత్యలు, అరాచకాల గురించి తెలుగు సాహిత్యం చెదురుమదురు రచనలు తప్ప ఇంకా మౌనంగానే ఉంది. మానస ఎండ్లూరి, విజయ కుమార్‌ లాంటి రచయితల రచనలు తప్ప పెద్దగా సాహిత్యం రాలేదు తెలుగులో. తమిళంలో రేవతి రాసిన ‘ఒక హిజ్రా ఆత్మ కధ’’ హిజ్రాల జీవితాన్ని సమగ్రంగా చిత్రించిన నవల. వసుదేంధ్ర కన్నడంలో చాలా రాస్తున్నాడు. ఇటీవల చిలుకూరి రామ ఉమామహేశ్వర శర్మ ‘‘తాలి’’ అని ఓ మంచి కధ రాసారు.
తెలుగులో ట్రాన్స్‌ కమ్యూనిటీ గురించి రాయాలంటే మొదట వారి బీభత్స జీవితాల గురించి, సెక్స్‌ వర్క్‌, భిక్షాటన తప్ప వేరే దారిలేని దయనీయమైన జీవన విధానాల గురించి సానుకూల దృక్పధం ఉంటే తప్ప రాయడం సాధ్యం కాదు. ఒకరిద్దరు తప్ప రచయితలెవ్వరూ వారి సమావేశాల్లో నాకు కనిపించలేదు. ట్రాన్స్‌ మహిళల్ని రౌడీలు కృరంగా హత్యలు చేసినప్పుడు రచయితలెవ్వరూ వారి మీద అమలయ్యే హింస గురించి నోరు విప్పలేదు.
ఇప్పుడిప్పుడే మొదలైన కొన్ని ప్రయత్నాలు ట్రాన్స్‌ జెండర్‌ కమ్యూనిటి జీవన విధానాల్లో అద్భుతమైన మార్పుకు నాంది పలుకుతున్నాయి. రచయితలు వాటిని అర్ధం చేసుకుంటే వారి గురించి రచనలు వస్తాయి. నిజానికి తెలుగు సమాజం మెల్లగా ట్రాన్స్‌ వ్యక్తుల పట్ల తన ధోరణులను సవరించుకుటూ చిన్న ప్రయత్నాలు చేస్తున్నది. ఇవన్నీ చాలా వరకూ ప్రభుత్వపరంగా జరుగుతున్నాయి.
ఇవన్నీ కూడా ట్రాన్స్‌ జెండర్‌ మహిళలు, ట్రాన్స్‌ మెన్‌ పరంగానే ఉంటున్నాయి. ఇంకా ఎన్నో అస్తిత్వాలతో ఉన్న ఎల్‌ జి బి టి కమ్యూనిటీ ఇంకా చీకట్లోనే ఉంది. రచయితల పని ఈ చీకట్ల మీద వెలుతురు ఫోకస్‌ చేసి ఆయా జీవితాల గురించి ప్రపంచానికి తమ రచనల ద్వారా తెలియచెప్పడం. సమాజంలో వారి పట్ల ఉన్న అసహనం, అనుమానం, స్టిగ్మాలను బద్దలు కొట్టాలంటే రచయితలు విస్తృతంగా వారి గురించి రాయాలి. అప్పుడు సమాజం వారిని తనలో కలుపుకోవడానికి, సానుకూలంగా స్పందించడానికి తయరౌతుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.