నమస్కారం.
జూన్ 2025 సంచికలో ‘‘వివక్ష’’ కథ చాలా బాగుంది. నిజంగా రిజర్వేషను వల్ల దళితులందరికీ న్యాయం కలుగుతుందా అంటే లేదనే చెబుతాను నేను. చాలా కుటుంబాలను చూసే ఈ నాలుగు మాటలు చెప్పాలనుకొంటున్నాను. నేను చూసిన ఒక యస్‌పి కుటుంబంలో పిల్లలందరూ డాక్టరులే. ఒక కలెక్టరు కుటుంబంలో అందరూ చక్కగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. మన లాలూ ప్రసాద్‌గారి కుటుంబం అంతా చాలా బాగు పడ్డారు.
మరి మిగతా చాలా మందికి అవకాశాలు అందుబాటులో లేవు. ఎలా వుంటాయి. అవకాశాలను మరీ మరీ వీళ్ళే అంది పుచ్చు కొంటున్నారు. మరి దీని గురించి ఎవరూ ఆలోచించరా… నా సలహా ఏమిటంటే, ఒక స్టేజ్‌కు వచ్చిన ఆ కుటుంబాలను ఈ క్యాటగిరీ నుండి తీసివేస్తే, ఎన్నో వేల దళితులకు అవకాశం దొరుకుతాయి. మరీ పని ఎందుకు చేయటం లేదు. నిచ్చెన ఎక్కిన పెద్దవారు ఒప్పుకోరు. మరి ఓట్లు రావాలి కదా. అందుకే వారు చెప్పినట్టు ఆడుతారు. రాజకీయాలలో వున్న వారికి తమ సీటు ముఖ్యం కానీ, నిజాయితీ గల ప్రజా సేవ కాదు. ఒక వేళ మెజారిటీలో వున్న ప్రభుత్వం ఏదైనా చేయదలిస్తే, ప్రతి పక్షాలు ఖండిరచటమే తమ కర్తవ్యమని, మంచి చెడు చూడక నో అంటారు. ఉద్యోగాల వరకు అంటే సరి. ప్రమోషన్‌లో కూడ రిజర్వేషన్ అంటే ఇక దేశం బాగు పడ్డట్టే. వడ్డించే వాడు మన వారైతే ఎక్కడ కూచున్నా ఏమని వారు, ఎగిరెగిరి దంచినా, వూరికే దంచినా డబ్బు ఒక్కటే అని వీరు ఎవరికి వారు ఉద్యోగాలను తేలికగా చూసుకుంటున్నారు. పిల్లికి గంట కట్టే వారు ఎవరూ లేరా… ఎవరూ రారా… అందుకే మెరిట్ వున్న వాళ్ళు విదేశాలకు వెళ్తుంటే, అక్కడా పోటీ. ప్రైవేట్ సంస్థలలో 5% కోటా కావాలని. ఎవరూ తెలివి తేటలతో పుట్టారు. పరిస్థితులే ప్రదానం. ఆ పరిస్థితులను అందరు దళితులకు ఇవ్వక కొందరే గుంజుకొంటున్నారు. అసలు వాలంటీర్‌గా బాగుపడ్డ కుటుంబాలు, వారే ఆ క్యాటగిరీ నుండి తప్పుకునే సంస్కారం ఎవరికీ లేదు. ఇలాంటి పరిస్థితిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ వుంటే ఎంత బాగుండునని చాలా మార్లు చాలా మంది అనుకోగా విన్నాను. – మంగళ
