గౌరవనీయులు భూమిక సంపాదకులు సత్యవతి గారికి నమస్కారం!
భూమిక స్త్రీవాద పత్రికను క్రమం తప్పకుండా ఆసాంతం చదివే పాఠకుల్లో నేనొకడ్ని. గీతారామస్వామి గారి జీవితానుభవాలు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నాయి. ఆమెకూ, అనువాదకులు ప్రభాకర్ గారికి అభినందనలు.
జూన్ (2025) సంచికలో అమ్మే స్ఫూర్తి శీర్షిక కింద డాక్టర్ బి వి (సురవరం) విజయలక్ష్మి గారితో పైడిమర్రిగారి ఇంటర్వ్యూ ఎంతో ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా, నేటి తరానికి ప్రేరణ కలిగించేదిగా ఉంది. 1974లో జరిగిన ఆమె వివాహానికి హాజరైన కార్యకర్తల్లో నేనొకడ్ని. అలాగే వారి వివాహ స్వర్ణోత్సవాల (2024) సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారిలో నేను, మా ఆవిడ డాక్టర్ కందిమల్ల భారతి ఉన్నాం. గత 50 సంవత్సరాలుగా డాక్టర్ విజయలక్ష్మి గారి మంచితనం ఆత్మీయత నిబద్ధతలను గమనిస్తున్నాను. ఆ దంపతులిద్దరి ప్రేమను పొందుతున్నందుకు హృదయపూర్వకంగా సంతోషిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. – ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ,
పూర్వ ఉపకులపతి తెలుగు విశ్వవిద్యాలయం
…. ఙ ….
