గ్లోబల్‌ స్త్రీవాదం-బెల్‌ హుక్స్‌

అనువాదం: ఎ.సునీత
ప్రపంచంలో ఎన్నో చోట్ల మహిళా స్వతంత్ర పోరాట యోధులు ఒంటరిగానే పితృస్వామ్యానికి, పురుషాధిపత్యానికి వ్యతిరేకంగా వ్యక్తిగత పోరాటాలు చేశారు. ఈ భూమ్మీద మొదటి మనుషులు తెల్ల జాతి వాళ్ళు కాదు కాబట్టి నల్ల జాతి స్త్రీలే మొదటి సారి

పురుషాధిక్యతకి వ్యతిరేకంగా తిరగబడి వుంటారు. అయితే ఈ తెల్ల జాత్యహంకార పెట్టుబడి దారీ పితృస్వామ్య పాశ్చాత్త్య సంస్కృతిలో నయా వలసవాద ఆలోచనా ధోరణే ప్రధానంగా అనేక సాంస్కృతిక అలవాట్లని ప్రభావితం చేస్తుంది. ఆ ఆలోచన ఎవరు ఏ భూభాగాన్ని జయించారు, ఎవరు దేనికి యజమాని, ఎవరికి పాలించే అధికారం ఉందనే విషయాలపై దృష్టి కేంద్రీకరిస్తుంది.
అమెరికాలో సమకాలీన స్త్రీవాదం ఈ నయా వలసవాదాన్ని ధిక్కరిస్తూ ఉనికిలోకి రాలేదు. అందువల్లే జాతి పరమయిన విశేషాధికారం కలిగిన తెల్ల జాతి స్త్రీలు త్వరలోనే ఉద్యమానికి తామే యజమానులమని ప్రకటించుకున్నారు. ఎంతో మంది శ్రామిక వర్గ స్త్రీలు, నల్ల జాతి స్త్రీలు ఉద్యమాన్ని రాడికల్‌ దిశల్లో మళ్లించటానికి కృషి చేసినప్పటికీ ఆ కృషి వెలుగు లోకి రాకుండా పోయింది. చివరికి, తెల్ల జాతి వర్గాధిపత్యం వున్న స్త్రీలు ఉద్యమానికి తామే యజమానులమని మిగిలిన వారందరూ కేవలం అనుచరులని ప్రకటించుకున్నారు. నయా వలస వాదంలో పరాధీన వర్గ సంబంధాలు జాతి, జాతి-రాజ్యం, జెండర్‌ అన్నింటినీ పక్కకి నెట్టేశాయి. దానికి స్త్రీవాదం కూడా అతీతంగా ఉండలేక పోయింది.
అమెరికాలోని స్త్రీవాద నాయకులు స్త్రీ పురుష సమానత్వాన్ని తమ లక్ష్యంగా ప్రకటించినప్పుడు ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలు దీన్ని కోరుకుంటున్నారా అన్నది పట్టించుకోలేదు. తమని తాము విముక్త స్త్రీలమని, తమ కంటే దీనులైన ఇతరులని, ముఖ్యంగా మూడవ ప్రపంచం’ లోని స్త్రీలని విముక్తి చేసే స్థాయిలో తాము ఉన్నట్లు ప్రకటించుకున్నారు. ఈ నయా వలసవాద పెత్తందారీ ధోరణులు అప్పటికే వివిధ రంగుల స్త్రీలని వెనక్కి నెట్టి కేవలం ఉదార/సంప్రదాయవాద స్త్రీలు మాత్రమే స్త్రీవాదానికి అసలు సిసలయిన ప్రతినిధులుగా ఉండేటట్లు చేసింది. రాడికల్‌ తెల్ల జాతి స్త్రీలకి ఈ చట్రంలో పెద్దగా చోటు ఇవ్వలేదు, ఇచ్చినా వారిని తీవ్రవాదులుగా చూపెట్టటం జరిగింది. 1990ల్లో వచ్చిన పవర్‌ ఫెమినిజం’ ధనవంతులయిన తెల్ల జాతి పరలింగ సంబంధాల్లో వుండే స్త్రీలని స్త్రీవాద సఫలతకి ఉదాహరణలుగా చూపెట్టటం యాధృచ్చికమేమీ కాదు.
నిజం చెప్పాలంటే స్త్రీవాద సమానత్వ భావనని ఇలా ఆక్రమించేసుకోవటం తెల్ల జాత్యహంకార పెట్టుబడి దారి పితృస్వామ్య వ్యవస్థలోని పాలక వర్గాలతో వారి కున్న సఖ్యతని దాచి పెట్టుకోవటానికి ఉపయోగపడిరది. ఇలా వీళ్ళు పాశ్చాత్య సామ్రాజ్యవాదం, అంతర్జాతీయ పెట్టుబడితో తమ సంబంధాలని కాపాడుకుంటూ స్త్రీవాదాన్ని స్వంతం చేసుకోవటం అనేక మంది రాడికల్‌ స్త్రీవాదులని బాగా కలవర పెట్టింది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలకి సమానత్వం వుండాలని పిలుపు నివ్వటం సరైందే. కానీ ఈ క్రమంలో వర్గాధిపత్యం వున్న స్త్రీలు తమ సామ్రాజ్యవాద పగటి కలని ప్రపంచంలో అందరు స్త్రీల మీదా రుద్దటం సమస్యాత్మకంగా తయారయింది. ఎందుకంటే అమెరికాలో స్త్రీలకి ప్రపంచంలో అందరికంటే ఎక్కువ హక్కులు ఉన్నాయని, వాళ్ళు అందరి కంటే స్వేచ్ఛగా బ్రతుకుతున్నారని, కాబట్టి ప్రపంచ స్త్రీవాద ఉద్యమాన్ని ముందుండి నడిపి, అందరి అజెండాలు నిర్ణయించే, ముఖ్యంగా మూడవ ప్రపంచ స్త్రీల అజెండాలని నిర్ణయించే అధికారం వారికుందని అనుకోవటం. ఇది కేవలం పాశ్చాత్య దేశాల్లోని పాలక వర్గ పురుషుల సామ్రాజ్యవాద జాత్యహంకారం, సెక్సిజంలని ప్రతిబింబిస్తుంది.
అత్యధిక శాతం అమెరికన్‌ స్త్రీలకి వలస వాదం, నయా వలసవాదం అనేవి తెలియవు, ఆయా పదాలని కూడా వాళ్ళు వాడరు. తమ సమాజంలో తమ కంటే తక్కువ స్థాయిలో వున్న స్త్రీల గురించి, ప్రపంచంలో అత్యధిక శాతం స్త్రీల గురించి వాళ్ళ ఆలోచన జాత్యహంకారం, సెక్సిజం, కులీన వాదంతో నిండిన వలసవాద దృక్పధాన్నుండి ఇంకా బయట పడలేదు. ఇటువంటి స్త్రీవాద ఆలోచన పరులు’ వ్యక్తిగతంగా ప్రపంచ వ్యాప్తంగా వుండే లింగ పరమయిన దోపిడీ, అణచివేతల గురించి మాట్లాడటం మొదలుపెట్టినప్పుడు నయా వలసవాద దృక్పథం నుండే మాట్లాడారు. ఇంకో పక్క నైట్‌ విజన్‌: ఇల్యూమినేటింగ్‌ వార్‌ అండ్‌ క్లాస్‌ ఆన్‌ ది నియో కొలోనియల్‌ టెరైన్‌ అనే పుస్తకంలో తెల్ల జాతి రాడికల్‌ స్త్రీవాదులు సమ కాలీన ప్రపంచాన్ని అర్ధం చేసుకోవాలంటే నయా వలసవాదాన్ని అర్ధం చేసుకోక తప్పదు అని నొక్కి చెప్పారు. జ్ఞానోదయం అవ్వని తెల్ల జాతి స్త్రీవాదులు మాత్రం తమ కార్యాచరణ సామ్రాజ్యవాద తెల్ల జాతి జాత్యహంకారం తో నిండి ఉందనే విషయాన్ని ఒప్పుకోవటానికి సిద్ధపడలేదు. వారు నిర్మించుకున్న ఆ నిరాకరణ గోడని బద్దలు కొట్టటానికి నల్ల జాతి స్త్రీలు, వివిధ రంగుల స్త్రీలు నిరంతర నిరసన, ప్రతిఘటన చెయ్యక తప్పలేదు.
మన దేశంలో అనేక మంది స్త్రీవాదులు జాత్యహంకారం, లింగం, వర్గం, జాతీయతతో కలిసిన అవగాహనని ఏర్పర్చుకున్న తర్వాత కూడా, తెల్ల జాతి పవర్‌ స్త్రీవాదులు’ మాత్రం స్త్రీ పురుష సమానత్వాన్ని సామ్రాజ్యవాద భావజాలంలో చూడటం ఆపలేదు. స్త్రీల బలవంతపు సున్తీ, థాయిలాండ్‌లో సెక్స్‌ క్లబ్బులు, ఇండియా, మధ్య ప్రాచ్యం, యూరోప్‌, ఆఫ్రికాలో స్త్రీలు తలపై, వంటిపై వేసుకునే హిజాబ్‌, బుర్ఖాలు, చైనాలో ఆడపిల్లల హత్యలు – ఇవన్నీ చాలా ముఖ్యమైన సమస్యలే. అయితే, ఇప్పటికీ ఆయా సమస్యల గురించి వలస విముక్తి దృక్పధంలో ఆలోచించి, ఒక సరైన ఆచరణ ఏమిటనే నిర్ధారణకు రావటానికి, ఆయా పరిష్కారాలు పాశ్చాత్త్య సామ్రాజ్యవాద పరిష్కారాలు సరైనవనే నిర్ధారణకు రాకుండా ఉండటానికి ఆయా స్త్రీవాదులు ఇప్పటికీ కష్టపడుతూనే వున్నారు. సాధారణంగా ఆయా దేశాలని పాశవిక, నాగరికత లేని’ దేశాలుగాను, అక్కడి సెక్సిజం అమెరికాలోని సెక్సిజం కంటే ప్రమాదకరమయింది, క్రూరమయిందిగా చిత్రించటం జరుగుతుంది
వలస విముక్తి ధోరణితో ఆలోచించే స్త్రీవాదం ప్రపంచ వ్యాప్తంగా స్త్రీల శరీరాల గురించి అమలయ్యే సెక్సిస్టు ఆచారాలని అన్నింటినీ కలిపి ఒక సమగ్ర దృక్పథంలో పరిశీలిస్తుంది. ఉదాహరణకి స్త్రీలకి జరిగే సున్తీని, సన్నగా ఉండటం కోసం పొట్ట మాడ్చుకోవటంతో వచ్చే ప్రాణాంతక వ్యాధుల్ని, శరీరాన్ని అందంగా’ మార్చుకోవటం కోసం చేసుకునే సర్జరీల వల్ల వచ్చే ప్రమాదాల్ని – అన్నింటినీ కలిపి చూడాలని, ఆయా దేశాల్లోని పాత, కొత్త ఆచారాలన్నింటి వెనుకా సెక్సిజం, స్త్రీ ద్వేషం
ఉన్నాయని, ఒక్కో దేశంలో ఒకో రకంగా అవి రూపుదిద్దుకుంటున్నాయని విశ్లేషిస్తుంది. మన దేశంలో వుండే సెక్సిజంకీ, ఇతర దేశాల్లో వుండే సెక్సిజంకీ దగ్గరి సంబంధం ఉందని అర్ధమవుతుంది. విషయాలని ఇలా చూసినప్పుడు పాశ్చాత్త్య సామ్రాజ్యవాదమే ఈ సమస్యలకి సరయిన పరిష్కారం అన్న నిర్ధారణకు రావటం కానీÑ అంతర్జాతీయ పెట్టుబడిదారీ వ్యవస్థ స్త్రీవాదాన్ని స్వంతం చేసేసుకోవటం కానీÑ స్త్రీవాదాన్ని ప్రపంచంలో ధనవంతులయిన పాశ్చాత్య దేశాలు ఎగుమతి చేస్తే వెనుకబడిన దేశాల స్త్రీలు ఎగబడి పొందాల్సిన భోగ వస్తువుగా మార్చి అమ్ముకోవటం గానీ కష్టమవుతుంది.
మన దేశంలో రాడికల్‌ స్త్రీవాదులు ప్రపంచంలోనే గొప్ప స్త్రీవాదులుగా ఫోజులు కొట్టే మన దేశ ఆడవాళ్ళ గుంపులని వారి వర్గపరమైన అవకాశవాదం గురించి సవాలు చేస్తే తప్ప పాశ్చాత్య దేశాల్లోని స్త్రీలకి ప్రపంచ స్త్రీవాదంపై వుండే ఆధిపత్యం, వారి పక్షపాత ధోరణులు కొనసాగుతూనే
ఉంటాయి. ప్రపంచ వ్యాప్తంగా రోజువారీ రాడికల్‌ స్త్రీవాద కార్యాచరణ జాతి, జాతీయత సరిహద్దులు దాటి స్త్రీవాద రాజకీయ సంఫీుభావాన్ని బలవత్తరం చేస్తూనే ఉంటుంది. ఈ అనుకూల ధోరణులని మాస్‌ మీడియా పెద్దగా పట్టించుకోదు. జిల్లా ఐసెన్‌ స్టైన్‌ హట్రేడ్స్‌: రేషియాలైజ్డ్‌ అండ్‌ సెక్సువలైజ్డ్‌ కాంఫ్లిక్ట్స్‌ ఇన్‌ ది 21వ సెంచరీ అన్న పుస్తకంలో ఇలా అంటారు:
స్త్రీవాదాన్ని దేశాంతర వాదంగా అర్ధం చేసుకున్నప్పుడు, అది జాతి/జెండర్‌ మధ్య అనవసర సరిహద్దుల్ని చెరిపేసి అది మగ జాతీయవాదానికి, స్టేట్‌ సోషలిజంకి, స్వేచ్చా మార్కెట్‌ వాదానికి సవాలుగా పరిణమిస్తుంది. ఉత్తర/ పశ్చిమ – దక్షిణ/ప్రాచ్య విభజనలకి అతీతంగా వ్యక్తుల మధ్య భిన్నత్వాన్ని, స్వేచ్చని, సమానత్వాన్ని గుర్తించే అవకాశం కల్పిస్తుంది.
గ్లోబల్‌ స్త్రీవాద ఎదుగుదలని అధ్యయనం చేసిన వారెవరికైనా స్త్రీలు మన స్వేచ్చని కాపాడటానికి చేస్తున్న ప్రయత్నాలని, పాశ్చాత్త్య దేశాల్లోని స్త్రీలు, ముఖ్యంగా అమెరికాలోని స్త్రీలు ఈ పోరాటాలకు చేసిన మద్దతు గుర్తించక తప్పదు. ఆ మద్దతు కొనసాగించాల్సిన అవసరం కూడా ఎంతో వుంది. ప్రపంచ స్త్రీవాద ఉద్యమానికి వివిధ దేశాల్లోని సంఘర్షణలని ఒక దగ్గరికి చేర్చి సెక్సిజం, లైంగిక దోపిడీ మరియు అణచివేతని అంతం చెయ్యటమే ప్రధాన లక్ష్యం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.