భూమిక 30 సంవత్సరాల సంబరాన్ని ఏప్రిల్ 13న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుకున్నాము. ఈ సంబరాలకి భూమికతో పరిచయం వున్న అందరూ హాజరయ్యారు. రచయిత్రులు, వివిధ ప్రాంతాలలో వున్న భూమిక సన్నిహితులు, వివిధ సంస్థల ప్రతినిధులు,
భూమిక పనిచేస్తున్న అన్నిప్రాంతాలలోని భూమిక టీం అందరు కలిసి చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సంబరాన్ని దుక్కిదున్నినాడమ్మ రైతు… పాటను ప్రశాంతి, కొంతమంది టీం కలిసి పాడడంతో సభ ప్రారంభమైంది. అపర్ణ మీటింగ్‌కి వచ్చిన అందరికి స్వాగతం పలికిన తర్వాత, శ్రీవిద్యా స్పెషల్ స్కూల్ పిల్లలు చేసిన ఒక నృత్యం సభకుల్ని బాగా (ఔవశ్రీషశీఎవ ూశీఅస్త్ర) ఆకట్టుకుంది. పిల్లలు ఈ పాటకు అంత చక్కగా ఎలా చేయగలిగారో దాని వెనుక వారి కృషి అంతా స్కూల్ ప్రిన్సిపల్ శాంతిగారు వివరించారు. సత్యవతి మాట్లాడుతూ 30 సంవత్సరాలు భూమిక మ్యాగజైన్ ఇంత విజయవంతంగా కొనసాగడానికి వెనుక ఉన్న చరిత్రను అందరితో పంచుకున్నారు. అన్వేషి ఆఫీసులో మ్యాగజైన్ మొదలైన దగ్గర నుండి, కరోనా సమయంలో ఎదుర్కొన్న సంక్షోభం నుండి ఇప్పుడు 30 సంవత్సరాల పండుగ చేసుకునే వరకు ఎలా చేరుకోగలిగాము, భూమికను తన చేతిలోకి తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు తన అనుభవాలను పంచుకున్నారు. సత్యవతి మాటలు అందరికి చాలా స్ఫూర్తిదాయికంగా అనిపించాయి.
అపర్ణ ముగ్గురు ప్యానలిస్ట్‌ల్ని వేదిక మీదకు ఆహ్వానించారు. అందులో ఫ్రొ॥ సునీతరాణి గారు, తాషిగారు, ఉషశ్రీ గారు పాల్గొన్నారు. ఫ్రొ॥ సునీత రాణి మాట్లాడుతూ స్త్రీల కోసం ఒక ప్రత్యేకమైన పత్రిక వుండడం అది జెండర్ దృక్పథంతో రాసిన కథనాలు రావడం అనేది చాలా మంచి విషయం ఈ జనరేషన్ వాళ్ళు భూమిక పత్రిక చదవడం ద్వారా చాలా సమాచారం తెలుసుకోగలరు అన్నారు. తాషి మాట్లాడుతూ స్త్రీ వాద ఉద్యమాలలో 3తీస Gవఅసవతీ వ్యక్తులను గుర్తించి వారికి తగిన సహకారం అందిస్తున్నారు అని, వారికి అందాల్సిన హక్కుల కోసం జరిగిన పోరాటాల గురించి వాటిని చట్టాలుగా తీసుకురావడం వరకు వెనుక పడిన కష్టాల్ని వివరించారు. ఉషశ్రీ మాట్లాడుతూ స్త్రీలు, మానసిక ఆరోగ్యం, మన చుట్టూ అంశాలు ఎలా ప్రభావితం చేస్తాయి. ఒకవేళ స్త్రీలు మానసిక సమస్యలు ఎదుర్కొన్నపుడు ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో చెబుతూ సహకరించే సహకార సంస్థల గురించి వివరించారు. ప్యానెల్ చర్చ పూర్తి అయిన తరువాత వంగపల్లి పద్మ గారు స్నేహం గురించి చక్కని పాటపాడుతూ అందరిని ఉత్సాహపరిచారు.
భూమిక మ్యాగజైన్‌తో పరిచయం వున్న ప్రముఖులు వారి అభిప్రాయాలను చిన్న వీడియోల రూపంలో పంపించారు. వాటిని ప్రొజెక్టర్ ద్వారా ప్రదర్శించారు. భూమిక 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా పరకాల ప్రభాకర్, జయధీర్, తిరుమల రావు, జూపాక సుభద్ర, మహేష్ భాగవత్, శారద, రచన, జీవన్‌కుమార్ హాజరయ్యారు. భూమిక ప్రత్యేక సంచికను, వాడిపోని మాటలు పుస్తకాలను ఆవిష్కరించారు. పరకాల కాళికాంబ గారు రాసిన ‘‘నా జీవితం కొన్ని జ్ఞాపకాలు ఘట్టాలు, పుస్తకాన్ని అతిధులు ఆవిష్కరించారు. అతిధులందరికి పుస్తకాలను ఇవ్వడం జరిగింది. పుస్తక ఆవిష్కరణ తరువాత ట్రైబల్ ట్రాన్స్ ఉమెన్ అందరూ ట్రైబల్ డాన్స్ చేశారు. కొత్తగా, ఉత్సహపరిచేలా వుంది. మరో ట్రాన్స్ ఉమెన్ గాయిత్రి మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో పాల్గొన్న అందరూ భూమికతో వారికి వున్న అనుభవాలను పంచుకోవడం, అందరూ కలిసి గ్రూపు ఫోటోలు తీసుకోవడం కార్యక్రమం చాలా సంతోషంగా, ఆనందంగా ముగిసింది.