వారసుడే కావాలా? – డా. ఆవుల రేణుక

వారసుడే కావాలని
నా గర్భాన్ని ప్రశ్నించిన రోజు
స్త్రీని కాదు నేనొక మర మనిషినని తెలిసింది.

నా శ్వాస పితృస్వామ్యపు నీడలో పడి
ప్రాణానికి కాదు…
లింగానికి విలువ కట్టారు.
నవమాసాలు నిద్ర కరవై….
బతుకంతా… భయంతో దినదిన గండమయ్యింది
బిడ్డ తన్నిన క్షణం ఆనందమయం కాదది
నాలో ఊపిరి పోసుకునే బిడ్డ
భవిష్యత్తు వెనక్కి నెట్టే తీర్పులా వుంది
అబ్బాయే కావాలనే వాక్యం
నా చెవుల్లో శాసనంగా చెక్కబడి
అది తల్లితనానికి పరీక్షగా మారింది

పాలు కారే వక్షోజాలు ఇద్దరు బిడ్డలకు ఒకటే,
విలువ మాత్రం ఒకరికే …
నా గర్భం వారసత్వపు కర్మాగారం కాదు,
ప్రాణంపోసే ఆలయం.
అక్కడ పురుడు పోసుకునే దీపం
ఆడైనా, మగైనా… రక్షణ ఒకటే.
ఒక్కసారి వినండి…
నా మౌనాన్ని, నొప్పిని, భయాన్ని తెలుసుకడి
వారసుడి కోసం స్త్రీ పీక నులమకండి
కాదు కాదు… ఈ లోకానికి రాబోయే
మరో అమ్మను చంపకండి.

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.