భూమ్మీద గంధర్వులు – ఉణుదుర్తి సుధాకర్‌

ఇదంతా జరిగి ఏభై ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగాలేదు. బైండు చేయించి పెట్టుకున్న మ్యూజింగ్స్‌’ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉందిÑ ఎన్ని ఊళ్లు మారినా నావెంటే వస్తోంది. దాని మూల్యం బాబూరావుకి చెల్లించనేలేదు.

రిటైరై మళ్లీ విశాఖపట్నం వచ్చి స్థిరపడ్డాక ఒకనాడు పూర్ణామార్కెట్‌ వద్ద పటాలకొట్టులో బాబూరావు ఫొటో కనబడిరది. అతడే, సందేహంలేదు. అయినా అడిగాను. ఎవరిదండీ ఈ ఫొటో?
మనకి తెలీదు సార్‌! ఆలబ్బాయనుకుంటాను, మొన్న బయానా ఇచ్చీసెల్లాడు. ఇయ్యాల రావాల మరి. అంటే?
బాగా వృద్ధుడైన షాపు యజమాని, రంపంతో ఫ్రేము చెక్కలను కోస్తూన్న పని నిలుపుచేసి, కళ్లజోడులోంచి పైకి చూస్తూ, ఇయ్యాలరేపు అమ్మా, అయ్యల ఫొటోలు ఎప్పుడు సార్‌ పటంకట్టిస్తారు? అంతా అయిపోయాకే కదా? అని నవ్వాడు, బోసినోటితో.
ఈసారికి నిన్ను క్షమించేస్తున్నాను’ అన్నట్లుగా నవ్వుతూన్న బాబురావ్‌ ఫొటోను, స్మార్ట్‌ఫోన్లో భద్రపరచుకున్నాను.
బాబూరావుది వెడల్పాటి నవ్వుమొహం. నిర్లక్ష్యానికి గురైన చింపిరి జుత్తు, మాసినగెడ్డం. షాపులోని స్టూలుమీద కూర్చొని కూర్చొని ఏర్పరచుకున్న చిరుబొజ్జ. షాపంటే మరింకేమీ కాదు, పాతపుస్తకాల దుకాణంÑ అలంకార్‌ థియేటర్‌ లేడీస్‌ గేటు ఎదురుగా బాటాషాపు ముందు, ఫుట్‌పాత్‌మీద. ఏదో ఒక పుస్తకం చదువుతూ బేరాలకోసం ఎదురుచూసేవాడు. ఎవరైనా దుకాణంముందు ఆగితే, చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి చిరునవ్వు చిందించేవాడు.
అతనిది మీ సంగతి నాకు తెలుసులే, అయినా ఈసారికి వదిలేస్తున్నా’ అన్నట్టుగా అగుపించే ఓర్పరి చూపుతో కూడిన చిరునవ్వు. నిజంగానే అతనికి అక్కడికి వచ్చే వాళ్ల సంగతులన్నీ తెలుసు. ఎక్కువమంది మాలాగా తరచూ వస్తూ – ఇవాళైనా, ఏదో ఒక అరుదైన పుస్తకం కంటబడకపోతుందా – అని ఆశపడేవాళ్లే. తీరా ఆ పుస్తకం దొరికితే, కొనేందుకు డబ్బులు చాలక, తీసినచోట తిరిగిపేట్టేసేవాళ్లే. అప్పుడతను నవ్వుతూ ఒక మాట అనేవాడు,
తీసుకోండి మాస్టారూ, ఎంతోకొంత ఇవ్వండి. మిగతాది రేపు ఇద్దురుగాని.’
ఎంచేతోగానీ బాబూరావు తన కస్టమర్లందర్నీ మాస్టారూ’ అనే సంబోధించేవాడు. కస్టమర్లందర్నీ అంటే, మా బోంట్ల మైనారిటీ వర్గమే కాకుండా – తెలుగు అపరాధపరిశోధక నవలలకై ఆత్రంగా వెతికేవారూ, అగాథా క్రిస్టీ, హెరాల్డ్‌ రాబిన్స్‌, అలిస్టర్‌ మెక్లియన్‌ వంటి ఇంగ్లీషు రచయితల బెస్ట్‌సెల్లర్స్‌ కోసం ఎగబడేవాళ్లూ, బూతు పుస్తకాలకోసమని వచ్చి సౌంఙ్ఞచేస్తూ, గొణిగే నడివయస్కులూ – వీళ్లంతా బాబూరావుకి సుపరిచితులే. చివరిగా చెప్పిన నడివయస్కుల వద్ద మాత్రమే డబ్బులు ఆడుతూండేవి. బాబూరావు వాళ్ల దగ్గర బాగా లాగేవాడనడానికి నావద్ద బలమైన ఆధారాలున్నాయి. ఆయా పుస్తకాలు కొన్నాక, వాళ్లు వడివడిగా వెళ్లిపోయేవాళ్లు. కొంతమంది మాత్రం వాటిని చంకలో పెట్టుకొని, ఒక ఫిల్టర్‌ సిగరెట్టు వెలిగించి, అలంకార్‌ లేడీస్‌ గేటువైపు అత్యాశగా చూసేవారు. వాళ్ల బాధ మాకు పూర్తిగా అర్థంకాకపోయినా నవ్వుకొనేవాళ్లం. ఒక వయసు దాటాక, మొగాళ్ల కామం, కళ్లల్లో మిగిలిపోతుందని తర్వాతెప్పుడో తెలిసింది.
ఎప్పుడైనా పండితులు, రచయితలు గనక వస్తే, వాళ్లకి వంగి నమస్కరించేవాడు బాబూరావు. తన స్టూలు ఖాళీచేసి కూర్చోమని, ప్రక్కనే ఉన్న బడ్డీకొట్టు అతన్ని కేకేసి, స్పెషల్‌ టీ రప్పించేవాడు. రావిశాస్త్రిగారిని ఒకటి రెండుసార్లు అక్కడ చూశాం. అందరి అవసరాలూ, పరిమితులూ బాబూరావుకి తెలుసు. అతనికది కేవలం వ్యాపారం మాత్రమే కాదని మాకూ తెలుసు.
ఇది చదివారా? ఇది చూశారా? మీకోసమే రప్పించాను’ ఇటువంటి మాటలతో కస్టమర్ల దృష్టిని ఆకర్షించేవాడు.
తరవాతెప్పుడో ఎంబీఏలో నేర్చుకున్నానుగాని, బాబూరావుకి తన మార్కెట్‌ వర్గీకరణ, వివిధ సమూహాల భిన్నాభిరుచులు కరతలామలకమే. అయితే అతని వ్యాపారాతీత దృష్టి మాత్రం తెలుగు సాహిత్యం పైనే. అందుకే మేం కొందరం అతనికి సన్నిహితులం అయ్యాం. అతను మాకోసం సేకరించిన, లేదా అట్టేపెట్టిన పుస్తకాల మూలంగానే మా సాహిత్యాభిరుచి విస్తరిల్లింది.
మీకు విశ్వనాథ అంటే పడదుగానీ, ఇది చదవండి, అంటూ విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు’ ఇచ్చాడు. నవ్వినవ్వి కళ్లవెంట నీళ్లొచ్చాయి. మర్నాడే ధర చెల్లించి ఆ పుస్తకం స్వంతం చేసుకున్నాను. ఆ విధంగా ఎంతోమంది రచయితల్ని పరిచయం చేశాడు. ఇప్పుడు గుర్తుకొస్తూన్న పేర్లు – దరిశి చెంచయ్య, పడాల రామారావు, శారద, అట్లూరి పిచ్చేశ్వరరావూ, బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు.
నీకివన్నీ ఎలా తెలుసు, బాబూరావ్‌? అంటే, నవ్వేసి, బేరాల్లేనప్పుడు ఏదో ఒక పుస్తకం తిరగేస్తూంటాను మాస్టారూ! అంటాడు.
ఒక సాయంత్రంపూట మేమక్కడకు చేరుకొనేసరికే బాబూరావు ఎవరితోనో గొడవపడుతున్నాడు. మున్సిసిపాలిటీ వాళ్లు అతని దుకాణాన్ని లేపేస్తున్నారని మాకు అర్థం అయింది. అతడి మిత్రుడైన టీకొట్టతని బండి ధ్వంసం అయింది. బాబూరావు మాత్రం అప్పటికే తన పుస్తకాల్ని పేకేజీ పెట్టెల్లో సర్దేసాడు. టీబండి కుర్రాడు భోరుమని ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తావ్‌?’ అని బాబూరావతన్ని కసురుకున్నాడు. ఏదో ఒకటిచేసి బతకలేమా?’ అని అతనితో అంటూనే మున్సిసిపల్‌ స్టాఫ్‌పై తిరగబడుతున్నాడు.
నన్ను గమనించి, మాస్టారూ, ఒక్క నిమిషం! అంటూ గబగబా వెళ్లి, పెట్టెలోంచి ఒక పుస్తకం తీసి నాకందించాడు, ఆమధ్య మీరడిగారు, అంటూ. అది చలం మ్యూజింగ్స్‌’. డబ్బులు? అన్నాను, అయోమమయంగా.
తరవాత చూసుకుందాం, మాస్టారూ అన్నాడు. ఇంతలో పోలీసులొచ్చి బాబూరావుని వ్యాన్‌ ఎక్కించారు.
శాస్త్రిగారికి కబురుపెట్టండి మాస్టారూ, అంటూ వ్యాన్‌ ఎక్కేశాడు, లాఠీ దెబ్బలుతింటూనే. అతడు కోరిన విధంగా కబురందజేసాను. ఆ తరువాత ఏమైందో తెలియలేదు. ఆ షాపు మళ్లీ అక్కడ కనిపించలేదు. బాబూరావు ఆచూకీ తెలియలేదు. చాలా రోజులు గడిచాక – ఒక సినీమాహాలు టికెట్‌ కౌంటర్లో టిక్కెట్లు అమ్ముతూ కనిపించాడు.
ఇదేమిటి బాబూరావుగారూ? అన్నాను. ఎంచేతోగాని అతన్ని నువ్వు’ అనడం సరికాదనిపించింది.
ఏదో గడిచిపోతోంది, మాస్టారూ! చీకటిగదిలో కూర్చొని టిక్కెట్లు చింపుకోవడమే కదా? ఎవరితో మాట్లాడేదిలేదు. మీలాంటి చదువుకున్న వాళ్లతో పరిచయాలూ లేవు, సంబంధాలూ లేవు. అతడేమి కోల్పోయాడో అర్థం అయింది.
క్యూలో నా వెనక ఉన్నతను, ఎంతసేపయ్యా? కదులు! అనడంతో లైన్‌లోంచి బయటపడక తప్పలేదు.
బాబూరావు దుకాణం మూసేసాక అటువైపు వెళ్లడం తగ్గించుకున్నాం. ఎప్పుడైనా వెళ్లినా ఏదో వెలితిగా అనిపించేది. అతడు పనిచేస్తున్న థియేటర్‌కి వెళ్లి పలకరిద్దామా అని కూడా అనుకున్నాను. కుదరలేదు. నా పరీక్షలు, చదువు, నన్ను వెంటతరిమాయి.
బాబూరావు అసలు స్వరూపం నా ఇంజనీరింగు చదువు ఆఖరి సంవత్సరానికిగానీ తెలియలేదు.
1973 వేసవి. కొత్తగా ఏర్పడ్డ విరసం విశాఖలో సాహిత్య పాఠశాలను నిర్వహించింది. శ్రీశ్రీని తొలిసారిగా చూసింది అక్కడే. అతని గురించి చలం, ఆకాశం నుండి జారిపడ్డ గంధర్వుడు’ అన్నాడు కదా! అది అక్షరాలా నిజం అని నమ్మిన వయసు మాది. ఆఖరి రోజున కలెక్టరాఫీసువద్ద బహిరంగసభ. గద్దర్‌ పాటతో ముగిసింది. చీకటి పడిరది.
కారామాస్టారూ, శ్రీశ్రీ జోలె పట్టుకొని జనంలోకి వచ్చారు. ఆ ఉద్వేగ కెరటాలలో మునిగితేలుతూ, నాకు తెలియకుండానే వారివైపుగా నాలుగడుగులు వేశాను. నా పక్కనుండే వాళ్లిద్దరూ ముందుకి కదిలారు. సమీపంలో ఉన్న ఒక వ్యక్తి తన పేంటు జేబులోంచి పర్సు తీసి, జోలెలో వేసి, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను! అన్నాడు. గొంతు గుర్తుపట్టాను. బాబూరావ్‌! గెడ్డం బాగా పెంచాడు.
శ్రీశ్రీ, జోలెను మాస్టారికి అప్పగించి, సిగ్గుపడుతూ నవ్వి, బాబూరావుని కౌగలించుకున్నాడు. నా కళ్లముందే ఆవిష్కరింపబడ్డ ఈ ఘటన వెనుక ఏదో నిగూఢమైన ఔచిత్యం దాగి ఉందని నాకు తోచింది. శాపగ్రస్తులై విడిపోయిన గంధర్వులు మానవలోకంలో తిరిగి కలుసుకున్నారని కూడా అనిపించింది. ఆ కలయికకు నేను ప్రత్యక్షసాక్షిని కావడం కాకతాళీయం కాదేమో?
మీటింగు అయిపోయాక కాసేపు అజంతా హోటల్‌ బస్టాపువద్ద మాట్లాడుకున్నాం. పాలవ్యాపారం చేస్తున్నానన్నాడు. ఆదాయం బాగుందట. డబ్బుకి లోటులేదు మాస్టారూ, మన ఓపికే! అంటూ నవ్వాడు. మొదట అతని బస్సు వచ్చింది.
ఒక రూపాయుంటే ఇవ్వండి మాస్టారూ, పర్సు పెద్ద గురువుగారికిచ్చేశాను, అన్నాడు. అదృష్టవశాత్తూ నావద్ద ఉంది. డబ్బంటే లక్ష్యంలేని వాడు వ్యాపారం ఏం చేస్తాడు?’ అనుకున్నాను, మనసులో.
పోనీ తరవాత బస్సులో వెళ్లండి,’ అని నేనంటే, చీకటితోలేచి పాలు పితికించుకోవాలంటూ హడావుడిగా వెళ్లిపోయాడు. బస్సు కదులుతూండగా, సిగరెట్లు మానెయ్యండి మాస్టారూ!’ అన్నాడు. మళ్లీ కలుసుకోలేదు.
ఇదంతా జరిగి ఏభై ఏళ్లు గడిచిపోయాయంటే నమ్మశక్యంగాలేదు. బైండు చేయించి పెట్టుకున్న మ్యూజింగ్స్‌’ పుస్తకాల బీరువాలో భద్రంగా ఉందిÑ ఎన్ని ఊళ్లు మారినా నావెంటే వస్తోంది. దాని మూల్యం బాబూరావుకి చెల్లించనేలేదు.
మా నాన్న మీకు తెలుసా సార్‌? అన్నాడా వ్యక్తి. పటాలకొట్లో ఫొటోకి ఫొటో తియ్యడం చూసినట్టున్నాడు. నలభైలలో
ఉంటాడు. అవును. బాబూరావుగారు పుస్తకాల దుకాణం నడుపుతూండేవాడు.
అదెప్పుడు సంగతండీ బాబు! నేను పుట్టకముందు. ఆ తరవాత ఆయన చాలా యాపారాలు చేసేడని మాయమ్మ చెప్పేది. దేంట్లోనూ అచ్చిరాలేదు. కానీ ఆ పుస్తకాల పిచ్చి మాత్రం వదల్లేదు అంటూ నవ్వాడతను.
బాబూరావు పోయి నెల్లాళ్లవుతోందట. తన పేరు సత్యనారయణ అన్నాడు. దుబాయ్‌ డ్రైడాక్‌లో ఫోర్మేన్‌గా పనిచేస్తున్నాడట. అదే రాత్రి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బొంబాయి వెళ్ళిపోతున్నాడు. నాన్న పోయాక అయన గురించి చాలా తెలిసిందండి. అందుకే అడిగాను, మీకు మా నాన్న తెలుసా – అని ఏం తెలిసింది?
నాన్న పోకముందు ఒక ఫ్రెండుకి కబురు చెయ్యమన్నాడు. ఇంకో మాటన్నాడు. తీసికెళ్ళేటప్పుడు ఎర్రజెండా కప్పాలన్నాడు. ఆ తరవాత మాటపడిపోయింది. ఎందుకలా అన్నాడో మాకు ఆ ఫ్రెండు చెప్పేదాకా తెలీలేదు.
ఎందుకట? ఆలిద్దరూ సీకాకులంల కలిసి పనిచేసారట సార్‌.
అంటే?
మా నాన్న సత్యం మేసారుకి సిస్యుడనీసి ఆ ఫ్రెండు చెప్పాడు. ఆయన పెద్ద లీడరంటకదా?
వెంపటాపు సత్యనారాయణా? అబ్బో, చాలా పెద్ద లీడరు!
ఆయనేనటండీ బాబు! ఆ గురువుగారి పేరు నాకు పెట్టాడు మానాన్న. గమ్మత్తేటంటే అన్నవరం సత్యనారాయణ పెరెట్టాడనీసి మాయమ్మ అనుకుంటుండీది ఆవిడ పోయినంతవరకున్నూ. ముసిముసి నవ్వులు నవ్వాడు సత్యనారాయణ.
ఏం చదువుకున్నావు, నువ్వు? ఇంటర్మీడియట్‌ పోయింది సార్‌! ఇంక చదివించలేననీసి మానాన్న యూనియనోల్లని పట్టుకొని షిప్‌యార్డులో అప్రంటీసు కింద జాయిన్‌ చేసేసాడు – వెల్డర్‌గా. కొన్నాల్లు జాబ్‌చేసి, సూపర్వ్‌జర్‌గా చాన్సు దొరికిందనీసి దుబాయ్‌ వైల్లిపోయాను. ఇప్పుడు ఫోర్మేన్‌గా చేస్తన్నాను సార్‌!. అతని గొంతులో కొద్దిగా గర్వం.
ఇంతలో ట్రాఫిక్‌ పోలీస్‌ కాన్‌స్టేబుల్‌ వచ్చి, ఆ వైట్‌ హోండా సిటీ మీదేనా సార్‌? అన్నాడు.
ఆ హడావుడిలో సత్యనారాయణ నెంబరు తీసుకోలేదు. నా నెంబరూ ఇవ్వలేదు.
ఆరోజు రాత్రి బాబూరావు కథని నేను చెప్పగలిగిన రీతిలో మా ఆవిడకి చెప్పి, ఈ భూమ్మీద గంధర్వులు చాలామంది
ఉంటారుగానీ, అందరి పాటలూ మనకి వినిపించవు, అంటూ ముగించాను.
చూశారా? మీకు కవిత్వం వచ్చేస్తోంది! అంటే ఒక పెగ్గు ఎక్కువైందన్నమాట. ఇంక ఈ దుకాణం కట్టేసి, భోజనానికి లేవండి! అన్నదామె.
(ఈ కథలో ఉన్నవి కొన్ని యథార్థాలు, చాలా కల్పితాలు)
(సారంగ వెబ్‌ మ్యాగజైన్‌ నుండి…)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.