Category Archives: కథలు

కథలు

పిడికిటి ఇసుక -తిరునగరి దేవకీదేవి

‘‘అమ్మమ్మా! ఇవ్వాళ పులిహోర చేస్తావా’’ బుంగమూతి పెట్టి అడిగింది వర్షిత. ‘‘ఓ ఎందుకు చేసి పెట్టను? అరగంటలో నీ ప్లేట్లో పులిహోర ఉంటుంది. సరేనా?’’ బుజ్జగింపుతో అంది వర్ధనమ్మ.

Share
Posted in కథలు | Leave a comment

ఆడదాన్ని నమ్మితే సొమ్ము ` నమ్మకుంటే దుమ్మే -ఎండపల్లి భారతి

తెల్లారి గుడ్లన్నీ ఉతికి ఆరేద్దామని మిద్ది మిందకు పోతి. మా ఇంటి ఉత్తరం పక్క నా మరదలు వాల్లిల్లుంది. నేను మిద్ది మీద గుడ్లు అరేసేది నా మరదలు చూసి, ‘‘ఓ వొదినా సరస నిన్న అలిగి పుట్టింటికి పోయిందంటనే’’ అనె.

Share
Posted in కథలు | Leave a comment

ఏనుగంత తండ్రికన్నా యేకుల బుట్టంత తల్లి నయం – గోగు శ్యామల

మడికట్ల పొద్దుమూకిన యాల పిల్లలందరం ఊరికి బయట గుమిగూడినం. వానవడి ఎల్సిన గుర్తులుగా నీటి బిందువులు పచ్చి గడ్డిపై పువ్వెండలో జిగేల్‌ మంటున్నయి. మొగపిల్లలంతా ఆ పక్కకు వోయి సెడుగుడాడుతుండ్రు. నా ఈడు ఆడ్విల్లలంతా దాగిట్ల

Share
Posted in కథలు | Leave a comment

మారిన ధోరణి -తమ్మెర రాధిక

వడగాలి వరండాలోంచి గుయ్యిమంటూ హాల్లో పడుకున్న పరమేశం గారి చెవుల్లోకి ఈడ్చి కొడుతోంది. మనవలు అటూ ఇటూ ఇల్లంతా పరిగెడుతూ ఆడుకుంటుంటే ‘‘నాయనలూ కాస్త పెద్ద దర్వాజా ఓరగా వేసి ఆడుకోండిరా, తలుపు తీస్తే వడగాలి ఇల్లంతా సుడి తిరుగుతోంది’’ అన్నాడు నీర్సంగా. ‘‘తలమీద కాస్త తడిగుడ్డ వేసుకోకూడదూ… చల్లటి నీళ్ళు తాగారుగా ఇంకా ఉడుకు … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

ఇనుప ముళ్ళకంచె -వి.శాంతి ప్రబోధ

బిజీగా సర్వ్‌ చేస్తుండగా టీవీలో వార్తలు వినిపించి ఒక్కసారిగా భయంతో కంపించిపోయాడు బలరామ్‌. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. చేసే పని చేయలేకపోతున్నాడు. అతని ఒంట్లో సత్తువంతా ఎవరో లాగేస్తున్నట్లు నీరసం ఆవహించింది. తూలి పడబోయి నిలదొక్కుకున్నాడు. ‘‘ఒరే… చేతిలో ప్లేట్లు పడతాయ్‌ జాగ్రత్త…’’ మేనేజర్‌ అరిచాడు.

Share
Posted in కథలు | Leave a comment

ఓ గెలుపు జ్ఞాపకం – గంగాడి సుధీర్‌

ఏం చేయాలో అర్థం కావడం లేదు కానీ సమస్య పరిష్కారం అవకపోతుందా అనే చిన్న ఆశ మాత్రం మనసును వదలడం లేదు. ఎంత ఆలోచించినా చేసేదేమీ లేదు కనుక ఒంటరిగానే క్యాంటీన్‌ ఆవల చెట్టుకిందనున్న బండరాయిపై కూర్చున్నాను. అసలు

Share
Posted in కథలు | Leave a comment

ఆమె నిర్ణయం – కాత్యాయని

(ఉర్దూ మూలం : రజియా సజ్జాద్‌ జహీర్‌) ఆ సాయంత్రం ఇంటి ముందు రిక్షా దిగుతూ, సర్వెంట్స్‌ క్వార్టర్స్‌ ముందు కూచుని ఉన్న శ్యామలిని తొలిసారి చూసింది సుల్తానా. మరోసారి తిరిగి చూడాలనిపించే ఆకర్షణ ఏదో ఉంది ఆ పిల్ల ముఖంలో.

Share
Posted in కథలు | Leave a comment

నో రూమ్‌ -కాళీపట్నం రామారావు

వెన్నెల పిండి ఆరవేసినట్లు లేదు. నగరం కొత్తగా ఉంది… అత్తవారి ఇల్లులా. ‘‘రూమ్‌ కావాల.’’ ‘‘సింగిలా, డబులా?’’

Share
Posted in కథలు | Leave a comment

ఇగో -తిరునగరి దేవకీదేవి

సాయంకాలం నాలుగు కావస్తోంది. సెలవులకు తెర పడిరది. పిల్లలకు మళ్ళీ ఉద్యోగ పర్వం… తిరుగుముఖం కాక తప్పలేదు. వాళ్ళు వెళ్ళిన తర్వాత కానీ బిందుకు అలసట తెలిసి రాలేదు. నెల రోజుల తర్వాత మధ్యాహ్నం నడుం వాల్చే అవకాశం దొరికింది. సాయంత్రం

Share
Posted in కథలు | Leave a comment

స్పందన – డా॥ తాళ్ళపల్లి యాకమ్మ

నింగిన చుక్కలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి. ‘‘అమ్మా నేను వెళ్ళొస్తాను’’ అంటూ టేబుల్‌పైన ఉన్న కీ చెయిన్‌ అందుకొని చెప్పులు వేసుకుంటున్న పద్మను ఉద్దేశించి ‘‘ఎక్కడికమ్మా…! ఇంత రాత్రివేళ బయటికి ఒంటరిగా ఎందుకు తల్లీ’’ అంది పద్మ తల్లి ప్రేమగా.

Share
Posted in కథలు | Leave a comment

మనోవ్యాధికి మందుంది – శివరాజు సుబ్బలక్ష్మి

డాక్టర్‌ మాధవరావు ఆ ఊరొచ్చి ఐదారు నెలలే అయినా మంచి పేరు తెచ్చుకున్నాడు. పేదవాళ్ళను ఎంతో దయగా చూసేవాడు. ఆ హాస్పిటల్‌లో అతనితో కలిసి పనిచేస్తున్న లేడీ డాక్టర్‌ కమల మొదట్లో ఇదంతా పేరు కోసం తెచ్చిపెట్టుకున్న ప్రవర్తన అనుకున్నా, తర్వాత్తర్వాత అతని పట్ల గౌరవభావం చూపసాగింది. ఆ రోజు మధ్యాహ్నం తాను హాస్పిటల్‌కి రానని … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

మట్టిగోడల మధ్య గడ్డిపోచ – శివరాజు సుబ్బలక్ష్మి

ఆ ఏడు వేసంగి ఎండలు మండిపోతున్నాయి. పొద్దువాలినా వేడి తగ్గలేదు. పసిపిల్లలు తట్టుకోలేక కంఠం జారిపోయేలా గోలపెడుతున్నారు. ముసలి అవ్వ ఆపుకారా పక్కన పెట్టుకుని కంఠం తడుపుకుంటూ తడిబట్ట వంటికి చుట్టుకు వచ్చే పోయేవాళ్ళని ”టైం ఎంతయిందర్రా” అంటూ గడుపుతోంది.

Share
Posted in కథలు | Leave a comment

సమయం కోసం… -అంపశయ్య నవీన్‌

”మీరు పంక్చువాలిటీని స్ట్రిక్టుగా పాటిస్తారు కదా! ఈ రోజు లేటయ్యారేమిటి?” హడావిడిగా హెడ్మాస్టర్‌ రూమ్‌లో ప్రవేశించి అటెండెన్స్‌ రిజిస్టర్‌లో సంతకం చేస్తున్న వాసంతితో అన్నాడు నిరంజన్‌.

Share
Posted in కథలు | Leave a comment

బచ్చే పౌచ్‌…! భండారు విజయ సుడులు తిరుగుతున్న గాలి దుమారాన్ని ఛేదించుకుంటూ పరుగున ఇంట్లోకి వచ్చి పడింది రాజవ్వ. తన జీవితంలాగే ఈ గాలిదుమారం కూడా ఆమె మనసును అతలాకుతలం చేస్తోంది. పొద్దుననగా ఇంట్లో ఒంటరిగా వదిలివెళ్ళిన పిల్లలు ఏమయ్యారో అన్న బాధ ఒకవైపు ఉంటే, మరోపక్క పక్కింటి శంకరయ్య వికారపు చూపులన్నీ తన గుడిసెవైపే … Continue reading

Share
Posted in కథలు | Leave a comment

”ఇది నాటకంలోని డైలాగు కాదు సార్‌!” – వెంకటమణి ఈశ్వర్‌

(భూమిక నిర్వహించిన కథ, కవితల పోటీలో మొదటి బహుమతి పొందిన కథ) థియేటర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ డిపార్ట్‌మెంట్‌… తరగతులు అయిపోయాయి; డిపార్టుమెంటులో విద్యార్థులెవరూ లేరు. ప్రొఫెసర్‌ శంకరరావు ఒక్కరే తన ఛాంబర్‌లో ఏదో పనిలో నిమగ్నమైవున్నారు. అప్పుడప్పుడూ వాచీవైపూ, తలుపువైపు చూస్తున్నాడు. ఇంతలో తలుపుదగ్గర చప్పుడైంది. అతడి కళ్లు ఆశగా విప్పారాయి.

Share
Posted in కథలు | Leave a comment

క్రిమి -మొయిదా శ్రీనివాసరావు

నాకు కులం, మతం లేదు, ఏ సమూహాలపైన మీరు ఇప్పుడు దాడి చేస్తున్నారో, ఆ సమూహాలను తరలి వెళ్లేలా చేసింది నేనే. వాతావరణం చల్లగా ఉంది. గత కొద్దిరోజులుగా అన్నింటా… అంతటా నెమ్మదిగా నిశ్శబ్దం అలుముకుంటోంది. నడిరోడ్లపై నత్తగుల్లలు నెమ్మదిగా పాకుతున్నాయి. ఆగి ఉన్న కార్లు పైకి తలకిందులుగా వేలాడుతూ గొంగళిపురుగులు జాయిగా దిగుతున్నాయి. మూసి … Continue reading

Share
Posted in కథలు | Leave a comment