Category Archives: వ్యాసాలు

వ్యాసాలు

నెత్తురోడుతున్న పాలస్తీనాలో ప్రతిఘటనా జ్వాలలు – చైతన్య చెక్కిళ్ల

గాజాపై ఇజ్రాయిల్‌ చేస్తున్న జాతిసంహారం (genocide) మొదలై ఎనిమిది నెలలు కావస్తున్నది. 76 ఏండ్ల క్రితం ఇజ్రాయిల్‌ స్థాపనతో పాలస్తీనీయుల జాతి ప్రక్షాళన (ethnic cleansing) మొదలయింది. 76 ఏండ్లుగా పాలస్తీనా ప్రజలను బలవంతపు వలసలకు గురి చేస్తూ, ఊర్లలో నుండి వెళ్లగొడ్తూ, జైళ్ళలో వేస్తూ, మిలిటరీ దాడులతో హత్యాకాండలు చేస్తూ ఇజ్రాయిల్‌ జాతి ప్రక్షాళన … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భూషణం కథలు – గిరిజన జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

అడవులలో, కొండ ప్రాంతాలలో నివసిస్తూ లేదా సంచార జీవనము గడుపుతూ ఆదిమ సంస్కృతిలో ఉండే తెగవారిని ‘గిరిజనులు’ అంటారు. ప్రపంచ దేశాలలో అన్ని జాతుల సంస్కృతుల కన్నా ఆదివాసుల సంస్కృతి భిన్నంగానూ, అపురూపంగాను ఉంటుంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఒక అన్వేషి నిష్క్రమణ – అఫ్సర్‌

ఈ నాలుగు మాటలు రాయడానికి ముందు అసలు సాయిపద్మ నిజంగా లేదన్న విషయం నేను నమ్మాలి కదా! అదే కష్టంగా ఉంది. ఈ చేదు నిజానికి నా నమ్మకంతో పని ఉందా లేదా అన్నది వేరే విషయం కానీ… ఇది నా ఆలోచనల్లో ఒక భాగం కావడానికి చాలా సమయమే పట్టవచ్చు. ఇంకా వారం కూడా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ఆమె ఎలా నిలబడిరదో ఆశ్చర్యమే! – అక్కిరాజు భట్టిప్రోలు

అది 2015. పర్సనల్‌గానూ, కెరీర్‌ పరంగానూ ఓ సందిగ్ధ సమయం. ఇప్పుడు నాకేం కావాలి అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కుంటున్నాను. నేను ఏమన్నా సాధించేశాను అని తృప్తి పడచ్చా, లేక వచ్చిన అవకాశాలన్నీ పూర్తిగా వాడుకోలేక పోయినందుకు అపజయాన్ని ప్రకటించేయాలా అని అద్దంలో చూసుకుంటున్న సమయం. ఎక్కణ్ణించి బయల్దేరానో అక్కడికే వెళ్ళి నన్ను నేను కొలుచుకోవాలి

Share
Posted in వ్యాసాలు | Leave a comment

‘శ్రమ ఎక్కువ, ఆదాయం తక్కువ – సర్వజయ భట్టాచార్య / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

అనువాదం: నీరజ పార్థసారధి హెహెగరా అడవి నుంచి సేకరించిన సాల పత్రాలతో పాత్రలను, పళ్ళాలను తయారుచేసి డాల్టన్‌గంజ్‌లో అమ్ముతుంటారు సకుని, గీతా దేవిలు. ఇరుగుపొరుగు వారు, స్నేహితులు కూడా అయిన ఈ ఇద్దరు మహిళలు గత రెండు దశాబ్దాలకు పైగా కలిసి ప్రయాణిస్తూ ఈ పనిని చేస్తున్నారు. ఆ వచ్చే సంపాదన చాలా కొద్దిగానే అయినప్పటికీ, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్‌ మొఘల్స్‌ – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

లలిత హృదయుడైన అక్బర్‌ కళలను పోషించాడు. ‘బులంద్‌ దర్వాజా’ లాంటి బృహత్‌ నిర్మాణాలను చేపట్టాడు. 1584లో ‘ఇలాహీ’ శకాన్ని ప్రారంభించాడు. 1586లో తన జీవితం, కాలాలకు సంబంధించిన చరిత్ర రాయమని ఆ పనిని తనకు అత్యంత ఆప్తుడైన అబుల్‌ ఫజల్‌కు అప్పగించాడు. అది అక్బర్‌నామా గా ప్రసిద్ధమైంది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

గిరిజన కథలు ` మహిళా జీవిత చిత్రణ – సారిపల్లి నాగరాజు

తెలుగు సాహిత్యంలో కథా ప్రక్రియకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈ కథా ప్రక్రియ నేడు విస్తృతంగా వ్యాప్తి చెందుతోంది. అనేకమంది కథకులు గిరిజన సమస్యలు, గిరిజన స్త్రీ జీవిత చిత్రణను నేపథ్యంగా చేసుకొని కథలు రచించారు. అలా వెలువడిన ఉత్తరాంధ్ర గిరిజన కథల్లో ఆదివాసీ స్త్రీల జీవిత చిత్రణను చిత్రిస్తూ వెలువడిన కథలను ఈ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలుగు కథానికలు ` భారతీయ జీవన విధానం – శ్రీలత అలువాల

చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ఎవరినైనా ఇట్టే ఆకట్టుకునేలా చేసే ప్రక్రియ కథ. తక్కువ నిడివిలో కథ నడుస్తూ పాత్రధారులు సరాసరి పాఠకుల హృదయాలలో ప్రవేశించి వారి ఆలోచనలకు పదునుపెడుతూ ముందుకు సాగేవి అసలైన కథలు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

వ్యవస్థాపకులుగా భారత మహిళలు ` సమస్యలు – డా॥ ఎ.రమా సరస్వతి, ఎస్‌. రమేశ్‌

వియుక్త (Abstract): భారత సంస్కృతి స్త్రీని శక్తి స్వరూపిణిగా భావిస్తుంది. ప్రాచీన భారతదేశంలో స్త్రీ పురుషుల మధ్య విభేదాలు, వ్యత్యాసాలు లేవు. వారి సమర్ధతను బట్టి స్త్రీలు వివిధ రంగాలలో వారి సత్తా చాటేవారు. కళలు, యుద్ధ విద్యలు, వేద పఠనం, కావ్య రచన, ఇంటి బాధ్యతలు మొదలైన అంశాలతో పాటు పలు ఆర్థిక, రాజకీయ … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

ప్రాచీన ఘటనలు కథలుగా ఎలా మారతాయి? – కల్లూరి భాస్కరం

అతి ప్రాచీనకాలంలో జరిగిన ఘటనలు చిలవలు, పలవలతో కథలుగా ఎలా మారతాయి, అవి కాలదూరాలను, స్థలదూరాలను, ప్రాంతాల హద్దులను జయిస్తూ ఎలా వ్యాపిస్తాయి, ఆ వ్యాపించే క్రమలో వాటిలో కల్పన ఎంత చేరుతుంది, వాస్తవం ఎంత మిగులుతుంది, లేక మొత్తం అంతా కల్పనే అవుతుందా?!

Share
Posted in వ్యాసాలు | Leave a comment

తెలంగాణలో చేనేతరంగ పరిరక్షణకు ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు – డా. శ్రీరాములు గోసికొండ

ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం కావాలి. ఆ ప్రజల్లో అణగారిన వర్గాలు, కులవృత్తులు చేస్తూ పేదరికంతో పోరాడుతూ, గ్లోబలైజేషన్‌ యుగంలో పోటీని తట్టుకోలేక చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ, కడు దుర్భర జీవితాన్ని

Share
Posted in వ్యాసాలు | Leave a comment

భారతదేశాన్ని పట్టి పీడిస్తోన్న క్షయవ్యాధి – రితాయన్‌ ముఖర్జీ / పీపుల్‌ ఆర్కైవ్‌ రూరల్‌ ఇండియా

ప్రపంచంలోని మొత్తం క్షయవ్యాధి రోగులలో దాదాపు మూడోవంతు మంది భారతదేశంలోనే ఉన్నారు. వీరిలో చాలామంది గ్రామీణ ప్రాంతాలకు, పట్టణ ప్రాంత మురికివాడలకు చెందినవాళ్ళు. ఈ రోగులలో చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. దీని నుంచి కోలుకున్న రోగుల కుటుంబాలు ఒకవైపు తమ ఆర్థిక భారాన్ని, ఇతర ఖర్చులను భరిస్తూనే, ఈ రోగుల పట్ల నిరంతర సంరక్షణను, … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment

కోటేశ్వరమ్మ ఆత్మకథ ‘నిర్జన వారధి’ – శాంతిశ్రీ బెనర్జీ

తెలుగు సాహిత్యంలో మహిళలు వ్రాసిన స్వీయ చరిత్రలు అతి తక్కువ. అందుకే కొండపల్లి కోటేశ్వరమ్మ గారి స్వీయ చరిత్ర ‘నిర్జన వారధి’ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించి చదవాల్సిన అవసరం ఎంతో ఉన్నది. ఈ మధ్య వచ్చిన రెండు స్వీయచరిత్రల గురించి మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. అందులో కోటేశ్వరమ్మ గారి ‘నిర్జన వారధి’ (2012) మొదటిది.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

దేవదాసి వ్యవస్థను రద్దు చేయించిన దేవదాసీ బిడ్డ – డాక్టర్‌ దేవరాజు మహారాజు

అనువాదం : రవికృష్ణ్ల సనాతన ధర్మశాస్త్రాలలో ఉందని నిమ్న వర్గాల బాలికలకు దేవుడితో పెండ్లి జరిపించి, వాళ్ళని వేశ్యలుగా మార్చి సమాజమంతా వాడుకునేది. వారినే దేవదాసీలనేవారు. ఆ దేవదాసీల వయసు నలభై దాటగానే వారిని వేలం వేసేవారు. వారిని వేలం పాటలో గెలుచుకుని, తీసుకుపోయిన వారు వారిని ఇంటి పనులకు, వ్యవసాయ పనులకు, ఇతరత్రా వాడుకునేవారు.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మొఘలుల చరిత్రకు మరో చేర్పు ద గ్రేట్‌ మొఘల్స్‌ – డాక్టర్‌ షేఖ్‌ మహబూబ్‌ బాషా

భారతదేశ చరిత్రలో తీవ్రంగా వివాదాస్పదం చేయబడుతున్న భాగాల్లో మొఘలుల చరిత్ర ప్రధానమైనది. ఎంత తీవ్రంగా వీరి చరిత్ర వివాదాస్పదమౌతోందో, అంతే పెద్ద ఎత్తున వీరి చరిత్రపై పుస్తకాలూ వెలువడుతున్నాయి. అలా ఇటీవల వెలువడ్డ ఒక ముఖ్యమైన పుస్తకం ప్రొఫెసర్‌ ఫర్హత్‌ నస్రీన్‌ రచించిన ద గ్రేట్‌ మొఘల్స్‌.

Share
Posted in వ్యాసాలు | Leave a comment

మాలతీ చందూర్‌ నవలా మంజరి`4, స్త్రీ పాత్రల వైవిధ్యం – మమత వేపాడ

వ్యాస సంగ్రహం: మాలతీ చందూర్‌ అనే పేరు సాహితీ ప్రియులకు చాలా సుపరిచితమైనది. తెలుగు సాహిత్యానికి కాకుండా సమాజానికి ఎంతో సేవ చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి. అది ఎలా అంటే ‘ఆంధ్రప్రభ’ సచిత్ర వారపత్రికలో 1952 నుండి ఆడవారి కోసం మాలతి చందూర్‌ రాసిన ‘ప్రమధావనం’ కాలమ్‌ 40 ఏళ్ళు నిరాటంకంగా వచ్చింది. ఎటువంటి సమస్యలకైనా … Continue reading

Share
Posted in వ్యాసాలు | Leave a comment